కొత్త Hero Xpulse 200 4V యాక్ససరీస్: వివరాలు

భారతదేశంలో అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ Hero MotoCorp (హీరో మోటోకార్ప్) దేశీయ మార్కెట్లో కొత్త Hero Xpulse 200 4V (హీరో ఎక్స్ ప్లస్ 200 4వి) బైక్ విడుదల చేసింది. దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త Hero Xpulse 200 4V బైక్ ధర రూ. 1.28 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ బైక్ దాని మునుపటి మోడల్స్ కంటే కూడా చాలా వరకు లేటెస్ట్ ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది.

కొత్త Hero Xpulse 200 4V యాక్ససరీస్: వివరాలు

కంపెనీ ఈ కొత్త బైక్ యొక్క యాక్ససరీస్ జాబితాను వెబ్‌సైట్‌లో విడుదల చేసింది. ఇందులో కంపెనీ ఈ బైక్ కోసం మోటోక్రాస్ హెల్మెట్‌ను అందిస్తోంది. ఈ హెల్మెట్ పైన X-పల్స్ 200 బ్రాండ్ మరియు ఇతర గ్రాఫిక్స్ చూడవచ్చు. ఇది చూడటానికి చాలా స్టైలిష్ గా ఉంటుంది.

కొత్త Hero Xpulse 200 4V యాక్ససరీస్: వివరాలు

కంపెనీ ఈ బైక్ లో మొబైల్ హోల్డర్ ఆప్సన్ కూడా అందించింది. బైక్ ట్యాంక్ ప్యాడ్-మౌంటెడ్ క్నీ ప్యాడ్‌లు మరియు నాలుగు సీట్ల ఎంపికలు కూడా ఇందులో ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అవి మోడరన్, టూరర్, డ్యూయల్ టోన్ మరియు అడ్వెంచర్ సీట్ ఆప్సన్స్. వీటితో పాటు కంపెనీ దీనికోసం ర్యాలీ కిట్ కూడా అందిస్తుంది.

కొత్త Hero Xpulse 200 4V యాక్ససరీస్: వివరాలు

కంపెనీ అందించే ఈ ర్యాలీ కిట్ లో ట్రావెల్ సస్పెన్షన్, ఫ్లాట్ స్యాడల్, నాబ్-ప్యాటర్న్ టైర్స్ తో పాటు ఈ కొత్త మోటార్‌సైకిల్‌కు కొత్త సైడ్-స్టాండ్‌ను కూడా అందిస్తుంది. కంపెనీ అందిస్తున్న ఈ ర్యాలీ కిట్ చట్టబద్ధమైనది, అంతే కాకుండా ఎఫ్ఎమ్ఎస్సిఐ ఆమోదించిన మోటార్ స్పోర్ట్స్ ఈవెంట్‌లకు ఇది ఒక హోమోలాగేట్.

కొత్త Hero Xpulse 200 4V యాక్ససరీస్: వివరాలు

ఇప్పుడు ఈ కొత్త BS6 వెర్షన్‌ బైక్ లో ఆయిల్-కూలర్ వంటి కొన్ని కొత్త అప్‌డేట్‌లను అందుకుంది. కావున ఇంజిన్ మరింత అద్భుతమైన పనితీరుని అందిస్తుంది. దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త Hero Xpulse 200 4V బైక్ ఇప్పుడు 199.6 సిసి ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఇందులో ఇప్పుడు 2-వాల్వ్ OHC కి బదులుగా 4-వాల్వ్ కాన్ఫిగరేషన్‌ అందుబాటులో ఉంటుంది.

కొత్త Hero Xpulse 200 4V యాక్ససరీస్: వివరాలు

ఈ కొత్త ఇంజిన్లోని 4-వాల్వ్ సెటప్ ఇంజిన్ అధిక RPM ల వద్ద మెరుగైన గాలిని తీసుకోవడానికి సహాయపడుతుంది, తద్వారా బైక్ నుండి మెరుగైన టాప్-ఎండ్ పనితీరును అందిస్తుంది. ఈ ఇంజిన్ ఇప్పుడు 8,500 ఆర్‌పిఎమ్ వద్ద 19.1 బిహెచ్‌పి పవర్ మరియు 6,500 ఆర్‌పిఎమ్ 17.35 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది మంచి పర్ఫామెన్స్ అందిస్తుంది.

కొత్త Hero Xpulse 200 4V యాక్ససరీస్: వివరాలు

ఇప్పుడు కొత్త Hero Xpulse 200 4V యొక్క డిజైన్ విషయానికి వస్తే, ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అయితే ఈ కొత్త మోడల్ దాని మునుపటి మోడల్ కి సమానంగా ఉంటుంది. కానీ దాని ట్యాంక్‌లో '4V' స్టిక్కర్ వంటికి గమనించవచ్చు. అంతే కాకుండా ఇది మూడు కొత్త డ్యూయల్ టోన్ కలర్ ఎంపికలతో వస్తుంది. ఇందులో ట్రైల్ బ్లూ, బ్లిట్జ్ బ్లూ మరియు రెడ్ రైడ్ ఉన్నాయి.

కొత్త Hero Xpulse 200 4V యాక్ససరీస్: వివరాలు

కొత్త Hero Xpulse 200 4V బైక్ లో ఎల్ఈడీ హెడ్‌లైట్లు మరింత ప్రకాశవంతంగా ఉన్నాయి. దీనితో పాటు స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్, గేర్ పొజిషన్ ఇండికేటర్, ఎకో మోడ్, రెండు ట్రిప్ మీటర్లు మరియు ఒక సింగిల్ ఛానల్ ABS తో పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో వస్తుంది.

కొత్త Hero Xpulse 200 4V యాక్ససరీస్: వివరాలు

ఈ బైక్ లోని సస్పెన్షన్ సెటప్, వీల్స్ మరియు టైర్లు వంటి భాగాలలో ఎలాంటి మార్పులు చేయబడలేదు. అయితే ఇందులోని సస్పెన్షన్ కోసం, ముందుభాగంలో 37 మిమీ టెలిస్కోపిక్ ఫోర్క్ అమర్చబడి ఉంటుంది. వెనుక భాగంలో మోనోషాక్ సెటప్ ఇవ్వబడింది. Xpulse 200 4V అదే 21 ఇంచెస్ మరియు 18 ఇంచెస్ వీల్ కాంబోను పొందుతుంది. ఈ బైక్ ముందు భాగంలో 90/90-21 టైర్లు మరియు వెనుక భాగంలో 120/80-18 టైర్లు ఉన్నాయి.

కొత్త Hero Xpulse 200 4V యాక్ససరీస్: వివరాలు

ఈ కొత్త Hero Xpulse 200 4V బైక్ ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలియు ఉంటుంది. అంతే కాకుండా ఈ బైక్ సరసమైన ధర వద్ద అలభిస్తుంది, కావున మార్కెట్లో ఈ బైక్ ఎక్కువమంది వినియోగాదారులను ఆకర్షించే అవకాశం ఉంటుంది.అంతే కాకుండా ప్రస్తుతం దేశంలో ప్రారంభమైన పండుగా సీజన్లో కంపెనీ మంచి అమ్మకాలతో ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. కావున కంపెనీ యొక్క ఈ నెల అమ్మకాలు ఖచ్చితంగా పెరుగుతాయి.

Most Read Articles

English summary
Hero motocorp accessories listed on website for newly launched xpulse 200 4v details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X