TVS బైక్స్‌పై డిస్కౌంట్ల వర్షం.. పండుగ సీజన్‌లో రూ. 8,000 వరకూ ఆదా!

చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న టీవీఎస్ మోటార్ కంపెనీ (TVS Motor Company) ఈ పండుగ సీజన్‌లో ఎంపిక చేసిన మోటార్‌సైకిళ్లపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లు మరియు ఆఫర్లను అందిస్తోంది. మీరు కూడా ఈ పండుగ సీజన్‌లో బైక్ కొనాలని చూస్తుంటే, TVS బైక్ కొనుగోలుపై నగదు ఆదా చేసువచ్చు. ఈ ఆఫర్ల వివరాలు ఏంటో తెలుసుకుందాం రండి.

TVS బైక్స్‌పై డిస్కౌంట్ల వర్షం.. పండుగ సీజన్‌లో రూ. 8,000 వరకూ ఆదా!

Apache RTR 160 4V బైక్ పై రూ. 8,000 వరకూ ఆదా

ఈ పండుగ సీజన్‌లో, TVS అందిస్తున్న లేటెస్ట్ 160 సిసి బైక్ Apache RTR 160 4V ని కస్టమర్లు జీరో శాతం వడ్డీ రేటుతో కొనుగోలు చేయవచ్చు. ఇది మాత్రమే కాదు, ఒకవేళ మీరు ఈ బైక్‌ను రుణం ద్వారా కొనాలనుకుంటే, కస్టమర్ల కోసం, కంపెనీ కేవలం రూ. 319 కోసం నెలవారీ EMI ప్లాన్‌ ను కూడా ప్రారంభించింది. అంతే కాకుండా, ఈ పండుగ సీజన్ లో కంపెనీ ఈ బైక్ పై రూ. 8,000 ఆదా చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది.

TVS బైక్స్‌పై డిస్కౌంట్ల వర్షం.. పండుగ సీజన్‌లో రూ. 8,000 వరకూ ఆదా!

కమ్యూటర్ బైక్‌లపై కూడా ఆఫర్లు..

టీవీఎస్ అందిస్తున్న ఎంట్రీ లెవల్ కమ్యూటర్ బైక్‌లపై కూడా ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. టీవీఎస్ తమ 100 సిసి మరియు 110 సిసి కమ్యూటర్ బైక్‌లపై అద్భుతమైన ఆఫర్లను అందిస్తోంది. టీవీఎస్ స్పోర్ట్, స్టార్ సిటీ ప్లస్ మరియు రేడియాన్ మోటార్‌సైకిళ్లపై కస్టమర్లు ఈ పండుగ సీజన్ ఆఫర్‌లో డిస్కౌంట్లను పొందవచ్చు.

TVS బైక్స్‌పై డిస్కౌంట్ల వర్షం.. పండుగ సీజన్‌లో రూ. 8,000 వరకూ ఆదా!

ఈ మూడు బైక్ లు కూడా అత్యధిక మైలేజ్ ఇచ్చే కమ్యూటర్ బైక్ లు మరియు మార్కెట్లో వీటికి ప్రత్యేకమైన డిమాండ్ కూడా ఉంది. ఈ సెగ్మెంట్లోని ఇతర 100 సిసి మోటార్‌సైకిళ్లతో పోల్చుకుంటే, ఈ బైకులు 15 శాతం ఎక్కువ మైలేజ్ ఇస్తాయని కంపెనీ పేర్కొంది. ప్రస్తుత పండుగ సీజన్ లో ఈ ఎంట్రీ లెవల్ కమ్యూటర్ మోటార్‌సైకిళ్లను కొనుగోలు చేసే కస్టమర్లు రూ. 5,000 వరకు నగదు ఆదా చేసుకోవచ్చు.

TVS బైక్స్‌పై డిస్కౌంట్ల వర్షం.. పండుగ సీజన్‌లో రూ. 8,000 వరకూ ఆదా!

స్పెషల్ ఎడిషన్ Apache RTR 160 4V లాంచ్

ఇదిలా ఉంటే, కంపెనీ ఇటీవలే ఓ స్పెషల్ ఎడిషన్ టీవీఎస్ అపాచే ఆర్టీఆర్ 160 4వి (TVS Apache RTR 160 4V) బైక్ ని విడుదల చేసింది. మార్కెట్లో ఈ స్పెషల్ ఎడిషన్ ధర రూ. 1,21,372 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) గా ఉంటుంది. ఈ స్పెషల్ ఎడిషన్ టీవీఎస్ అపాచే ఆర్టీఆర్ 160 4వి బైక్ డ్రమ్ బ్రేక్, సింగిల్ డిస్క్ మరియు రియర్ డిస్క్ బ్రేక్ వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది.

TVS బైక్స్‌పై డిస్కౌంట్ల వర్షం.. పండుగ సీజన్‌లో రూ. 8,000 వరకూ ఆదా!

టీవీఎస్ విడుదల చేసిన అప్‌డేటెడ్ Apache RTR 160 4V సిరీస్ బైకులు ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలతో లభిస్తాయి. వీటిలో కొత్త ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లు, హెడ్‌ల్యాంప్‌లు మరియు మూడు విభిన్న రైడింగ్ మోడ్‌లను జోడించారు. కాగా, ఇందులోని స్పెషల్ ఎడిషన్ టీవీఎస్ అపాచే ఆర్టీఆర్ 160 4వి ప్రత్యేకమైన స్పోర్టీ బాడీ డెకాల్స్ మరియు ప్రత్యేక కలర్ థీమ్ ను కలిగి ఉంటుంది.

TVS బైక్స్‌పై డిస్కౌంట్ల వర్షం.. పండుగ సీజన్‌లో రూ. 8,000 వరకూ ఆదా!

ఇది మ్యాట్ బ్లాక్ కలర్ థీమ్‌ తో రెడ్ అల్లాయ్ వీల్స్ ను కలిగి ఉంటుంది. ఈ స్పెషల్ ఎడిషన్ మోడల్ లో కొత్త సీట్ ప్యాటర్న్, సర్దుబాటు చేయగల క్లచ్ మరియు బ్రేక్ లివర్‌ మరియు కొత్త హెడ్‌ల్యాంప్ డిజైన్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. రద్దీగా ఉండే, ట్రాఫిక్‌ లో బైక్‌ ను సులభంగా రైడ్ చేయటం కోసం TVS కొత్త గ్లైట్ త్రూ టెక్నాలజీని ఈ బైక్ లో ప్రవేశపెట్టింది.

TVS బైక్స్‌పై డిస్కౌంట్ల వర్షం.. పండుగ సీజన్‌లో రూ. 8,000 వరకూ ఆదా!

కొత్త TVS గ్లైట్ త్రూ టెక్నాలజీ సాయంతో, బైక్ ను ట్రాఫిక్ లో వేగవంతం చేయకుండా, గంటకు 6 నుండి 7 కిమీ వేగంతో నడిపేలా చేస్తుంది. ఈ బైక్‌ లో బ్రేకింగ్ సామర్థ్యాన్ని మరింత మెరుగుపరచడానికి ఇందులో సింగిల్ ఛానల్ ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్) కూడా ఇవ్వబడింది.

TVS బైక్స్‌పై డిస్కౌంట్ల వర్షం.. పండుగ సీజన్‌లో రూ. 8,000 వరకూ ఆదా!

టీవీఎస్ మోటార్ కంపెనీ స్పెషల్ ఎడిషన్ Apache RTR 160 4V మోడల్‌ని విడుదల చేయడంతో పాటుగా, ఈ సిరీస్ లో లభించే వేరియంట్లను కూడా అప్‌డేట్ చేసింది. ఇప్పుడు కొత్త అపాచే ఆర్టీఆర్ 160 4వి నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. ఇందులో రియర్ డ్రమ్, రియర్ డిస్క్, రియర్ డిస్క్‌ విత్ బ్లూటూత్ మరియు స్పెషల్ ఎడిషన్ మోడళ్లు ఉన్నాయి. వాటి ధరల వివరాలు ఇలా ఉన్నాయి:

TVS Apache RTR 160 4V (రియర్ డ్రమ్): రూ .1,15,265

TVS Apache RTR 160 4V (రియర్ డిస్క్): రూ .1,17,350

TVS Apache RTR 160 4V (రియర్ డిస్క్‌ విత్ బ్లూటూత్): రూ .1,20,050

TVS Apache RTR 160 4V స్పెషల్ ఎడిషన్: రూ 1,21,372

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

TVS బైక్స్‌పై డిస్కౌంట్ల వర్షం.. పండుగ సీజన్‌లో రూ. 8,000 వరకూ ఆదా!

కొత్త టీవీఎస్ అపాచే ఆర్టీఆర్ 160 4వి బైక్‌లో కాస్మెటిక్ మరియు ఫీచర్ అప్‌గ్రేడ్స్ మినహా యాంత్రికంగా ఎలాంటి మార్పులు లేవు. ఇందులో ఉపయోగించిన 159.7 సిసి సింగిల్ సిలిండర్, ఆయిల్ కూల్డ్, BS6 ఇంజన్ గరిష్టంగా 9,250 ఆర్‌పిఎమ్ వద్ద 17.38 బిహెచ్‌పి శక్తిని మరియు 7250 ఆర్‌పిఎమ్ వద్ద 14.73 న్యూటన్ మీటర్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

TVS బైక్స్‌పై డిస్కౌంట్ల వర్షం.. పండుగ సీజన్‌లో రూ. 8,000 వరకూ ఆదా!

మునుపటి BS4 ఇంజన్ కంటే ఈ కొత్త BS6 ఇంజన్ మరింత శుద్ధి చేయబడింది. ఈ బైక్ రేస్ ట్యూన్డ్ ఫ్యూయెల్ ఇంజెక్షన్ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. ఫలితంగా, ఇది మరింత మెరుగైన థ్రోటల్ రెస్పాన్స్ ను అందిస్తుంది. ఈ కారణంగా బైక్ రైడర్ల కి మరింత ఉల్లాసభరితమైన రైడింగ్ అనుభవాన్ని అందిస్తుంది.

Most Read Articles

English summary
Festive discounts on tvs bikes october 2021 offer details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X