భారత మార్కెట్లో Enigma Cafe Racer బుకింగ్స్ ఓపెన్; త్వరలోనే విడుదల

భారతదేశంలో పెరుగుతున్న కాలుష్యం మరియు ఇంధన ధరల నేపథ్యంలో, ప్రజలు ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల పట్ల ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. ఈ డిమాండ్ ను క్యాష్ చేసుకునేందుకు కొత్త ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థలు కూడా పుట్టుకొస్తున్నాయి.

భారత మార్కెట్లో Enigma Cafe Racer బుకింగ్స్ ఓపెన్; త్వరలోనే విడుదల

తాజాగా, దేశీయ ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్టప్ కంపెనీ అయిన ఎనిగ్మా ఆటోమొబైల్స్ (Enigma Automobiles) తమ రాబోయే ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ కేఫ్ రేసర్ (Cafe Racer) ను ఆవిష్కరించింది. ఈ సరికొత్త ఎనిగ్మా కెఫే రేసర్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ కోసం కంపెనీ ఇప్పుడు ప్రీ-బుకింగ్ లను కూడా ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఈ బైక్ చూడటానికి పాత కాలపు కెఫే రేసర్ మోడళ్ల డిజైన్ ను తలపిస్తుంది.

భారత మార్కెట్లో Enigma Cafe Racer బుకింగ్స్ ఓపెన్; త్వరలోనే విడుదల

వచ్చే నెల దీపావళి నాటికి కంపెనీ ఈ ఎలక్ట్రిక్ బైక్‌ను విడుదల చేయాలని ప్లాన్ చేస్తోంది. ఆసక్తిగల కస్టమర్లు ఎనిగ్మా కెఫే రేసర్ (Enigma Cafe Racer) ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను కంపెనీ యొక్క అధీకృత డీలర్‌షిప్‌ల ద్వారా కానీ లేదా బ్రాండ్ యొక్క అధికారిక వెబ్‌సైట్ ద్వారా కానీ బుక్ చేసుకోవచ్చు. కేఫే రేజర్ ఎలక్ట్రిక్ బైక్ ను పూర్తిగా భారతదేశంలోనే అభివృద్ధి చేసి, రూపొందించామని ఎనిగ్మా ఆటోమొబైల్స్ పేర్కొంది.

భారత మార్కెట్లో Enigma Cafe Racer బుకింగ్స్ ఓపెన్; త్వరలోనే విడుదల

ఎనిగ్మా ఆటోమొబైల్స్ కేవలం కెఫే రేసర్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ను మాత్రమే కాకుండా క్రింక్ (Crink), జిటి450 (GT450) మరియు ఆంబియర్ (Ambier) అనే మూడు ఎలక్ట్రిక్ స్కూటర్లను కూడా విక్రయిస్తోంది. కొత్త విడుదల చేయబోయే కేఫ్ రేసర్ ఎలక్ట్రిక్ బైక్ ను దేశవ్యాప్తంగా ప్రారంభించాలని ఎనిగ్మా యోచిస్తోంది.

భారత మార్కెట్లో Enigma Cafe Racer బుకింగ్స్ ఓపెన్; త్వరలోనే విడుదల

ఎనిగ్మా కెఫే రేసల్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ఎర్ల్ గ్రే, మిలిటరీ గ్రీన్, థండర్ వైట్, ఆర్ఎమ్ఎస్ రెడ్ మరియు లాగ్ ఆరెంజ్ అనే ఐదు కలర్ ఆప్షన్‌లలో అందుబాటులోకి రానుంది. ఈ కేఫే రేసర్ మోడల్ డిజైన్ ను పరిశీలిస్తే, పేరు సూచించినట్లుగానే ఇది నియో రెట్రో స్టైలింగ్ ఎలిమెంట్స్‌తో కూడిన కేఫే రేసర్ స్టైల్‌ ను కలిగి ఉంటుంది.

భారత మార్కెట్లో Enigma Cafe Racer బుకింగ్స్ ఓపెన్; త్వరలోనే విడుదల

ఈ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ లోని గుండ్రని హెడ్‌ల్యాంప్, ట్రెడిషనల్ ఫ్రంట్ అండ్ రియర్ ఫోర్కులు, టియర్‌డ్రాప్ ఆకారపు ఫ్యూయెల్ ట్యాంక్, వైర్-స్పోక్ వీల్స్, సిగ్నేచర్ కేఫ్-రేజర్-స్టైల్ కౌల్‌తో కూడిన సింగిల్-పీస్ సీట్ వంటి క్లాసిక్ డిజైన్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అలాగే, ఇందులో ఫ్రంట్ డిస్క్ బ్రేక్ మరియు డిజిటల్ డిస్‌ప్లే వంటి మోడ్రన్ డిజైన్ ఎలిమెంట్స్ కూడా ఇందులో ఉన్నాయి.

భారత మార్కెట్లో Enigma Cafe Racer బుకింగ్స్ ఓపెన్; త్వరలోనే విడుదల

ఈ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ యొక్క ఇతర ఫీచర్లను గమనిస్తే, ఇందులో క్లిప్-ఆన్ హ్యాండిల్ బార్, చిన్న ఫ్రంట్ ఫెండర్ మరియు వెనుక టైర్ హగ్గర్ ఉన్నాయి. సిల్వర్ ఫాక్స్ ట్యాంక్, వైట్ టెయిల్ సెక్షన్, బ్లాక్-అవుట్ సెంట్రల్ ప్యానెల్స్ మరియు గ్లోసీ ఫినిషింగ్ రిమ్స్‌తో ఈ మోటార్‌సైకిల్ మంచి కాంట్రాస్టింగ్ అప్పీల్‌ను పొందుతుంది. ఇది ఎలక్ట్రిక్ బైక్ అని సూచించడానికి దీనిపై బ్లూ కలర్ హైలైటింగ్ కూడా ఉంటుంది.

భారత మార్కెట్లో Enigma Cafe Racer బుకింగ్స్ ఓపెన్; త్వరలోనే విడుదల

అయితే, ఎలక్ట్రిక్ మోటార్ మరియు బ్యాటరీని కలిగి ఉన్న ఈ మోటార్‌సైకిల్ యొక్క సెంట్రల్ ప్యానెల్ ప్రొఫైల్ చూడటానికి కొద్దిగా వింతగా అనిపించవచ్చు. ఎనిగ్మా కేఫే రేసర్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ లో 72V 50 Ah LifePo4 (లిథియం ఫెర్రస్ ఫాస్ఫేట్) బ్యాటరీ ప్యాక్ ఉంటుంది, ఇది గరిష్టంగా 5.6kW పవర్ అవుట్‌పుట్‌ ను అందిస్తుంది. ఈ బ్యాటరీని ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ చేస్తే, దీనిపై 140 కిలోమీటర్ల వరకూ ప్రయాణించవచ్చని కంపెనీ పేర్కొంది.

భారత మార్కెట్లో Enigma Cafe Racer బుకింగ్స్ ఓపెన్; త్వరలోనే విడుదల

ఈ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ యొక్క గరిష్ట వేగం గంటకు 136 కిలోమీటర్ల వరకూ ఉంటుందని ఎనిగ్మా ఆటోమొబైల్స్ తెలిపింది. ఈ కేఫే రేసర్ పెర్ఫార్మెన్స్ గణాంకాలను పరిశీలిస్తే, ఇవి ఇంటర్నల్ కంబషన్ (ఐసి) ఇంజన్ తో పనిచేసే కూడిన మోటార్‌సైకిళ్లను పోలి ఉన్నాయని ఎనిగ్మా పేర్కొంది. స్టాండర్డ్ ఛార్జర్‌ సాయంతో ఈ బ్యాటరీని కేవలం మూడు గంటల్లోనే 0 నుండి 80 శాతం చార్జ్ చేసుకోవచ్చు. పూర్తిగా 100 శాతం చార్జ్ చయేడానికి నాలుగు గంటల సమయం పడుతుంది.

భారత మార్కెట్లో Enigma Cafe Racer బుకింగ్స్ ఓపెన్; త్వరలోనే విడుదల

ఈ సందర్భంగా ఎనిగ్మా ఆటోమొబైల్స్ వ్యవస్థాపకుడు మరియు సీఈఓ అన్మోల్ బోహ్రే మాట్లాడుతూ, తాము మోటార్‌సైకిళ్ల రూపకల్పన ప్రారంభించినప్పుడు, శక్తివంతమైన అన్వేషణ సాధనంగా పనిచేసే మోటార్‌బైక్‌ను రూపొందించడమే తమ లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ఇది పాతకాలపు-ప్రేరేపిత మోటార్‌సైకిల్ ఆఫ్-రోడింగ్ సామర్థ్యాలతో పాటుగా ప్రయాణ సౌకర్యాన్ని కూడా అందిస్తుందని బోహ్రే వెల్లడించారు.

భారత మార్కెట్లో Enigma Cafe Racer బుకింగ్స్ ఓపెన్; త్వరలోనే విడుదల

ఎనిగ్మా కెఫే రేసర్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ లోని బ్యాటరీ ప్యాక్‌ పై కంపెనీ అపరిమిత కిలోమీటర్లతో 5 సంవత్సరాల వారంటీని కూడా అందిస్తోంది. అలాగే, ఈ ఎనిగ్మా ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ స్పోక్ వీల్స్‌ పై కంపెనీ 3 సంవత్సరాల టైర్ వారంటీని కూడా అందిస్తోంది. ఈ ఎలక్ట్రిక్ కేఫే రేసర్ బైక్ ను నడపటం చాలా సులభం మరియు అదే సమయంలో దీనికి కనీస మెయింటినెన్స్ మాత్రమే అవసరం.

ఇదివరకు చెప్పుట్లుగా ఎనిగ్మా కెఫే రేసర్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ పూర్తిగా దేశీయంగా అభివృద్ధి చేయబడిన మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తి. ఈ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ను కంపెనీ ప్రస్తుతం భోపాల్ మరియు హైదరాబాద్ లలో ఉన్న ఎనిగ్మా తయారీ కేంద్రాలలో ఉత్పత్తి చేయబడుతోంది. ఎనిగ్మా ద్విచక్ర వాహనాలు ఇ-మొబిలిటీ విభాగంలో విప్లవాత్మక మార్పులు తెస్తాయని భావిస్తున్నారు.

Most Read Articles

English summary
Enigma cafe racer electric motorcycle bookings opened in india details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X