భారత్‌లో డ్యుకాటి మల్టీస్ట్రాడా 950 ఎస్ జిపి వైట్ లాంచ్: ధర, వివరాలు

ఇటాలియన్ పెర్ఫార్మెన్స్ మోటార్‌సైకిల్ బ్రాండ్ 'డ్యుకాటి' భారత మార్కెట్లో మరో కొత్త హై-పెర్ఫార్మెన్స్ బైక్‌ను విడుదల చేసింది. డ్యుకాటి మల్టీస్ట్రాడా 950 ఎస్ జిపి వైట్ మోటార్‌సైకిల్‌ను కంపెనీ దేశీయ విపణిలో విడుదల చేసింది.

భారత్‌లో డ్యుకాటి మల్టీస్ట్రాడా 950 ఎస్ జిపి వైట్ లాంచ్: ధర, వివరాలు

డ్యుకాటి మల్టీస్ట్రాడా 950 ఎస్‌లో కొత్త కలర్ స్కీమ్ రాక గురించి కంపెనీ గత సంవత్సరం లాంచ్ సమయంలో ప్రకటించింది. భారత మార్కెట్లో డ్యుకాటి మల్టీస్ట్రాడా 950 ఎస్ జిపి వైట్ ధర రూ.15.69 లక్షలు, ఎక్స్ షోరూమ్ (ఇండియా)గా ఉంది.

భారత్‌లో డ్యుకాటి మల్టీస్ట్రాడా 950 ఎస్ జిపి వైట్ లాంచ్: ధర, వివరాలు

మల్టీస్ట్రాడా 950 ఎస్ బైక్‌లో కొత్తగా ప్రవేశపెట్టిన ఈ కలర్ స్కీమ్ కారణంగా, రెడ్ కలర్ వేరియంట్‌తో పోల్చుకుంటే ఈ బైక్ ధర కూడా రూ.20,000 అధికంగా ఉంటుంది. ఈ జిపి వైట్ వేరియంట్ ఫ్యూయెల్ ట్యాంక్ మరియు ఫ్రంట్ ఫెయిరింగ్‌పై బూడిదరంగు మరియు తెలుపు రంగులతో కూడిన ఆర్కిటిక్ కామో పెయింట్ స్కీమ్ ఉంటుంది. హెడ్‌ల్యాంప్ కౌల్ కూడా వైట్ కలర్‌లో ఉంటుంది.

MOST READ:మీకు తెలుసా.. భారతదేశపు మొట్టమొదటి కమర్షియల్ పైలట్ ఈ యువతి

భారత్‌లో డ్యుకాటి మల్టీస్ట్రాడా 950 ఎస్ జిపి వైట్ లాంచ్: ధర, వివరాలు

డ్యుకాటి మల్టీస్ట్రాడా 950 ఎస్ జిపి వైట్‌లో కొత్త పెయింట్ స్కీమ్ మినహా, ఇంజన్ పరంగా వేరే మార్పులు లేవు. మల్టీస్ట్రాడా 950 ఎస్ మరియు 950 ఎస్ జిపి వైట్ రెండు మోడళ్లు కూడా ఒకేరకమైన ఇంజన్ మరియు ఫీచర్లను కలిగి ఉంటాయి. డ్యుకాటి మల్టీస్ట్రాడా 950 ఎస్ జిపి వైట్‌లో 937సిసి, ట్విన్ సిలిండర్, టెస్టాస్ట్రెట్టా 11° ఇంజన్‌తో పనిచేస్తుంది.

భారత్‌లో డ్యుకాటి మల్టీస్ట్రాడా 950 ఎస్ జిపి వైట్ లాంచ్: ధర, వివరాలు

ఈ ఇంజన్ గరిష్టంగా 9000 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 111 బిహెచ్‌పి శక్తిని మరియు 7750 ఆర్‌పిఎమ్ వద్ద 96 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ స్లిప్-అసిస్ట్ క్లచ్ మరియు బ్రాండ్ యొక్క (డిక్యూఎస్) డ్యుకాటి క్విక్ షిఫ్ట్ బై-డైరెక్షనల్ క్విక్ షిఫ్టర్‌తో సిక్స్-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

MOST READ:విధుల్లో ఉన్న అంబులెన్స్ డ్రైవర్ తన తల్లి మరణ వార్త విన్నాడు.. తరువాత ఏం జరిగిందంటే?

భారత్‌లో డ్యుకాటి మల్టీస్ట్రాడా 950 ఎస్ జిపి వైట్ లాంచ్: ధర, వివరాలు

మల్టీస్ట్రాడా 950 ఎస్ డిజైన్ దాని పెద్ద తోబుట్టువు అయిన మల్టీస్ట్రాడా 1260 నుండి ప్రేరణ పొంది రూపొందించబడింది. ఈ ఎంట్రీ-లెవల్ అడ్వెంచర్-టూరింగ్ మోటార్‌సైకిల్‌లో కార్నరింగ్ లైట్స్ సెటప్‌తో కూడిన హారిజాంటల్ ట్విన్ ఎల్‌ఈడి హెడ్‌ల్యాంప్‌లు ఉంటాయి.

భారత్‌లో డ్యుకాటి మల్టీస్ట్రాడా 950 ఎస్ జిపి వైట్ లాంచ్: ధర, వివరాలు

డ్యుకాటి మల్టీస్ట్రాడా 950 ఎస్ బైక్‌లోని ఇతర ఫీచర్లను గమనిస్తే, ఇది ఫ్రంట్ బీక్ డిజైన్‌ను కలిగి ఉండి, నకల్ గార్డ్స్ మరియు పొడవైన విండ్‌స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. ఈ విండ్‌స్క్రీన్‌ను 60 మిమీ రేంజ్‌లో ఒక చేతితో సర్దుబాటు చేసుకునే సౌలభ్యం ఉంటుంది. ఈ అడ్వెంచర్ టూరర్‌లో రెండు 12 వోల్ట్ పవర్ సాకెట్లు, ఒక యూఎస్‌బి పోర్ట్ మరియు 20-లీటర్ ఇంధన ట్యాంక్ ఉన్నాయి, ఇవి సుదూర ప్రయాణాలకు అనువుగా ఉంటాయి.

MOST READ:నదిలో చిక్కుకున్న మహీంద్రా థార్.. బయటకు లాగిన మిత్సుబిషి పజెరో[వీడియో]

భారత్‌లో డ్యుకాటి మల్టీస్ట్రాడా 950 ఎస్ జిపి వైట్ లాంచ్: ధర, వివరాలు

ఇంకా ఇందులో 5 అంగుళాల టిఎఫ్‌టి కలర్ ఇన్ఫోటైన్‌మెట్ డిస్‌ప్లే కూడా ఉంటుంది. ఇది మోటారుసైకిల్ యొక్క వివిధ ఎలక్ట్రానిక్ రైడర్ అసిస్టెన్స్‌లను కంట్రోల్ చేయటం కోసం ఉపయోగపడుతుంది. ఈ ఫీచర్లను స్విచ్ గేర్ మరియు టిఎఫ్‌టి కన్సోల్ సహాయంతో కంట్రోల్ చేయవచ్చు.

భారత్‌లో డ్యుకాటి మల్టీస్ట్రాడా 950 ఎస్ జిపి వైట్ లాంచ్: ధర, వివరాలు

ఈ బైక్‌లో నాలుగు కాన్ఫిగర్ రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి. అవి: స్పోర్ట్, టూరింగ్, అర్బన్ అండ్ ఎండ్యూరో. ఇంకా ఇందులో బాష్ కార్నరింగ్ ఎబిఎస్, డ్యుకాటి ట్రాక్షన్ కంట్రోల్ (డిటిసి), వెహికల్ హోల్డ్ కంట్రోల్ (విహెచ్‌సి), క్రూయిజ్ కంట్రోల్ సిస్టమ్ మరియు డ్యుకాటి మల్టీమీడియా సిస్టమ్ (డిఓఎస్) ఫీచర్లు కూడా ఉన్నాయి.

MOST READ:పనికిరాని సీట్ బెల్టులతో వ్యాపారం.. మిలియన్ల కొద్దీ సంపాదన.. ఎలా అనుకునుటున్నారా?

భారత్‌లో డ్యుకాటి మల్టీస్ట్రాడా 950 ఎస్ జిపి వైట్ లాంచ్: ధర, వివరాలు

ఇందులోని మెకానికల్స్ విషయానికి వస్తే, ఈ బైక్ ముందు భాగంలో 48 మిమీ సెమీ యాక్టివ్ (డిఎస్ఎస్) డ్యుకాటి స్కైహూక్ సస్పెన్షన్ ఫోర్క్ మరియు వెనుక భాగంలో మోనో-షాక్ సస్పెన్షన్ యూనిట్ ఉంటాయి. ఈ రెండు సస్పెన్షన్లను యాంత్రికంగా కంట్రోల్ చేయవచ్చు.

భారత్‌లో డ్యుకాటి మల్టీస్ట్రాడా 950 ఎస్ జిపి వైట్ లాంచ్: ధర, వివరాలు

ఇక బ్రేకింగ్ విషయానికి వస్తే, ముందు భాగంలో రేడియల్‌గా అమర్చిన కాలిపర్‌లతో 320 మిమీ డ్యూయల్ డిస్క్‌లు మరియు వెనుక భాగంలో రెండు పిస్టన్ కాలిపర్‌తో కూడిన 265 మిమీ సింగిల్ డిస్క్ బ్రేక్ ఉంచాయి. వీటిని బ్రెంబో బ్రాండ్ నుండి గ్రహించారు. ఇది బాష్ ఏబిఎస్ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది.

భారత్‌లో డ్యుకాటి మల్టీస్ట్రాడా 950 ఎస్ జిపి వైట్ లాంచ్: ధర, వివరాలు

ఈ అడ్వెంచర్ మోటార్‌సైకిల్‌లో ముందు వైపు 19 ఇంచ్ అల్లాయ్ వీల్ మరియు వెనుక వైపు 17 ఇంచ్ అల్లాయ్ వీల్ ఉంటాయి. వీటిపై పిరెల్లి స్కార్పియన్ ట్రైల్ II టైర్లు అమర్చబడి ఉంటాయి. డ్యుకాటి మల్టీస్ట్రాడా 950 ఎస్ ఈ విభాగంలో ట్రయంప్ టైగర్ 900 జిటి మరియు బిఎమ్‌డబ్ల్యూ ఎఫ్ 900 ఎక్స్‌ఆర్ మరియు కవాసాకి వెర్సిస్ 1000 వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

Most Read Articles

English summary
Ducati Multistrada 950 S GP White Launched In India; Price, Specs And Features. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X