రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైకులు వస్తున్నాయ్! ఐషర్ మోటార్స్ భారీ ప్లాన్

రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లు త్వరలోనే మార్కెట్లో సందడి చేయనున్నాయి. రాయల్ ఎన్‌ఫీల్డ్ మాతృ సంస్థ ఐషర్ మోటార్స్ వివిధ మార్కెట్లలోని వినియోగదారుల డిమాండ్‌కు అనుగుణంగా ప్రకారం ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్‌లను విడుదల చేసే ప్రణాళికపై పనిచేస్తోంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైకులు వస్తున్నాయ్! ఐషర్ మోటార్స్ భారీ ప్లాన్

కొత్త ఎలక్ట్రిక్ వాహనాలతో పాటుగా కంపెనీ అంతర్గత దహన (ఇంటర్నల్ కంబస్టియన్) ఇంజన్ కలిగిన వాహనాలను కూడా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ప్రస్తుత మార్కెట్ ట్రెండ్‌కి అనుగుణంగా, ఐషర్ మోటార్స్ కూడా ఎలక్ట్రిక్ వాహనాల రేసులో ప్రయోజనం పొందాలని కోరుకుంటుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైకులు వస్తున్నాయ్! ఐషర్ మోటార్స్ భారీ ప్లాన్

ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల విభాగం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని, ఈ వృద్ధిని దృష్టిలో ఉంచుకుని, తాము కూడా భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహన ఉత్పత్తులను అభివృద్ధి చేయడానికి వ్యూహాత్మకంగా కృషి చేస్తున్నామని ఐషర్ మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్ సిద్ధార్థ్ లాల్ తమ 2020-21 వార్షిక నివేదికలో వెల్లడించారు.

రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైకులు వస్తున్నాయ్! ఐషర్ మోటార్స్ భారీ ప్లాన్

తమ కంపెనీకి బలమైన బ్రాండ్ మరియు పెద్ద డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్ ఉన్నాయని, దీని సహాయంతో ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో కంపెనీ తమ సామర్థ్యాలను పెంచుకోగలదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గ్లోబల్ మార్కెట్ కోసం పూర్తి స్థాయి ప్రీమియం ఎలక్ట్రిక్ వాహనాలు మరియు సేవలను అభివృద్ధి చేయడానికి కస్టమర్లపై తమ లోతైన అవగాహనతో దీనిని సమర్థిస్తున్నామని ఆయన అన్నారు.

రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైకులు వస్తున్నాయ్! ఐషర్ మోటార్స్ భారీ ప్లాన్

విద్యుదీకరణలో (ఎలక్ట్రిఫికేషన్‌లో) ఒక భాగమైన సమగ్ర పర్యావరణ, సామాజిక మరియు పాలన దృష్టిని అభివృద్ధి చేయడమే ఐషర్ మోటార్స్ యొక్క లక్ష్యమని సిద్ధార్థ్ లాల్ తమ కంపెనీ వార్షిక నివేదికలో వివరించారు.

రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైకులు వస్తున్నాయ్! ఐషర్ మోటార్స్ భారీ ప్లాన్

ఐషర్ మోటార్స్ ఇటీవలి కాలంలో విద్యుత్ వినియోగాన్ని మరియు వ్యర్థ పదార్థాల నిర్వహణ వ్యవస్థను సమర్థవంతంగా మెరుగుపరిచింది. కంపెనీకి చెందిన రెండు ఉత్పాదక యూనిట్లు కూడా వాటర్ పాజిటివ్ అని ధృవీకరించబడ్డాయి మరియు పునరుత్పాదక ఇంధన భాగాన్ని పెంచడానికి కూడా కంపెనీ కృషి చేస్తోంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైకులు వస్తున్నాయ్! ఐషర్ మోటార్స్ భారీ ప్లాన్

వాతావరణ మార్పులను నివారించే ప్రయత్నాలతో పాటు కార్బన్ న్యూట్రల్ ఎకానమీకి కంపెనీ మద్దతు ఇస్తుందని, ప్రజల్లో ఐషర్ మోటార్స్ తమ నమ్మకాన్ని పెంపొందించుకోవడం మరియు దాని తయారీ యూనిట్లతో పాటు దాని మొత్తం ఉత్పత్తి విలువ గొలుసుపై సానుకూల ప్రభావాన్ని సృష్టించడం లక్ష్యంగా ఉందని లాల్ చెప్పారు.

రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైకులు వస్తున్నాయ్! ఐషర్ మోటార్స్ భారీ ప్లాన్

ఇదిలా ఉంటే, రాయల్ ఎన్‌ఫీల్డ్ ఈ నెల ఆరంభంలో తమ ప్రోడక్ట్ లైనప్‌లోని అన్ని మోటార్‌సైకిళ్ల ధరలను మరోసారి పెంచింది. కస్టమర్ ఎంచుకునే మోడల్ మరియు వేరియంట్‌ను బట్టి వాటి ధరలు రూ.4,470 నుండి రూ.8,405 మధ్యలో పెరిగాయి. గడచిన జూన్ నెలలో కంపెనీ దేశీయ మార్కెట్లో 35,815 యూనిట్లను విక్రయించగా, ఇదే సమయంలో ఎగుమతులు 365 శాతం పెరిగాయి.

రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైకులు వస్తున్నాయ్! ఐషర్ మోటార్స్ భారీ ప్లాన్

రాయల్ ఎన్‌ఫీల్డ్ బ్రాండ్ గతేడాది జపాన్, కాంబోడియా, కోస్టా రికా మరియు డొమినికన్ రిపబ్లిక్ వంటి కొత్త మార్కెట్లలోకి ప్రవేశించింది. అదే సంవత్సరంలో, అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్స్‌లో కంపెనీ కంప్లీట్లీ నాక్డ్ డౌన్ యూనిట్స్ (సికెడి యూనిట్లు) రూపంలో తమ ఉత్పత్తులను విక్రయించడం ప్రారంభించింది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైకులు వస్తున్నాయ్! ఐషర్ మోటార్స్ భారీ ప్లాన్

ఐషర్ మోటార్స్ ప్రస్తుతం రాయల్ ఎన్‌ఫీల్డ్ బ్రాండ్ క్రింద క్లాసిక్, బుల్లెట్, ఇంటర్‌సెప్టర్ 650, కాంటినెంటల్ జిటి 650, మీటియోర్ 350 వంటి మోడళ్లను భారత మార్కెట్లో విక్రయిస్తోంది. మరోవైపు, రాయల్ ఎన్‌ఫీల్డ్ తమ కొత్త తరం క్లాసిక్ 350 మోడల్‌ను మార్కెట్లో విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. మీటియోర్ 350ని తయారు చేసిన జే-ప్లాట్‌ఫామ్ ఆధారంగానే కొత్త తరం క్లాసిక్ 350ని కూడా తయారు చేయనున్నట్లు సమాచారం.

Most Read Articles

English summary
Eicher Motors Plans To Manufacture Premium Electric Bikes In India, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X