మైసూర్‌లో Hero Electric కొత్త డీలర్‌షిప్ ప్రారంభం; వివరాలు

భారతదేశపు అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ హీరో ఎలక్ట్రిక్ (Hero Electric) మైసూర్ నగరంలో ఓ కొత్త డీలర్‌షిప్‌ ను ప్రారంభించింది. శాండల్‌వుడ్ సిటీలో భారతదేశంలోనే అతిపెద్ద మరియు పురాతన ఎలక్ట్రిక్ టూ వీలర్ బ్రాండ్ అయిన హీరో ఎలక్ట్రిక్ ప్రారంభించిన రెండవ డీలర్‌షిప్ ఇది.

మైసూర్‌లో Hero Electric కొత్త డీలర్‌షిప్ ప్రారంభం; వివరాలు

సుతుర్ మఠంలోని శ్రీ శివరాత్రి దేశికేంద్ర మహాస్వామిజీ సమక్షంలో ఈవీ ఆటో హౌస్ (EV Auto House) పేరుతో ఈ కొత్త డీలర్‌షిప్ ప్రారంభించబడింది. కొత్త డీలర్‌షిప్ 1400 చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉంటుంది. ఈ డీలర్‌షిప్‌లో సేల్స్ అండ్ సర్వీస్ సదుపాయాలు రెండూ ఉన్నాయి.

మైసూర్‌లో Hero Electric కొత్త డీలర్‌షిప్ ప్రారంభం; వివరాలు

ఈ సందర్భంగా హీరో ఎలక్ట్రిక్ సీఈఓ సోహిందర్ గిల్ మాట్లాడుతూ, "హీరో ఎలక్ట్రిక్ బ్రాండ్ వద్ద, కస్టమర్ అవసరాలను తీర్చడానికి అధీకృత సర్వీస్ అవుట్‌లెట్ లతో పాటు బలమైన డీలర్‌షిప్ ఉనికిని ఏర్పాటు చేయాలని మేము భావిస్తున్నాము. కర్ణాటక మా ప్రాధాన్యత మార్కెట్‌లలో ఒకటి మరియు ఇది విస్తృత కస్టమర్‌లను హైలైట్ చేస్తుంది" అని అన్నారు.

మైసూర్‌లో Hero Electric కొత్త డీలర్‌షిప్ ప్రారంభం; వివరాలు

ఇంకా ఆయన మాట్లాడుతూ.. "కస్టమర్లలో ఎలక్ట్రిక్ వాహనాల పట్ల అవగాహన వేగంగా ఈవీల స్వీకరణకు అనువదిస్తుంది. మేము బలమైన ఛార్జింగ్ నెట్‌వర్క్ ను అందించడం, అవగాహన కల్పించడం మరియు వినియోగదారులకు ఈవీ లను మరింత అందుబాటులోకి తీసుకురావడానికి నెట్‌వర్క్ విస్తరణపై దృష్టి సారించడం కోసం పని చేస్తూనే ఉంటాము" అని గిల్ చెప్పారు.

మైసూర్‌లో Hero Electric కొత్త డీలర్‌షిప్ ప్రారంభం; వివరాలు

ఈ డీలర్‌షిప్ ను ప్రారంభించిన సందర్భంగా, ఈవీ ఆటో హౌస్ అధినేత ధన్‌రాజ్ ప్రవీణ్ మాట్లాడుతూ, "నిబద్ధత, నమ్మకం మరియు మద్దతు కోసం నిలబడే అతిపెద్ద ఎలక్ట్రిక్ టూ-వీలర్ కంపెనీతో భాగస్వామిగా ఉన్నందుకు మేము సంతోషిస్తున్నాము. వినియోగదారులకు క్లీనర్ మరియు గ్రీన్ మొబిలిటీ సొల్యూషన్‌లను అందించడానికి మేము హీరో ఎలక్ట్రిక్‌తో భాగస్వామ్యం అయ్యాము" అని అన్నారు.

మైసూర్‌లో Hero Electric కొత్త డీలర్‌షిప్ ప్రారంభం; వివరాలు

మైసూర్ లో కొత్తగా ఏర్పాటు చేసిన ఈవీ ఆటో హౌస్ డీలర్‌షిప్ లో కంపెనీ నుండి మొత్తం 9 ఎలక్ట్రిక్ స్కూటర్లు మరియు వెలాసిటీ ఎలక్ట్రిక్ సైకిల్‌ అందుబాటులో ఉంటాయి. ఈ 9 ఎలక్ట్రిక్ స్కూటర్ శ్రేణిలో వాస్తవానికి 5 మోడళ్లు మాత్రమే ఉన్నాయి. వాటిలో డబుల్ బ్యాటరీ మరియు ఇతర వేరియంట్లు కలిపి మొత్తం 9 మోడళ్లుగా లభిస్తాయి.

మైసూర్‌లో Hero Electric కొత్త డీలర్‌షిప్ ప్రారంభం; వివరాలు

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఎన్‌వైఎక్స్, ఫోటాన్, ఆప్టిమా, ఫ్లాష్ మరియు అట్రియా మోడళ్లు ఉన్నాయి. వీటిలో సిటీ స్పీడ్ (హెచ్ఎక్స్) మరియు కంఫర్ట్ స్పీడ్ (ఎల్ఎక్స్) రెండింటిలోనూ అందుబాటులో ఉంది. ఇవి రెండూ వరుసగా 42km/h మరియు 25km/h గరిష్ట వేగాన్ని కలిగి ఉంటాయి. ఇందులో Optima HX గరిష్టంగా 122 కిలోమీటర్ల రేంజ్ ను ఆఫర్ చేస్తుండగా, Optima LX 88 కిలోమీటర్ల రేంజ్ ను అందిస్తుంది.

మైసూర్‌లో Hero Electric కొత్త డీలర్‌షిప్ ప్రారంభం; వివరాలు

ఇకపోతే, ఎన్‌వైఎక్స్ మరియు ఫోటాన్ ఎలక్ట్రిక్ స్కూటర్లు వరుసగా 165 మరియు 108 కిలోమీటర్ల రేంజ్ ను ఆఫర్ చేస్తూ సిటీ స్పీడ్ (HX) రూపంలో మాత్రమే అందుబాటులో ఉంటాయి. కాగా, హీరో ఎలక్ట్రిక్ ఫ్లాష్ మరియు అట్రియా మోడళ్లు కంఫర్ట్ స్పీడ్ (LX) రూపంలో మాత్రమే లభిస్తాయి. వీటి గరిష్ట వేగం గంటకు 25 కిమీ గా మాత్రమే ఉంటుంది.

మైసూర్‌లో Hero Electric కొత్త డీలర్‌షిప్ ప్రారంభం; వివరాలు

హీరో ఎలక్ట్రిక్ కంఫర్ట్ స్పీడ్ శ్రేణిలో లభిస్తున్న మూడు ఎల్‌ఎక్స్ మోడళ్ల (ఆప్టిమా ఎల్‌ఎక్స్, అట్రియా మరియు ఫ్లాష్) ను భారత రోడ్లపై నడపడానికి వాటిని రిజిస్టర్ చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే, వీటి వేగం గంటకు గరిష్టంగా 25 కిలోమీటర్లకు మించదు. అట్రియా మరియు ఫ్లాష్ రెండు మోడళ్లు కూడా ఒకే ఛార్జ్‌పై 85 కిలోమీటర్ల రేంజ్ ను ఆఫర్ చేస్తాయి.

మైసూర్‌లో Hero Electric కొత్త డీలర్‌షిప్ ప్రారంభం; వివరాలు

హీరో ఎలక్ట్రిక్ స్కూటర్లు - ధరలు:

కర్ణాటక మార్కెట్లో హీరో ఎలక్ట్రిక్ అందిస్తున్న వివిధ రకాల ఎలక్ట్రిక్ స్కూటర్లు మరియు వాటి ఎక్స్-షోరూమ్ ధరల వివరాలు ఇలా ఉన్నాయి:

కంఫర్ట్ స్పీడ్ రేంజ్ మోడళ్లు (టాప్ స్పీడ్ 25 కెఎంపిహెచ్):

 • ఫ్లాష్ ఎల్ఎక్స్ (VRLA) - రూ. 46,640
 • ఆప్టిమా ఎల్ఎక్స్ (VRLA) - రూ. 51, 440
 • ఫ్లాష్ ఎల్ఎక్స్ - రూ. 59,460
 • అట్రియా ఎల్ఎక్స్ - రూ. 66,640
 • ఆప్టిమా ఎల్ఎక్స్ - రూ. 67,440
 • సిటీ స్పీడ్ రేంజ్ మోడళ్లు (టాప్ స్పీడ్ 42 కెఎంపిహెచ్):

  • ఆప్టిమా హెచ్ఎక్స్ (సింగిల్ బ్యాటరీ) - రూ. 55,580
  • ఆప్టిమా హెచ్ఎక్స్ (డబుల్ బ్యాటరీ) - రూ. 65,640
  • ఎన్‌వైఎక్స్ హెచ్ఎక్స్ (డబుల్ బ్యాటరీ) - రూ. 67,540
  • ఫోటాన్ హెచ్ఎక్స్ - రూ. 74,240
  • మైసూర్‌లో Hero Electric కొత్త డీలర్‌షిప్ ప్రారంభం; వివరాలు

   (గమనిక: అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, అక్టోబర్ 28, 2021వ తేదీ నాటికి)

   Hero Electric ఈ స్కూటర్లతో పాటుగా వెలాసిటీ (Velocity) అనే ఇ-సైకిల్‌ను కూడా విక్రయిస్తోంది. ఇది 10Ah బ్యాటరీ ప్యాక్ ను కలిగి ఉంటుంది మరియు సింగిల్ ఛార్జ్‌పై గరిష్టంగా 50 కిలోమీటర్ల రేంజ్ ను ఆఫర్ చేస్తుంది. ఇందులో చార్జ్ అయిపోతే, పెడల్ అసిస్టెన్స్ సాయంతో తొక్కుకుంటూ వెళ్లిపోవచ్చు మరియు పెడల్ అసిస్టెన్స్ సాయంతో ఈ సైకిల్ రేంజ్ కూడా పెరుగుతుంది.

Most Read Articles

English summary
Hero electric opens new dealership in mysore details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X