పెరుగుతున్న పెట్రోల్ ధరలు: హీరో ఎలక్ట్రిక్ షోరూమ్‌ల వైపు కస్టమర్ల పరుగులు

పెట్రోల్ ధరలు భగ్గుమంటున్నాయి. కొత్త సంవత్సరం ప్రారంభమై ఇంకా రెండు నెలలు కూడా పూర్తి కాలేదు, అప్పడే పెట్రోల్, డీజిల్ ధరలు 22 సార్లు పెరిగాయి. జనవరి 2021 నుండి ఇప్పటి వరకూ లీటరు పెట్రోల్‌పై రూ.6.17 మేర ధర పెరగగా, డీజిల్‌పై రూ.6.40 మేర ధరలు పెరిగాయి.

పెరుగుతున్న పెట్రోల్ ధరలు: హీరో ఎలక్ట్రిక్ షోరూమ్‌ల వైపు కస్టమర్ల పరుగులు

పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రభుత్వ నియంత్రణలు ఎత్తివేయటంతో చమురు కంపెనీలు దాదాపు ప్రతిరోజూ ఇంధన ధరలను పెంచుతూ వస్తున్నాయి. ప్రస్తుతం ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.90.58గా ఉంటే, లీటర్ డీజిల్ ధర రూ.80.97గా ఉంది. రాజస్థాన్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.100 లను దాటిపోయింది, అక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ.100.49గా ఉంది.

పెరుగుతున్న పెట్రోల్ ధరలు: హీరో ఎలక్ట్రిక్ షోరూమ్‌ల వైపు కస్టమర్ల పరుగులు

ఈ పరిస్థితుల నేపథ్యంలో, పెరుగుతున్న పెట్రోల్ ధరలను చూసి, కొనుగోలుదారులు ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలపై ఆసక్తి చూపుతున్నారు. పెట్రోల్‌తో నడిచే వాహనాలతో పోల్చుకుంటే, ఎలక్ట్రిక్ వాహనాల ధర కాస్తంత అధికంగా ఉన్నప్పటికీ, లాంగ్ రన్‌లో వాటి రన్నింగ్ కాస్ట్ మరియు మెయింటినెన్స్ ఖర్చులు మాత్రం చాలా తక్కువగా ఉంటాయి.

పెరుగుతున్న పెట్రోల్ ధరలు: హీరో ఎలక్ట్రిక్ షోరూమ్‌ల వైపు కస్టమర్ల పరుగులు

పెట్రోల్ ధరాఘాతాన్ని తప్పించుకునేందుకు కస్టమర్లు ఇప్పుడు హీరో ఎలక్ట్రిక్ షోరూమ్‌లకు క్యూ కడుతున్నారు. గత రెండు నెలల్లో హీరో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల కోసం వస్తున్న ఎంక్వైరీలు భారీగా పెరిగినట్లు సంస్థ ప్రకటించింది. కంపెనీ అందిస్తున్న ఎలక్ట్రిక్ టూవీలర్ల కోసం టెస్ట్ రైడ్ రిజిస్ట్రేషన్లు కూడా భారీగా పెరినట్లు హీరో ఎలక్ట్రిక్ తెలిపింది.

పెరుగుతున్న పెట్రోల్ ధరలు: హీరో ఎలక్ట్రిక్ షోరూమ్‌ల వైపు కస్టమర్ల పరుగులు

గత కొన్ని వారాలుగా తమ డీలర్‌షిప్ కేంద్రాలకు వినియోగదారుల తాకిడి పెరిగిందని, కస్టమర్లు తమ వద్ద ఉన్న పెట్రోల్ పవర్డ్ టూవీలర్లను హీరో ఎలక్ట్రిక్ టూవీలర్ల కోసం మార్పిడి (ఎక్సేంజ్) చేసుకుంటే కలిగే ప్రయోజనాల గురించి కూడా ఎంక్వైరీలు చేస్తున్నట్లు కంపెనీ పేర్కొంది.

పెరుగుతున్న పెట్రోల్ ధరలు: హీరో ఎలక్ట్రిక్ షోరూమ్‌ల వైపు కస్టమర్ల పరుగులు

ప్రస్తుతం ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన విభాగంలో, హీరో ఎలక్ట్రిక్ వివిధ రకాల ఉత్పత్తులను విక్రయిస్తూ, విస్తృతమైన నెట్‌వర్క్‌తో మార్కెట్ లీడర్‌గా ఉంది. ఈ బ్రాండ్ అందిస్తున్న కొన్ని రకాల లో-స్పీడ్ ఎలక్ట్రిక్ టూవీలర్లకు రిజిస్ట్రేషన్ మరియు లైసెన్స్ కూడా అవసరం లేదని కంపెనీ తెలిపింది.

పెరుగుతున్న పెట్రోల్ ధరలు: హీరో ఎలక్ట్రిక్ షోరూమ్‌ల వైపు కస్టమర్ల పరుగులు

హీరో ఎలక్ట్రిక్ అందిస్తున్న సిటీ స్పీడ్ ఎన్‌వైఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ ఎక్కువగా ఉందని కంపెనీ తెలిపింది. గతేడాది అక్టోబర్ నెలలో కంపెనీ ఈ స్కూటర్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. మార్కెట్లో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.64,640 లుగా ఉంది.

పెరుగుతున్న పెట్రోల్ ధరలు: హీరో ఎలక్ట్రిక్ షోరూమ్‌ల వైపు కస్టమర్ల పరుగులు

హీరో సిటీ స్పీడ్ ఎన్‌వైఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ పూర్తి చార్జ్‌పై 82 కిలోమీటర్ల రేంజ్‌ను ఆఫర్ చేస్తుంది. ఇందులో టాప్-రేంజ్ వేరియంట్ కూడా అందుబాటులో ఉంది, ఇది పూర్తి చార్జ్‌పై గరిష్టంగా 210 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది.

పెరుగుతున్న పెట్రోల్ ధరలు: హీరో ఎలక్ట్రిక్ షోరూమ్‌ల వైపు కస్టమర్ల పరుగులు

హీరో ఎలక్ట్రిక్ తన సిటీ స్పీడ్ సిరీస్‌లో ఆప్టిమా మరియు ఫోటాన్ అనే ఇతర మోడళ్లను కూడా విక్రయిస్తోంది. మార్కెట్లోని ఇతర మోడళ్లతో పోల్చుకుంటే, హీరో ఎలక్ట్రిక్ టూవీలర్లు సరసమైన ధరను కలిగి ఉండటమే కాకుండా, బెటర్ సర్వీస్ నెట్‌వర్క్‌ను కూడా కలిగి ఉంటాయి. ప్రస్తుతం హీరో ఎలక్ట్రిక్‌కి దేశవ్యాప్తంగా 750కి పైగా చార్జింగ్ స్టేషన్లు ఉన్నాయి.

Most Read Articles

English summary
Demand For Hero Electric Scooters Increased Due To High Fuel Prices. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X