డుకాటి బ్రాండ్ నుండి రెండు కొత్త స్క్రాంబ్లర్ మోడళ్లు వచ్చాయ్..

ఇటాలియన్ ప్రీమియం మోటార్‌సైకిల్ బ్రాండ్ డుకాటి (Ducati) తాజాగా రెండు కొత్త మోటార్‌సైకిళ్లను ఆవిష్కరించింది. డుకాటి వరల్డ్ ప్రీమియర్ 2022 వర్చువల్ ఈవెంట్‌లో భాగంగా కంపెనీ తమ కొత్త స్క్రాంబ్లర్ 1100 ట్రిబ్యూట్ ప్రో (Scrambler 1100 Tribute Pro) మరియు స్క్రాంబ్లర్ 800 అర్బన్ మోటార్డ్ (Scrambler 800 Urban Motard) మోడళ్లను ఆవిష్కరించింది.

డుకాటి బ్రాండ్ నుండి రెండు కొత్త స్క్రాంబ్లర్ మోడళ్లు వచ్చాయ్..

కొత్త 2022 డుకాటి స్క్రాంబ్లర్ 1100 ట్రిబ్యూట్ మోటార్‌సైకిల్ 50వ వార్షికోత్సవ వేడుకలో భాగంగా విడుదల చేయబడింది. డుకాటి 1971 లో ఎయిర్ కూల్డ్, ట్విన్ సిలిండర్ ఇంజన్‌ తో ప్రారంభించిన ఈ మోటార్‌సైకిల్‌ కు కొన్ని చారిత్రక స్పర్శలను అందించింది. మరోవైపు, ట్రిబ్యూట్ ప్రో 750 స్పోర్ట్జ్ నుండి ప్రేరణ పొందిన ఈ మోడల్‌ లో జియాలియో రూపొందించిన డుకాటి లోగో, జియాలో ఓక్రా ఎల్లో కలర్ ఆప్షన్ కూడా ఉన్నాయి.

డుకాటి బ్రాండ్ నుండి రెండు కొత్త స్క్రాంబ్లర్ మోడళ్లు వచ్చాయ్..

డుకాటి స్క్రాంబ్లర్ 1100 ట్రిబ్యూట్ ప్రో లో కంపెనీ యాంత్రిక ఎలాంటి మార్పులను చేయలేదు. ఇందులోని 1079 సిసి ఎయిర్ కూల్డ్ ఎల్ ట్విన్ ఇంజన్ 7500 ఆర్‌పిఎమ్ వద్ద 84 బిహెచ్‌పి శక్తిని మరియు 4750 ఆర్‌పిఎమ్ వద్ద 88 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్‌ తో జత చేయబడి ఉంటుంది. ట్రేల్లిస్ ఫ్రేమ్‌పై డుకాటి ఈ బైక్‌ను రూపొందించింది.

డుకాటి బ్రాండ్ నుండి రెండు కొత్త స్క్రాంబ్లర్ మోడళ్లు వచ్చాయ్..

సస్పెన్షన్ సెటప్ విషయానికి వస్తే, ముందు వైపున పూర్తిగా సర్దుబాటు చేయగల మార్జోచి ఫోర్క్‌లను మరియు వెనుకవైపు 45 మిమీ ట్రావెల్ తో కూడిన మోనోషాక్ సస్పెన్షన్ ను అందిస్తున్నారు. బ్రేకింగ్ విషయానికి వస్తే, స్క్రాంబ్లర్ మోటార్‌సైకిల్ ముందు భాగంలో బ్రెంబో నుండి గ్రహించిన ఎమ్4.32 మోనోబ్లాక్ ఫోర్-పిస్టన్ ఫ్రంట్ కాలిపర్‌లతో కూడిన 320 మిమీ సెమీ ఫ్లోటింగ్ ట్విన్ డిస్క్‌లు మరియు వెనుక భాగంలో సింగిల్ పిస్టన్‌తో కూడిన 245 మిమీ డిస్క్‌లు ఉన్నాయి.

డుకాటి బ్రాండ్ నుండి రెండు కొత్త స్క్రాంబ్లర్ మోడళ్లు వచ్చాయ్..

డుకాటి స్క్రాంబ్లర్ 1100 ట్రిబ్యూట్ ప్రో మూడు రైడింగ్ మోడ్ లను కలిగి ఉంటుంది. ఇది కార్నర్ ఏబిఎస్ తో పాటుగా డుకాటి ట్రాక్షన్ కంట్రోల్ ఫీచర్ ను కూడా కలిగి ఉంటుంది. ట్రిబ్యూట్ ప్రో స్క్రాంబ్లర్ వెర్షన్‌కు సూచించినప్పటికీ, ఇది డుకాటి స్క్రాంబ్లర్ 800 అర్బన్ మోటార్డ్‌పై ఆధారపడి ఉంటుంది. ఇది డ్యుకాటి జిపి19 రెడ్ మరియు స్టార్ వైట్ సిల్క్‌ కలర్ తో ఇంధన ట్యాంక్‌ పై బ్లాక్ గ్రాఫిక్స్‌ తో కలిగి ఉంటుంది.

డుకాటి బ్రాండ్ నుండి రెండు కొత్త స్క్రాంబ్లర్ మోడళ్లు వచ్చాయ్..

ఈ బైక్ యొక్క ఇతర ముఖ్యమైన ఫీచర్లను గమనిస్తే, ఫ్లాట్ సీట్, దిగువ హ్యాండిల్‌బార్లు, సైడ్ నెంబర్ ప్లేట్ మరియు రెడ్ ఫ్రంట్ మడ్‌గార్డ్ ఉన్నాయి. ఇంకా ఇందులో 17 ఇంచ్ స్పోక్ వీల్స్‌ మరియు పిరెల్లి డయాబ్లో రోసో III టైర్‌ను కలిగి ఉంటుంది. డుకాటి స్క్రాంబ్లర్ 800 వెర్షన్ 803 సీసీ, ఎల్-ట్విన్ ఇంజన్‌ తో పనిచేస్తుంది. ఇది 8,250 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 73 హార్స్‌పవర్ ను మరియు 5,250 ఆర్‌పిఎమ్ వద్ద 66.2 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేయగలదు. ఈ ఇంజన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌ తో జత చేయబడి ఉంటుంది.

డుకాటి బ్రాండ్ నుండి రెండు కొత్త స్క్రాంబ్లర్ మోడళ్లు వచ్చాయ్..

ఈ కొత్త బైక్ కూడా దాని పూర్వీకుల మాదిరిగానే అదే ఎలక్ట్రానిక్స్ ప్యాకేజీని కలిగి ఉంటుంది. ఇందులో కార్నింగ్ ఏబిఎస్, డుకాటి మల్టీమీడియా సిస్టమ్, సర్దుబాటు చేయగల లివర్, సైడ్ స్టాండ్ ఇండికేటర్ వంటి మరిన్నో ఫీచర్లు ఉన్నాయి. కొత్త డుకాటి స్క్రాంబ్లర్ 1100 ట్రిబ్యూట్ ప్రో మరియు స్క్రాంబ్లర్ 800 అర్బన్ మోటార్డ్ వచ్చే నవంబర్‌ 2021 ముందుగా యూరప్‌ మార్కెట్లలో విక్రయానికి రానున్నాయి.

డుకాటి బ్రాండ్ నుండి రెండు కొత్త స్క్రాంబ్లర్ మోడళ్లు వచ్చాయ్..

కాగా, ఈ రెండు బైక్‌లు వచ్చే ఏడాది ప్రారంభంలో భారతదేశంలో కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే, ఈ స్పెషల్ మోడళ్లు సాధారణ మోడళ్ల కంటే కొంచెం ఎక్కువ ధరను కలిగి ఉండే అవకాశం ఉంది. డుకాటి ఇటీవలే భారత మార్కెట్లో తమ కొత్త మోన్‌స్టర్ ఎడిషన్ స్ట్రీట్ ఫైటర్ మోటార్‌సైకిల్ ను విడుదల చేసింది.

డుకాటి బ్రాండ్ నుండి రెండు కొత్త స్క్రాంబ్లర్ మోడళ్లు వచ్చాయ్..

డుకాటి మోన్‌స్టర్ రెండు వేరియంట్లలో లభిస్తుంది, అవి - స్టాండర్డ్ మరియు ప్లస్. భారతదేశంలో వరుసగా డుకాటి మోన్‌స్టర్ ఎడిషన్ స్ట్రీట్ ఫైటర్ మోటార్‌సైకిల్ ధరలు రూ. 10.99 లక్షల నుండి రూ. 11.24 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉన్నాయి. ఇది కంపెనీ లైనప్‌ లో అత్యధికంగా అమ్ముడైన రెండవ మోడల్.

డుకాటి బ్రాండ్ నుండి రెండు కొత్త స్క్రాంబ్లర్ మోడళ్లు వచ్చాయ్..

డుకాటి బ్రాండ్‌కు సంబంధించిన ఇటీవలి ఇతర వార్తలను గమనిస్తే, డుకాటి మల్టీస్ట్రాడా 950 వెర్షన్ స్థానంలో కంపెనీ కొత్త మల్టీస్ట్రాడా వి2 అడ్వెంచర్ స్పోర్ట్ మోటార్‌సైకిల్‌ ని అంతర్జాతీయ మార్కెట్‌ కి పరిచయం చేసింది. ఈ మోటార్‌సైకిల్ స్టాండర్డ్ మరియు ఎస్ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది.

డుకాటి బ్రాండ్ నుండి రెండు కొత్త స్క్రాంబ్లర్ మోడళ్లు వచ్చాయ్..

కొత్త డుకాటీ మల్టీస్ట్రాడా వి2 నగర ప్రయాణం మరియు రోజువారీ ఉపయోగం కోసం ప్రత్యేకమైన మోడల్ అని కంపెనీ పేర్కొంది. ఈ ఇటాలియన్ బ్రాండ్ డుకాటి యొక్క ప్రణాళికాబద్ధమైన ప్రీమియర్ సిరీస్‌లో ఇది మొదటి బైక్. ఇందులో ఆయిల్ ఛఏంజ్ మరియు వాల్వ్ క్లియరెన్స్ విరామాలు ప్రతి 15,000 కిమీ మరియు 30,000 కిమీకి సర్దుబాటు చేయబడుతాయని కంపెనీ తెలిపింది.

Most Read Articles

English summary
Ducati unveils new scrambler 1100 tribute pro and scrambler 800 urban motard details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X