భారత్‌లో విడుదలైన కొత్త డుకాటీ పానిగలే వి4; ధర & పూర్తి వివరాలు
ఇటాలియన్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ డుకాటీ తన పానిగలే వి4 సూపర్‌బైక్‌ను ఎట్టకేలకు దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. ఈ కొత్త డుకాటీ పానిగలే వి4 సూపర్‌బైక్ బిఎస్ 6 ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా అప్డేట్ చేయబడింది. ఈ కొత్త బైక్ గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

భారత మార్కెట్లో విడుదలైన కొత్త డుకాటీ పానిగలే వి4 సూపర్‌బైక్ రెండు వేరియంట్లలో విడుదలైంది. పానిగలే వి4 స్టాండర్డ్ వేరియంట్ ధర రూ. 23.50 లక్షలు కాగా, టాప్-స్పెక్ పానిగలే వి 4 ఎస్ ధర రూ .28.40 లక్షల వరకు ఉంటుంది. ఈ ధరలు ఎక్స్-షోరూమ్ ప్రకారం నిర్ణయించబడింది.

ఈ కొత్త పానిగలే వి4 సూపర్‌బైక్ ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు ఒకే ఎల్‌ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లను కలిగి ఉంటాయి. ఈ బైక్‌లో ప్లెక్సిగ్లాస్ హెడ్‌ల్యాంప్‌లు మరియు సైడ్ ఫెయిరింగ్‌లు కూడా లభిస్తాయి. మొత్తానికి ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

కొత్త డుకాటీ పానిగలే వి4 బైక్‌లో అదే 1,103 సిసి, డెనిమో ఎస్‌డిసి స్ట్రాడేల్ ఇంజన్ అమర్చబడి ఉంటుంది. ఈ ఇంజన్ 13,000 ఆర్‌పిఎమ్ వద్ద 214 బిహెచ్‌పి శక్తిని మరియు 9,500 ఆర్‌పిఎమ్ వద్ద 124 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇన్ బైక్ ట్రాక్ స్పీడ్ మరియు ప్రతిస్పందనను పెంచడానికి రూపొందించిన ఏరోడైనమిక్ మరియు ఎలక్ట్రానిక్ మార్పుల శ్రేణిని కలిగి ఉంటుంది.

డుకాటీ పానిగలే వి 4 బైక్ యొక్క ఏరోడైనమిక్ వి 4 ఆర్ వంటి ప్లెక్సిగ్లాస్ హెడ్‌లైట్ ఫెయిరింగ్ మరియు సైడ్ ఫెయిరింగ్‌లు రేడియేటర్‌పై సమర్థవంతమైన ఎయిర్‌ఫ్లో లాటరల్ ఎక్స్ట్రాక్టర్స్ మరియు వింగ్లెట్స్ వంటి వాటితో అప్డేట్ చేయబడి ఉంటుంది. ఈ సూపర్‌బైక్ లో ప్రిడిక్టివ్ కంట్రోల్ సిస్టమ్ కూడా ఉంటుంది.

కొత్త డుకాటీ పానిగలే వి4 బైక్ సస్పెన్షన్ సెటప్ విషయానికి వస్తే, దీని ముందు భాగంలో నిక్స్ ఫోర్క్ మరియు వెనుక భాగంలో టిటిఎక్స్ షాక్ మరియు ఎలక్ట్రానిక్ స్టీరింగ్ డంపర్ వంటివి కలిగి ఉటుంది. అదే విధంగా ఈ కొత్త బైక్ బ్రేకింగ్ సిస్టమ్ విషయానికి వస్తే, ఇందులో బ్రెంబో స్టైల్మా ఆర్ కాలిపర్‌లకు రెండు వైపులా డిస్క్ బ్రేక్‌లు అందించబడ్డాయి.

కొత్త డుకాటీ పానిగలే వి4 బైక్ ఎలక్ట్రానిక్స్ ప్యాకేజీలో బాష్ కార్నింగ్ ఎబిఎస్, వీల్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, లాంచ్ కంట్రోల్, స్లైడ్ కంట్రోల్, బై-డైరెక్షనల్ క్విక్ షిఫ్టర్ మరియు ఇంజిన్ బ్రేక్ కంట్రోల్ వంటివి కూడా ఉన్నాయి. కొత్త డుకాటీ పానిగలే వి 4 భారత మార్కెట్లో కవాసాకి నింజా జెడ్‌ఎక్స్-10 ఆర్, సుజుకి హయాబుసా, బిఎమ్‌డబ్ల్యూ ఎస్ 1000 ఆర్ఆర్ వంటి వాటికీ ప్రత్యర్థిగా ఉంటుంది.


Click it and Unblock the Notifications








