eBikeGo నుండి Rugged ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల: ధర, రేంజ్, ఫీచర్లు

ముంబైకి చెందిన ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ eBikeGo (ఈ-బైక్‌-గో) భారత మార్కెట్లో మరొక కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. కంపెనీ 'Rugged' (రగ్గడ్) అనే పేరుతో ఈ కొత్త ఎలక్ట్రిక్ మోటో స్కూటర్‌ను ప్రవేశపెట్టింది. పేరుకు తగినట్లుగానే ఈ స్కూటర్ మంచి రగ్గడ్ పెర్ఫార్మెన్స్‌ను కలిగి ఉంటుంది.

eBikeGo నుండి Rugged ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల: ధర, రేంజ్, ఫీచర్లు

ఇటు సిటీ రోడ్లు మరియు అటు ఆఫ్-రోడింగ్ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని కంపెనీ ఈ Rugged మోటో-స్కూటర్‌ను తయారు చేసింది. ఇది చిన్న స్కూటర్ లాంటి టైర్లను మరియు మోపెడ్ లాంటి బాడీ డిజైన్‌ను కలిగి ఉంటుంది. కంపెనీ ఈ స్కూటర్‌ను G1 మరియు G1+ అనే రెండు వేరియంట్లలో విడుదల చేసింది. వీటి ధరలు ఇలా ఉన్నాయి:

Rugged G1 - రూ. 79,999

Rugged G1+ - రూ. 99,999

(రెండు ధరలు ఎక్స్-షోరూమ్)

eBikeGo నుండి Rugged ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల: ధర, రేంజ్, ఫీచర్లు

వివిధ ప్రభుత్వ సబ్సిడీల నుండి అదనపు ప్రయోజనాలను చేర్చిన తర్వాత eBikeGo నుండి ఈ Rugged ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ ధర కంటే చాలా చౌకగా మారుతుంది. ఆసక్తి గల కస్టమర్లు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కంపెనీ యొక్క అధికారిక వెబ్‌సైట్ (www.rugged.bike) లో నామ మాత్రపు మొత్తాన్ని చెల్లించి బుక్ చేసుకోవచ్చు

eBikeGo నుండి Rugged ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల: ధర, రేంజ్, ఫీచర్లు

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం బుకింగ్ అడ్వాన్స్‌ని కంపెనీ రూ. 499 గా నిర్ణయించింది. ఒకవేళ ఎవరైనా కస్టమర్ ఈ బైక్ వద్దనుకుని, బుకింగ్ క్యాన్సిల్ చేసుకుంటే ఈ బుకింగ్ మొత్తాన్ని పూర్తిగా తిరిగి చెల్లిస్తామని కంపెనీ పేర్కొంది. Rugged ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీలు నవంబర్ 2021 నుండి ప్రారంభమవుతాయని కంపెనీ ప్రకటించింది.

eBikeGo నుండి Rugged ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల: ధర, రేంజ్, ఫీచర్లు

ఈ రెండు వేరియంట్లపై FAME II సబ్సిడీలు లభిస్తాయని కంపెనీ తెలిపింది. అలాగే, వివిధ రాష్ట్రాలు అనుసరించే ఈవీ విధానాల ప్రకారం, రాష్ట్ర స్థాయి సబ్సిడీలు అమలులోకి వచ్చిన తర్వాత వీటి ధరలు మరింత తగ్గుతాయని కంపెనీ పేర్కొంది.

eBikeGo నుండి Rugged ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల: ధర, రేంజ్, ఫీచర్లు

ఇక Rugged ఎలక్ట్రిక్ స్కూటర్ విషయానికి వస్తే, ఇందులో 3 kW ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. ఇది గరిష్టంగా గంటకు 70 కిలోమీటర్ల వేగాన్ని చేరుకోగలదు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో వేరు చేయగల రెండు 2 kWh బ్యాటరీ ప్యాక్‌లు ఉంటాయి. అపార్ట్‌మెంట్‌లలో నివసించే వారు వీటిని స్కూటర్ నుండి తొలగించి, విడిగా చార్జ్ చేసుకోవచ్చు.

eBikeGo నుండి Rugged ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల: ధర, రేంజ్, ఫీచర్లు

ఈ బ్యాటరీలను పూర్తిగా చార్జ్ చేయటానికి 3.5 గంటల సమయం పడుతుంది. పూర్తి ఛార్జ్ పై ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్టంగా 160 కిలోమీటర్ల రేంజ్‌ను ఆఫర్ చేస్తుందని కంపెనీ తెలిపింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 30 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్ సామర్థ్యం కూడా ఉంటుంది.

eBikeGo నుండి Rugged ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల: ధర, రేంజ్, ఫీచర్లు

Rugged ఎలక్ట్రిక్ మోటో స్కూటర్ యొక్క బాడీని స్వింగ్ ఛాస్సిస్ మరియు స్టీల్ ఫ్రేమ్‌తో తయారు చేశారు. ఈ బైక్ ఛాస్సిస్‌పై కంపెనీ 7 సంవత్సరాల వారంటీని కూడా అందిస్తోంది. ఇందులో 12 అంతర్నిర్మిత స్మార్ట్ సెన్సార్లు ఉంటాయి. Rugged యాప్ సాయంతో యూజర్లు తమ స్కూటర్‌ను లాక్/అన్‌లాక్ చేయవచ్చు. ఇందులో యాంటీ-థెఫ్ట్ అలారమ్ ఫీచర్ కూడా ఉంది.

eBikeGo నుండి Rugged ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల: ధర, రేంజ్, ఫీచర్లు

eBikeGo పేర్కొన్న సమాచారం ప్రకారం, eBikeGo యొక్క కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఆధారిత ఫ్లీట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ మరియు దాని B2B మరియు B2C కార్యకలాపాల యొక్క EBG Matics (eBikeGo యొక్క పేటెంట్ IoT టెక్నాలజీ) ద్వారా విశ్లేషించబడిన మిలియన్ల డేటా పాయింట్ల నుండి పొందిన డేటాను ఉపయోగించి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ రూపొందించినట్లు కంపెనీ తెలిపింది.

eBikeGo నుండి Rugged ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల: ధర, రేంజ్, ఫీచర్లు

Rugged ఎలక్ట్రిక్ స్కూటర్‌ను తమిళనాడులోని కోయంబత్తూర్‌లో ఉన్న Boom Motors (బూమ్ మోటార్స్) సహకారంతో తయారు చేయబడుతోంది. ఈ సంస్థ త్వరలో 1 లక్ష వాహనాల ఉత్పత్తి సామర్థ్యాన్ని చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. దేశంలోని తొమ్మిది రాష్ట్రాలలో Rugged తమ అనుభవ కేంద్రాలను (ఎక్స్‌పీరియెన్స్ సెంటర్లను) ప్రారంభించనుంది.

eBikeGo నుండి Rugged ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల: ధర, రేంజ్, ఫీచర్లు

రాబోయే నెలల్లో, ఈ సంస్థ దేశవ్యాప్తంగా 3000 కి పైగా ఛార్జింగ్ స్టేషన్లను కలిగి ఉండాలని యోచిస్తోంది. భారతదేశంలోని అన్ని నగరాల్లో ఆన్‌లైన్ ప్రీ-బుకింగ్ మరియు ఆఫ్‌లైన్ అనుభవ కేంద్రాల ద్వారా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను అందుబాటులోకి తెస్తామని కంపెనీ తెలిపింది.

eBikeGo నుండి Rugged ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల: ధర, రేంజ్, ఫీచర్లు

Rugged ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్లో విడుదల చేసిన సందర్భంగా EBikeGo సంస్థ వ్యవస్థాపకుడు మరియు సీఈఓ ఇర్ఫాన్ ఖాన్ మాట్లాడుతూ.. గణనీయమైన అధ్యయనం మరియు మూడు సంవత్సరాల నిరీక్షణ తర్వాత భారతదేశంలో అత్యంత స్థిరమైన, తెలివైన మరియు ధృఢనిర్మాణంగల మోటార్ స్కూటర్ 'RUGGED' ప్రారంభించినందుకు తమకెంతో సంతోషంగా ఉందని అన్నారు.

eBikeGo నుండి Rugged ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల: ధర, రేంజ్, ఫీచర్లు

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ రెండు మార్పిడి చేయగల 2 kWh బ్యాటరీలు మరియు అధునాతన సెన్సార్‌లతో పూర్తిగా భారతీయ రహదారుల కోసం రూపొందించబడిందని, ఇందులో భారతదేశంలో మొట్టమొదటిగా స్వదేశీంగా తయారు చేసిన హబ్ మోటార్ ను ఉపయోగించామని చెప్పారు. భారతదేశంలో ఇ-మొబిలిటీ యొక్క ముఖచిత్రాన్ని మార్చే మరియు ఎలక్ట్రిక్ బైక్ కేటగిరీలో ఆవిష్కరణల పరిమితులను పెంచే 'Rugged' ప్రవేశాన్ని ప్రకటించడానికి తామెంతో సంతోషిస్తున్నామని ఆయన తెలిపారు.

Most Read Articles

English summary
Ebikego launches rugged electric moto scooter in india price range specs
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X