కెఎల్ యూనివర్సిటీ విద్యార్థులు అపురూప సృష్టి; వైర్‌లెస్ ఛార్జింగ్ ఎలక్ట్రిక్ బైక్‌

భారతదేశంలో రోజురోజుకి ఎలక్ట్రిక్ వాహనాలకు ఆదరణ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో భాగంగానే చాలా కంపెనీలు తమ ఉత్పత్తులను ఎలక్ట్రిక్ వెహికల్స్ గా తయారుచేసి మార్కెట్లో విక్రయిస్తున్నాయి. ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ రంగం బాగా అభివృద్ధి చెందదానికి మరియు కస్టమర్లు ఎక్కువ ఆసక్తి చూపడానికి, కారణం ఒకరకంగా పెరుగుతున్న ఇంధన ధరలు కూడా.

వైర్‌లెస్ ఛార్జింగ్ బైక్‌ సృష్టించిన KLU స్టూడెంట్స్

ఇదిలా ఉండగా కొంతమంది యువకులు వారిలో ఉన్న నైపుణ్యాన్ని వెలుగులోకి తీసుకురావడానికి కొత్త కొత్త ప్రయోగాలు చేస్తుంటారు. ఇందులో భాగంగానే ఇప్పటికే దీనికి సంబంధించి చాలా సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఇదేరీతిలో మరో సంఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.

కెఎల్ యూనివర్సిటీకి చెందిన విద్యార్థులు బృందం ఒక ఎలక్ట్రిక్ బైక్ తయారుచేసింది. ఇందులో ఆశర్యం ఏమిటి అనుకోవచ్చు, కానీ ఈ బైక్ వైర్‌లెస్ ఛార్జింగ్ తో పని చేస్తుంది. నిజంగా ఇది ఒక అద్భుతంగా అనే చెప్పాలి.

నివేదికల ప్రకారం కెఎల్ యనివర్శిటీలోని ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ చేస్తున్న ఆరుగురు థర్డ్ ఇయర్ మరియు ఫోర్త్ ఇయర్ స్టూడెంట్స్ ఈ రకమైన ఎలక్ట్రిక్ బైక్ సృష్టించారు. ఇది చూడటానికి సైకిల్‌లా ఉంది కాబట్టి దీన్ని సైకిబైక్ లేదా బైస్కిబైక్ అని పిలుచుకోవచ్చు. ఇటీవల కాలంలో మొబైళ్లకు వెర్‌లెస్ టెక్నాలజీ కామన్ అయిపోయింది, కానీ ఈ ఎలక్ట్రిక్ బైక్ కూడా వెర్‌లెస్ టెక్నాలజీతో పనిచేస్తుంది.

ఈ టెక్నాలజీని బైకులకు సెట్ చెయ్యడం కొంత కష్టమైనప్పటికీ ఇది సాధ్యమయ్యింది. ఈ సరికొత్త ప్రోటోటైప్ తయారుచేయడం ద్వారా కేఎల్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ డిపార్ట్‌మెంట్, ఇతర ఫ్యాకల్టీ తమ టెక్నాలజీని ప్రపంచానికి చాటిచెప్పారు.

ఈ వెర్‌లెస్ ఎలక్ట్రిక్ బైక్ వేగం గంటకు 55 కిలోమీటర్లు. అదేవిధంగా ఈ బైక్ ఒక ఛార్జ్ తో 85 నుంచి 100 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. కానీ దీనిని ఛార్జింగ్ చేయడానికి సుమారు 5 గంటల సమయం పడుతుంది. ఇందులో వైర్‌లెస్ ఛార్జింగ్ కోసం ప్రత్యేకంగా సెల్ బ్యాలెన్సింగ్ ఫీచర్ అందుబాటులో ఉంది.

ఇలాంటి టెక్నాలజీ ప్రపంచంలోనే చాలా తక్కువ దేశాల్లో ఉంది. కానీ మన తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణ రాజధాని నగరం హైదరాబాద్ లో ఈ అరుదైన టెక్నాలజీ వెలుగులోకి రావడం నింజంగా చాలా అద్భుతం. అంతే కాదు దీన్ని తయారుచేసిన బృందం నిజంగా ప్రశంసనీయం.

Most Read Articles

English summary
KL University Students Develop Electric Bike With Wireless Charging. Read in Telugu.
--<
-->
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X