మొదటిసారి విదేశాలకు ఎగుమతైన దేశీయ సైకిల్స్; పూర్తి వివరాలు

భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో సైకిళ్లకున్న ప్రాధాన్యత రోజు రోజుకి పెరుగుతోంది. ఈ క్రమంలో సైకిల్ తయారీదారులు ఎలక్ట్రిక్ సైకిల్స్ ఉత్పత్తి చేసి విక్రయిస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రముఖ సైకిల్స్ తయారీదారు హీరో ఎలక్ట్రిక్ సైకిల్స్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల హీరో సైకిల్స్ తన మేడ్-ఇన్-ఇండియా ఎలక్ట్రిక్ సైకిల్స్ యొక్క మొదటి బ్యాచ్‌ను జర్మనీకి ఎగుమతి చేసింది.

మొదటిసారి విదేశాలకు ఎగుమతైన దేశీయ సైకిల్స్; పూర్తి వివరాలు

హీరో కంపెనీ తన ఎలక్ట్రిక్ సైకిల్స్ యొక్క మొదటి బ్యాచ్‌లో 200 యూనిట్ల ఎలక్ట్రిక్ సైకిళ్లను రవాణా చేసింది. ఎలక్ట్రిక్ సైకిళ్లను కంపెనీ విదేశాలకు ఎగుమతి చేయడం ఇదే మొదటిసారి. భవిష్యత్తులో యూరోపియన్ మార్కెట్‌కు మరిన్ని సైకిళ్లను రవాణా చేయడం ద్వారా యూరోపియన్ యూనియన్ (ఇయు) మార్కెట్‌లో ఆధిపత్యం చెలాయించాలని కంపెనీ భావిస్తోంది.

మొదటిసారి విదేశాలకు ఎగుమతైన దేశీయ సైకిల్స్; పూర్తి వివరాలు

హీరో సైకిల్స్ 2025 నాటికి యూరోపియన్ మార్కెట్ నుండి సుమారు 300 మిలియన్ యూరోలు సంపాదించాలని, దానికి తగిన ఏర్పాట్లను చేస్తోంది. అంటే దీని విలువ భారత కరెన్సీ ప్రకారం సుమారు 2,600 కోట్ల రూపాయలు. హీరో తన అంతర్జాతీయ బ్రాండ్ హెచ్‌ఎన్‌ఎఫ్ కింద యూరప్‌లో సైకిళ్లను విక్రయిస్తుంది.

మొదటిసారి విదేశాలకు ఎగుమతైన దేశీయ సైకిల్స్; పూర్తి వివరాలు

ఐరోపాలో అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ ఈ-సైకిల్ సంస్థగా హెచ్‌ఎంసిని స్థాపించడానికి ఈ చర్య మొదటి దశ అని హీరో సైకిల్స్ అధికారికంగా తెలిపింది. 2030 నాటికి యూరప్‌లో ఈ-సైకిల్ అమ్మకాలు 15 మిలియన్ యూనిట్లకు చేరుకుంటాయని కంపెనీ భావిస్తోంది. ఎగుమతులు మరియు ఈ-సైకిళ్ల అమ్మకాలను పెంచడం ద్వారా మార్కెట్ ఈ విభాగంలో ఆధిపత్యం చెలాయిస్తుంది.

మొదటిసారి విదేశాలకు ఎగుమతైన దేశీయ సైకిల్స్; పూర్తి వివరాలు

హీరో సైకిల్స్ ఇంటర్నేషనల్ సిఇఒ జెఫ్ వైజ్ మాట్లాడుతూ, అధిక నాణ్యత గల ఈ-సైకిళ్లను ఉత్పత్తి చేయడానికి హెచ్ఎన్ఎఫ్ యొక్క ఇంజనీరింగ్ మరియు డిజైన్ నైపుణ్యాన్ని హీరో యొక్క ఉత్పాదక సామర్థ్యాలతో కలపడానికి మేము ఎదురుచూస్తున్నామన్నారు. ఇందుకోసం లూధియానాలోని 100 ఎకరాల సైకిల్ వ్యాలీ దీనికి గణనీయమైన కృషి చేస్తుంది.

మొదటిసారి విదేశాలకు ఎగుమతైన దేశీయ సైకిల్స్; పూర్తి వివరాలు

కరోనా మహమ్మారి అధికంగా విజృంభించిన కారణంగా సరఫరా గొలుసు దెబ్బతిన్నట్లు హీరో సైకిల్స్ కంపెనీ తెలిపింది. కానీ కంపెనీ ఈ సరఫరా గొలుసును అప్‌గ్రేడ్ చేసి, ఉన్న డిమాండ్ వేగంగా తీర్చడానికి కృషి చేస్తోంది. కరోనా కాలంలో సైకిళ్ళు మరియు ఈ-సైకిళ్లకు డిమాండ్ బాగా పెరిగిందని కంపెనీ తెలిపింది.

మొదటిసారి విదేశాలకు ఎగుమతైన దేశీయ సైకిల్స్; పూర్తి వివరాలు

హీరో ఈ-సైకిల్స్ కోసం పెరుగుతున్న డిమాండ్ తీర్చడానికి, హీరో సైకిల్స్ లాజిస్టిక్స్ మెయింటెనెన్స్ మరియు డిజిటల్ పరివర్తనలో ప్రత్యేకత కలిగిన డిజిటల్ సరఫరా గొలుసు సంస్థ హీరో సప్లై చైన్ ను స్థాపించింది. దీని ద్వారా హీరో సైకిల్స్ సంవత్సరానికి 60 లక్షల యూనిట్లను ఉత్పత్తి చేసే అవకాశం ఉంది.

మొదటిసారి విదేశాలకు ఎగుమతైన దేశీయ సైకిల్స్; పూర్తి వివరాలు

లుధియానా (పంజాబ్), ఘజియాబాద్ (యుపి) మరియు బీహతా (బీహార్) వద్ద ఉన్న ప్లాంట్లలో కంపెనీ అధిక సంఖ్యలో సైకిల్స్ తయారు చేస్తుంది. ఈ సంస్థ ఇంగ్లాండ్‌లో డిజైన్ సెంటర్‌ను, శ్రీలంకలో అత్యాధునిక ఉత్పాదక సదుపాయాన్ని కూడా కలిగి ఉంది. ఏది ఏమైనా మనదేశం నుంచి ఇతర దేశాలకు ఎగుమతి కావడం నిజంగా అభివృద్ధివైపు ప్రయాణించడమే అవుతుంది.

Most Read Articles

English summary
Hero Made In India Electric Cycles First Batch Dispatched To Germany. Read in Telugu.
Story first published: Monday, June 28, 2021, 17:27 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X