భారత్‌లో విడుదలకు సిద్ధమవుతున్న డ్యుకాటి మల్టీస్ట్రాడా వి4 అడ్వెంచర్ బైక్

ఇటాలియన్ సూపర్ బైక్ కంపెనీ డ్యుకాటి, గతేడాది నవంబర్ నెలలో ఆవిష్కరించిన తమ సరికొత్త ఆఫ్-రోడ్ అడ్వెంచర్ టూరింగ్ మోటార్‌సైకిల్ 'డ్యుకాటి మల్టీస్ట్రాడా వి4'ను కంపెనీ త్వరలోనే భారత మార్కెట్లో కూడా విడుదల చేయబోతోంది. మరికొన్ని వారాల్లోనే ఈ అడ్వెంచర్ టూరింగ్ మోటార్‌సైకిల్ బుకింగ్స్, అమ్మకాలు ప్రారంభం కావచ్చని సమాచారం.

భారత్‌లో విడుదలకు సిద్ధమవుతున్న డ్యుకాటి మల్టీస్ట్రాడా వి4 అడ్వెంచర్ బైక్

ఈ జూన్‌లో డ్యుకాటి భారతదేశంలో మొత్తం మూడు కొత్త మోడళ్లను విడుదల చేయనుంది. వీటిలో మల్టీస్ట్రాడా వి4 కూడా ఒకటి. దేశీయ మార్కెట్లో డ్యుకాటి మల్టీస్ట్రాడా వి4 ఇప్పుడు ఈ ఇటాలియన్ బ్రాండ్ యొక్క ఫ్లాగ్‌షిప్ అడ్వెంచర్ టూరింగ్ మోటార్‌సైకిల్‌గా నిలుస్తుంది.

భారత్‌లో విడుదలకు సిద్ధమవుతున్న డ్యుకాటి మల్టీస్ట్రాడా వి4 అడ్వెంచర్ బైక్

జిగ్‌వీల్స్ నుండి వచ్చిన తాజా నివేదిక ప్రకారం, జూన్ 2021 నాటికి మల్టీస్ట్రాడా వి4 ను భారత మార్కెట్లో లాంచ్ చేయాలని కంపెనీ చూస్తోంది. మల్టీస్ట్రాడా వి4 తో పాటు, డ్యుకాటి ఈ నెలలో డయావెల్ 1260 మరియు పానిగల్ వి4 మోటార్‌సైకిళ్లను కూడా విడుదల చేయనున్నట్లు సమాచారం.

భారత్‌లో విడుదలకు సిద్ధమవుతున్న డ్యుకాటి మల్టీస్ట్రాడా వి4 అడ్వెంచర్ బైక్

డ్యుకాటి యొక్క ఈ లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ అడ్వెంచర్ టూరర్ బైక్ మొత్తం మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. అవి: స్టాండర్డ్, వి4 ఎస్ మరియు వి4 ఎస్ స్పోర్ట్. మల్టీస్ట్రాడా వి4 బ్రాండ్ యొక్క పోర్ట్‌ఫోలియోలోని పానిగల్ వి4 మోటార్‌సైకిల్‌కు శక్తినిచ్చే సరికొత్త ఇంజన్‌తో పనిచేస్తుంది. అయితే, కంపెనీ ఈ ఇంజన్‌ను అడ్వెంచర్ టూరర్ యొక్క ఫీచర్లకు అనుగుణంగా మోడిఫై చేసింది.

భారత్‌లో విడుదలకు సిద్ధమవుతున్న డ్యుకాటి మల్టీస్ట్రాడా వి4 అడ్వెంచర్ బైక్

డ్యుకాటి మల్టీస్ట్రాడా వి4 బబైక్‌లో 1158 సిసి వి4 గ్రాంటూరిస్మో లిక్విడ్ కూల్డ్ ఇంజన్ ఉంటుంది, ఇది 10,500 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 170 బిహెచ్‌పి శక్తిని మరియు 8,750 ఆర్‌పిఎమ్ వద్ద 125 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది స్లిప్-అసిస్ట్ క్లచ్ మరియు (డిక్యూఎస్) డ్యుకాటి క్విక్ షిఫ్ట్ బై-డైరెక్షనల్ క్విక్ షిఫ్టర్ టెక్నాలజీతో కూడిన సిక్స్-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

భారత్‌లో విడుదలకు సిద్ధమవుతున్న డ్యుకాటి మల్టీస్ట్రాడా వి4 అడ్వెంచర్ బైక్

అడ్వెంచర్-టూరింగ్ విభాగంలో సరికొత్త బెంచ్ మార్క్‌ను సృష్టించిన మోటార్‌సైకిల్ ఈ డ్యుకాటి మల్టీస్ట్రాడా వి4. ఈ మోటారుసైకిల్ ముందు మరియు వెనుక భాగంలో రాడార్ టెక్నాలజీని కలిగి ఉన్న మొట్టమొదటి మోటార్‌సైకిల్ కూడా ఇదే కావటం విశేషం. ఇది బ్లైండ్‌స్పాట్ డిటెక్షన్ మరియు రాడార్-గైడెడ్ క్రూయిజ్ కంట్రోల్‌ను అనుమతిస్తుంది, ఈ తరహా టెక్నాలజీ ప్రపంచంలోనే మొట్టమొదటిది.

భారత్‌లో విడుదలకు సిద్ధమవుతున్న డ్యుకాటి మల్టీస్ట్రాడా వి4 అడ్వెంచర్ బైక్

డ్యుకాటి మల్టీస్ట్రాడా వి4 బ్రాండ్ యొక్క విలక్షణమైన అడ్వెంచర్-టూరర్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. వి4 మోడల్ అగ్రెసివ్‌గా మరియు అందంగా కనిపిస్తుంది. ఇది ముందు వైపు నుండి ఆకర్షణీయమైన డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఈ మోటారుసైకిల్‌లో ఎయిర్-ఇన్‌లెట్‌లతో పాటుగా ఏర్పాటు చేసిన ట్విన్-పాడ్ హెడ్‌ల్యాంప్‌లు మరియు హెడ్‌ల్యాంప్స్‌లో ఇంటిగ్రేటెట్ చేసిన ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి.

భారత్‌లో విడుదలకు సిద్ధమవుతున్న డ్యుకాటి మల్టీస్ట్రాడా వి4 అడ్వెంచర్ బైక్

ఇతర డిజైన్ ఫీచర్లలో పొడవైన సర్దుబాటు చేయగల విండ్‌స్క్రీన్, నకల్ గార్డ్స్, ఫ్రేమ్ ప్రొటెక్టర్స్, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ పైన జిపిఎస్ మౌంట్‌లతో పాటు 12వోల్ట్ ఛార్జింగ్ సాకెట్, ఎల్‌ఇడి టెయిల్ లాంప్స్, ఇంటిగ్రేటెడ్ రియర్ లగేజ్ ర్యాక్, అప్-స్వీప్ ఎగ్జాస్ట్, బ్యాక్‌లైట్ స్విచ్ గేర్, స్ప్లిట్ సీట్స్ మొదలైనవి ఉన్నాయి.

భారత్‌లో విడుదలకు సిద్ధమవుతున్న డ్యుకాటి మల్టీస్ట్రాడా వి4 అడ్వెంచర్ బైక్

డ్యుకాటి మల్టీస్ట్రాడా వి4 మోటార్‌సైకిల్‌లో పెద్ద 22-లీటర్ ఫ్యూయెల్ ట్యాంక్ ఉంటుంది. ఇది సుదూర ప్రయాణాలకు అనువుగా ఉంటుంది. ఈ అడ్వెంచర్-టూరర్ యొక్క వి4 ఎస్ స్పోర్ట్ వేరియంట్‌లో కార్బన్ ఫైబర్ ఫ్రంట్ మడ్‌గార్డ్‌తో పాటు అక్రపోవిక్ ఎండ్-కెన్ మఫ్లర్ కూడా ఉంటుంది.

భారత్‌లో విడుదలకు సిద్ధమవుతున్న డ్యుకాటి మల్టీస్ట్రాడా వి4 అడ్వెంచర్ బైక్

ఈ మోటార్‌సైకిల్‌లోని స్టాండర్డ్ వేరియంట్‌లో ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం 5 ఇంచ్ టిఎఫ్‌టి డిస్‌ప్లే ఉంటుంది. మిగిలిన రెండు వేరియంట్లలో మాత్రం ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం 6.5 ఇంచ్ డిస్‌ప్లే యూనిట్ ఉంటుంది. ఈ మోటారుసైకిల్‌లో వివిధ రకాల ఎలక్ట్రానిక్ రైడర్ అసిస్టెన్స్ ఫీచర్లు ఉంటాయి, ఇవన్నీ వివిధ రైడింగ్ మోడ్లతో లోడ్ అవుతుంది, వీటిని స్విచ్ గేర్ మరియు ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ ఉపయోగించి కంట్రోల్ చేయవచ్చు.

భారత్‌లో విడుదలకు సిద్ధమవుతున్న డ్యుకాటి మల్టీస్ట్రాడా వి4 అడ్వెంచర్ బైక్

ఇందులో స్పోర్ట్, టూరింగ్, అర్బన్ మరియు ఎండ్యూరో వంటి వివిధ రైడింగ్ మోడ్‌లు ఉంటాయి. వీటిని ప్రారంభించడానికి రైడ్-బై-వైర్ సిస్టమ్ ఉంటుంది. ఇతర ఎలక్ట్రానిక్ రైడర్ అసిస్టెన్స్ ఫీచర్లలో (డిటిసి) డ్యుకాటి ట్రాక్షన్ కంట్రోల్, (డిడబ్ల్యుసి) డ్యుకాటి వీలీ కంట్రోల్, బాష్ నుండి కార్నరింగ్ ఎబిఎస్ మరియు (విహెచ్‌సి) వెహికల్ హోల్డ్ కంట్రోల్ మొదలైనవి ఉన్నాయి.

భారత్‌లో విడుదలకు సిద్ధమవుతున్న డ్యుకాటి మల్టీస్ట్రాడా వి4 అడ్వెంచర్ బైక్

డ్యుకాటి మల్టీస్ట్రాడా వి4 మెకానికల్స్‌ను గమనిస్తే, దీని ముందు భాగంలో 50 మిమీ ట్రావెల్‌తో కూడిన 170 మిమీ అప్‌సైడ్ డౌన్ (యూఎస్‌డి) ఫోర్కులు మరియు వెనుక భాగంలో 180 మిమీ లాంగ్ ట్రావెల్‌ మరియు డ్యుకాటి స్కైహూక్ సస్పెన్షన్ (డిఎస్ఎస్) టెక్నాలజీతో కూడిన మోనో-షాక్ సస్పెన్షన్ సెటప్ ఉంటాయి.

భారత్‌లో విడుదలకు సిద్ధమవుతున్న డ్యుకాటి మల్టీస్ట్రాడా వి4 అడ్వెంచర్ బైక్

ఇక బ్రేకింగ్ విషయానికి వస్తే, ముందు వైపు 320 మిమీ డ్యూయల్-సెమీ ఫ్లోటింగ్ డిస్క్‌లతో పాటు రేడియల్‌గా అమర్చిన బ్రెంబో మోనోబ్లోక్ ఫోర్-పిస్టన్ కాలిపర్స్ మరియు ముందు భాగంలో రేడియల్ మాస్టర్ సిలిండర్ ద్వారా జరుగుతుంది. మరియు వెనుక భాగంలో, బ్రెంబో టూ పిస్టన్ ఫ్లోటింగ్ కాలిపర్‌తో కూడిన 265 మిమీ డిస్క్ బ్రేక్ ఉంటుంది.

భారత్‌లో విడుదలకు సిద్ధమవుతున్న డ్యుకాటి మల్టీస్ట్రాడా వి4 అడ్వెంచర్ బైక్

మొత్తంగా చూసుకుంటే, సరికొత్త డ్యుకాటి మల్టీస్ట్రాడా వి4 అగ్రెసివ్ ఇటాలియన్ స్టైలింగ్‌ను కలిగి ఉన్న అద్భుతమైన అడ్వెంచర్ టూరర్ మోటార్‌సైకిల్‌గా ఉంటుంది. సరికొత్త రాడార్ టెక్నాలజీ వంటి ఫస్ట్ ఇన్ క్లాస్ ఫీచర్లతో ఈ విభాగంలో ఓ కొత్త బెంచ్‌మార్క్‌ను సృష్టించనుంది. డ్యుకాటి మల్టీస్ట్రాడా వి4 భారత మార్కెట్లో బిఎమ్‌డబ్ల్యూ ఆర్ 1250 జిఎస్ మరియు హోండా సిఆర్‌ఎఫ్ 1100 ఎల్ ఆఫ్రికా ట్విన్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

Most Read Articles

English summary
Ducati Multistrada V4 Adventurer Tourer India Launch Expected Very Soon, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X