Hero MotoCorp అద్భుతమైన ఆఫర్స్: స్పెషల్ డిస్కౌంట్స్ కూడా..!!

భారతదేశంలో పండుగ సీజన్ ప్రారంభమయ్యింది. ఈ పండుగ సీజన్లో ఆటోమొబైల్ కంపెనీల యొక్క అమ్మకాలను మరింత పెంచుకోవడానికి ప్రత్యేకమైన మరియు అద్భుతమైన ఆఫర్స్ మరియు డిస్కౌంట్లను అందిస్తోంది. ఇందులో భాగంగానే Hero MotoCorp (హీరో మోటోకార్ప్) తన వినియోగదారుల కోసం చాలా ప్రత్యేకమైన ఆఫర్‌లను అందిస్తోంది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

Hero MotoCorp అద్భుతమైన ఆఫర్స్: స్పెషల్ డిస్కౌంట్స్ కూడా..!!

హీరో మోటోకార్ప్ కంపెనీ ఇప్పుడు తన విస్తృత శ్రేణి బైకులు మరియు స్కూటర్లపై బంపర్ డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ ఆఫర్ హీరో కంపెనీ యొక్క Splendor+ (స్ప్లెండర్ ప్లస్), Pleasure+ (ప్లెజర్ ప్లస్) వంటి వాటికి వర్తిస్తుంది. అంతే కాకుండా, తమ వాహనాల కొనుగోలుపై వినియోగదారులకు అనుకూలమైన ఫైనాన్స్ స్కీమ్ ప్రయోజనాన్ని కూడా కంపెనీ అందిస్తోంది.

Hero MotoCorp అద్భుతమైన ఆఫర్స్: స్పెషల్ డిస్కౌంట్స్ కూడా..!!

దేశంలో ప్రారంభమైన ఈ పండుగ సీజన్‌లో, హీరో బైకులు, స్కూటర్లు మొదలైన వాహనాలపై 5.55 శాతం ఫైనాన్స్ సదుపాయం అందుతుంది. ఇది కాకుండా, కేవలం 6,999 రూపాయల డౌన్ పేమెంట్ తో మీరు బైక్ లేదా స్కూటర్‌ను కొనుగోలు చేయవచ్చు. దీనితో పాటు కొత్త హీరో బైక్ లేదా స్కూటర్ కొనుగోలు చేస్తే రూ. 12,500 ఆఫర్‌ని కూడా మీరు పొందవచ్చు.

Hero MotoCorp అద్భుతమైన ఆఫర్స్: స్పెషల్ డిస్కౌంట్స్ కూడా..!!

కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, హీరో తన బైకులు మరియు స్కూటర్ల యొక్క ఎంపిక చేసిన మోడళ్లపై రూ. 12,500 వరకు ప్రయోజనాలను అందిస్తుంది. దీనితో పాటు మీరు క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డ్‌తో వెహికల్ కొనుగోలు చేయాలనుకుంటే మీరు దీని కింద దాదాపు రూ. 7,500 వరకు ఆదా చేయవచ్చు. అంతే కాకుండా కంపెనీ రూ. 2,100 క్యాష్ డిస్కౌంట్ మరియు రూ .5,000 లాయల్టీ/ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా కూడా అందిస్తోంది. కావున ఈ పండుగ సీజన్లో వాహనం కొనుగోలు చేయాలనుకుంటే ఈ ఆఫర్స్ అన్నీ కూడా పొందవచ్చు.

Hero MotoCorp అద్భుతమైన ఆఫర్స్: స్పెషల్ డిస్కౌంట్స్ కూడా..!!

భారతదేశంలో కంపెనీ యొక్క అమ్మకాలను మరింత పెంచుకోవాలనే నేపథ్యంలో, పండుగలు ప్రారంభమైన వెంటనే కంపెనీ తన పోర్ట్‌ఫోలియోను అప్‌డేట్ చేసింది. గత కొన్ని రోజులుగా కంపెనీ తన ప్రొడక్ట్ లైనప్‌లో మూడు కొత్త బైక్‌లు మరియు స్కూటర్‌లను విడుదల చేసింది. ఇందులో XPulse 200 4V, ప్లెజర్+ Xtec మరియు Xtreme 160R స్టీల్త్ ఎడిషన్ వంటివి ఉన్నాయి.

Hero MotoCorp అద్భుతమైన ఆఫర్స్: స్పెషల్ డిస్కౌంట్స్ కూడా..!!

మీరు ఈ పండుగ సీజన్లో కొత్త బైక్ లేదా స్కూటర్ కొనాలని ఆలోచిస్తుంటే, హీరో మోటోకార్ప్ యొక్క ఈ కొత్త మోడల్స్ చాలా అనుకూలంగా ఉంటాయి. ఇవన్నీ కూడా ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటాయి. హీరో కంపెనీ యొక్క కొత్త మోడల్స్ మరియు ఎడిషన్‌లు త్వరలో షోరూమ్‌లో అందుబాటులోకి వస్తాయని కంపెనీ తెలిపింది. కావున కొనుగోలుదారులు దీనికోసం కంపెనీ యొక్క అధికారిక వెబ్సైట్ సందర్శించవచ్చు.

Hero MotoCorp అద్భుతమైన ఆఫర్స్: స్పెషల్ డిస్కౌంట్స్ కూడా..!!

కంపెనీ ఇటీవల విడుదల చేసిన బైక్ మరియు స్కూటర్ల విషయానికి వస్తే, XPulse 200 4V ధర రూ .1.28 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) కాగా, మరోవైపు, Pleasure+ Xtec (ప్లెజర్+ ఎక్స్‌టెక్) ధర రూ. 61,900 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) వరకు ఉంటుంది. ఇక కంపెనీ యొక్క కొత్త Xtreme 160R స్టీల్త్ ఎడిషన్ ధర రూ. 1.16 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ధరతో అందుబాటులో ఉంటాయి. ఈ మూడు వాహనాలు ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలతో వస్తాయి.

Hero MotoCorp అద్భుతమైన ఆఫర్స్: స్పెషల్ డిస్కౌంట్స్ కూడా..!!

Hero MotoCorp యొక్క సెప్టెంబర్ 2021 అమ్మకాల నివేదికలు ఇటీవల విడుదలయ్యాయి. ఈ నివేదికల ప్రకారం కంపెనీ యొక్క అమ్మకాలు బాగా తగ్గినట్లు తెలిసింది. కంపెనీ విడుదల చేసిన ఈ అమ్మకాల నివేదిక విషయానికి వస్తే, సెప్టెంబర్ 2021 లో కంపెనీ మొత్తం 5,30,000 యూనిట్ల ద్విచక్ర వాహనాలను విక్రయించింది, ఇది సెప్టెంబర్ 2020 లో విక్రయించిన 7,15,718 యూనిట్లతో పోలిస్తే 25.90 శాతం క్షీణించినట్లు తెలిసింది.

Hero MotoCorp అద్భుతమైన ఆఫర్స్: స్పెషల్ డిస్కౌంట్స్ కూడా..!!

మార్కెట్లో కంపెనీ యొక్క అమ్మకాలు తగ్గినప్పటికీ, ఎగుమతులు మాత్రం బాగా వృద్ధి చెందాయని తెలిసింది. ఎగుమతులలో సెప్టెంబర్ 2020 తో పోలిస్తే సెప్టెంబర్ 2021 లో కంపెనీ ఎగుమతులలో 35.06 శాతం వృద్ధిని సాధించింది. ప్రస్తుతం ముడిసరుకు మరియు ఉక్కు ధరల పెరుగుదల కారణంగా హీరో గత వారం తన బైక్ మరియు స్కూటర్ శ్రేణి యొక్క అన్ని మోడళ్ల ధరలను పెంచింది. కంపెనీ పెరుగుదలలు దాదాపు ఇప్పుడు 3,000 రూపాయలు వరకు పెరిగాయి.

Hero MotoCorp అద్భుతమైన ఆఫర్స్: స్పెషల్ డిస్కౌంట్స్ కూడా..!!

అయితే గత నెలలో కంపెనీ యొక్క అమ్మకాలు తగ్గడం వల్ల ఈ నెలలో మంచి అమ్మకాలను పొందటానికి కంపెనీ ఆఫర్స్ మరియు డిస్కౌంట్స్ అందించడమే కాకుండా కొత్త వానలను కూడా మార్కెట్లో విడుదల చేసింది, కావున ఈ నెలలో కంపెనీ మంచి అమ్మకాలను సాధిస్తుందని భావిస్తున్నాము.

More from DriveSpark

Article Published On: Monday, October 18, 2021, 10:00 [IST]
English summary
Hero motocorp bike scooters festive season discount offers upto rs 12500 details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+