Honda Activa 125 పై దీపావళి ధమాకా ఆఫర్.. రూ. 5,000 వరకూ క్యాష్‌బ్యాక్.. త్వరపడండి!

జపనీస్ టూవీలర్ బ్రాండ్ హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా లిమిటెడ్ (Honda Motorcycle and Scooters India Limited) నుండి అత్యధికంగా అమ్ముడవుతున్న యాక్టివా స్కూటర్‌పై కంపెనీ దీపావళి ఆఫర్‌లను ప్రకటించింది. సమాచారం ప్రకారం, ఈ దీపావళి సీజన్ లో హోండా యాక్టివా 125 స్కూటర్ ను కొనుగోలు చేసే కస్టమర్లకు కంపెనీ డిస్కౌంట్ మరియు క్యాష్‌బ్యాక్‌తో సహా అనేక ఇతర ఆఫర్‌లను కూడా అందిస్తోంది.

Honda Activa 125 పై దీపావళి ధమాకా ఆఫర్.. రూ. 5,000 వరకూ క్యాష్‌బ్యాక్.. త్వరపడండి!

ఒకవేళ మీరు కూడా ఈ పండుగ సీజన్‌లో Honda Activa 125 స్కూటర్ ని కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే, మీరు ఈ స్కూటర్‌పై రూ. 5,000 వరకు ఆదా చేసుకోవచ్చు. అదెలానో తెలుసుకుందాం రండి.

Honda Activa 125 పై దీపావళి ధమాకా ఆఫర్.. రూ. 5,000 వరకూ క్యాష్‌బ్యాక్.. త్వరపడండి!

రూ. 5,000 క్యాష్‌బ్యాక్

ఈ స్కూటర్ ను క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ ఈఎమ్ఐ ఫైనాన్స్ ఆఫర్ ఉపయోగించి కొనుగోలు చేసే వారికి మాత్రేమ ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఇండస్ఇండ్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, యెస్ బ్యాంక్, స్టాండర్డ్ చార్టెడ్ మరియు ఫెడరల్ బ్యాంక్ కంపెనీలు అందించే డెబిట్ లేదా క్రెడిట్ కార్డుల నుండి ఈఎమ్ఐ ద్వారా కొనుగోలు చేసే వారికి మాత్రమే ఈ క్యాష్‌బ్యాక్ ఆఫర్ లభిస్తుంది.

Honda Activa 125 పై దీపావళి ధమాకా ఆఫర్.. రూ. 5,000 వరకూ క్యాష్‌బ్యాక్.. త్వరపడండి!

కార్డ్-ఆధారిత ఈఎమ్ఐ కోసం దేశవ్యాప్తంగా ఉన్న వినియోగదారులందరికీ పైన్ ల్యాబ్స్ మద్దతు ఇస్తుంది. క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ ఈఎమ్ఐ విధానం ద్వారా హోండా యాక్టివా 125 స్కూటర్ ను కొనుగోలు చేసే కస్టమర్లు, స్కూటర్ ధరలో గరిష్టంగా 5 శాతం వరకూ (రూ. 5,000 మించకుండా) క్యాష్‌బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఆఫర్ నవంబర్ 30, 2021 వ తేదీ వరకూ చెల్లుబాటులో ఉంటుంది.

Honda Activa 125 పై దీపావళి ధమాకా ఆఫర్.. రూ. 5,000 వరకూ క్యాష్‌బ్యాక్.. త్వరపడండి!

ఎలాంటి డౌన్‌పేమెంట్, డాక్యుమెంటేషన్ మరియు హైపోథికేషన్ లేదు

పైన పేర్కొన్న బ్యాంకులు జారీ చేసిన క్రెడిట్ లేదా డెబిట్ కార్డులను ఉపయోగించి, ఈఎమ్ఐ స్కీమ్ లో హోండా యాక్టివాను కొనుగోలు చేసే కస్టమర్లు ఎలాంటి ముందస్తు చెల్లింపు (డౌన్‌పేమెంట్) చేయాల్సిన అవసరం ఉండదని, అంతేకాకుండా ఇందుకోసం ఎటువంటి డాక్యుమెంటేషన్ మరియు హైపోథికేషన్ కూడా ఉండదని కంపెనీ తమ ప్రకటనలో పేర్కొంది.

Honda Activa 125 పై దీపావళి ధమాకా ఆఫర్.. రూ. 5,000 వరకూ క్యాష్‌బ్యాక్.. త్వరపడండి!

హోండా కస్టమర్ల కోసం వాహన కొనుగోలు ప్రక్రియను సులభతరం చేసేందుకు కంపెనీ డౌన్‌పేమెంట్ మరియు హైపోథెకేషన్‌ను సులభతరం చేసింది. ఇప్పుడు మీరు ఏ పత్రం యొక్క హార్డ్ కాపీని సమర్పించకుండానే స్కూటర్‌ను కొనుగోలు చేసే మొత్తం ప్రక్రియను పూర్తి చేయవచ్చు. హోండా టూ-వీలర్స్ డీలర్లు ఎలాంటి భౌతిక పత్రాన్ని (హార్డ్ కాపీ) సమర్పించాల్సిన అవసరం లేకుండానే ఆన్‌లైన్‌లో డిజిటల్‌గా అన్ని ప్రక్రియలను చేస్తున్నారు.

Honda Activa 125 పై దీపావళి ధమాకా ఆఫర్.. రూ. 5,000 వరకూ క్యాష్‌బ్యాక్.. త్వరపడండి!

కంపెనీ ఈ స్కూటర్ ను జీరో డౌన్ పేమెంట్‌తో అందిస్తోంది, అంటే ఇప్పుడు మీరు ఎలాంటి డబ్బు చెల్లించకుండానే మీకు ఇష్టమైన హోండా యాక్టివా 125 స్కూటర్ ని ఇంటికి తీసుకెళ్లవచ్చు. వీటితో పాటుగా, బ్యాంకులు ఈ స్కూటర్ కోసం పూర్తిగా 100 శాతం ఫైనాన్సింగ్ సౌకర్యాన్ని అందిస్తున్నాయి. హోండా తమ వాహనాల కోసం ఆన్‌లైన్ బుకింగ్‌ లను కూడా ప్రారంభించింది. ఇప్పుడు కస్టమర్లు తమ ఇంటి సౌకర్యం నుండే హోండా వాహనాన్ని బుక్ చేసుకోవచ్చు.

Honda Activa 125 పై దీపావళి ధమాకా ఆఫర్.. రూ. 5,000 వరకూ క్యాష్‌బ్యాక్.. త్వరపడండి!

5.99 శాతం ఆకర్షణీయమైన వడ్డీ రేటు

పండుగల సీజన్ దృష్ట్యా హోండా తన బైక్‌లు మరియు స్కూటర్ల కొనుగోలు ప్రక్రియను సులభం చేసేందుకు కంపెనీ తమ వాహనాలపై ఆకర్షణీయమైన వడ్డీ రేటును ప్రకటించింది. రుణం (లోన్) ద్వారా ఏదైనా హోండా బైక్ లేదా స్కూటర్ కొనుగోలు చేయడానికి కనీస వడ్డీ రేటును 5.99 శాతంగా ప్రతిపాదించింది. దీంతో పాటు ప్రాసెసింగ్ ఫీజును కూడా మినహాయించింది. ఇదే కాకుండా, ఒకవేళ మీరు హోండా నుండి వాహన బీమా ప్లాన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే, కంపెనీ రూ. 5 లక్షల వరకు వాహన బీమాను కూడా అందిస్తుంది.

Honda Activa 125 పై దీపావళి ధమాకా ఆఫర్.. రూ. 5,000 వరకూ క్యాష్‌బ్యాక్.. త్వరపడండి!

ఆసక్తిగల కస్టమర్లు హోండా యాక్టివా 125 స్కూటర్ ను ఆన్‌లైన్ ద్వారా కూడా బుకింగ్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్ బుకింగ్‌ లపై కూడా ఈ క్యాష్‌బ్యాక్ ఆఫర్ వర్తిస్తుంది. మార్కెట్లో యాక్టివా 125 స్కూటర్ స్టాండర్డ్, అల్లాయ్ మరియు డీలక్స్ అనే మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. వీటి ధరలు ఇలా ఉన్నాయి:

  • ACTIVA 125 DRUM (BSVI) - Rs.75649
  • ACTIVA 125 DRUM ALLOY (BSVI) - Rs.79317
  • ACTIVA 125 DISC (BSVI) - Rs.82822
  • (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, హైదరాబాద్)

    Honda Activa 125 పై దీపావళి ధమాకా ఆఫర్.. రూ. 5,000 వరకూ క్యాష్‌బ్యాక్.. త్వరపడండి!

    హోండా యాక్టివా 125 స్కూటర్ ఇంజన్ విషయానికి వస్తే, ఇందులో 124 సిసి ఎయిర్-కూల్డ్, ప్రోగ్రామ్డ్ ఫ్యూయల్ ఇంజెక్ట్ ఇంజన్‌ ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 8.14 బిహెచ్‌పి పవర్ ను మరియు 10.3 ఎన్ఎమ్ టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ తో జతచేయబడి ఉంటుంది. కంపెనీ ఈ స్కూటర్ ని సైలెంట్ ఏసిజి స్టార్టర్ తో అందిస్తోంది. ఇది శబ్ధం లేని ఇంజన్ స్టార్ట్ అనుభూతిని అందిస్తుంది.

    Honda Activa 125 పై దీపావళి ధమాకా ఆఫర్.. రూ. 5,000 వరకూ క్యాష్‌బ్యాక్.. త్వరపడండి!

    హోండా యాక్టివా 125 స్కూటర్ యొక్క ప్రధాన ఫీచర్లను గమనిస్తే, ఇందులో ఎల్‌ఈడి హెడ్‌లైట్, ఎల్‌ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లు, సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, సైడ్ స్టాండ్ ఇంజన్ కటాఫ్, ఆల్-మెటల్ బాడీ, కాంబి బ్రేక్ సిస్టమ్, డ్రమ్ మరియు డిస్క్ బ్రేక్ ఆప్షన్, డీలక్స్ వేరియంట్ లో అల్లాయ్ వీల్స్‌ వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి. హోండా నుండి అత్యధికంగా అమ్ముడవుతున్న స్కూటర్లలో యాక్టివా అగ్రస్థానంలో ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Thursday, November 4, 2021, 11:27 [IST]
English summary
Diwali festive offers on honda activa 125 cashback upto rs 5000 details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+