దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త గోజిరో ఎలక్ట్రిక్ సైకిల్; ధర రూ. 19,999 మాత్రమే

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ బాగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో భాగంగానే దేశీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్లు, బైకులు మాత్రమే కాకుండా ఎలక్ట్రిక్ సైకిల్స్ కూడా విడుదలవుతుంది. అయితే ఇప్పుడు ప్రముఖ ఎలక్ట్రిక్ సైకిల్ తయారీదారు గోజీరో తన బ్రాండ్ నుంచి ఒక కొత్త ఎలక్ట్రిక్ సైకిల్ విడుదల చేసింది. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త గోజిరో ఎలక్ట్రిక్ సైకిల్; ధర రూ. 19,999 మాత్రమే

భారతీయ మార్కెట్లో విడుదలైన గోజీరో ఎలక్ట్రిక్ సైకిల్ 'స్కెల్లింగ్ లైట్' ధర రూ. 19,999. ఈ ఎలక్ట్రిక్ సైకిల్ 250 W రియర్ హబ్ డ్రైవ్ మోటారుతో పాటు 210Wh డిటాచబుల్ లిథియం-అయాన్ బ్యాటరీని కలిగి ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ సైకిల్ మూడు రైడింగ్ మోడ్స్ కలిగి ఉంటుంది.

దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త గోజిరో ఎలక్ట్రిక్ సైకిల్; ధర రూ. 19,999 మాత్రమే

ఈ సైకిల్ యొక్క రైడ్ మోడ్‌ను కంట్రోల్ చేయడానికి గోజీరో డ్రైవ్ కంట్రోల్ 2.0 డిస్ప్లే యూనిట్ ఇవ్వబడింది. ఈ డిస్ప్లైలో రైడర్ బ్యాటరీ లెవెల్, ఛార్జింగ్ మరియు మోడ్ గురించిన సమాచారాన్ని పొందుతుంది. మెరుగైన బ్రేకింగ్ కోసం అల్లాయ్ హ్యాండిల్ బార్‌లు మరియు వి-బ్రేక్‌లు ఈ సైకిల్ లో ఉపయోగించబడ్డాయి.

దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త గోజిరో ఎలక్ట్రిక్ సైకిల్; ధర రూ. 19,999 మాత్రమే

భారతదేశంలో అధికంగా వ్యాపించిన కరోనా మహమ్మారి వల్ల చాలామంది ప్రజలు తమకు వ్యక్తిగత వాహనాలు ఉండాలని నిర్ణయించుకోవడం వల్ల మార్కెట్లో వాహనాల అమ్మకాలు భారీగా పెరిగాయి. ఇటువంటి పరిస్థితిలో గోజిరో కంపెనీ చాలా తక్కువ ఖర్చుతో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు విడుదల చేసింది.

దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త గోజిరో ఎలక్ట్రిక్ సైకిల్; ధర రూ. 19,999 మాత్రమే

గోజిరో ఎలక్ట్రిక్ సైకిల్స్ ప్రస్తుతం పెట్రోల్ మరియు డీజిల్ వంటి వాటితో నడిచే వాహనాలకు ప్రత్యామ్నాయంగా ఉపయోగపడాతాయి. అంతే కాదు ఇటీవల కాలంలో ప్రజలు కూడా తమ ఆరోగ్యంపై ద్రుష్టి పెట్టడం వల్ల ఎక్కువ శాతం సైకిల్స్ ఉపయోగించడానికి ఆసక్తి చూపుతున్నారు.

దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త గోజిరో ఎలక్ట్రిక్ సైకిల్; ధర రూ. 19,999 మాత్రమే

గోజిరో స్కెల్లింగ్ లైట్ ఈ-సైకిల్ యొక్క నిర్వహణ కూడా చాలా తక్కువ మరియు చాలా సులభంగా కూడా ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ సైకిల్ యొక్క బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయడానికి కేవలం 2.5 గంటల సమయం పడుతుంది. కేవలం ఇందులో ఉన్న బ్యాటరీని మాత్రమే ఛార్జ్ చేయవచ్చు. ఈ ఫీచర్ ఈ ఎలక్ట్రిక్ సైకిల్ లో చాలా ప్రత్యేకమైనదిగా ఉంటుంది.

దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త గోజిరో ఎలక్ట్రిక్ సైకిల్; ధర రూ. 19,999 మాత్రమే

ఈ కొత్త సైకిల్ విడుదల గురించి గోజిరో సిఇఒ అంకిత్ కుమార్ మాట్లాడుతూ, కరోనా మహమ్మారి మరియు రెండవ వేవ్ ప్రభావం వల్ల ప్రజలు ఉమ్మడిగా ప్రయాణించడానికి ఇష్టపడటం లేదు, ఎక్కువగా వ్యక్తిగతంగా ప్రయాణించడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే వాహనాలను కొనడానికి ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు విడుదలైన ఈ కొత్త ఎలక్ట్రిక్ సైకిల్ తక్కువ ధర కలిగి ఉంటడం వల్ల ఎక్కువమంది వినియోగదారులు వినియోగించడానికి అనుకూలంగా ఉంటుంది.

దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త గోజిరో ఎలక్ట్రిక్ సైకిల్; ధర రూ. 19,999 మాత్రమే

సైకిల్స్ వినియోగం కేవలం తక్కువ దూర ప్రయాణాలకు మాత్రమే కాకుండా, సైక్లింగ్ చాలా వరకు ఆరోగ్యానికి చాలా మంచిది కూడా. ఈ కారణాల వల్ల ఎక్కువమంది ఇటీవల కాలంలో కూడా సైకిల్స్ ఉపయోగించడానికి ముందడుగులు వేస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ సైకిల్స్ ఆర్థికంగా మరియు సురక్షితంగా కూడా ఉంటాయి.

Most Read Articles

English summary
GoZero Skellig Lite Launched E-Cycle At Rs 19,999 In India. Read in Telugu.
--<
-->
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X