డ్యుకాటి మల్టీస్ట్రాడా వి4 టీజర్ లాంచ్; జులై నెలలో భారత మార్కెట్లో విడుదల

ఇటాలియన్ సూపర్ బైక్ బ్రాండ్ డ్యుకాటి నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సరికొత్త ఆఫ్-రోడ్ అడ్వెంచర్ టూరింగ్ మోటార్‌సైకిల్ 'డ్యుకాటి మల్టీస్ట్రాడా వి4' త్వరలోనే భారత మార్కెట్లో విడుదల కానుంది. ఈ మేరకు కంపెనీ ఓ టీజర్‌ను విడుదల చేసింది. జులై నెలలో ఈ బైక్‌ను విడుదల చేస్తున్నట్లు కంపెనీ పేర్కొంది.

డ్యుకాటి మల్టీస్ట్రాడా వి4 టీజర్ లాంచ్; జులై నెలలో భారత మార్కెట్లో విడుదల

డ్యుకాటి గడచిన సంవత్సరం నవంబర్ నెలలో తమ మల్టీస్ట్రాడా వి4 బైక్‌ను ప్రపంచ వ్యాప్తంగా ఆవిష్కరించింది. భారత మార్కెట్లో డ్యుకాటి మల్టీస్ట్రాడా వి4 ఇప్పుడు ఈ ఇటాలియన్ బ్రాండ్ యొక్క ఫ్లాగ్‌షిప్ అడ్వెంచర్ టూరింగ్ మోటార్‌సైకిల్‌గా మారనుంది. మరికొన్ని వారాల్లోనే ఈ అడ్వెంచర్ టూరింగ్ మోటార్‌సైకిల్ బుకింగ్స్, అమ్మకాలు కూడా ప్రారంభం కానున్నాయి.

డ్యుకాటి మల్టీస్ట్రాడా వి4 టీజర్ లాంచ్; జులై నెలలో భారత మార్కెట్లో విడుదల

డ్యుకాటి మల్టీస్ట్రాడా వి4 అడ్వెంచర్ టూరర్ బైక్ మొత్తం మూడు వేరియంట్లలో అందుబాటులోకి రానుంది. వీటిలో స్టాండర్డ్, వి4 ఎస్ మరియు వి4 ఎస్ స్పోర్ట్ అనే వేరియంట్లు ఉన్నాయి. డ్యుకాటి బ్రాండ్ యొక్క పోర్ట్‌ఫోలియోలోని పానిగల్ వి4 మోటార్‌సైకిల్‌లో ఉపయోగించిన సరికొత్త ఇంజన్‌నే ఈ కొత్త మల్టీస్ట్రాడా వి4 బైక్‌లో కూడా ఉపయోగించారు. అయితే, కంపెనీ ఈ ఇంజన్‌ను అడ్వెంచర్ టూరర్ యొక్క ఫీచర్లకు అనుగుణంగా మోడిఫై చేసింది.

డ్యుకాటి మల్టీస్ట్రాడా వి4 టీజర్ లాంచ్; జులై నెలలో భారత మార్కెట్లో విడుదల

ఈ అడ్వెంచర్ మోటార్‌సైకిల్‌లో శక్తివంతమైన 1158సిసి వి4 గ్రాంటూరిస్మో లిక్విడ్ కూల్డ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 10,500 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 170 బిహెచ్‌పి శక్తిని మరియు 8,750 ఆర్‌పిఎమ్ వద్ద 125 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది స్లిప్-అసిస్ట్ క్లచ్ మరియు (డిక్యూఎస్) డ్యుకాటి క్విక్ షిఫ్ట్ బై-డైరెక్షనల్ క్విక్ షిఫ్టర్ టెక్నాలజీతో కూడిన సిక్స్-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

డ్యుకాటి మల్టీస్ట్రాడా వి4 టీజర్ లాంచ్; జులై నెలలో భారత మార్కెట్లో విడుదల

డ్యుకాటి మల్టీస్ట్రాడా వి4 మెకానికల్స్ విషయానికి వస్తే, ఈ బైక్ ముందు భాగంలో 50 మిమీ ట్రావెల్‌తో కూడిన 170 మిమీ అప్‌సైడ్ డౌన్ (యూఎస్‌డి) ఫోర్కులు మరియు వెనుక భాగంలో 180 మిమీ లాంగ్ ట్రావెల్‌ మరియు డ్యుకాటి స్కైహూక్ సస్పెన్షన్ (డిఎస్ఎస్) టెక్నాలజీతో కూడిన మోనో-షాక్ సస్పెన్షన్ సెటప్ ఉంటాయి. అలాగే, ఇందులో ముందు వైపు రెండు 320 మిమీ డిస్క్ బ్రేకులు మరియు వెనుక వైపు 265 మిమీ ఒక డిస్క్ బ్రేక్ ఉంటుంది.

డ్యుకాటి మల్టీస్ట్రాడా వి4 టీజర్ లాంచ్; జులై నెలలో భారత మార్కెట్లో విడుదల

ఈ బైక్‌లోని ఇతర ఫీచర్లను గమనిస్తే, పొడవైన సర్దుబాటు చేయగల విండ్‌స్క్రీన్, నకల్ గార్డ్స్, ఫ్రేమ్ ప్రొటెక్టర్స్, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ పైన జిపిఎస్ మౌంట్‌లతో పాటు 12వోల్ట్ ఛార్జింగ్ సాకెట్, ఎల్‌ఈడి టెయిల్ లాంప్స్, ఇంటిగ్రేటెడ్ రియర్ లగేజ్ ర్యాక్, అప్-స్వీప్ ఎగ్జాస్ట్, బ్యాక్‌లైట్ స్విచ్ గేర్, స్ప్లిట్ సీట్స్ మరియు సుదూర ప్రయాణాలకు అనువుగా పెద్ద 22-లీటర్ ఫ్యూయెల్ ట్యాంక్ మొదలైనవి ఉన్నాయి.

డ్యుకాటి మల్టీస్ట్రాడా వి4 టీజర్ లాంచ్; జులై నెలలో భారత మార్కెట్లో విడుదల

డ్యుకాటి మల్టీస్ట్రాడా వి4 మోటార్‌సైకిల్‌లోని స్టాండర్డ్ వేరియంట్‌లో ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం 5 ఇంచ్ టిఎఫ్‌టి డిస్‌ప్లే ఉంటుంది. మిగిలిన రెండు వేరియంట్లలో మాత్రం ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం 6.5 ఇంచ్ డిస్‌ప్లే యూనిట్ ఉంటుంది. ఈ ఇంకా ఇందులో వివిధ రకాల ఎలక్ట్రానిక్ రైడర్ అసిస్టెన్స్ ఫీచర్లు కూడా ఉంటాయి, వీటన్నంటినీ స్విచ్ గేర్ మరియు ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ సాయంతో కంట్రోల్ చేయవచ్చు.

డ్యుకాటి మల్టీస్ట్రాడా వి4 టీజర్ లాంచ్; జులై నెలలో భారత మార్కెట్లో విడుదల

రైడింగ్ మోడ్స్ విషయానికి వస్తే, ఈ బైక్‌లో స్పోర్ట్, టూరింగ్, అర్బన్ మరియు ఎండ్యూరో వంటి వివిధ రకాల రైడింగ్ మోడ్‌లు ఉంటాయి. వీటిని ప్రారంభించడానికి రైడ్-బై-వైర్ సిస్టమ్ ఉంటుంది. ఇతర ఎలక్ట్రానిక్ రైడర్ అసిస్టెన్స్ ఫీచర్లలో (డిటిసి) డ్యుకాటి ట్రాక్షన్ కంట్రోల్, (డిడబ్ల్యుసి) డ్యుకాటి వీలీ కంట్రోల్, బాష్ నుండి కార్నరింగ్ ఎబిఎస్ మరియు (విహెచ్‌సి) వెహికల్ హోల్డ్ కంట్రోల్ మొదలైనవి ఉన్నాయి.

డ్యుకాటి మల్టీస్ట్రాడా వి4 టీజర్ లాంచ్; జులై నెలలో భారత మార్కెట్లో విడుదల

ఈ అడ్వెంచర్-టూరర్ యొక్క వి4 ఎస్ స్పోర్ట్ వేరియంట్‌లో కార్బన్ ఫైబర్ ఫ్రంట్ మడ్‌గార్డ్‌తో పాటు అక్రపోవిక్ ఎండ్-కెన్ మఫ్లర్ కూడా ఉంటుంది. అంతేకాకుండా, ఇందులో సెగ్మెంట్ ఫస్ట్ రాడార్ టెక్నాలజీ కూడా ఉంటుంది. ఈ టెక్నాలజీ వలన బ్లైండ్‌స్పాట్ డిటెక్షన్ మరియు రాడార్-గైడెడ్ క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్లను పొందవచ్చు. మోటార్‌సైకిళ్లలో ఈ తరహా టెక్నాలజీ ప్రపంచంలోనే ఇది మొట్టమొదటిది.

డ్యుకాటి మల్టీస్ట్రాడా వి4 టీజర్ లాంచ్; జులై నెలలో భారత మార్కెట్లో విడుదల

డ్యుకాటి మల్టీస్ట్రాడా వి4 చాలా అగ్రెసివ్‌గా మరియు అందంగా కనిపిస్తుంది. ఇది బ్రాండ్ యొక్క విలక్షణమైన అడ్వెంచర్-టూరర్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. ముందు వైపు నుండి ఆకర్షణీయంగా కనిపించే ఈ బైక్‌లో ఎయిర్-ఇన్‌లెట్‌లతో పాటుగా ఏర్పాటు చేసిన ట్విన్-పాడ్ హెడ్‌ల్యాంప్‌లు మరియు హెడ్‌ల్యాంప్స్‌లో ఇంటిగ్రేటెట్ చేసిన ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

Most Read Articles

English summary
Ducati Multistrada V4 Teaser Revealed; India Launch In July 2021, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X