డుకాటీ పానిగలే సూపర్ బైక్ డిజైన్‌ను కాపీ కొట్టిన చైనా కంపెనీ.. పూర్తి వివరాలు

ప్రపంచంలో ఉన్న దాదాపు అన్ని వస్తువులు చైనా మార్కెట్లో తయారవుతున్నాయి. అసలైన వాటిని కాపీ కొట్టి అచ్చం అలాగే ఉండే వాటిని తయారుచేయడంలో చైనాకు వెన్నతో పెట్టిన విద్య. ఇప్పటికే చాలా వాహనాలను కాపీ కొట్టి అసలైన వాహనాలను మరిపించే విధంగా తయారుచేసిన సంఘటనలు చాలా ఉన్నాయి. ఇపుడు ఇదే విధంగా వాహనదారులకు ఎంతగానో ఇష్టమైన డుకాటీ పానిగలే సూపర్ బైక్ ని కాపీ కొట్టింది. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ చూద్దాం..

డుకాటీ పానిగలే సూపర్ బైక్ డిజైన్‌ను కాపీ కొట్టిన చైనా కంపెనీ.. పూర్తి వివరాలు

సాధారణంగా కంపెనీలు తయారు చేస్తున్న వస్తువుల డిజైన్స్ పట్ల నిర్లక్ష్యంగా ఉన్న వేళ చైనా మార్కెట్ వాటిని కాపీ కొట్టి అలాంటి వాహనాలను తయారుచేసి ప్రపంచ మార్కెట్లో తన పెత్తనం చెలాయిస్తోంది. అసలైన మోడల్స్ తో పోటీ పడలేక ఇలాంటి కుతంత్రాలకు పాల్పడుతోంది.

డుకాటీ పానిగలే సూపర్ బైక్ డిజైన్‌ను కాపీ కొట్టిన చైనా కంపెనీ.. పూర్తి వివరాలు

అంతర్జాతీయ మార్కెట్లో చాలా ప్రజాదరణ పొందిన కార్ మరియు బైక్ నమూనాలు చాలాసార్లు దొంగలించబడి, మందలించబడిన తర్వాత కూడా తన బుడ్డి ఏమాత్రం మార్చుకోవడం లేదు. చైనాలో ప్రసిద్ధ మోడళ్ల డిజైన్లను దొంగిలించడం మరియు వాటిని తక్కువ ధరలకు అమ్మడం ఒక అలవాటుగా మారిపోయింది.

MOST READ:చిట్టి చిట్టి రోబో కాదు, పిజ్జా డెలివరీ రోబో, తెలుసా.. అయితే ఇది చూడండి

డుకాటీ పానిగలే సూపర్ బైక్ డిజైన్‌ను కాపీ కొట్టిన చైనా కంపెనీ.. పూర్తి వివరాలు

ఇటలీకి చెందిన డ్యుకాటి పానిగలే 959 బైక్ యొక్క డిజైన్ కాపీ కొత్త దానిని పోలిన ఒక బైక్ ఇటీవల విడుదల చేసింది. ప్రసిద్ధ డుకాటీ పానిగలే 959 బైక్ రూపకల్పనను కాపీ కొట్టి తయారు చేసిన బైక్ కి చైనాలో మాక్సియావో 500 ఆర్ఆర్ అని నామకరణం చేసి మార్కెట్లో ఆవిష్కరించారు.

డుకాటీ పానిగలే సూపర్ బైక్ డిజైన్‌ను కాపీ కొట్టిన చైనా కంపెనీ.. పూర్తి వివరాలు

ఈ సూపర్ బైక్ యొక్క డిజైన్ మాత్రమే కాదు ఆఖరికి, ఈ చైనా తయారీదారు డుకాటీ యొక్క ఐకానిక్ రెడ్ అండ్ వైట్ బ్యాడ్జింగ్‌ను కూడా కాపీ చేశారు. ఇది చూడటానికి ఒరిజినల్ డ్యుకాటి పానిగాలే బైక్ ని తలపిస్తుంది.

MOST READ:సమంత మనసు ఆకాశమంత.. దీనికి ఇదే నిలువెత్తు నిదర్శనం

డుకాటీ పానిగలే సూపర్ బైక్ డిజైన్‌ను కాపీ కొట్టిన చైనా కంపెనీ.. పూర్తి వివరాలు

ఈ డూప్లికేట్ డ్యుకాటి బైక్ లో 471 సిసి, ట్విన్-సిలిండర్ ఇంజన్‌ అమర్చారు. ఈ ఇంజన్ 8,500 ఆర్‌పిఎమ్ వద్ద 47.5 బిహెచ్‌పి శక్తిని మరియు 7,000 ఆర్‌పిఎమ్ వద్ద 43 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ గంటకు 165 కిమీ వేగంతో ప్రయాణిస్తుంది. అంతే కాకుండా ఇది కేవలం 6.1 సెకన్లలో 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకోగలదు.

డుకాటీ పానిగలే సూపర్ బైక్ డిజైన్‌ను కాపీ కొట్టిన చైనా కంపెనీ.. పూర్తి వివరాలు

ఈ గణాంకాలు చైనా నిర్మిత సూపర్‌బైక్ రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650 కంటే ఎక్కువగా ఉన్నాయి. ఈ రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650 బైక్ లో 648 సిసి ఇంజన్‌ అమర్చారు. ఈ ఇంజన్ 47.65 బిహెచ్‌పి శక్తి మరియు 52 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

MOST READ:మా నాన్న పోలీస్.. నేను ఏమైనా చేస్తా.. కరోనా వేళ ఢిల్లీలో యువతి హల్‌చల్ [వీడియో]

డుకాటీ పానిగలే సూపర్ బైక్ డిజైన్‌ను కాపీ కొట్టిన చైనా కంపెనీ.. పూర్తి వివరాలు

మాక్సియావ్ 500 ఆర్‌ఆర్ ముందు భాగంలో డయల్ కాలిపర్‌లతో డ్యూయల్ 320 మిమీ డిస్క్ బ్రేక్‌, వెనుకవైపు 260 మిమీ డిస్క్ బ్రేక్ అమర్చారు. అంతే కాకుండా డ్యూయల్-ఛానల్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఇందులో ఉంటుంది. ఈ బైక్‌లో 22 లీటర్ల సామర్థ్యం గల ఇంధన ట్యాంక్ ఉంది. ఈ బైక్ 22.2 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది.

డుకాటీ పానిగలే సూపర్ బైక్ డిజైన్‌ను కాపీ కొట్టిన చైనా కంపెనీ.. పూర్తి వివరాలు

ఈ బైక్ యొక్క ఎల్‌ఈడీ హెడ్‌లైట్, ఫెయిరింగ్ మరియు టైల్ లాంప్ అసలు డుకాటీ పానిగలే సూపర్‌బైక్‌లో ఉన్న విధంగా ఉంటుంది. చూడగానే మొదటి చూపుతోనే ఇది అసలైన డ్యుకాటి పానిగలే 959 తలిపిస్తుంది. కానీ ఏది ఏమైనా ఈ డూప్లికేట్ బైక్ ఒరిజినల్ బైక్ కి దీటుగా రాదనే విషయం వాహనప్రియులన్దరికి తెలుసు.

MOST READ:చెక్కతో చేసిన టయోటా ఫార్చ్యూనర్ లెజెండర్.. సూపర్, గురూ..!

Most Read Articles

English summary
China’s Ducati Panigale Copycat Superbike. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X