భారత్‌లో విడుదలకు సిద్దమవుతున్న గోగోరో ఎలక్ట్రిక్ స్కూటర్‌; వివరాలు

భారతమార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు రోజురోజుకి డిమాండ్ బాగా పెరుగుతోంది. ఈ విధంగా పెరుగుతున్న నేపథ్యంలో ఆటో మొబైల్ కంపెనీలు చాలా వరకు మార్కెట్లో కొత్త వాహనాలను విడుదల చేస్తున్నాయి. ఇందులో భాగంగానే తైవాన్‌ ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ సంస్థ గోగోరో తన గోగోరో వివా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను భారతమార్కెట్లో విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది.

భారత్‌లో విడుదలకు సిద్దమవుతున్న గోగోరో ఎలక్ట్రిక్ స్కూటర్‌; వివరాలు

గోగోరో కంపెనీ తన వివా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను 2019 లో ప్రవేశపెట్టింది. ఇప్పటికే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ విదేశీ మార్కెట్లో మంచి అమ్మకాలతో ముందుకు వెళ్తోంది. అయితే ఇటీవల భారతదేశపు అతిపెద్ద ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ గోగోరోతో మౌలిక సదుపాయాలు మరియు ఇతర సౌకర్యాలను అందించడానికి ఒక ఒప్పందం కుదుర్చుకుంది.

భారత్‌లో విడుదలకు సిద్దమవుతున్న గోగోరో ఎలక్ట్రిక్ స్కూటర్‌; వివరాలు

ఈ ఒప్పందం ప్రకారం హీరో మోటోకార్ప్ రాబోయే ఎలక్ట్రిక్ స్కూటర్లు గోగోరో యొక్క ఈవి ప్లాట్‌ఫాం ఆధారంగా ఉంటాయి. గోగోరో వివా ఎలక్ట్రిక్ స్కూటర్లను హీరో మోటోకార్ప్ స్టోర్లలో మాత్రమే విక్రయిస్తామని నివేదికలు చెబుతున్నాయి. కావున ఈ స్కూటర్లు హీరో మోటోకార్ప్ విక్రయించనుంది.

భారత్‌లో విడుదలకు సిద్దమవుతున్న గోగోరో ఎలక్ట్రిక్ స్కూటర్‌; వివరాలు

గోగోరో వివా ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క విషయానికి వస్తే ఈ స్కూటర్ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉండి యువ వినియోగదారులను ఆకర్షించే విధంగా రూపొందించబడింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ మంచి ఆకర్షణీయమైన డిజైన్ మరియు అట్రాక్టివ్ కలర్ లో ఉంది.

భారత్‌లో విడుదలకు సిద్దమవుతున్న గోగోరో ఎలక్ట్రిక్ స్కూటర్‌; వివరాలు

కంపెనీ నివేదికల ప్రకారం ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గంటకు 30 కి.మీ వేగంతో ప్రయాణించగలదు. అంతే కాకుండా ఇది ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేయబడిన తరువాత గంటకు 85 కి.మీ వరకు నడుస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 3 కిలోవాట్ల మోటారుతో అమర్చబడి ఉంటుంది. ఈ మోటారు 115 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

భారత్‌లో విడుదలకు సిద్దమవుతున్న గోగోరో ఎలక్ట్రిక్ స్కూటర్‌; వివరాలు

ఈ స్కూటర్ మొత్తంమీద చాలా సింపుల్ డిజైన్‌ను కలిగి ఉంది. అంతే కాకుండా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో అనేక ఫీచర్లు ఉన్నాయి. ఈ స్కూటర్ లో ఎల్‌ఈడీ లైటింగ్, ఎల్‌సీడీ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, టూ రైడ్ మోడ్, రీజనరేటివ్ బ్రేకింగ్, కీలెస్ ఇగ్నిషన్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

భారత్‌లో విడుదలకు సిద్దమవుతున్న గోగోరో ఎలక్ట్రిక్ స్కూటర్‌; వివరాలు

ఈ స్కూటర్ లో బ్యాటరీ ఎక్స్చేంజ్ టెక్నాలజీ కూడా కలిగి ఉంటుంది. ఈ టెక్నాలజీ వల్ల పూర్తిగా ఛార్జ్ చేసిన బ్యాటరీని కొద్ది నిమిషాల్లో ఎక్స్చేంజ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఈ స్కూటర్‌ యొక్క హ్యాండిల్‌బార్‌లో యుఎస్‌బి ఛార్జింగ్ పోర్ట్ ఉంది. ఈ స్కూటర్ చూడటానికి సింపుల్ గా ఉన్న విధంగా, బరువు కూడా తక్కువగా ఉంటుంది. దీనితోపాటు ఎత్తు కూడా తక్కువగా ఉంటుంది.

భారత్‌లో విడుదలకు సిద్దమవుతున్న గోగోరో ఎలక్ట్రిక్ స్కూటర్‌; వివరాలు

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 10 ఇంచెస్ వీల్‌బేస్, 740 మిమీ పొడవైన సీటు కలిగి ఉండి కేవలం 80 కిలోల బరువు మాత్రమే కలిగి ఉంటుంది. ఈ స్కూటర్‌లో 21.6 లీటర్ల స్టోరేజ్ ప్లేస్ ఉంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కీలెస్ మరియు బేసిక్ అనే రెండు మోడళ్లలో విక్రయించబడుతుంది.

భారత్‌లో విడుదలకు సిద్దమవుతున్న గోగోరో ఎలక్ట్రిక్ స్కూటర్‌; వివరాలు

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క కీలెస్ మోడల్ మొత్తం 10 కలర్ ఆప్సన్స్ లో లభిస్తుంది. అయితే బేసిక్ మోడల్ కేవలం 3 కలర్స్ లో మాత్రమే లభిస్తుంది. భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను మరింత వేగంగా విక్రయించడానికి గోగోరో బ్యాటరీ ఎక్స్ఛేంజ్ ప్లాట్‌ఫామ్‌తో హీరో మోటోకార్ప్ భాగస్వామ్యం కుదుర్చుకుంది.

భారత్‌లో విడుదలకు సిద్దమవుతున్న గోగోరో ఎలక్ట్రిక్ స్కూటర్‌; వివరాలు

ఈ భాగస్వామ్యం ప్రపంచంలోని అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ మరియు బ్యాటరీ ఎక్స్ఛేంజ్ టెక్నాలజీలో అగ్రగామి అయిన గొగోరోను కలుపుతుంది. ఈ రెండు సంస్థల భాగస్వామ్యం తరువాత భారతదేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉంది.

More from DriveSpark

Article Published On: Saturday, May 22, 2021, 12:51 [IST]
English summary
Gogoro To Launch Its Electric Scooter In India. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+