కొత్త 2022 డ్యుకాటి హైపర్‌మోటార్డ్ 950 బైక్ ఆవిష్కరణ; వివరాలు

ఇటాలియన్ పెర్ఫార్మెన్స్ మోటారుసైకిల్ బ్రాండ్ డ్యుకాటి, తమ సరికొతత్ 2022 హైపర్‌మోటార్డ్ 950 స్పోర్ట్స్ బైక్‌ను ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించింది. ఈ కొత్త డ్యుకాటి హైపర్‌మోటార్డ్ 950 ఇప్పుడు అప్‌డేట్ చేయబడిన ఇంజన్‌తో పాటుగా కొన్ని కొత్త డిజైన్ ఎలిమెంట్స్‌ను కూడా కలిగి ఉంటుంది.

కొత్త 2022 డ్యుకాటి హైపర్‌మోటార్డ్ 950 బైక్ ఆవిష్కరణ; వివరాలు

కొత్త 2020 మోడల్ డ్యుకాటి హైపర్‌మోటార్డ్ 950 మోటార్‌సైకిల్‌ను స్టాండర్డ్, ఆర్‌విఈ మరియు ఎస్‌పి అనే మూడు వేరియంట్లలో ప్రవేశపెట్టారు. ఈ అప్‌డేటెడ్ మోటారుసైకిల్ త్వరలోనే భారత మార్కెట్లో కూడా విడుదల కానుంది. ఇందులోని మూడు వేరియంట్లను కంపెనీ ఈ ఏడాది భారతదేశంలో విడుదల చేయనుంది.

కొత్త 2022 డ్యుకాటి హైపర్‌మోటార్డ్ 950 బైక్ ఆవిష్కరణ; వివరాలు

భారత మార్కెట్లో కొత్త 2022 డ్యుకాటి హైపర్‌మోటార్డ్ 950 బైక్ ధరలు సుమారు రూ.12.5 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతాయని అంచనా. ఈ బైక్‌లోని ఇంజన్ విషయానికి వస్తే, మునుపటి హైపర్‌మోటార్డ్ 950 మోడల్‌లో ఉపయోగించిన అదే ఇంజన్ యొక్క అప్‌గ్రేడెడ్ వెర్షన్‌ను ఈ కొత్త మోడల్‌లో ఉపయోగించారు.

MOST READ:అవసరమైన వారికి ఉచితంగా ఆక్సిజన్ అందిస్తున్న 26 ఏళ్ల యువతి.. నిజంగా గ్రేట్ కదా..!

కొత్త 2022 డ్యుకాటి హైపర్‌మోటార్డ్ 950 బైక్ ఆవిష్కరణ; వివరాలు

ఈ బైక్‌లో డెస్మోడ్రోమిక్ టెస్టాస్ట్రెట్టా 11 °, ఎల్-ట్విన్ సిలిండర్, లిక్విడ్-కూల్డ్ 937 సిసి ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 9000 ఆర్‌పిఎమ్ వద్ద 112.6 బిహెచ్‌పి శక్తిని మరియు 7250 ఆర్‌పిఎమ్ వద్ద 96 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ స్లిప్-అసిస్ట్ క్లచ్‌తో సిక్స్-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

కొత్త 2022 డ్యుకాటి హైపర్‌మోటార్డ్ 950 బైక్ ఆవిష్కరణ; వివరాలు

కొత్త 2022 డ్యుకాటి హైపర్‌మోటార్డ్ 950 బైక్‌లోని ఎర్‌విఈ మరియు ఎస్‌పి వేరియంట్లను మాత్రం బై-డైరెక్షనల్ క్విక్ షిఫ్టర్ డ్యుకాటి క్విక్ షిఫ్ట్ (డిక్యూఎస్)తో స్టాండర్డ్‌గా అందిస్తున్నారు. కాగా, ఇందులోని ఎస్‌పి వేరియంట్ ఈ మోటారుసైకిల్ యొక్క ఇతర రెండు వేరియంట్‌లతో పోలిస్తే, కొత్త లివరీని కలిగి ఉంటుంది. ఇది కేవలం డిజైన్ పరంగానే కాకుండా, హార్డ్‌వేర్ పరంగా కూడా ఇది భిన్నంగా కనిపిస్తుంది.

MOST READ:కరోనా బాధితులకోసం కొత్త హాస్పిటల్ ప్రారంభించిన ఒమేగా సెకి మొబిలిటీ; పూర్తి వివరాలు

కొత్త 2022 డ్యుకాటి హైపర్‌మోటార్డ్ 950 బైక్ ఆవిష్కరణ; వివరాలు

ఈ మోటార్‌సైకిల్ ముందు భాగంలో 48 మిమీ ఫుల్లీ అడ్జస్టబల్ అప్‌సైడ్-డౌన్ (యుఎస్‌డి) ఫోర్కులు మరియు వెనుక భాగంలో ఓహ్లిన్స్ నుండి గర్హించిన ఫుల్లీ అడ్జస్టబల్ మోనో-షాక్ సస్పెన్షన్ సెటప్‌ను కలిగి ఉంటుంది. ఇది సుపీరియర్ పిరెల్లి డయాబ్లో సూపర్కోర్సా ఎస్పి టైర్లతో పాటుగా తేలికైన 17 ఇంచ్ మార్చెసిని ఫోర్జ్డ్ అల్లాయ్ వీల్స్‌ను కలిగి ఉంటుంది.

కొత్త 2022 డ్యుకాటి హైపర్‌మోటార్డ్ 950 బైక్ ఆవిష్కరణ; వివరాలు

డ్యుకాటి హైపర్‌మోటార్డ్ 950 నేక్డ్ డిజైన్‌తో, తక్కువ బాడీ ప్యానెళ్లను కలిగి ఉండి చాలా తేలికగా ఉంటుంది. ఈ బైక్ బరువును తక్కువగా ఉంచేందుకు కంపెనీ దీని తయారీలో ఎక్కువగా కార్బన్ ఫైబర్ బాగాలను ఉపయోగించింది. ఈ కార్బన్ ఫైబర్ బాగాలలో ఫ్రంట్ మడ్‌గార్డ్ మరియు టైమింగ్ బెల్ట్ కవర్లు కూడా ఉన్నాయి.

MOST READ:రాఫెల్ యుద్ధ విమానానికి, బుగాటి సూపర్ కారుకి పోటీ: ఎవరు గెలిచారో తెలిస్తే షాక్!

కొత్త 2022 డ్యుకాటి హైపర్‌మోటార్డ్ 950 బైక్ ఆవిష్కరణ; వివరాలు

స్టాండర్డ్ వేరియంట్‌తో పోల్చితే, ఆర్‌విఈ మరియు ఎస్‌పి వేరియంట్లలో రెండు చివర్లలో పూర్తిగా సర్దుబాటు చేయగల సస్పెన్షన్‌ను కలిగి ఉంటాయి. అయితే, అవి మార్జోచి బ్రాండ్ నుండి గ్రహించిన లో-స్పెక్ యూనిట్స్ అయి ఉంటాయి. అలాగే, రెండు చివర్లలో పిరెల్లి డయాబ్లో రోసో III టైర్లతో కూడిన స్టాండర్డ్ 17 ఇంచ్ అల్లాయ్ వీల్స్ ఉంటాయి.

కొత్త 2022 డ్యుకాటి హైపర్‌మోటార్డ్ 950 బైక్ ఆవిష్కరణ; వివరాలు

ఇకపోతే, ఈ మూడు వేరియంట్లలో లైటింగ్, ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ మరియు బ్రేకింగ్ హార్డ్‌వేర్ ఒకే విధంగా ఉంటాయి. బ్రేకింగ్ విషయానికి వస్తే, ముందు భాగంలో బ్రెంబో బ్రాండ్ నుండి గ్రహించిన 320 మిమీ సెమీ ఫ్లోటింగ్ బ్రేక్ డ్యూయల్ డిస్క్‌లతో పాటు రేడియల్‌గా అమర్చిన మోనోబ్లోక్ 4-పాట్ కాలిపర్‌లు మరియు వెనుక భాగంలో 245 మిమీ సింగిల్ డిస్క్ 2 పాట్ కాలిపర్‌లు ఉంటాయి.

MOST READ:తౌక్టే తుఫాన్ ఎఫెక్ట్; 37 మంది మరణం 38 మంది గల్లంతు

కొత్త 2022 డ్యుకాటి హైపర్‌మోటార్డ్ 950 బైక్ ఆవిష్కరణ; వివరాలు

కొత్త 2022 డ్యుకాటి హైపర్‌మోటార్డ్ 950 మోటారుసైకిల్‌లో టర్న్-సిగ్నల్ సూచికలతో సహా మొత్తం లైటింగ్ అంతా పూర్తిగా ఎల్‌ఈడీ రూపంలోనే ఉంటుంది. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ టిఎఫ్‌టి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ రూపంలో ఉంటుంది మరియు హ్యాండిల్‌బార్‌లో ఆఫర్ చేసిన ప్రత్యేకమైన స్విచ్‌గేర్‌ను ఉపయోగించి కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది.

కొత్త 2022 డ్యుకాటి హైపర్‌మోటార్డ్ 950 బైక్ ఆవిష్కరణ; వివరాలు

ఈ కొత్త హైపర్‌మోటార్డ్ బైక్‌ను అనేక ఎలక్ట్రానిక్స్ రైడర్ ప్యాకేజీలతో అందిస్తున్నారు. ఇందులో బహుళ రైడింగ్ మోడ్‌లు, బాష్ కార్నరింగ్ ఏబిఎస్, డ్యుకాటి ట్రాక్షన్ కంట్రోల్ (డిటిసి) ఇవో మరియు డ్యుకాటి వీలీ కంట్రోల్ (డిడబ్ల్యూసి) ఇవో మొదలైనవి ఉన్నాయి. ఈ మోటార్‌సైకిల్‌లో కొన్ని పవర్ మోడ్స్ మరియు యుఎస్‌బి ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంటాయి.

కొత్త 2022 డ్యుకాటి హైపర్‌మోటార్డ్ 950 బైక్ ఆవిష్కరణ; వివరాలు

డ్యుకాటి అంతర్జాతీయ మార్కెట్లలో ఈ బైక్ కోసం కొన్ని ప్రత్యేకమైన యాక్ససరీలను అందిస్తోంది. ఇందులో యాంటీ-తెఫ్ట్ సిస్టమ్, హ్యాండిల్‌బార్‌పై హీటెడ్ గ్రిప్స్ మరియు బ్రాండ్ యొక్క డ్యుకాటి మల్టీమీడియా సిస్టమ్ (డిడబ్ల్యూఎస్) కూడా ఉన్నాయి. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ని గమనిస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Ducati Unveils New 2022 Hypermotard 950 In The Global Market, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X