Hero Maestro Edge 110 ఇప్పుడు కొత్త కలర్‌లో.. ధర కేవలం రూ. 65,900 మాత్రమే

ప్రముఖ వాహన తయారీ సంస్థ Hero MotoCorp (హీరో మోటోకార్ప్) దేశీయ మార్కెట్లో కొత్త Hero Maestro Edge 110 (హీరో మాస్ట్రో ఎడ్జ్ 110) ని కొత్త కలర్ ఆప్సన్ లో విడుదల చేసింది. పండుగ సీజన్ ని దృష్టిలో ఉంచుకుని కంపెనీ కొత్త స్కూటర్ ని విడుదల చేసింది. ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

Hero Maestro Edge 110 ఇప్పుడు కొత్త కలర్‌లో

Hero Maestro Edge 110 ఇప్పుడు స్కార్లెట్ రెడ్‌ కలర్ లో అందుబాటులో ఉంది. ఈ స్కూటర్ ఇప్పుడు మొత్తం 8 కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది. ఈ స్కూటర్లో కొత్త కలర్ ఆప్సన్ కాకుండా ఇతర మార్పులు ఏమి చేయలేదు, అంతే కాకుండా ఈ స్కూటర్ ధరలో కూడా ఎలాంటి మార్పు చేయలేదు.

Hero Maestro Edge 110 ఇప్పుడు కొత్త కలర్‌లో

హీరో మాస్ట్రో ఎడ్జ్ 110 యొక్క ఈ కొత్త కలర్ ఆప్సన్ లో, మూడు రంగుల మిశ్రమం కనిపిస్తుంది. దీని ముందు భాగంలోని ప్యానెల్, ఫ్లోర్‌బోర్డ్ ప్యానెల్ మరియు ఫ్రంట్ ఫెండర్ అంటివి రెడ్ కలర్ లో ఉన్నాయి. ఇక దాని వెనుక భాగంలో బ్లాక్ కలర్ ఇవ్వబడింది, ఈ కలర్స్ మాత్రమే కాకుండా రెడ్, బ్లూ మరియు గ్రే కలర్ హైలైట్‌లు కూడా అక్కడక్కడా చూడవచ్చు.

Hero Maestro Edge 110 ఇప్పుడు కొత్త కలర్‌లో

ఈ మూడు రంగుల కారణంగా ఇది చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. మొత్తంమీద, ఈ స్కూటర్ కొత్త కలర్ ఆప్షన్‌లో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఈ కొత్త కలర్ ఆప్షన్ బైక్‌కి మంచి దూకుడు రూపాన్ని ఇస్తుంది. ఇది కాకుండా, ఈ స్కూటర్ మరో ఏడు రంగు ఎంపికలలో అందుబాటులో ఉంది. ఈ కొత్త కలర్ స్కూటర్ యొక్క ఇంజిన్‌లో కూడా ఎటువంటి మార్పులు చేయలేదు, మునుపటి మోడల్ లోని ఫీచర్స్ ఇందులో ఉన్నాయి.

Hero Maestro Edge 110 ఇప్పుడు కొత్త కలర్‌లో

హీరో మాస్ట్రో ఎడ్జ్ 110 స్కూటర్ 110 సిసి ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 8.15 బిహెచ్‌పి పవర్ మరియు 8.75 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీని ప్రారంభ ధర రూ. 65,900 వద్ద ఉంచబడింది, దీనితో పాటు 100 మిలియన్ ఎడిషన్ ధర రూ. 66,900 వద్ద ఉంచబడింది.

Hero Maestro Edge 110 ఇప్పుడు కొత్త కలర్‌లో

కంపెనీ తన 125 సిసి వెర్షన్ స్కూటర్ ని హీరో కనెక్ట్ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులోకి వచ్చింది. హీరో కనెక్ట్ ప్లాట్‌ఫామ్‌ను హీరో మోటోకార్ప్ గత సంవత్సరం ప్రవేశపెట్టింది. కంపెనీ దీనిని ప్రారంభించినప్పటి నుండి ఎంతోమంది వినియోగదారులు దీనిని కొనుగోలు చేశారు. ఈ కనెక్ట్ చేయబడిన ప్లాట్‌ఫామ్‌ ఆర్టిఫిషియల్లీ ఇంటెలిజెన్స్ పై ఆధారపడిన టెక్నాలజీ.

Hero Maestro Edge 110 ఇప్పుడు కొత్త కలర్‌లో

ఈ టెక్నాలజీ రైడర్‌కు భద్రత మరియు భద్రతను అందించడమే కాకుండా, రైడర్ యొక్క మొత్తం డ్రైవింగ్ అనుభవాన్ని మెరుగుపరచడం కూడా దీని లక్ష్యం. హీరో మాస్ట్రో 125 కాకుండా, కంపెనీ ఇతర ఉత్పత్తుల కోసం హీరో కనెక్ట్ ప్లాట్‌ఫామ్‌ ఎంపికను అందిస్తోంది. ఈ ఫీచర్ కంపెనీకి చెందిన కొన్ని డీలర్‌షిప్‌లలో మాత్రమే లభిస్తుంది. హీరో మోటోకార్ప్ యొక్క ఇతర ఉత్పత్తులలో హీరో ప్లెజర్ ప్లస్ Xtec, Xtreme 160R స్టీల్త్ ఎడిషన్ మరియు Xpulse 200 4V ఉన్నాయి. ఈ నమూనాలు ఇప్పటికే హీరో కనెక్ట్ ప్లాట్‌ఫారమ్‌తో అనుసంధానించబడ్డాయి.

Hero Maestro Edge 110 ఇప్పుడు కొత్త కలర్‌లో

కంపెనీ కొంతకాలం క్రితం తన స్కూటర్ ధరలను పెంచింది. ఇందులో భాగంగానే హీరో మాస్ట్రో ఎడ్జ్ 125 డిస్క్ ప్రిస్మాటిక్ ప్లస్ కనెక్ట్ ధర రూ. 81,900, హీరో మాస్ట్రో ఎడ్జ్ 125 డిస్క్ ప్రిస్మాటిక్ ధర రూ. 77,900, హీరో మాస్ట్రో ఎడ్జ్ 125 డిస్క్ ధర రూ. 77,900 మరియు హీరో మాస్ట్రో ఎడ్జ్ 125 డ్రమ్ ధర రూ. 73,450. హీరో మాస్ట్రో ఎడ్జ్ 110 యొక్క 100 మిలియన్ ఎడిషన్ ధర రూ. 68,599, హీరో మాస్ట్రో ఎడ్జ్ 110 అల్లాయ్ జెడ్ఎక్స్ రూ. 66,900, హీరో మాస్ట్రో ఎడ్జ్ 110 అల్లాయ్ డ్రమ్ విఎక్స్ ధర రూ. 65,900 ఉంచబడింది. (ఇక్కడ తెలిపిన అన్ని ధరలు కంపెనీ ధరలు పెంచిన తరువాత నిర్ణయించిన ధరలు)

Hero Maestro Edge 110 ఇప్పుడు కొత్త కలర్‌లో

దేశీయ మార్కెట్లో దాదాపు చాలా కంపెనీలు తమ వాహనాల ధరలను పెంచుతున్నాయి. ఇందులో భాగంగానే Hero MotoCorp కూడా తన వాహన ధరలను పెంచుతుంది. ధరల పెరుగుదలకు ప్రధాన కారణం పెరుగుతున్న ముడిసరుకుల ధరలు అని కంపెనీ తెలిపింది. అదనపు వ్యయ భారాన్ని తగ్గించడానికి ఉత్పత్తి ధరలను పెంచాలని కంపెనీ నిర్ణయించింది. కస్టమర్లపై పెద్దగా భారం పడకుండా ధరలు పెంచినట్లు కంపెనీ తెలిపింది.

Hero Maestro Edge 110 ఇప్పుడు కొత్త కలర్‌లో

హీరో తన ఉత్పత్తులను నిరంతరం అప్‌డేట్ చేస్తూనే ఉంది, ఈ కారణంగా ఎక్కువమంది కొనుదారులను ఆకర్శించగలుగుతుంది. ఇందులో భాగంగానే కంపెనీ ఇప్పుడు ఈ కొత్త స్కూటర్ ని కొత్త కలర్ ఆప్సన్ లో ప్రవేశపెట్టింది. ఈ కొత్త కలర్ ఆప్సన్ తప్పకుండా ఎక్కువమంది కొనుగోలుదారులను ఆకర్శించగలుగుతుంది. కావున కంపెనీ మంచి అమ్మకాలతో ముందుకు సాగుతుంది.

Most Read Articles

English summary
Hero maestro edge 110 new color option launched details
--<
-->
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X