2021 ఇండియా బైక్ వీక్‌లో Harley Davidson Sportster S విడుదల: ధర, ఫీచర్లు, వివరాలు

మహారాష్ట్రలోని లోనావాలాలో ఉన్న ఆంబీ వ్యాలీ ఎయిర్ స్ట్రిప్‌లో జరుగుతున్న 2021 ఇండియా బైక్ వీక్ (2021 India Bike Week) లో అమెరికన్ మోటార్‌సైకిల్ బ్రాండ్ హార్లే డేవిడ్‌సన్ తమ సరికొత్త స్పోర్ట్‌స్టర్ ఎస్ (Harley-Davidson Sportster S) మోటార్‌సైకిల్ ను విడుదల చేసింది. భారత మార్కెట్లో ఈ కొత్త హార్లే డేవిడ్‌సన్ స్పోర్ట్‌స్టర్ ఎస్ ధర రూ. 15.51 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా నిర్ణయించబడింది. భారతదేశంలో హార్లే డేవిడ్సన్ నేరుగా కార్యకాలాపాలు ముగించినప్పటికీ, హీరో మోటోకార్ప్ సహకారం ద్వారా పరోక్షంగా ఇక్కడి మార్కెట్లో వ్యాపారం సాగిస్తోన్న సంగతి తెలిసినదే.

2021 ఇండియా బైక్ వీక్‌లో Harley Davidson Sportster S విడుదల: ధర, ఫీచర్లు, వివరాలు

బైక్ ప్రియులకు ఎంతో ఇష్టమైన మరియు ప్రతి ఏటా జరిగే ఇండియా బైక్ వీక్ (IBW) 2021 ఎడిషన్ ఈ ఏడాది పూనేలోని లోవానాలాలో శని మరియు ఆదివారాలలో (డిసెంబర్ 4, 5వ తేదీలలో) నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో అనేక టూవీలర్ బ్రాండ్లు తమ కొత్త మరియు అధునాతన ఉత్పత్తులను ప్రదర్శిస్తుండగా, మరికొన్ని కంపెనీలు ఈ వేదిక మీదుగా తమ కొత్త ఉత్పత్తులను మార్కెట్లో ప్రవేశపెడుతున్నాయి. ఇందులో భాగంగానే, అమెరికన్ బ్రాండ్ హార్లే డేవిడ్సన్ తమ ప్రీమియం మోటార్‌సైకిల్ ను విడుదల చేసింది.

2021 ఇండియా బైక్ వీక్‌లో Harley Davidson Sportster S విడుదల: ధర, ఫీచర్లు, వివరాలు

హార్లే డేవిడ్‌సన్ స్పోర్ట్‌స్టర్ ఎస్ బైక్ కు శక్తినిచ్చే ఇంజన్ ఆర్కిటెక్చర్‌ ను కౌంటర్ బ్యాలెన్స్డ్ రివల్యూషన్ మ్యాక్స్ 1250 లిక్విడ్-కూల్డ్ వి-ట్విన్ ఇంజన్‌గా ఉపయోగిస్తుంది. ఇది కంపెనీ ఇటీవల భారతదేశంలో విడుదల చేసిన హార్లే డేవిడ్సన్ యొక్క మొట్టమొదటి ఆఫ్-రోడ్ మోటార్‌సైకిల్ పాన్ అమెరికా 1250 అడ్వెంచర్ టూరర్‌ (Pan America 1250 Adventure Tourer) లో కూడా కనిపిస్తుంది. అయితే, ఈ కొత్త స్పోర్ట్‌స్టర్ ఎస్ బైక్ లోని 60-డిగ్రీల వి-ట్విన్ ఇంజన్ చిన్న వాల్వ్‌లు మరియు పోర్ట్‌లతో విభిన్నమైన ఇంటర్నల్‌లతో పాటు వివిధ కంబషన్ చాంబర్ మరియు పిస్టన్ ఆకారాలను కలిగి ఉంటుంది.

2021 ఇండియా బైక్ వీక్‌లో Harley Davidson Sportster S విడుదల: ధర, ఫీచర్లు, వివరాలు

హార్లే డేవిడ్సన్ స్పోర్ట్‌స్టర్ ఎస్ బైక్ కోసం రీట్యూన్ చేయబడిన ఈ ఇంజన్‌కి రివల్యూషన్ మ్యాక్స్ 1250 టి అనే పేరు పెట్టారు మరియు ఈ ఇంజన్ గరిష్టంగా 7,500 ఆర్‌పిఎమ్ వద్ద 121 బిహెచ్‌పి శక్తిని మరియు 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 125 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6- స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడి ఉంటుంది. ఇందులో సున్నితమైన గేర్‌షిఫ్ట్ అనుభూతి కోసం అసిస్ట్ మరియు స్లిప్పర్ క్లచ్‌ను కూడా అందిస్తున్నారు.

2021 ఇండియా బైక్ వీక్‌లో Harley Davidson Sportster S విడుదల: ధర, ఫీచర్లు, వివరాలు

హార్లే డేవిడ్‌సన్ స్పోర్ట్‌స్టర్ ఎస్ బైక్ లో మొత్తం మూడు రైడింగ్ మోడ్‌లు ఉంటాయి, అవి - స్పోర్ట్, రోడ్ మరియు రెయిన్. ఈ మూడు రైడింగ్ మోడ్స్ కూడా ముందుగానే నిర్వచించిన (ప్రీ డిఫైన్డ్) రైడింగ్ మోడ్‌లు. అయితే, బైక్ యజమానులు తమ రైడింగ్ స్టైల్ కి సరిపోయే లక్షణాలను పొందడానికి పూర్తిగా అనుకూలీకరించదగిన (కస్టమైజబల్) రైడింగ్ మోడ్‌ను కూడా ఉపయోగించవచ్చు. రైడర్ ఎంచుకునే విభిన్న రైడింగ్ మోడ్‌లను బట్టి సైక్లింగ్ థ్రోటల్ రెస్పాన్స్, టార్క్ డెలివరీ మరియు ఇంజన్ బ్రేకింగ్‌లు సర్దుబాటు అవుతాయి. ఈ రైడింగ్ మోడ్‌లు ట్రాక్షన్ కంట్రోల్ మరియు ఏబిఎస్ సెటప్‌లను కూడా సర్దుబాటు చేస్తాయి.

2021 ఇండియా బైక్ వీక్‌లో Harley Davidson Sportster S విడుదల: ధర, ఫీచర్లు, వివరాలు

ఈ సరికొత్త స్పోర్ట్‌స్టర్ ఎస్ బైక్ లోని ఇంజన్ ఛాసిస్‌ చాలా సమర్థవంతమైనది. హార్లే నుండి వచ్చిన ఈ స్పోర్ట్‌స్టర్ ఎస్ లో ముందు వైపు 43 మిమీ ఇన్వెర్టెడ్ ఫోర్క్‌లు మరియు వెనుక వైపున మోనో షాక్ సస్పెన్షన్ ఉన్నాయి. షోవా సస్పెన్షన్ సెటప్ కంప్రెషన్, రీబౌండ్ మరియు స్ప్రింగ్ ప్రీలోడ్ కోసం సర్దుబాటును కలిగి ఉంటుంది. బ్రేకింగ్ విషయానికి వస్తే, స్పోర్ట్‌స్టర్ ఎస్ లో ముందు వైపు 4 పిస్టన్ బ్రెంబో బ్రేక్ కాలిపర్‌లతో కూడిన 320 మిమీ రేడియల్ మౌంటెడ్, మోనోబ్లాక్ డిస్క్ బ్రేక్‌ మరియు వెనుక వైపు సింగిల్ బ్రెంబో బ్రేక్ కాలిపర్ సెటప్‌తో కూడిన 260 మిమీ డిస్క్ బ్రేక్‌లు ఉంటాయి.

2021 ఇండియా బైక్ వీక్‌లో Harley Davidson Sportster S విడుదల: ధర, ఫీచర్లు, వివరాలు

హార్లే డేవిడ్‌సన్ స్పోర్ట్‌స్టర్ ఎస్ ముందు బాగంలో 17 ఇంచ్ చక్రం మరియు వెనుక భాగంలో 16 ఇంచ్ చక్రం ఉంటాయి. ఇవి రెండూ కూడా తేలికైన మరియు ధృడమైన అల్యూమినియం తో చేయబడిన అల్లాయ్ వీల్స్. వీటిపై 160/70 TR17 ప్రొఫైల్ ఫ్రంట్ టైర్ మరియు 180/70 R16 ప్రొఫైల్ రియర్ టైర్లు ఉంటాయి మరియు ఈ టైర్లు డన్‌లాప్ టైర్ బ్రాండ్ కి చెందినవి. హార్లే డేవిడ్‌సన్ యొక్క కొత్త స్పోర్ట్‌స్టర్ ఎస్ మొత్తం పొడవు 2,265 మిమీ, వెడల్పు 843 మిమీ మరియు ఎత్తు 1,089 మిమీగా ఉంటాయి. దీని వీల్‌బేస్ 1,519 మిగా ఉంటుంది మరియు భూమి నుండి సీటు ఎత్తు 752 మిమీగా ఉంటుంది.

2021 ఇండియా బైక్ వీక్‌లో Harley Davidson Sportster S విడుదల: ధర, ఫీచర్లు, వివరాలు

గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే, ఇది కేవలం 93 ​​మిమీ మాత్రమే ఉంటుంది. స్పోర్ట్‌స్టర్ ఎస్ లో 11.8 లీటర్ల ఇంధన ట్యాంక్, 3 లీటర్ల రిజర్వ్ కెపాసిటీ ఉంటుంది. ఈ బైక్ మొత్తం బరువు 228 కిలోలుగా ఉంటుంది. హార్లే డేవిడ్సన్ స్పోర్ట్సర్ ఎస్ (Harley Davidson Sportster S) యొక్క డిజైన్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది, ముందు భాగంలో దీర్ఘచతురస్రాకారంలో ఉండే ఎల్ఈడి హెడ్‌ల్యాంప్‌తో పాటు ఇన్వెర్టెడ్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు ముందు భాగంలో పెద్ద టైర్ తో ఇది చాలా గంభీరమైన వైఖరిని కలిగి ఉంటుంది.

2021 ఇండియా బైక్ వీక్‌లో Harley Davidson Sportster S విడుదల: ధర, ఫీచర్లు, వివరాలు

ఈ బైక్ యొక్క కుడి వైపు సీటుకు దగ్గరగా ఉండే హై-మౌంటెడ్ 2-1-2 ఎగ్జాస్ట్ సెటప్ ఈ బైక్ డిజైన్ మొత్తాన్ని డామినేట్ చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఈ ఎగ్జాస్ట్ సిస్టమ్ 304-సిరీస్ స్టెయిన్‌లెస్ స్టీల్‌ను ఉపయోగించి తయారు చేశారు మరియు రైడర్ నుండి వేడిని ప్రతిబింబించేలా రూపొందించారు. ఇక బైక్ వెనుక భాగాన్ని పరిశీలిస్తే, వెనుక వైపు పెద్ద టైర్ మరియు టైర్ హగ్గర్ మౌంటెడ్ టెయిల్‌ లైట్లతో చాలా మినిమలిస్టిక్ డిజైన్ ఎలిమెంట్స్ ను కలిగి ఉంటుంది. రైడర్ సమాచారం కోసం ఈ బైక్ ముందు భాగంలో ఓ గుండ్రటి 4 ఇంచ్‌ల ఎల్‌సిడి డిస్‌ప్లే సెటప్ ఉంటుంది.

2021 ఇండియా బైక్ వీక్‌లో Harley Davidson Sportster S విడుదల: ధర, ఫీచర్లు, వివరాలు

ఈ డిస్‌ప్లే యూనిట్ బ్లూటూత్ కనెక్టివిటీని కలిగి ఉంటుంది, దీని సాయంతో రైడర్ తన స్మార్ట్ ఫోన్ ను బైక్ తో అనుసంధానం చేసుకోవచ్చు. దీనిని హార్లే డేవిడ్‌సన్ యాప్‌తో కనెక్ట్ చేసినప్పుడు టర్న్-బై-టర్న్ నావిగేషన్ ను కూడ పొందవచ్చు. హార్లే డేవిడ్‌సన్ స్పోర్ట్‌స్టర్ ఎస్ బైక్ లోని ఇతర ఫీచర్లను గమనిస్తే, ఇందులో సిక్స్-యాక్సిస్ ఇనర్షియల్ మెజర్‌మెంట్ యూనిట్ (IMU), కార్నరింగ్ ఏబిఎస్, క్రూయిజ్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ మరియు మీ మొబైల్ ఫోన్‌ చార్జింగ్ కోసం యూఎస్‌బి టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ మొదలైన వాటిని కలిగి ఉంటుంది.

Most Read Articles

English summary
Harley davidson sportster s launched at rs 15 51 lakhs details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X