ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైక్‌లపై ప్రత్యేక ఇన్సెంటివ్స్‌ను ప్రకటించిన గోవా సర్కార్

రాష్ట్రంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల కొనుగోలుదారులను ప్రోత్సహించేందుకు గోవా ప్రభుత్వం ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. పర్యావరణాన్ని కాపాడేందుకు గానూ ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించేలా ప్రోత్సహించేందుకు ఈ కొత్త ఇన్సెంటివ్స్ ఉపయోగపడుతాయని ప్రభుత్వం భావిస్తోంది.

ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైక్‌లపై ప్రత్యేక ఇన్సెంటివ్స్‌ను ప్రకటించిన గోవా సర్కార్

ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల విషయంలో రిజిస్ట్రేషన్ ఫీజు రద్దు, పన్ను మినహాయింపు మరియు ప్రత్యేక ప్రోత్సాహకం (గ్రాంట్) వంటి ఆఫర్లను ప్రభుత్వం ప్రకటించింది.

ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైక్‌లపై ప్రత్యేక ఇన్సెంటివ్స్‌ను ప్రకటించిన గోవా సర్కార్

రాష్ట్రంలో క్లీన్ అండ్ గ్రీన్ వాహనాలను ప్రోత్సహించే లక్ష్యంతో మొదటి దశలో భాగంగా కొనుగోలు చేసే తొలి 10,000 ఎలక్ట్రిక్ టూవీలర్లకు మాత్రమే ఈ రాయితీలను అందించాలని రాష్ట్రం యోచిస్తోంది. ఈ ప్రోత్సాహకాల వివరాలు ఇలా ఉన్నాయి:

ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైక్‌లపై ప్రత్యేక ఇన్సెంటివ్స్‌ను ప్రకటించిన గోవా సర్కార్

1. పాత ఫోన్లను ట్రేడ్ చేసి కొత్త ఫోన్లను కొన్న రీతిలోనే, గోవాలో ఎలక్ట్రిక్ స్కూటర్ల కోసం కూడా బై బ్యాక్ ప్రోగ్రామ్‌ను ప్రకటించారు. ఇందులో పాత వాహనాలను ట్రేడ్ చేసే వారికి క్యాష్ ఇన్సెంటివ్‌లను అందిస్తున్నారు.

ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైక్‌లపై ప్రత్యేక ఇన్సెంటివ్స్‌ను ప్రకటించిన గోవా సర్కార్

2. రిజిస్ట్రేషన్ ఫీజు లేదు. ఎలక్ట్రిక్ వాహనాలపై రిజిస్ట్రేషన్ ఫీజును పూర్తిగా రద్దు చేశారు. ఈ విధంగా ఎలక్ట్రిక్ వాహనం ధర దాదాపు 5 శాతం వరకు తగ్గుతుంది. ఫలితంగా కొత్త ఎలక్ట్రిక్ వాహనాలు మరింత చౌకగా మారుతాయి.

ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైక్‌లపై ప్రత్యేక ఇన్సెంటివ్స్‌ను ప్రకటించిన గోవా సర్కార్

3. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలపై సబ్సిడీ. ఎలక్ట్రిక్ టూవీలర్లపై సబ్సిడీని ఆఫర్ చేయటం ద్వారా సదరు వాహనం ఖర్చు మరింత తగ్గుతుంది. ఎలక్ట్రిక్ వాహనం యొక్క ధర మరియు పనితీరు ఆధారంగా సబ్సిడీ ఉంటుంది.

ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైక్‌లపై ప్రత్యేక ఇన్సెంటివ్స్‌ను ప్రకటించిన గోవా సర్కార్

4. పాత వాహనాలను స్క్రాప్ చేస్తే ఇన్సెంటివ్స్ ఇవ్వటం. పాత వాహనాలను స్క్రాప్ చేసి, కొత్త ఎలక్ట్రిక్ వాహనాన్ని కొనుగోలు చేసేటప్పుడు పెద్ద మొత్తంలో ఇన్సెంటివ్‌ను ఆఫర్ చేయటం ద్వారా కొత్త ఎలక్ట్రిక్ టూవీలర్ కొనుగోలు ఖర్చు తగ్గుతుంది.

ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైక్‌లపై ప్రత్యేక ఇన్సెంటివ్స్‌ను ప్రకటించిన గోవా సర్కార్

గోవా ప్రభుత్వం ప్రకటించిన ఈ రాయితీలు, మొదటి దశలో రాష్ట్రంలో కొనుగోలు చేసే తొలి 10,000 ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు మాత్రమే ఇవ్వాలని నిర్ణయించింది. రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించడం ద్వారా ప్రతి సంవత్సరం సుమారు 5,000 టన్నుల CO2 ఉద్గారాలను తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైక్‌లపై ప్రత్యేక ఇన్సెంటివ్స్‌ను ప్రకటించిన గోవా సర్కార్

రాష్ట్రంలో అధిక సంఖ్యలో ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించడం ద్వారా కాలుష్య సమస్యకు చెక్ పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందు కోసం గోవాలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడంతో పాటుగా, వాటికి కావల్సిన ప్రాథమిక సౌకర్యాలను కూడా కల్పించాలని ప్లాన్ చేస్తోంది.

ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైక్‌లపై ప్రత్యేక ఇన్సెంటివ్స్‌ను ప్రకటించిన గోవా సర్కార్

ఇందుకు గానూ గోవా సర్కార్ తమ రాష్ట్రంలో ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు పనులను ముమ్మరం చేసింది. పబ్లిక్ ప్రదేశాలు, ఇంధన ఫిల్లింగ్ కేంద్రాల్లో కూడా ఎలక్ట్రిక్ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసేందుకు సర్కారు ప్లాన్ చేస్తోంది. గోవా కంటే ముందుగా ఢిల్లీ సర్కార్ తమ రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు స్విఛ్ ఢిల్లీ పేరిట ఓ క్యాంపైన్‌ను ప్రారంభించిన విషయం తెలిసినదే.

Most Read Articles

English summary
Electric Scooters And Bikes In Goa To Get Multiple Incentives From Government. Read In Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X