eBikeGo తీసుకున్న నిర్ణయం ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచుతుందా?

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది. అయితే మార్కెట్లో చాలామంది కొనుగోలుదారులు ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నప్పటికీ, ఎలక్ట్రిక్ వాహనాలను కావలసిన మౌళిక సదుపాయాలు అందుబాటులో లేదు. కానీ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం మరియు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయడానికి ఎలక్ట్రిక్ వాహనదారులను ప్రోత్సహించడానికి అనేక చర్యలు తీసుకుంటున్నాయి.

ప్రతి 500 మీటర్లకు EV ఛార్జింగ్ స్టేషన్‌ ఏర్పాటు చేయనున్న eBikeGo

ఇందులో భాగంగానే ఎలక్ట్రిక్ వాహన వినియోగదారులకోసం ఛార్జింగ్ స్టేషన్లను ప్రారంభించడానికి సన్నాహాలు సిద్ధం చేస్తుంది. EV ఛార్జింగ్ స్టేషన్లను ప్రారంభించడానికి వివిధ కంపెనీలు ప్రభుత్వాలతో భాగస్వామ్యం కలిగి ఉన్నాయి. వీటిలో eBikeGo కంపెనీ కూడా ఉంది. eBikeGo ఛార్జ్ పేరుతో దేశవ్యాప్తంగా ఒక లక్ష స్మార్ట్ ఛార్జింగ్ కేంద్రాలను ప్రారంభించబోతోంది.

ప్రతి 500 మీటర్లకు EV ఛార్జింగ్ స్టేషన్‌ ఏర్పాటు చేయనున్న eBikeGo

ఇందులో భాగంగానే 500 మీటర్ల లోపు అన్ని మెట్రో నగరాలు మరియు ఇతర నగరాల్లో eBikeGo ఛార్జ్ సెంటర్లు ఏర్పాటు చేయబడతాయి. ఈ ఛార్జింగ్ స్టేషన్లు ఎలక్ట్రిక్ బైకులు మరియు ఎలక్ట్రిక్ త్రీ వీలర్ వాహనాలను చాలా అనుకూలంగా ఉంటాయి. వినియోగదారు డిమాండ్‌ని బట్టి సమగ్ర చెల్లింపు వ్యవస్థ ద్వారా ఛార్జింగ్ ఛార్జీలు వసూలు చేయబడతాయి.

ప్రతి 500 మీటర్లకు EV ఛార్జింగ్ స్టేషన్‌ ఏర్పాటు చేయనున్న eBikeGo

eBikeGo ఛార్జ్ ప్రాజెక్ట్ భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆత్మ నిర్భారత్ భారత్ మరియు మేడ్ ఇన్ ఇండియా స్ఫూర్తితో రూపొందించబడింది. 2019 లో భారతదేశంలో ద్విచక్ర వాహనాల అమ్మకాలు 21.2 మిలియన్ యూనిట్లుగా ఉన్నాయి. ఇది 2025 నాటికి 2.6% నుండి 26.6 మిలియన్ యూనిట్లకు పెరుగుతుందని అంచనా.

ప్రతి 500 మీటర్లకు EV ఛార్జింగ్ స్టేషన్‌ ఏర్పాటు చేయనున్న eBikeGo

దేశీయ మార్కెట్‌లో ద్విచక్ర వాహనాల విక్రయాలు 2021 మొదటి త్రైమాసికంలో బాగా పెరిగాయి. గత సంవత్సరం ఇదే త్రైమాసికంతో పోలిస్తే మరింత ఎక్కువగా ఉంది. ఈ పెరుగుదల వాతావరణంలో ఎక్కువ కార్బన్ ఉద్గారాల విడుదలకు కారణం అయ్యింది. రోజురోజుకి పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి.

ప్రతి 500 మీటర్లకు EV ఛార్జింగ్ స్టేషన్‌ ఏర్పాటు చేయనున్న eBikeGo

ఇందులో భాగంగానే దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెంచడానికి తగిన సన్నాహాలు చేస్తున్నాయి. అయితే ఈ ఎలక్ట్రిక్ వాహన వినియోగాలకు కావలసిన ఛార్జింగ్ స్టేషన్స్ అందుబాటులో లేకపోవడం వల్ల, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం తగ్గుతున్న సమయంలో భారతదేశంలో అతిపెద్ద ఎలక్ట్రిక్ టూ వీలర్ మొబిలిటీ ప్లాట్‌ఫామ్ అయిన eBikeGo సరసమైన ధరలలో IoT ఎనేబుల్డ్ స్మార్ట్ ఛార్జింగ్ స్టేషన్లను ప్రారంభిస్తోంది.

ప్రతి 500 మీటర్లకు EV ఛార్జింగ్ స్టేషన్‌ ఏర్పాటు చేయనున్న eBikeGo

ఈ ఛార్జింగ్ స్టేషన్లను eBikeGo ఛార్జ్ మొబైల్ యాప్ ద్వారా లేదా www.ebikego.com/charge ద్వారా యాక్సెస్ చేయవచ్చు. ఇందులో Wi-Fi ఎనేబుల్ చేయబడింది. eBikeGo ఛార్జింగ్ స్టేషన్లు ప్రతి 500 మీటర్లకు ఒకటి ఇన్‌స్టాల్ చేయబడతాయి. ఎలక్ట్రిక్ రైడర్లు ఈ ఛార్జింగ్ స్టేషన్లలో ఎక్కడైనా, ఎప్పుడైనా తమ వాహనాలను ఛార్జ్ చేసుకోవచ్చు. ఈ ఛార్జింగ్ స్టేషన్లలో బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ అయిన తర్వాత ఆటోమేటిక్‌గా ఆగిపోతుంది.

ప్రతి 500 మీటర్లకు EV ఛార్జింగ్ స్టేషన్‌ ఏర్పాటు చేయనున్న eBikeGo

ఈ ఛార్జింగ్ స్టేషన్లు వినియోగదారుడి డిమాండ్‌కి అనుగుణంగా ముందుగా నిర్ణయించిన రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తాయి. ఈ రీఛార్జ్ ప్లాన్‌లు సరసమైన రేటుకి అందుబాటులో ఉంటాయి. ఫీజులు వసూలు చేయడానికి సమగ్ర చెల్లింపు విధానం అందించబడుతుంది. బెంగళూరు, ముంబై, ఇండోర్, పుణె, న్యూఢిల్లీ, అమృత్ సర్ మరియు హైదరాబాద్ సహా ఏడు నగరాల్లో eBikeGo ఛార్జ్ అందుబాటులో ఉంది.

ప్రతి 500 మీటర్లకు EV ఛార్జింగ్ స్టేషన్‌ ఏర్పాటు చేయనున్న eBikeGo

ఒక సంవత్సరంలో, eBikeGo 1 లక్ష eBikeGo ఛార్జింగ్ స్టేషన్లను తెరవాలని నిర్ణయించింది. కంపెనీ ఇప్పటికే ముంబైలో ఈ ఛార్జింగ్ స్టేషన్లను ప్రారంభించింది. eBikeGo ప్రస్తుతం భారతదేశంలోని 7 నగరాల్లో చురుకుగా ఉంది, అన్ని ప్రధాన లాస్ట్ మైల్ డెలివరీ కంపెనీలతో పని చేస్తోంది.

ప్రతి 500 మీటర్లకు EV ఛార్జింగ్ స్టేషన్‌ ఏర్పాటు చేయనున్న eBikeGo

eBikeGo భారతదేశంలోని ఎలక్ట్రిక్ బైక్‌ల కోసం eBikeGo తన స్మార్ట్ టెక్నాలజీని అభివృద్ధి చేసింది. కంపెనీ ఒక్కసారిగా ఈ ఛార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేసినట్లయితే ఎలక్ట్రిక్ వాహన వినియోగదారుల సంఖ్య అమాంతం పెరిగే అవకాశం ఉంటుంది. తద్వారా భారతదేశంలో కార్బన్ ఉద్గారాలు భారీగా తగ్గడంతో వాతావరణ కాలుష్యం కూడా భారీగా తగ్గుతుంది.

భారతదేశంలో రోజురోజుకి ఇంధన ధరలు పెరుగుతున్న కారణంగా చాలామంది వాహన వినియోగారులు ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే ఈ ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించుకోవడానికి ఛార్జింగ్ స్టేషన్స్ కావాల్సినన్ని అందుబాటులో లేదు, ఈ కారణంగానే కొనుగోలుదారులు కొంత సంశయిస్తున్నారు. అయితే ఇప్పుడు eBikeGo ఏర్పాటు చేయనున్న ఈ ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్స్ వారి సంశయాలను రూపుమాపుతాయి.

Most Read Articles

English summary
Ebikego to open ev charging stations at every 500 meter distance details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X