దేశంలో కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు eBikeGo తో చేతులు కలిపిన Lowsoot

ప్రపంచ వ్యాప్తంగా వివిధ రకాల మానవ కార్యకలాపాల వలన ప్రతి సంవత్సరం దాదాపు 51 బిలియన్ టన్నుల గ్రీన్‌హౌస్ వాయువులు విడుదల అవుతున్నాయి. ఇది ఇలానే కొనసాగితే, 2050 నాటికి ప్రపంచ ఉష్ణోగ్రతలు ప్రస్తుత సగటు కంటే 2 డిగ్రీలు పెరుగుతాయని పరిశోధకులు అంచనా వేస్తున్నారు.

దేశంలో కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు eBikeGo తో చేతులు కలిపిన Lowsoot

ఈ పరిణామాల వలన ప్రపంచ వ్యాప్తంగా వివిధ రకాల విపత్తులు సంభవించే ప్రమాదం ఉంటుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. వేగవంతమైన గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఆస్ట్రేలియాలో అడవుల్లో కార్చిచ్చులు చెలరేగడం, అంటార్కిటికాలో హిమానీనదాలు (మంచు కొండలు) వేగంగా కరిగిపోవడం, తీరప్రాంతాల్లో తుఫానులు, మహారాష్ట్రలో ఆకస్మిక వాతావరణ మార్పులు మరియు కరువు వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించనున్నాయి.

దేశంలో కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు eBikeGo తో చేతులు కలిపిన Lowsoot

ఈ పరిస్థితులను తక్షణమే సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే, సున్నా ఉద్గారాలను పరిగణనలోకి తీసుకోవటమే మన ముందున్న ఏకైక మార్గం. వచ్చే 2050 నాటికి పూర్తిగా సున్నా ఉద్గారాలను నిర్ధారించాలనుకుంటే, వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడం మరియు ఇప్పటికే వాతావరణంలో పేరుకుపోయిన కార్బన్‌ను తొలగించి వేయడం చేయాలి.

దేశంలో కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు eBikeGo తో చేతులు కలిపిన Lowsoot

భవిష్యత్తులో ఎదురుకాబోయే వాతావరణ విపత్తులను నివారించాలంటే మానవ జాతి నికర-సున్నా ఉద్గారాలను (నెట్-జీరో ఎమిషన్స్) సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భారతదేశంలో ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని, ప్రముఖ ఎలక్ట్రిక్ టూవీలర్ మొబిలిటీ ప్లాట్‌ఫామ్ అయిన ఈబైక్‌గో (eBikeGo) తో అభివృద్ధి చెందుతున్న స్టార్టప్ కంపెనీ లోసూట్ (LowSoot) ఓ భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది.

దేశంలో కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు eBikeGo తో చేతులు కలిపిన Lowsoot

భారతదేశంలో సున్నా ఉద్గారాలను సాధించడానికి మరియు0 కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి పరిష్కారాలను కనుగొనడానికి ఈ కూటమి ఏర్పడింది. ఈ ఒప్పందంలో భాగంగా వాతావరణ నిధి (క్లైమేట్ ఫండ్)ని సమకూర్చడానికి మరియు పర్యావరణ సవాళ్లను (ఎన్విరాన్‌మెంటల్ ఛాలెంజెస్) ఏర్పాటు చేయడానికి లోసూట్ సంస్థను ఈబైక్‌గో ఎంపిక చేసింది.

దేశంలో కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు eBikeGo తో చేతులు కలిపిన Lowsoot

పర్యావరణ సమస్యలు మరియు ఎలక్ట్రిక్ మొబిలిటీపై దృష్టి సారించే అన్ని స్టార్టప్‌లు ఈ పోటీలో పాల్గొనడానికి ఆహ్వానించబడ్డాయి. ఈబైక్‌గో ద్వారా స్వీకరించబడిన మొత్తం 1540 దరఖాస్తులలో ఇంక్యుబేషన్ కోసం లోసూట్ ఎంపిక చేయబడింది. లోసూట్ వారి రోజువారీ కార్బన్ ఉద్గారాలను ట్రాక్ చేయడానికి మరియు తొలగించడానికి సహాయపడుతుంది.

దేశంలో కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు eBikeGo తో చేతులు కలిపిన Lowsoot

ప్రపంచాన్ని నెట్-జీరో ఎమిషన్స్ వైపు నడిపే ప్రక్రియను వేగవంతం చేసే ప్రయత్నంలో eBikeGo Lowsoot కి మద్దతు ఇవ్వనుంది. లోసూట్ కార్బన్-తగ్గింపు ప్రాజెక్టులలో పెట్టుబడి పెట్టడం ద్వారా కార్బన్ ఉద్గారాలను ట్రాక్ చేయడానికి మరియు నిర్మూలించడానికి ఒక వేదికను సృష్టిస్తుంది. లోసూట్ ఈరోజు నాటికి 5616 టన్నుల CO2 ని పొదుపు చేసింది.

దేశంలో కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు eBikeGo తో చేతులు కలిపిన Lowsoot

ఈబైక్‌గో సహకారంతో లోసూట్ తమ యొక్క బేసిక్ టెక్నాలజీ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ని ఉపయోగించి వ్యక్తులు మరియు కంపెనీల కార్బన్ పాదముద్రలను (కార్బన్ ఫుట్‌ప్రింట్స్) లెక్కిస్తుంది. ఈ ప్లాట్‌ఫామ్ యొక్క ప్రస్తుత వెర్షన్ కార్బన్ కాలిక్యులేటర్‌ని ఉపయోగించి ఒక వ్యక్తి లేదా ఒక సంస్థ మొత్తం సంవత్సరంలో ఎంత CO2 ను విడుదల చేస్తుందో లెక్కించడానికి సహాయపడుతుంది.

దేశంలో కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు eBikeGo తో చేతులు కలిపిన Lowsoot

ఇక eBikeGo కంపెనీ విషయానికి వస్తే, ఇది దేశంలోని వివిధ నగరాల్లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను అద్దెకు అందించే సంస్థ. ఇందుకోసం కంపెనీ హీరో ఎలక్ట్రిక్ టూవీలర్ సంస్థతో ఓ ఒప్పందాన్ని కూడా కలిగి ఉంది. హీరో ఎలక్ట్రిక్ సంస్థకు చెందిన కొన్ని రకాల ఎలక్ట్రిక్ స్కూటర్లను ఈ కంపెనీ నెలవారీ చందా ప్రాతిపదికన అద్దెకి ఇస్తుంటుంది.

దేశంలో కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు eBikeGo తో చేతులు కలిపిన Lowsoot

ప్రస్తుతం, హైదరాబాద్, బెంగుళూరు, ముంబై, ఇండోర్, పూనే, ఢిల్లీ మరియు అమృతసర్ నగరాల్లో ఈబైక్‌గో తమ సేవలను అందిస్తోంది. త్వరోలనే, దేశంలోని మరిన్ని నగరాలకు కంపెనీ తమ సేవలను విస్తరించాలని ప్లాన్ చేస్తోంది. ఈబైక్‌గో అందిస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్లను మొబైల్ యాప్ సాయంతో ఒక నెలకు గానీ లేదా సంవత్సరం పాటు గానీ రెంట్‌కి తీసుకోవచ్చు. వీటి అద్దె నెలకు రూ. 3600 నుండి ప్రారంభం వుతుంది.

దేశంలో కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు eBikeGo తో చేతులు కలిపిన Lowsoot

దేశీయ మార్కెట్లో ఈబైక్‌గో రగ్గడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల

ముంబైకి చెందిన ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ eBikeGo (ఈ-బైక్‌-గో), భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్లను అద్దెకి ఇవ్వడమే కాకుండా, స్వతహాగా ఓ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. ఈ మేరకు 'Rugged' (రగ్గడ్) అనే పేరుతో కంపెనీ ఓ కొత్త ఎలక్ట్రిక్ మోటో స్కూటర్‌ను దేశీయ విపణిలో ప్రవేశపెట్టింది.

దేశంలో కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు eBikeGo తో చేతులు కలిపిన Lowsoot

పేరుకు తగినట్లుగానే Rugged స్కూటర్ మంచి రగ్గడ్ పెర్ఫార్మెన్స్‌ను కలిగి ఉంటుంది. ఇది చిన్న స్కూటర్ లాంటి టైర్లను మరియు మోపెడ్ లాంటి బాడీ డిజైన్‌ను కలిగి ఉంటుంది. Rugged G1 మరియు G1+ అనే రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. వీటి ధరలు వరుసగా రూ. 85,000 మరియు రూ. 1.07 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉన్నాయి.

దేశంలో కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు eBikeGo తో చేతులు కలిపిన Lowsoot

ఆసక్తిగల కస్టమర్లు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కంపెనీ వెబ్‌సైట్‌లో రూ. 499 టోకెన్ అడ్వాన్స్ చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ఒకవేళ ఎవరైనా కస్టమర్ మనసు మార్చుకుని ఈ బైక్ వద్దనుకుని, బుకింగ్ క్యాన్సిల్ చేసుకుంటే ఈ బుకింగ్ మొత్తాన్ని పూర్తిగా తిరిగి చెల్లిస్తామని కంపెనీ పేర్కొంది. Rugged ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీలు నవంబర్ 2021 నుండి ప్రారంభమవుతాయని కంపెనీ తెలిపింది.

Most Read Articles

English summary
Ebikego partners with lowsoot to reduce carbon emissions in india
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X