ఒకటి, రెండు కాదు.. ఏకంగా 10,000 ఛార్జింగ్ స్టేటన్స్ ఏర్పాటుకి Hero Electric శ్రీకారం

భారతదేశ ఎలక్ట్రిక్ వాహన తయారీ దిగ్గజం Hero Electric (హీరో ఎలక్ట్రిక్) ఎలక్ట్రిక్ వాహన వినియోగదారులకు ఒక శుభవార్తను తీసుకువచ్చింది. కంపెనీ అందించిన సమాచారం ప్రకారం భారతదేశంలో 2022 నాటికి దాదాపు 10,000 ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది.

ఒకటి, రెండు కాదు.. ఏకంగా 10,000 ఛార్జింగ్ స్టేటన్స్ ఏర్పాటుకి Hero Electric శ్రీకారం

ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్స్ కోసం Hero Electric ఢిల్లీకి చెందిన ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ సొల్యూషన్స్ స్టార్టప్ Massive Mobility (మాసివ్ మొబిలిటీ) తో భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయం రాబోయే కాలంలో ఎలక్ట్రిక్ వాహన వినియోగదారులకు ఛార్జింగ్ కష్టాల నుంచి బయటపడేస్తుంది. ఎందుకంటే ఎక్కువ సంఖ్యలో ఛార్జింగ్ స్టేషన్స్ అందుబాటులోకి వచ్చేస్తున్నాయి కావున.

ఒకటి, రెండు కాదు.. ఏకంగా 10,000 ఛార్జింగ్ స్టేటన్స్ ఏర్పాటుకి Hero Electric శ్రీకారం

కంపెనీ ఏర్పాటు చేయనున్న ఈ ఛార్జింగ్ స్టేషన్లు అన్ని రకాల ఎలక్ట్రిక్ వాహనాల వినియోగానికి ఉపయోగించబడతాయని కంపెనీ తెలిపింది. హీరో ఎలక్ట్రిక్ యొక్క కొత్త EV భాగస్వామి Massive Mobility (మాసివ్ మొబిలిటీ) అనేది ఒక స్టార్టప్, ఇది 3-వీలర్ మరియు 2-వీలర్ ఎలక్ట్రిక్ వాహనాల యొక్క అన్ని ఛార్జింగ్ అవసరాల కోసం 'స్మార్ట్ కనెక్టెడ్ నెట్‌వర్క్' ఏర్పాటు చేస్తుంది. అంతే కాకుండా ఛార్జింగ్ పాయింట్లు మరియు పార్కింగ్ సేవలను అందిస్తుంది.

ఒకటి, రెండు కాదు.. ఏకంగా 10,000 ఛార్జింగ్ స్టేటన్స్ ఏర్పాటుకి Hero Electric శ్రీకారం

భారతదేశంలో హీరో ఎలక్ట్రిక్ ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంలో Massive Mobility సహాయపడుతుందని కంపెనీ పేర్కొంది. ఈ సందర్భంగా హీరో ఎలెక్ట్రిక్ సిఇఒ సోహిందర్ గిల్ మాట్లాడుతూ, భారత ప్రభుత్వం ఇటీవల చేసిన ప్రకటనలు EV పరిశ్రమను తదుపరి స్థాయికి తీసుకెళ్లడానికి సహాయపడ్డాయి. ఎలక్ట్రిక్ వాహన పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడానికి మేము నిరంతరం కృషి చేస్తున్నామన్నారు.

ఒకటి, రెండు కాదు.. ఏకంగా 10,000 ఛార్జింగ్ స్టేటన్స్ ఏర్పాటుకి Hero Electric శ్రీకారం

రెండు కంపెనీలు సంయుక్తంగా తమ ఛార్జింగ్ స్టేషన్లను ఉపయోగించి వినియోగదారుల ప్రవర్తనను కొలవడానికి ఒక సర్వేను కూడా నిర్వహించాయి. సర్వే ప్రకారం, చాలామంది EV కస్టమర్‌లు మొబైల్ యాప్‌లు లేదా ఇంటర్నెట్ ద్వారా స్మార్ట్ ఛార్జర్‌ల కోసం అన్వేషిస్తారు. అంతే కాకుండా ఛార్జింగ్ కోసం 16 AMP ఛార్జింగ్ పాయింట్ మరియు లాంగ్ కార్డ్ కోసం డిమాండ్ ఎక్కువగా ఉన్నట్లు ఈ సర్వేలు తెలుపుతాయి.

ఒకటి, రెండు కాదు.. ఏకంగా 10,000 ఛార్జింగ్ స్టేటన్స్ ఏర్పాటుకి Hero Electric శ్రీకారం

భారతదేశంలో రోజురోజుకి ఇంధన ధరలు పెరుగుతున్న కారణంగా, చాలామంది వాహన కొనుగోలుదారులు, ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. దీనికి తోడు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎలక్ట్రిక్ వాహన వినియోగాలను ప్రోత్సహహించడానికి, అనేక రాయితీలు మరియు సబ్సిడీలు అందిస్తున్నాయి. ఇవన్నీ ఎలక్ట్రిక్ వాహన వినియోగాలను పెంచడంలో సహాయపడతాయి.

ఒకటి, రెండు కాదు.. ఏకంగా 10,000 ఛార్జింగ్ స్టేటన్స్ ఏర్పాటుకి Hero Electric శ్రీకారం

ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాన్ని ప్రోత్సహించడానికి, కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల ఎలక్ట్రిక్ వాహనాలను రిజిస్ట్రేషన్ నుండి మినహాయించింది. ఈ నిర్ణయం తరువాత, ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసే వినియోగదారులు రిజిస్ట్రేషన్ ఫీజును ఆదా చేసుకోవచ్చు.

ఒకటి, రెండు కాదు.. ఏకంగా 10,000 ఛార్జింగ్ స్టేటన్స్ ఏర్పాటుకి Hero Electric శ్రీకారం

దేశవ్యాప్తంగా ఇంధన ధరలు విపరీతంగా పెరుగుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పెరుగుతున్న ఇంధన ధరల మాత్రమే కాకుండా పెరుగుతున్న కాలుష్యాన్ని అదుపుచేయడానికి ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం ఎంతైనా అవసరం, కావున పెద్ద ఎత్తున ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించడానికి ప్రజలు ఆసక్తి కనపరచడానికి ప్రభుత్వం కూడా తమ వంతు కృషి చేస్తుంది.

ఒకటి, రెండు కాదు.. ఏకంగా 10,000 ఛార్జింగ్ స్టేటన్స్ ఏర్పాటుకి Hero Electric శ్రీకారం

ఇది కాకుండా, ఎలక్ట్రిక్ వాహన తయారీదారులను ప్రోత్సహించడానికి, అన్ని బ్యాటరీతో నడిచే వాహనాలపై GST రేటు 12 శాతం నుండి 5 శాతానికి తగ్గించబడింది. ఇది కాకుండా, అనేక రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీలు మరియు డిస్కౌంట్లు ఇవ్వడం ద్వారా ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి మరియు విక్రయాలను కూడా ప్రోత్సహిస్తున్నాయి.

ఒకటి, రెండు కాదు.. ఏకంగా 10,000 ఛార్జింగ్ స్టేటన్స్ ఏర్పాటుకి Hero Electric శ్రీకారం

ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆటోమొబైల్ రంగానికి రూ. 26,000 కోట్ల ప్రొడక్షన్-లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) పథకాన్ని ఆమోదించినట్లు తెలిసింది. అయితే, గత ప్రణాళికలకు భిన్నంగా ఈసారి ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల రంగంపై దృష్టి సారించింది. గత సంవత్సరం, ఆటోమొబైల్ మరియు కాంపోనెంట్స్ సెక్టార్ కోసం కేంద్ర ప్రభుత్వం రూ .57,043 కోట్ల PLI స్కీమ్‌ను ప్రకటించింది. అయితే, హైడ్రోజన్ ఇంధనం మరియు ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టి పెట్టడానికి ప్రభుత్వం ఈ రంగానికి సంబంధించిన ప్రణాళికను రూ .25,938 కోట్లకు తగ్గించింది. ఈ పథకం 5 సంవత్సరాలు అమలు చేయబడుతుంది.

ఒకటి, రెండు కాదు.. ఏకంగా 10,000 ఛార్జింగ్ స్టేటన్స్ ఏర్పాటుకి Hero Electric శ్రీకారం

భారతదేశంలో ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహన వినియోగం పెరుగుదల దిశవైపు వెళ్తోంది. కానీ ఇప్పటికి ఎలక్ట్రిక్ వాహనాలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు అందుబాటులో లేకపోవడం వల్ల చాలామంది ఎలక్ట్రిక్ వాహన వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఇప్పుడు Hero Electric తీసుకున్న ఈ నిర్ణయం ఎలక్ట్రిక్ వాహన వినియోగదారుల ఇబ్బందులకు చెక్ పెట్టనుంది. కంపెనీ దేశవ్యాప్తంగా ఇన్ని ఛార్జింగ్ స్టేటన్స్ ఏర్పాటు చేస్తే, ఎలక్ట్రిక్ వాహన వినియోగదారుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంటుంది.

Most Read Articles

English summary
Hero electric to setup 10000 ev charging stations enters into partnership with this firm
Story first published: Saturday, September 25, 2021, 12:38 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X