ఇకపై హెల్మెట్స్ వినియోగంపై కొత్త రూల్స్.. అవేంటో ఇక్కడ చూడండి

దేశంలో రోజు రోజుకి రోడ్డుప్రమాదాల వల్ల మరణిస్తున్న వారు ఎక్కువవుతున్న కారణంగా కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి. దీని ప్రకారం ఐఎస్ఐ మార్క్ లేకుండా వున్న నకిలీ మరియు తక్కువ నాణ్యత గల హెల్మెట్ల అమ్మకాన్ని జూన్ 1 నుండి భారతదేశంలో నిషేధించారు.

ఇకపై హెల్మెట్స్ వినియోగంపై కొత్త రూల్స్.. అవేంటో ఇక్కడ చూడండి

భారతదేశంలో డ్రైవర్ల భద్రతను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కొత్త నిబంధనలను అమలు చేస్తోందని, ఇప్పుడు ఐఎస్ఐ గుర్తు లేకుండా హెల్మెట్ల కొనుగోలు మరియు అమ్మకం చట్టవిరుద్ధమని రోడ్డు, రవాణా మంత్రిత్వ శాఖ గత నవంబర్ 26 న నోటిఫికేషన్‌లో అధికారికంగా పేర్కొంది.

ఇకపై హెల్మెట్స్ వినియోగంపై కొత్త రూల్స్.. అవేంటో ఇక్కడ చూడండి

ఈ నిబంధన ప్రకారం, 2021 జూన్ 1 నుండి కొత్త రూల్స్ అమలులోకి వచ్చాయి. దీని ప్రకారం ఇప్పుడు ఐఎస్ఐ మార్క్ లేని హెల్మెట్ల అమ్మకం జరిగితే, కనీసం 2 సంవత్సరాల జైలు శిక్ష మరియు రూ. 2 లక్షల జరిమానా విధించే అవకాశం ఉంది. ఈ నియమం ఐఎస్ఐ మార్క్ లేని హెల్మెట్ల తయారీదారులకు మరియు దిగుమతిదారులకు ఇద్దరికి సమానంగా వర్తిస్తుంది.

MOST READ:ఫస్ట్ టైమ్ కార్ డ్రైవ్ చేయడానికి సిద్దమైన కుమార్తెతో తండ్రి ఫన్నీ [వీడియో]

ఇకపై హెల్మెట్స్ వినియోగంపై కొత్త రూల్స్.. అవేంటో ఇక్కడ చూడండి

భారతదేశంలోని హెల్మెట్ ఉత్పత్తులకు ఐఎస్ఐ భద్రతా గుర్తు ఇచ్చే పనిని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బిఐఎస్) చేస్తుంది. ఇది ఉత్పత్తులకు భద్రతా ప్రమాణాలను నిర్ణయించే ప్రభుత్వ సంస్థ. బిఐఎస్ నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం, అన్ని హెల్మెట్ తయారీ సంస్థలు ఈ ఐఎస్ఐ సర్టిఫికేషన్ తీసుకోవాలి.

ఇకపై హెల్మెట్స్ వినియోగంపై కొత్త రూల్స్.. అవేంటో ఇక్కడ చూడండి

దేశంలో ఎక్కువ సంఖ్యలో నకిలీ హెల్మెట్లు అమ్ముడవుతున్నందున, రోడ్డు ప్రమాదాల సమయంలో ఐఎస్ఐ కాని గుర్తుతో నకిలీ హెల్మెట్లు ద్విచక్ర వాహన డ్రైవర్ల తలని రక్షించలేకపోతున్నాయని బిఐఎస్ దేశ హైకోర్టు ముందు ఆందోళన వ్యక్తం చేసింది. ఈ కారణంగానే రోడ్డు ప్రమాదాల్లో ద్విచక్ర వాహనాల మరణాల సంఖ్య పెరుగుతోంది.

MOST READ:దిశా పటాని & టైగర్ ష్రాఫ్‌పై ఎఫ్‌ఐఆర్‌ బుక్ చేసిన ముంబై పోలీసులు.. కారణం ఇదే

ఇకపై హెల్మెట్స్ వినియోగంపై కొత్త రూల్స్.. అవేంటో ఇక్కడ చూడండి

బిఐఎస్ విజ్ఞప్తి మేరకు రవాణా మంత్రిత్వ శాఖ ఇచ్చిన నోటీసు ప్రకారం, ఐఎస్ఐ మార్క్ లేని హెల్మెట్ల అమ్మకం చట్టవిరుద్ధమని ప్రకటించింది. ప్రభుత్వ తీసుకున్న ఈ నిర్ణయాన్ని హెల్మెట్ తయారీదారులు స్వాగతించారు. ఇది ప్రజలలో నిజమైన మరియు సురక్షితమైన హెల్మెట్లను ఉపయోగించే పద్ధతిని పెంచుతుందని, ఇది రోడ్డు ప్రమాదాలలో మరణాల సంఖ్యను తగ్గిస్తుందని వారు అభిప్రాయపడ్డారు.

ఇకపై హెల్మెట్స్ వినియోగంపై కొత్త రూల్స్.. అవేంటో ఇక్కడ చూడండి

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రకారం, 2016 లో భారతదేశంలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో దాదాపు 3,00,000 మంది మరణించినట్లు తెలుస్తోంది. ఇందులో సుమారు 40 శాతం మంది హెల్మెట్ ధరించని ద్విచక్ర వాహన డ్రైవర్లుగా తెలిసింది. అదేవిధంగా, 2018 లో హెల్మెట్ ధరించకుండా డ్రైవింగ్ చేయడం వల్ల సుమారు 43,614 మంది మరణించారు.

MOST READ:శభాష్ పోలీస్; లాక్‌డౌన్‌లో బయటకు వచ్చిన రాజకీయ నాయకుడికి కూడా రూ. 11,000 జరిమానా

ఇకపై హెల్మెట్స్ వినియోగంపై కొత్త రూల్స్.. అవేంటో ఇక్కడ చూడండి

దేశంలో ఐఎస్ఐ మార్క్ హెల్మెట్లను తప్పనిసరి చేయడం ద్విచక్ర వాహన డ్రైవర్ల భద్రత కోసం తీసుకున్న ప్రధాన చర్య. దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల్లో మరణాలను తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. కావున ద్విచక్ర వాహనదారులు కూడా తప్పకుండా ఐఎస్ఐ మార్క్ హెల్మెట్స్ తప్పకుండా కొనుగోలు చేయాలి.

Most Read Articles

English summary
Helmets Without ISI Mark Banned In India From 1st June Details. Read in Telugu.
Story first published: Thursday, June 3, 2021, 19:27 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X