Earth Energy ఈవీలకు పెరుగుతున్న డిమాండ్, ఇప్పటి వరకూ 37,000 ప్రీ-ఆర్డర్లు

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. ప్రత్యేకించి ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు డిమాండ్ ఎక్కువగా ఉంటోంది. ఈ నేపథ్ంలో, భారత ఎలక్ట్రిక్ వాహన విభాగంలో కొత్త కంపెనీలు కూడా పుట్టుకొస్తున్నాయి. మరోవైపు దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై రాయితీలు మరియు ప్రోత్సాహకాల కూడా అందిస్తోంది.

Earth Energy ఈవీలకు పెరుగుతున్న డిమాండ్, ఇప్పటి వరకూ 37,000 ప్రీ-ఆర్డర్లు

అంతేకాకుండా, దేశంలో పెట్రోల్ మరియు డీజిల్ ఇంధనాల ధరలు కూడా భారీగా పెరుగుతున్న నేపథ్యంలో, కస్టమర్లు ఇప్పుడుసాంప్రదాయ వాహనాల నుండి ఎలక్ట్రిక్ వాహనాల వైపు దృష్టి సారిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో, దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు, ముఖ్యంగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల అమ్మకాలు వేగంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో, తయారీదారులు తమ ఎలక్ట్రిక్ వాహనాలను మెరుగుపరచడంలో బిజీగా ఉన్నాయి.

Earth Energy ఈవీలకు పెరుగుతున్న డిమాండ్, ఇప్పటి వరకూ 37,000 ప్రీ-ఆర్డర్లు

తాజాగా, దేశీయ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఎర్త్ ఎనర్జీ (Earth Energy), ఈ సంవత్సరం ప్రారంభంలో భారతదేశంలో తమ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన వాహనాలను ప్రారంభించింది మరియు ఈ కంపెనీ దాని EV విభాగాన్ని వేగంగా విస్తరిస్తోంది. ఇటీవల ఈ కంపెనీ 10 భారతీయ రాష్ట్రాల్లోని డిస్ట్రిబ్యూటర్లను కూడా నియమించుకుంది. ఈ డిస్ట్రిబ్యూటర్ల నుండి ఇప్పటి వరకూ 37,000 ఎలక్ట్రిక్ టూ వీలర్లకు ముందస్తు ఆర్డర్లు (ప్రీ-ఆర్డర్స్) అందుకున్నట్లు కంపెనీ తెలిపింది.

Earth Energy ఈవీలకు పెరుగుతున్న డిమాండ్, ఇప్పటి వరకూ 37,000 ప్రీ-ఆర్డర్లు

ఎర్త్ ఎనర్జీ ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటుగా ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, కేరళ, తమిళనాడు మరియు ఒరిస్సా రాష్ట్రాలలో కూడా తమ డీలర్ నెట్‌వర్క్‌ ను కలిగి ఉంది. కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, భారతదేశంలో వచ్చే ఐదు సంవత్సరాలలో ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందుతుందని అంచనా వేసింది. వేగంగా పెరుగుతున్న డిమాండ్‌ ను తీర్చడానికి, కంపెనీ తమ డిస్ట్రిబ్యూటర్ నెట్‌వర్క్‌ ను కూడా విస్తరించాలని యోచిస్తోంది.

Earth Energy ఈవీలకు పెరుగుతున్న డిమాండ్, ఇప్పటి వరకూ 37,000 ప్రీ-ఆర్డర్లు

ఎర్త్ ఎనర్జీ సంస్థకు ప్రస్తుతం మహారాష్ట్రలో ఓ ఎలక్ట్రిక్ వాహన తయారీ కేంద్ర ఉంది. ఇక్కడ 20,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన తయారీ కేంద్రంలో కంపెనీ ఈ వాహనాలను తయారు చేస్తోంది. ఈ ఎలక్ట్రిక్ వాహన తయారీ ప్లాంట్ వార్షిక ప్రాతిపదికన 46,000 యూనిట్లను ఉత్పత్తి చేయగలదు. భవిష్యత్తులో ఈ ప్లాంట్ ను అదనంగా మరో 20,000 చదరపు అడుగుల ప్రాంతానికి విస్తరించాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది.

ముంబైకి చెందిన ఎర్త్ ఈవీ (Earth EV) తయారు చేసే ఎలక్ట్రిక్ వాహనాలలోదాదాపు 96 శాతం భాగాలను స్థానికంగా (దేశీయంగా) సేకరిస్తున్నట్లు పేర్కొంది. భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ నిరంతరం పెరుగుతోందని ఎర్త్ ఈవీ సీఈఓ రుషి సేంఘాని అన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలపై అవగాహన, తక్కువ రన్నింగ్ కాస్ట్ వంటి అనేక కారణాల వలన ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలను స్వీకరిస్తున్నారని ఆయన చెప్పారు.

Earth Energy ఈవీలకు పెరుగుతున్న డిమాండ్, ఇప్పటి వరకూ 37,000 ప్రీ-ఆర్డర్లు

భారతదేశంలో పెరుగుతున్న ఇంధన ధరల కారణంగా, ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ కూడా భారీగా పెరుగుతోందని ఆయన అన్నారు. ఎర్త్ ఎనర్జీ కేవలం ఎలక్ట్రిక్ టూవీలర్లను మాత్రమే కాకుండా, రాబోయే రోజుల్లో వాణిజ్య ఎలక్ట్రిక్ వాహనాలను కూడా ప్రారంభిస్తుందని రుషి సెంఘాని అన్నారు. ఎర్త్ ఎనర్జీ ఈవీ తయారు చేసే ఎలక్ట్రిక్ వాహనాలు అంతర్నిర్మిత మొబైల్ అప్లికేషన్ ఫీచర్‌ తో వస్తాయి, ఇది రైడర్ వారి స్మార్ట్‌ఫోన్‌ లో ప్రత్యక్ష నావిగేషన్‌ను వీక్షించడానికి వీలు కల్పిస్తుంది.

ఎర్త్ ఎనర్జీ ఈవీ సంస్థ ప్రస్తుతం భారత మార్కెట్లో మూడు ఉత్పత్తులను అందిస్తోంది. వీటిలో ఒక స్కూటర్, ఒక కమ్యూటర్ బైక్ మరియు ఒక క్రూయిజర్ ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.

Earth Energy ఈవీలకు పెరుగుతున్న డిమాండ్, ఇప్పటి వరకూ 37,000 ప్రీ-ఆర్డర్లు

ఎర్త్ ఎనర్జీ గ్లైడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ (Earth Energy Glyde)

ఎర్త్ ఎనర్జీ అందిస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్ పేరు గ్లైడ్ (Glyde). ఇది ఎస్ఎక్స్ (SX) మరియు ఎస్ఎక్స్ (SX+) అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఇందులో గ్లైడ్ ఎస్ఎక్స్ అనేది లో-స్పీడ్ స్కూటర్, దీని టాప్ స్పీడ్ గరిష్టంగా గంటకు 25 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. పూర్తి చార్జ్ పై ఇది గరిష్టంగా 150 కిలోమీటర్ల రేంజ్ ను ఆఫర్ చేస్తుంది. మార్కెట్లో దీని ధర రూ.74,500 గా ఉంటుంది.

Earth Energy ఈవీలకు పెరుగుతున్న డిమాండ్, ఇప్పటి వరకూ 37,000 ప్రీ-ఆర్డర్లు

గ్లైడ్ ఎస్ఎక్స్+ స్కూటర్ విషయానికి వస్తే, ఇది హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్. దీని టాప్ స్పీడ్ గంటకు 90 కిలోమీటర్ల వరకూ ఉంటుంది. పూర్తి చార్జ్ పై ఇది గరిష్టంగా 100 కిలోమీటర్ల రేంజ్ ను ఆఫర్ చేస్తుంది. మార్కెట్లో దీని ధర రూ.94,500 (ఎక్స్-షోరూమ్)గా ఉంటుంది. ఈ రెండు మోడళ్లు కూడా ఒకేరకమైన (72V 52ah) బ్యాటరీ ప్యాక్ తో వస్తాయి. వీటిని పూర్తిగా చార్జ్ చేయడానికి కేవలం 40 నిమిషాల సమయం మాత్రమే పడుతుంది.

Earth Energy ఈవీలకు పెరుగుతున్న డిమాండ్, ఇప్పటి వరకూ 37,000 ప్రీ-ఆర్డర్లు

ఇకపోతే, ఎర్త్ ఎనర్జీ అందించనున్న మిగిలిన రెండు ఉత్పత్తుల పేర్లు ఎవాల్వ్ఆర్ (EvolveR) మరియు ఎవాల్వ్‌జీ (EvolveZ). వీటిలో ఎవాల్వ్ఆర్ అనేది అర్బన్ కమ్యూటర్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ మరియు ఎవాల్వ్‌జీ అనేది అర్బన్ క్రూయిజల్ ఎలక్ట్రిక్ బైక్. ప్రస్తుతానికి వీటి పేర్లు మినహా ఇతర వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ నిగమనిస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Earth energy receives 37000 pre order for its electric vehicles details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X