2021 లో భారత్‌లో విడుదలైన టాప్ మోస్ట్ బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్.. ఇవే.. మీకు తెలుసా..!!

భారతీయ మార్కెట్లో 2021 లో ఎలక్ట్రిక్ వాహనాలకు విపరీతమైన ఆదరణ పెరిగింది. దీనికి ప్రధాన కారణమా అమాంతం పెరిగిన ఇంధన (పెట్రోల్ మరియు డీజిల్) ధరలు. పెరిగిన ఇంధన ధరలు సామాన్య ప్రజలపైన ఎక్కువ ప్రభావము చూపాయి. ఈ కారణంగా చాలామంది ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపారు.

అయితే దేశీయ మార్కెట్లో భారతీయ మార్కెట్లో విడుదలైన కొని ఎలక్ట్రిక్ స్కూటర్లను గురించి మరింత సమాచారం ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.. రండి.

2021 లో భారత్‌లో విడుదలైన టాప్ మోస్ట్ బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్.. ఇవే.. మీకు తెలుసా..!!

ఓలా ఎస్1 మరియు ఎస్1 ప్రో (Ola S1 & S1 Pro):

భారతీయ మార్కెట్లో అత్యంత ప్రసిద్ధి చెందిన Ola Electric యొక్క ఎస్1 మరియు ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్లు దేశీయ విఫణిలో అడుగుపెట్టక ముందు నుంచి కూడా మంచి ఆదరణ పొందుతూ ఉన్నాయి. ఈ కారణంగానే కంపెనీ యొక్క ఈ స్కూటర్లు ఎక్కువ సంఖ్యలో బుకింగ్స్ పొందాయి.

2021 లో భారత్‌లో విడుదలైన టాప్ మోస్ట్ బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్.. ఇవే.. మీకు తెలుసా..!!

Ola S1 మరియు S1 ప్రో ధరలు వరుసగా రూ. 99,999 మరియు రూ. 1,29,999 (ఎక్స్-షోరూమ్). ఇవి రెండూ కూడా ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉన్నాయి. అయితే S1 ప్రో బేస్ S1 వేరియంట్ కంటే ఎక్కువ ఫీచర్స్ కలిగి ఉంటుంది. అంతే కాకుండా వీటిలో 36-లీటర్ అండర్-సీట్ స్టోరేజ్, రియర్ గ్రాబ్ రైల్స్, ఫ్రంట్ స్టోరేజ్ పాకెట్స్, లగేజ్ హుక్ మరియు రబ్బర్-లైన్డ్ ఫ్రంట్ ఫుట్‌వెల్ వంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి.

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ 3.9 కిలోవాట్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ద్వారా శక్తిని పొందుతుంది. దీని ఎలక్ట్రిక్ మోటార్ 8.5 kW గరిష్ట శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క బ్యాటరీని 750W సామర్థ్యం గల పోర్టబుల్ ఛార్జర్‌తో దాదాపు 6:30 గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. ఇది కాకుండా, ఫాస్ట్ ఛార్జర్‌తో కేవలం 18 నిమిషాల్లో 75% వరకు ఛార్జ్ చేయబడుతుంది.

2021 లో భారత్‌లో విడుదలైన టాప్ మోస్ట్ బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్.. ఇవే.. మీకు తెలుసా..!!

ఓలా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో అనేక కొత్త మరియు ఆధునిక ఫీచర్లను అందించింది. Ola S1 పూర్తి ఛార్జ్‌పై 121 కిమీల రేంజ్‌ను అందిస్తుంది, అయితే హై ఎండ్ వేరియంట్ S1 ప్రో 181 కిమీల పరిధిని కలిగి ఉంది. ఈ రెండు స్కూటర్ల టాప్ స్పీడ్ విషయానికి వస్తే, Ola S1 గరిష్టంగా 90 km/h వేగంతో, Ola S1 Pro గరిష్టంగా 115 km/h వేగంతో రైడ్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది.

2021 లో భారత్‌లో విడుదలైన టాప్ మోస్ట్ బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్.. ఇవే.. మీకు తెలుసా..!!

సింపుల్ వన్ (Simple One):

సింపుల్ ఎనర్జీ తన సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను దేశీయ మార్కెట్లో 2021 ఆగష్టు 15 న అధికారికంగా విడుదల చేసింది. ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రారంభ ధర ఎక్స్-షోరూమ్ ప్రకారం రూ. 1.09 లక్షలు. సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ త్రిభుజాకార ఎల్ఈడీ డిఆర్ఎల్ లు, ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు టర్న్-సిగ్నల్ ఇండికేటర్స్ వంటి వాటిని కలిగి ఉంటుంది. అంతే కాకుండా ఇందులో ఎల్ఈడీ టెయిల్-లాంప్, సింగిల్-పీస్ సీట్, ఫ్లాట్ ఫ్లోర్‌బోర్డ్, 30-లీటర్స్ అండర్-సీట్ స్టోరేజ్, అల్లాయ్ వీల్స్, రియర్ గ్రాబ్ రైల్స్ మరియు కాంటూర్డ్ రియర్ వ్యూ మిర్రర్స్ వంటివి ఉన్నాయి.

2021 లో భారత్‌లో విడుదలైన టాప్ మోస్ట్ బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్.. ఇవే.. మీకు తెలుసా..!!

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో 4.8 కిలోవాట్ లిథియం-అయాన్ బ్యాటరీతో జతచేయబడిన 4.5 కిలోవాట్ ఎలక్ట్రిక్ మోటార్ కలిగి ఉంటుంది. గ్రే కలర్ బ్యాటరీ ప్యాక్ మరియు 6 కిలోల కంటే ఎక్కువ బరువు ఉంటుంది. ఈ బ్యాటరీ ప్యాక్ భారతీయ వినియోగదారులకు కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. ఇది రిమూవబుల్ బ్యాటరీ, కావున దీనిని సులభంగా ఛార్జ్ చేసుకోవచ్చు.

2021 లో భారత్‌లో విడుదలైన టాప్ మోస్ట్ బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్.. ఇవే.. మీకు తెలుసా..!!

ఈ స్కూటర్ పూర్తిగా ఛార్జ్ చేసిన తర్వాత 240 కిమీ రేంజ్ ఇస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కేవలం 3.6 సెకన్లలో 0 నుంచి 100 కి.మీ వరకు వేగవంతమవుతుంది. ఇది హై స్పీడ్ స్కూటర్, కావున దీని గరిష్ట వేగం గంటకు 100 కిమీ వరకు ఉంటుంది. ఇది ఎకో మోడ్‌లో 203 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది.

2021 లో భారత్‌లో విడుదలైన టాప్ మోస్ట్ బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్.. ఇవే.. మీకు తెలుసా..!!

ఎర్త్ ఎనర్జీ గ్లైడ్ ప్లస్ (Earth Energy Glide Plus):

ముంబైకి చెందిన ఎర్త్ ఎనర్జీ ఎలక్ట్రిక్ భారతీయ మార్కెట్లో మూడు కొత్త స్కూటర్లను విడుదల చేసి, తన ప్రస్తానం మొదలుపెట్టింది. కంపెనీ గ్లైడ్+ ఎలక్ట్రిక్ స్కూటర్‌తో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన విభాగంలోకి ప్రవేశించింది. ఈ-స్కూటర్‌తో పాటు, కంపెనీ తన రెండు ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లను కూడా విడుదల చేసింది. అవి ఎవాల్వ్ ఆర్ మరియు ఎవాల్వ్ ఎక్స్.

2021 లో భారత్‌లో విడుదలైన టాప్ మోస్ట్ బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్.. ఇవే.. మీకు తెలుసా..!!

ఎర్త్ ఎనర్జీ యొక్క గ్లైడ్+ ఎలక్ట్రిక్ స్కూటర్ 2.4 కిలోవాట్ ఎలక్ట్రిక్ మోటారును కలిగి ఉంటుంది. ఇది 26 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అంతే కాకుండా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క గరిష్ట వేగం గంటకు 60 కిమీ వరకు ఉంటుంది.

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 100 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. అంతే కాకుండా ఇది ఫాస్ట్ ఛార్జర్‌ని ఉపయోగించి, బ్యాటరీని కేవలం 40 నిమిషాల్లో 0 నుండి 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. కాని స్టాండర్డ్ ఛార్జర్‌తో ఛార్జ్ చేయడానికి కేవలం 2.5 గంటల సమయం మాత్రమే పడుతుంది.

2021 లో భారత్‌లో విడుదలైన టాప్ మోస్ట్ బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్.. ఇవే.. మీకు తెలుసా..!!

బౌన్స్ ఇన్ఫినిటీ ఈ1 (Bounce Infinity E1):

బెంగళూరుకు చెందిన బౌన్స్ (Bounce) మార్కెట్లో ఇటీవల కాలంలోనే కొత్త బౌన్స్ ఇన్ఫినిటీ E1 (Bounce Infinity E1) స్కూటర్ విడుదల చేసింది. కంపెనీ విడుదల చేసిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 'బ్యాటరీతో మరియు బ్యాటరీ లేకుండా' అనే ఆప్సన్స్ తో అందుబాటులో ఉంటుంది. బ్యాటరీతో కూడిన ఈ స్కూటర్ ధర రూ. 68,999 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) కాగా, బ్యాటరీ లేకుండా ఉండే ఈ స్కూటర్ ధర రూ. 45,099 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) వరకు ఉంటుంది.

2021 లో భారత్‌లో విడుదలైన టాప్ మోస్ట్ బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్.. ఇవే.. మీకు తెలుసా..!!

భారతదేశంలో బౌన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. కావున కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు కేవలం రూ. 499 తో బుక్ చేసుకోవచ్చు. అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీలు 2022 మార్చి నుండి ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. బౌన్స్ ఇన్ఫినిటీ E1 డీలర్‌షిప్‌ల ద్వారా మరియు ఆన్‌లైన్‌లో కూడా కొనుగోలుదారులకు డెలివెరీ చేయబడుతుంది.

2021 లో భారత్‌లో విడుదలైన టాప్ మోస్ట్ బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్.. ఇవే.. మీకు తెలుసా..!!

బౌన్స్ ఇన్ఫినిటీ E1 స్కూటర్ ఒక ఫుల్ ఛార్జ్‌పై దాదాపు 85 కిమీ (ఎకో మోడ్‌) పరిధిని అందిస్తుంది. అదేవిధంగా పవర్ మోడ్‌లో 65 కిమీల పరిధిని అందిస్తుంది. అంతే కాకుండా ఈ కొత్త స్కూటర్ యొక్క గరిష్ట వేగం గంటాకు 65 కిమీ/గం వరకు ఉంటుంది. ఈ స్కూటర్ మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తుంది.

2021 లో భారత్‌లో విడుదలైన టాప్ మోస్ట్ బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్.. ఇవే.. మీకు తెలుసా..!!

ఈవి సోల్ (EV Soul):

'Eeve India' భారతీయ మార్కెట్లో కంపెనీ EeVe Soul Electric Scooter విడుదల చేసింది. ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 1.40 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ స్కూటర్ ఆధునిక కాలంలో ఉపయోగించే స్కూటర్లలో ఉండే దాదాపు అన్ని ఫీచర్స్ ఉన్నాయి. ఇందులో ఐఓటి ఫంక్షన్, యాంటీ-థెఫ్ట్ లాక్ సిస్టమ్, జిపిఎస్ నావిగేషన్, USB పోర్ట్, కీలెస్ అనుభవం, రివర్స్ మోడ్, సెంట్రల్ బ్రేకింగ్ సిస్టమ్, జియో-ట్యాగింగ్ మరియు జియో-ఫెన్సింగ్ వంటివి ఉన్నాయి. కావున ఇది వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.

2021 లో భారత్‌లో విడుదలైన టాప్ మోస్ట్ బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్.. ఇవే.. మీకు తెలుసా..!!

EeVe Soul Electric Scooter యొక్క సీటు కింద రెండు లిథియం ఫెర్రస్ ఫాస్ఫేట్ బ్యాటరీ ప్యాక్‌లు అమర్చబడి ఉన్నాయి. ఇవి ఈ స్కూటర్ కి దాదాపు 120 కిలోమీటర్ల పరిధిని అందిస్తాయి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క గరిష్ట వేగం గంటకు 40 కిమీ ఉన్నప్పుడు ఎకో మోడ్ లో ఇది 120 కిమీ పరిధిని అందిస్తుంది. అయితే మిగిలిన రెండు మోడ్స్ లో పరిధి తక్కువగా ఉంటుంది. ఇది వినియోగదారులు గమనించాలి.

2021 లో భారత్‌లో విడుదలైన టాప్ మోస్ట్ బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్.. ఇవే.. మీకు తెలుసా..!!

ఈ స్కూటర్ పూర్తిగా ఛార్జ్ కావడానికి దాదాపు 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది. అంతే కాకుండా ఈ స్కూటర్ లోని బ్యాటరీలను వేరు చేసి మార్చుకోవచ్చు, కావున దీనిని వినియోగారులు చాలా సులభంగా ఉపయోగించుకోవచ్చు. ఈ స్కూటర్ మూడేళ్ళ వారంటీతో వస్తుంది.

పైన చెప్పిన ఈ అన్ని ఎలక్ట్రిక్ స్కూటర్లు మంచి ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉండటమే కాకుండా మంచి పరిధిని కూడా అందిస్తాయి. కావున దేశీయ మార్కెట్లో మంచి ఆదరణ పొందుతున్నాయి.

Most Read Articles

English summary
Electric scooter launched in 2021 ola s1 simple one bounce infinity more
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X