భారత్‍లో విడుదలైన 'Ducati Scrambler Desert Sled Fasthouse' బైక్: ధర రూ. 10.99 లక్షలు

ఇటాలియన్ మోటార్‌సైకిల్ తయారీ సంస్థ డుకాటి (Ducati) దేశీయ మార్కెట్లో కొత్త Scrambler Desert Sled Fasthouse బైక్ ను విడుదల చేసింది. దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త బైక్ ధర రూ. 10.99 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా). కంపెనీ విడుదల చేసిన ఈ లేటెస్ట్ బైక్ ప్రపంచ మార్కెట్లో కేవలం 800 యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి.

భారత్‍లో విడుదలైన 'Ducati Scrambler Desert Sled Fasthouse' బైక్: ధర రూ. 10.99 లక్షలు

డుకాటీ స్క్రాంబ్లర్ మరియు అమెరికన్ క్లాత్స్ బ్రాండ్ ఫాస్ట్‌హౌస్ మధ్య సహకారాన్ని జరుపుకోవడానికి స్క్రాంబ్లర్ డెసర్ట్ స్లెడ్ ​​ఫాస్ట్‌హౌస్ సృష్టించబడింది. ఇది 2020లో అమెరికన్ రైడర్ జోర్డాన్ గ్రాహమ్‌ను మింట్ 400 యొక్క హూలిగన్ క్లాస్ లో విజయం సాధించింది, ఇది అత్యంత పురాతన మరియు అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆఫ్-రోడ్ రేసు.

భారత్‍లో విడుదలైన 'Ducati Scrambler Desert Sled Fasthouse' బైక్: ధర రూ. 10.99 లక్షలు

డుకాటి స్క్రాంబ్లర్ డెసర్ట్ స్లెడ్ ​​ఫాస్ట్‌హౌస్ సాధారణ స్క్రాంబుల్డ్ స్లెడ్‌పై ఆధారపడి ఉంటుంది. అంతే కాకుండా గత సంవత్సరం మింట్ 400 ఆఫ్-రోడ్ రేస్‌లో ఉపయోగించిన బైక్‌లపై ఉన్న వాటికి నివాళులు అర్పించే ప్రత్యేకమైన లివరీని కలిగి ఉంది. ఇది చూడటానికి చాలా ఆకర్షనీయంగా ఉంటుంది.

భారత్‍లో విడుదలైన 'Ducati Scrambler Desert Sled Fasthouse' బైక్: ధర రూ. 10.99 లక్షలు

ఈ బైక్ లో ఉన్న లివరీ యొక్క ప్రధాన రంగులు బ్లాక్ మరియు గ్రే కలర్ లో ఉంటాయి. ఇవి బైక్ యొక్క ఫ్యూయెల్ ట్యాంక్ పైన కూల్ జియోమెట్రిక్ షేప్ ఏర్పరుస్తాయి. దీనితో పాటు Scrambler Ducati మరియు Fasthouse లోగోను కూడా కలిగి ఉంటుంది. అయితే ఇందులోని ఫ్రేమ్ డుకాటీ రెడ్‌లో పెయింట్ చేయబడింది.

కంపెనీ యొక్క ఈ Scrambler Desert Sled Fasthouse బైక్ యొక్క ప్రత్యేక సంఖ్య 800 అనేది అల్యూమినియం ప్లేట్‌తో అలంకరించబడి ఉంటుంది. మొత్తానికి ఈ బైక్ చూసిన వెంటనే ఆకర్శించే విధంగా మరియు ఆధునిక ఫీచర్స్, పరికరాలను కలిగి ఉంటుంది.

భారత్‍లో విడుదలైన 'Ducati Scrambler Desert Sled Fasthouse' బైక్: ధర రూ. 10.99 లక్షలు

కంపెనీ విడుదల చేసిన ఈ కొత్త బైక్ ​​యొక్క సీటు ఎత్తు భూమి నుండి 840 మి.మీ ఎత్తులో ఉంటుంది. ఈ బైక్ లో ర్యాలీ-ఇన్స్ఫైర్డ్ ఫుట్‌పెగ్‌లు రిమూవబుల్ రబ్బరు ప్యాడ్‌లు ఉంటాయి. ఇందులోని మడ్‌గార్డ్‌లు రెండూ కూడా బ్లాక్ పెయింట్ చేయబడి ఉంటుంది.

భారత్‍లో విడుదలైన 'Ducati Scrambler Desert Sled Fasthouse' బైక్: ధర రూ. 10.99 లక్షలు

కంపెనీ యొక్క ఈ కొత్త బైక్ విడుదల సందర్భంగా, Ducati India మేనేజింగ్ డైరెక్టర్ Bipul Chandra మాట్లాడుతూ, స్క్రాంబ్లర్ డెజర్ట్ స్లెడ్ ​​ఈ విభాగంలో అత్యంత సామర్థ్యం కలిగిన ఆఫ్ రోడ్ బైక్‌లలో ఒకటి. భారతీయ కస్టమర్లు ఈ వాస్తవాన్ని గమనించడం వల్ల ఇది ఎంతో ఆదరణ పొందగలిగింది. ఈ బైక్ చక్కటి డెసర్డ్ బైక్, కావున ఈ బైక్ ప్రపంచ వ్యాప్తంగా కేవలం 800 మంది మాత్రమే ఈ బైక్ ను పొందగలరు.

భారత్‍లో విడుదలైన 'Ducati Scrambler Desert Sled Fasthouse' బైక్: ధర రూ. 10.99 లక్షలు

భారతీయ మార్కెట్లో ఈ కొత్త Duacti Scrambler Desert Sled Fasthouse యొక్క బుకింగ్స్ ప్రారంభమైన కేవలం కొన్ని నిముషాల్లోనే మొత్తం అమ్ముడయ్యాయి. దీన్ని బట్టి చూస్తే ఈ బైక్ కి దేశీయ మార్కెట్లో ఎంత ఆదరణ ఉందొ మనం అర్థం చేసుకోవచ్చు.

Ducati Scrambler Desert Sled Fasthouse బైక్ అద్భుతమైన ఫెర్ఫామెన్స్ అందిస్తుంది. దీనికోసం కంపెనీ ఇందులో ఎయిర్ కూల్డ్ 803 సిసి ఎల్-ట్విన్ ఇంజన్‌ను అమర్చింది. ఈ ఇంజిన్ 8,250 ఆర్‌పిఎమ్ వద్ద 71.8 బిహెచ్‌పి పవర్ మరియు 5,750 ఆర్‌పిఎమ్ వద్ద 66.2 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ అందిస్తుంది. ఇంజిన్ స్ట్రెయిట్ కట్ గేర్లు మరియు స్లిప్పర్ క్లచ్‌తో 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది.

భారత్‍లో విడుదలైన 'Ducati Scrambler Desert Sled Fasthouse' బైక్: ధర రూ. 10.99 లక్షలు

Ducati Scrambler Desert Sled Fasthouse బైక్ (డుకాటి స్క్రాంబ్లర్ డెసర్ట్ స్లెడ్ ​​ఫాస్ట్‌హౌస్‌) లో 46 మి.మీ అప్‌సైడ్ డౌన్ ఫోర్క్‌లతో ట్యూబ్యులర్ స్టీల్ ట్రెల్లిస్ ఫ్రేమ్ సెటప్ మరియు వెనుకవైపు 200 మి.మీ ట్రావెల్‌తో కూడిన కయాబా మోనో షాక్ ప్రీలోడ్ మరియు రీబౌండ్ అడ్జస్ట్‌మెంట్‌తో పాటు డబుల్ సైడెడ్ అల్యూమినియం స్వింగార్మ్ వంటివి కలిగి ఉంటాయి.

భారత్‍లో విడుదలైన 'Ducati Scrambler Desert Sled Fasthouse' బైక్: ధర రూ. 10.99 లక్షలు

ఇక ఈ బైక్ యొక్క బ్రేకింగ్ సెటప్ విషయానికి వస్తే, ఇందులో రేడియల్ 4-పిస్టన్ కాలిపర్‌లతో ఫ్రంట్ వీల్‌పై 330 మి.మీ డిస్క్ బ్రేక్ మరియు వెనుక భాగంలో సింగిల్ ఫ్లోటింగ్ కాలిపర్‌తో 245 మి.మీ డిస్క్ బ్రేక్ బ్రేకింగ్‌ ఉంటాయి. బ్రేకింగ్ సిస్టం చాలా అద్భుతంగా ఉంటుంది, కావున బైక్ రైడర్ కి చాలా అనుకూలమగా ఉంటుంది.

భారత్‍లో విడుదలైన 'Ducati Scrambler Desert Sled Fasthouse' బైక్: ధర రూ. 10.99 లక్షలు

Ducati Scrambler Desert Sled Fasthouse మంచి రైడింగ్ అనుభవాన్ని అందిస్తుంది. దీనికోసం ఈ బైక్ యొక్క ముందు చక్రం 120/70 R19 టైర్‌తో కూడిన స్పోక్డ్ 19 ఇంచెస్ యూనిట్ కలిగి ఉంటుంది. అదేవిధంగా వెనుక చక్రం స్పోక్డ్ 17 ఇంచెస్ యూనిట్, ఇది 170/60 R17 టైర్‌ను కలిగి ఉంటుంది. డెసర్ట్ స్క్రాంబ్లర్ స్లెడ్‌లో ఉపయోగించే టైర్లు పిరెల్లీ యొక్క స్కార్పియన్ ర్యాలీ STRలు, కావున అద్భుతమైన పనితీరుని అందిస్తాయి.

Most Read Articles

English summary
Ducati scrambler desert sled fasthouse launched in india price specs details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X