కొత్తగా మరో 1,000 సేల్స్ టచ్ పాయింట్లు.. ఎక్కడ చూసినా హీరో ఎలక్ట్రిక్ స్కూటర్లే..

భారతదేశంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ అయిన హీరో ఎలక్ట్రిక్ (Hero Electric), ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021 - 2022) ముగిసే నాటికి దేశవ్యాప్తంగా 1,000 సేల్స్ టచ్ పాయింట్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. కంపెనీ ప్రస్తుతం దేశవ్యాప్తంగా 300 కొత్త సేల్స్ టచ్ పాయింట్లను ఏర్పాటు చేసింది.

కొత్త మరో 1,000 సేల్స్ టచ్ పాయింట్లు.. ఎక్కడ చూసినా హీరో ఎలక్ట్రిక్ స్కూటర్లే..

ఎలక్ట్రిక్ వాహనాలపై కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు, మెరుగైన చార్జింగ్ మౌలిక సదుపాయాలు మరియు ఎలక్ట్రిక్ వాహనాల పట్ల వినియోగదారులలో అధికమవుతున్న అవగాహన వంటి పలు అంశాల కారణంగా హీరో ఎలక్ట్రిక్ తమ సేల్స్ అండ్ సర్వీస్ నెట్‌వర్క్ ను విస్తృతంగా పెంచుకోవాలని చూస్తున్నట్లు కంపెనీ తెలిపింది.

కొత్త మరో 1,000 సేల్స్ టచ్ పాయింట్లు.. ఎక్కడ చూసినా హీరో ఎలక్ట్రిక్ స్కూటర్లే..

భారతదేశంలో గత కొన్ని నెలలో పెట్రోల్ ధరలు నిరంతరాయంగా పెరుగుతుండటంతో కస్టమర్లు కూడా ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల వైపు ఎక్కువ ఆసక్తిని కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశీయ విపణిలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు, ప్రత్యేకించి హీరో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. ఈ డిమాండ్ కు అనుగుణంగా కంపెనీ తమ నెట్‌వర్క్ ను కూడా విస్తరించాలని నిర్ణయించింది.

కొత్త మరో 1,000 సేల్స్ టచ్ పాయింట్లు.. ఎక్కడ చూసినా హీరో ఎలక్ట్రిక్ స్కూటర్లే..

కేవలం సేల్స్ టచ్‌పాయింట్లను మాత్రమే కాకుండా, ఉత్పత్తి సామర్థ్యాన్ని కూడా పెంచనున్నట్లు హీరో ఎలక్ట్రిక్ తెలిపింది. గత ఏడాదితో పోలిస్తే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెట్టింపు విక్రయాలకు అనుగుణంగా తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని విస్తరించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. హీరో ఎలక్ట్రిక్ భారతదేశం అంతటా 500 నగరాల్లో సానుకూల విక్రయాలను కలిగి ఉంది మరియు ఈ నగరాల్లో 700 కంటే ఎక్కువ సేల్స్ అండ్ సర్వీస్ నెట్‌వర్క్‌ లను కూడా కలిగి ఉంది.

కొత్త మరో 1,000 సేల్స్ టచ్ పాయింట్లు.. ఎక్కడ చూసినా హీరో ఎలక్ట్రిక్ స్కూటర్లే..

భారత మార్కెట్లో ప్రస్తుతం Hero Electric అందిస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్లలో కంఫర్ట్ స్పీడ్ విభాగంలో అట్రియా (Atria), ఫ్లాష్ (Flash) మరియు ఆప్టిమా (Optima) ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయిస్తోంది. ఇవన్నీ కూడా లో-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్లు, వీటి గరిష్ట వేగం గంటకు 25 కిలోమీటర్ల కన్నా తక్కువగా ఉంటుంది. ఈ లో-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్లను నడపడానికి లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్ అవసరం ఉండదు.

కొత్త మరో 1,000 సేల్స్ టచ్ పాయింట్లు.. ఎక్కడ చూసినా హీరో ఎలక్ట్రిక్ స్కూటర్లే..

ఇకపోతే, హీరో ఎలక్ట్రిక్ సిటీ స్పీడ్ విభాగంలో ఆప్టిమా హెచ్ఎక్స్ (Optima HX), ఎన్‌వైఎక్స్ హెచ్ఎక్స్ (NYX HX) మరియు ఫోటాన్ హెచ్ఎక్స్ (Photon HX) మోడళ్లను విక్రయిస్తోంది. ఈ స్కూటర్ల గరిష్ట వేగం (టాప్ స్పీడ్) గంటకు 42 కిలోమీటర్ల కన్నా ఎక్కువగా ఉంటుంది. ఈ సిటీ స్పీడ్ రేంజ్ స్కూటర్లను నడపడానికి రిజిస్ట్రేషన్ మరియు లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలి.

కొత్త మరో 1,000 సేల్స్ టచ్ పాయింట్లు.. ఎక్కడ చూసినా హీరో ఎలక్ట్రిక్ స్కూటర్లే..

హీరో ఎలక్ట్రిక్ భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్ల వ్యాపారం ప్రారంభించినప్పటి నుండి ఇప్పటి వరకు నాలుగు లక్షలకు పైగా ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించినట్లు తెలిపింది. రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరుగుతుందని కంపెనీ ఆశాభావంతో ఉంది. గత నెలలో (సెప్టెంబర్ 2021 లో) హీరో ఎలక్ట్రిక్ భారత మార్కెట్లో 6,500 యూనిట్ల ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించింది.

కొత్త మరో 1,000 సేల్స్ టచ్ పాయింట్లు.. ఎక్కడ చూసినా హీరో ఎలక్ట్రిక్ స్కూటర్లే..

రూ. 15,000 లకు పైగా తగ్గిన హీరో ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు..

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫేమ్ (ఫాస్ట్ అడాప్షన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ (హైబ్రిడ్) ఎలక్ట్రిక్) II ప్రాజెక్టులో భాగంగా, ఎలక్ట్రిక్ వాహన తయారీదారులకు ఇచ్చే ప్రోత్సాహకాలలో ఇటీవల చేసిన సవరణల నేపథ్యంలో, దేశీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల ధరలు భారీగా తగ్గాయి.

కొత్త మరో 1,000 సేల్స్ టచ్ పాయింట్లు.. ఎక్కడ చూసినా హీరో ఎలక్ట్రిక్ స్కూటర్లే..

ఇందులో భాగంగా, హీరో ఎలక్ట్రిక్ అందిస్తున్న కొన్ని రకాల ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు సుమారు రూ. 15,000 లకు పైగా తగ్గాయి. కస్టమర్ ఎంచుకునే మోడల్ మరియు వేరియంట్ ను బట్టి ఈ తగ్గింపు మారుతూ ఉంటుంది. ఖచ్చితమైన వివరాల కోసం మీ సమీపంలోని అధీకృత హీరో ఎలక్ట్రిక్ డీలర్‌షిప్ ను సందర్శించండి.

కొత్త మరో 1,000 సేల్స్ టచ్ పాయింట్లు.. ఎక్కడ చూసినా హీరో ఎలక్ట్రిక్ స్కూటర్లే..

ఏటా 5 లక్షల ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ..

హీరో ఎలక్ట్రిక్ స్కూటర్లకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని కంపెనీ 2022 నాటికి తమ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనా తయారీ సామర్థ్యాన్ని ఏటా 5 లక్షల యూనిట్లకు పెంచాలని భావిస్తోంది. అంతే కాకుండా, దేశవ్యాప్తంగా ఛార్జింగ్ మౌళిక సదుపాయాలను విస్తరించడానికి కూడా కంపెనీ ప్లాన్ చేస్తోంది.

కొత్త మరో 1,000 సేల్స్ టచ్ పాయింట్లు.. ఎక్కడ చూసినా హీరో ఎలక్ట్రిక్ స్కూటర్లే..

ప్రస్తుతం హీరో ఎలక్ట్రిక్ సంస్థకు పంజాబ్‌లోని లూథియానాలో ఓ ఎలక్ట్రిక్ వాహన తయారీ ప్లాంట్ ఉంది. ఈ ప్లాంట్ ఏటా 1 లక్షకు పైగా ద్విచక్ర వాహనాలను తయారు చేయగలదు. రానున్న ఏడాదిలో ఈ ఉత్పత్తి సామర్థ్యాన్ని ఏటా 5 లక్షల యూనిట్లకు పెంచాలని కంపెనీ చూస్తోంది. హీరో ఎలక్ట్రిక్ సంస్థకు దేశవ్యాప్తంగా 600 లకు పైగా షోరూమ్‌లు మరియు సర్వీస్ సెంటర్లు ఉన్నాయి.

కొత్త మరో 1,000 సేల్స్ టచ్ పాయింట్లు.. ఎక్కడ చూసినా హీరో ఎలక్ట్రిక్ స్కూటర్లే..

హీరో ఎలక్ట్రిక్ స్కూటర్లు - ధరలు

ప్రస్తుతం, మన తెలుగు రాష్ట్రాలలో (ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మార్కెట్లలో) హీరో ఎలక్ట్రిక్ అందిస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్లు మరియు వాటి ఎక్స్-షోరూమ్ ధరల వివరాలు ఇలా ఉన్నాయి:

కంఫర్ట్ స్పీడ్ రేంజ్ మోడళ్లు (టాప్ స్పీడ్ 25 కెఎంపిహెచ్):

  • Flash LX (VRLA) - రూ. 46,640
  • Optima LX (VRLA) - రూ. 51, 440
  • Flash LX - రూ. 59,460
  • Atria LX - రూ. 66,640
  • Optima LX - రూ. 67,440
  • సిటీ స్పీడ్ రేంజ్ మోడళ్లు (టాప్ స్పీడ్ 42 కెఎంపిహెచ్):

    • Optima HX (Single Battery) - రూ. 55,580
    • Optima HX (Dual Battery) - రూ. 65,640
    • NYX HX (Dual Battery) - రూ. 67,540
    • Photon HX - రూ. 74,240
    • (గమనిక: అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, అక్టోబర్ 26, 2021వ తేదీ నాటికి)

Most Read Articles

English summary
Hero electric to open 1000 touchpoints by end of fy2022 details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X