Bajaj Pulsar బైక్స్‌పై రూ.4,000 డిస్కౌంట్, త్వరపడండి!

ప్రముఖ దేశీయ ద్విచక్ర వాహన తయారీ సంస్థ Bajaj Auto, భారత మార్కెట్లో విక్రయిస్తున్న పాపులర్ మోటార్‌సైకిల్ బ్రాండ్ Pulsar సిరీస్ లో కంపెనీ ఎంపిక చేసిన మోడళ్లపై నగదు తగ్గింపులను అందిస్తోంది. ఈ పండుగ సీజన్ లో Bajaj Pulsar NS160 మరియు Bajaj Pulsar 150 SD లను కొనుగోలు చేసే కస్టమర్లు రూ. 4,000 నగదు తగ్గింపును పొందవచ్చు.

Bajaj Pulsar బైక్స్‌పై రూ.4,000 డిస్కౌంట్, త్వరపడండి!

అంతేకాకుండా, ఈ రెండు మోడళ్లను కంపెనీ తక్కువ డౌన్‌పేమెంట్ స్కీమ్ తో కూడా అందిస్తోంది. వీటి కోసం కనిష్ట డౌన్‌పేమెంట్ ను కంపెనీ రూ. 18,348 గా నిర్ణయించింది. ఈ ఆఫర్లు పరిమితం కాలం మాత్రమే అందుబాటులో ఉంటాయని, మరిన్ని వివరాల కోసం సమీపంలోని బజాజ్ డీలర్‌షిప్ కేంద్రాన్ని సందర్శించాలని కంపెనీ కోరింది.

Bajaj Pulsar బైక్స్‌పై రూ.4,000 డిస్కౌంట్, త్వరపడండి!

భారత మార్కెట్లో Bajaj Pulsar మోడళ్లు అత్యంత ప్రజాదరణ పొందినవి మరియు యువతను ఎక్కువగా ఆకర్షించేవి. ప్రస్తుతం ఈ Pulsar సిరీస్ లో కంపెనీ 125 సిసి మొదలుకొని 220 సిసి వరకు వివిధ వెర్షన్లను విక్రయిస్తోంది. దేశంలో పండుగ సీజన్ సమీపిస్తున్న నేపథ్యంలో, ఎక్కువ మంది కస్టమర్లను ఆకర్షించేందుకు కంపెనీ సిద్ధమవుతోంది.

Bajaj Pulsar బైక్స్‌పై రూ.4,000 డిస్కౌంట్, త్వరపడండి!

ఇందులో భాగంగానే, Bajaj Pulsar NS160 మరియు Bajaj Pulsar 150 SD మోడళ్లపై కంపెనీ రూ. 4,000 నగదు ప్రయోజనాన్ని ప్రకటించింది. ప్రస్తుతం మార్కెట్లో Pulsar NS160 ధర రూ. 1,15,091 (ఎక్స్-షోరూమ్) గా ఉంది. ఈ బైక్ మెటాలిక్ పెరల్ వైట్, బెండ్ రెడ్ మరియు ప్యూర్ గ్రే అనే మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

Bajaj Pulsar బైక్స్‌పై రూ.4,000 డిస్కౌంట్, త్వరపడండి!

Bajaj Pulsar NS160 బైక్‌లో 160 సిసి 4 వాల్వ్ సింగిల్ సిలిండర్ ఇంజన్ ఉంటుంది. ఇగ్నిషన్ సులువుగా జరిగేందుకు ఇందులో రెండు స్పార్క్ ప్లగ్‌ లు కూడా ఉంటాయి. ఈ ఆయిల్ కూల్డ్ ఇంజన్ గరిష్టంగా 9000 ఆర్‌పిఎమ్ వద్ద 17.2 బిహెచ్‌పి పవర్ ను మరియు 7250 ఆర్‌పిఎమ్ వద్ద 14.6 న్యూటన్ మీటర్ టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది.

Bajaj Pulsar బైక్స్‌పై రూ.4,000 డిస్కౌంట్, త్వరపడండి!

Bajaj Pulsar NS160 భారత టూవీలర్ మార్కెట్లోని ఎంట్రీ లెవల్ నేక్డ్ స్ట్రీట్ స్పోర్ట్స్ మోటార్‌సైకిల్ విభాగంలో TVS Apache RTR 160, Hero Xtreme 160R మరియు Honda Hornet 2.0 వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

Bajaj Pulsar బైక్స్‌పై రూ.4,000 డిస్కౌంట్, త్వరపడండి!

ఇక Bajaj Pulsar 150 SD విషయానికి వస్తే, మార్కెట్లో ఈ మోటార్‌సైకిల్ ధర రూ. 1,04,365 (ఎక్స్-షోరూమ్) గా ఉంది. ఈ మోడల్ యొక్క అతిపెద్ద ఫీచర్ ఏంటంటే, ఇందులోని అద్భుతమైన పవర్ డెలివరీని అందించే 150 సిసి సింగిల్ సిలిండర్ ఇంజన్. అదే సమయంలో, దీని డిజైన్ కూడా చాలా క్లాసీగా ఉంటుంది. ఈ రెండు కారణాల వలన ఈ మోడల్ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి.

Bajaj Pulsar బైక్స్‌పై రూ.4,000 డిస్కౌంట్, త్వరపడండి!

Pulsar 150 SD మోటార్‌సైకిల్ లో 150 సిసి ఇంజన్ ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 8500 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 14 బిహెచ్‌పి పవర్ ను మరియు 6500 ఆర్‌పిఎమ్ వద్ద 13.25 న్యూటన్ మీటర్ టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. మొత్తం 148 కేజీల బరువున్న ఈ మోటార్‌సైకిల్ కోసం Bajaj సింగిల్ ఛానల్ ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్) ఫీచర్ ని కూడా అందిస్తోంది.

Bajaj Pulsar బైక్స్‌పై రూ.4,000 డిస్కౌంట్, త్వరపడండి!

ఈ బైక్ బ్లూ / బ్లాక్, రెడ్ / బ్లాక్, బ్లాక్ / రెడ్ మరియు వైట్ / బ్లాక్ వంటి విభిన్న డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. బజాజ్ ఆటో తమ Pulsar శ్రేణిలోని మోడళ్లలో ఎప్పటికప్పుడు కాస్మెటిక్ అప్‌గ్రేడ్స్ చేస్తూ మరియు ఫేస్‌లిఫ్ట్ మోడళ్లను ప్రవేశపెడుతూ ఉండటం వలన, యువతలో ఈ బ్రాండ్ పట్ల క్రేజ్ స్థిరంగా నిలుపుకుంటూ వస్తోంది.

Bajaj Pulsar బైక్స్‌పై రూ.4,000 డిస్కౌంట్, త్వరపడండి!

ప్రస్తుతం Bajaj Pulsar సిరీస్ లో 125 సిసి నుండి 220 సిసి మధ్యలో పదకొండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. రానున్న రోజుల్లో ఓ సరికొత్త 250 సిసి వెర్షన్ పల్సర్ ని కూడా విడుదల చేసేందుకు కంపెనీ ప్లాన్ చేస్తోంది. ఇది ఈ సిరీస్ లోనే పూర్తిగా సరికొత్తగా ఉంటుందని సమాచారం.

Bajaj Pulsar బైక్స్‌పై రూ.4,000 డిస్కౌంట్, త్వరపడండి!

ఎంట్రీ లెవల్ స్పోర్ట్స్ బైక్ విభాగంలో 250 సిసి క్వార్టర్ లీటర్ మోటార్‌సైకిళ్లకు పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకొని, Bajaj ఈ కొత్త మోడల్‌ Pulsar 250 ని విడుదల చేయాలని భావిస్తోంది. Pulsar బ్రాండ్ యొక్క 20 వ వార్షికోత్సవం సందర్భంగా తమ కొత్త 250 సిసి మోడల్ ను కంపెనీ వచ్చే నవంబర్ 2021 లో విడుదల చేసే అవకాశం ఉంది.

Bajaj Pulsar బైక్స్‌పై రూ.4,000 డిస్కౌంట్, త్వరపడండి!

ఇది ఇప్పటి వరకూ వచ్చిన Pulsar మోటార్‌సైకిళ్లలో కెల్లా అత్యుత్తమమైన మరియు అత్యంత శక్తివంతమైన మోడల్ గా ఉంటుందని భావిస్తున్నారు. అంతేకాకుండా, దీనిని పూర్తిగా సరికొత్త ప్లాట్‌ఫారమ్‌ పై ఆధారపడి నిర్మించనున్నట్లు సమాచారం. కొత్త Bajaj Pulsar 250 మూడు వేరియంట్లలో అందించబడుతుందని అంచనా.

Bajaj Pulsar బైక్స్‌పై రూ.4,000 డిస్కౌంట్, త్వరపడండి!

వీటిలో మొదటిది నేక్డ్ లేదా NS250, రెండవది ఫుల్లీ ఫెయిర్డ్ RS250 మరియు మూడవది సెమీ ఫెయిర్డ్ 250F గా ఉంటుందని సమాచారం. అంటే, వీటిని ప్రస్తుతం విక్రయిస్తున్న NS200, RS200 మరియు 220F మోడళ్లకు వారసులుగా విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ ని గమనిస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Get rs 4000 cash benefit on bajaj pulsar ns160 or pulsar 150 sd details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X