ఈ మోటార్‌సైకిల్ మధ్యలో పెద్ద రంధ్రం ఉంటుంది, ఎందుకంటే..?

ఈ ఫొటోలో ఉన్న బైక్‌ను చూశారా, చూడటానికి సూపర్‌బైక్‌లా కనిపించే ఈ కాన్సెప్ట్‌ను యుకెకు చెందిన వైట్ మోటార్‌సైకిల్ కాన్సెప్ట్స్ అనే సంస్థ రూపొందించింది. సుజుకి హయబుసా నుండి స్పూర్తి పొంది తయారు చేసినట్లుగా ఉంటే, ఈ కొత్త WMC250EV ప్రోటోటైప్‌ను ఎలక్ట్రిక్ ల్యాండ్ స్పీడ్ రికార్డ్ సృష్టించే లక్ష్యంతో డిజైన్ చేశారు.

ఈ మోటార్‌సైకిల్ మధ్యలో పెద్ద రంధ్రం ఉంటుంది, ఎందుకంటే..?

గత ఏడాది వోక్స్‌హాల్ వాట్మాన్‌లో మోటోజిపి లెజెండ్ మాక్స్ బీగీ నెలకొల్పిన గంటకు 367 కిలోమీటర్ల రికార్డును అధిగమించడమే ఈ ఎలక్ట్రిక్ బైక్ లక్ష్యమని వైట్ మోటార్‌సైకిల్ కాన్సెప్ట్స్ ప్రకటించింది. ఇది గరిష్టంగా గంటకు 400 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీయగలదని కంపెనీ పేర్కొంది.

ఈ మోటార్‌సైకిల్ మధ్యలో పెద్ద రంధ్రం ఉంటుంది, ఎందుకంటే..?

ల్యాండ్ స్పీడ్ రికార్డ్ కోసం ఈ ఎలక్ట్రిక్ బైక్ ప్రోటోటైప్‌ను ప్రత్యేకమైన ఏరోడైనమిక్ డిజైన్‌తో రూపొందించారు. ఇది వరకు చెప్పుకున్నట్లుగా, దీని బాడీ డిజైన్ రెండవ తరం సుజుకి హయాబుసా నుండి ప్రేరణ పొంది డిజైన్ చేసినట్లుగా అనిపిస్తుంది.

ఈ మోటార్‌సైకిల్ మధ్యలో పెద్ద రంధ్రం ఉంటుంది, ఎందుకంటే..?

ఈ బైక్ మధ్యలో వి-ఎయిర్ అని పిలువబడే ట్యూబ్ ఉంటుంది. ఇధి ఎలక్ట్రిక్ బైక్ యొక్క డ్రాగ్ గుణకాన్ని 70 శాతం వరకూ తగ్గిస్తుందని కంపెనీ చెబుతోంది. ఈ డిజైన్ బైక్ వేగంగా గాలి గుండా వెళ్ళడానికి అనుమతిస్తుంది.

ఈ మోటార్‌సైకిల్ మధ్యలో పెద్ద రంధ్రం ఉంటుంది, ఎందుకంటే..?

డౌన్‌ఫోర్స్‌ను పెంచడానికి సాధారణంగా జోడించబడే వింగ్‌లెట్స్‌ను ఈ డిజైన్ కలిగి ఉండదు. అయితే, స్టాండర్డ్ బైక్‌తో పోలిస్తే, ఈ WMC250EV ఐదు రెట్లు ఎక్కువ ఫ్రంట్ లోడ్‌ని కలిగి ఉంటుందని కంపెనీ తెలిపింది.

ఈ మోటార్‌సైకిల్ మధ్యలో పెద్ద రంధ్రం ఉంటుంది, ఎందుకంటే..?

వైట్ మోటార్‌సైకిల్ కాన్సెప్ట్స్ రూపొందించిన ఈ ఎలక్ట్రిక్ బైక్‌లోని వెనుక చక్రంలో రెండు 30 కిలోవాట్ల మోటార్లు మరియు ముందు చక్రంలో రెండు 20 కిలోవాట్ల మోటార్లు ఉంటాయి. ఇవన్నీ కలిసి గరిష్టంగా 134 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తాయి.

ఈ మోటార్‌సైకిల్ మధ్యలో పెద్ద రంధ్రం ఉంటుంది, ఎందుకంటే..?

పెట్రోల్‌తో నడిచే బైక్ శక్తితో పోల్చడం ఇది సరికాకపోవచ్చు, కానీ దాని వేగానికి ఇది సరిపోతుందని కంపెనీ తెలిపింది. బొలీవియన్ ఫ్లాట్లలో ప్రపంచ రికార్డు కోసం కృషి చేస్తున్నందున 2022 నాటికి కంపెనీ ఈ బైక్ బలాన్ని పెంచుతుందని నివేదికలు సూచిస్తున్నాయి.

ఈ మోటార్‌సైకిల్ మధ్యలో పెద్ద రంధ్రం ఉంటుంది, ఎందుకంటే..?

సమర్థవంతమైన విద్యుత్ ప్రసారాన్ని అందించడానికి, ఈ బైక్‌ను మెషీన్డ్ అల్లాయ్ స్వింగార్మ్‌ను ఉపయోగించి తయారు చేశారు. ఇది స్వింగార్మ్‌ను ధూళి నుండి కాపాడి, డ్రైవ్ మరియు డ్రైవ్ స్ప్రాకెట్‌ను నిరంతరం లూబ్రికేట్ చేస్తూ ఉంటుంది.

ఈ మోటార్‌సైకిల్ మధ్యలో పెద్ద రంధ్రం ఉంటుంది, ఎందుకంటే..?

సుమారు 300 కిలోల బరువున్న ఈ బైక్ ముందు భాగంలో రెండు 340 మిమీ డిస్కులు మరియు వెనుక భాగంలో 310 మిమీ డిస్కులు ఉంటాయి. వీటిని ఈబిసి బ్రాండ్ నుండి గ్రహించారు. ఇరువైపులా 17 ఇంచ్ డిమాగ్ అల్యూమినియం అల్లాయ్ వీల్స్ మరియు పీరెల్లి టైర్స్ ఉంటాయి.

Most Read Articles

English summary
Hayabusa Inspired Electric Super Bike All Set To Create Land Speed Record, Details. Read in Telugu.
Story first published: Saturday, June 26, 2021, 15:40 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X