కనెక్టెడ్ ఫీచర్‌తో విడుదలైన సరికొత్త హీరో మాస్ట్రో ఎడ్జ్ 125 స్కూటర్‌; ధర & వివరాలు

భారత మార్కెట్లో వాహన వినియోగదారులు క్రమంగా పెరుగుతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకునే చాలా కంపెనీలు కొత్త కొత్త వాహనాలను శర వేగంగా దేశీయ మార్కెట్లో విడుదల చేస్తున్నాయి. ఇందులో భాగంగానే భారతదేశంలో అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ ఇప్పుడు తన కొత్త మాస్ట్రో ఎడ్జ్ 125 స్కూటర్‌ను విడుదల చేసింది.

కనెక్టెడ్ ఫీచర్‌తో విడుదలైన సరికొత్త మాస్ట్రో ఎడ్జ్ 125 స్కూటర్‌

కొత్త మాస్ట్రో ఎడ్జ్ 125 స్కూటర్‌ ఇప్పుడు రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. ఒకటి డ్రమ్ వేరియంట్‌, మరొకటి డిస్క్ వేరియంట్‌. ఈ కొత్త మాస్ట్రో ఎడ్జ్ 125 స్కూటర్‌ యొక్క ధరల విషయానికి వస్తే డ్రమ్ వేరియంట్‌ ధర రూ. 72,250 కాగా, డిస్క్ వేరియంట్‌ ధర 76,500 రూపాయలు. అదేవిధంగా కనెక్టెడ్ వేరియంట్‌ ధర రూ. 79,750 వరకు ఉంటుంది.

కనెక్టెడ్ ఫీచర్‌తో విడుదలైన సరికొత్త మాస్ట్రో ఎడ్జ్ 125 స్కూటర్‌

కొత్త హీరో మాస్ట్రో ఎడ్జ్ 125 స్కూటర్ లో ఫస్ట్-ఇన్-సెగ్మెంట్ ప్రొజెక్టర్ ఎల్‌ఇడి హెడ్‌ల్యాంప్స్, ఫుల్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, కాల్ అలర్ట్, టర్న్-బై-టర్న్ నావిగేషన్ సిస్టమ్ మరియు బ్లూటూత్ కనెక్టివిటీ వంటి ఫీచర్లు అందించబడ్డాయి. ఈ స్కూటర్ ఇప్పుడు కొత్త షార్ప్ హెడ్‌ల్యాంప్‌లతో చాలా స్పోర్టి డిజైన్‌లో ప్రవేశపెట్టబడింది.

కనెక్టెడ్ ఫీచర్‌తో విడుదలైన సరికొత్త మాస్ట్రో ఎడ్జ్ 125 స్కూటర్‌

స్కూటర్‌ లైన్స్ అండ్ క్రీజెస్ తో డ్యూయల్ టోన్ పెయింట్ స్కిం తో ఉంటుంది. మొత్తానికి ఈ కొత్త స్కూటర్ డిజైన్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ స్కూటర్ మునుపటికంటే కొత్త టెక్నాలజీని కలిగి ఉండి మంచి అప్డేటెడ్ ఫీచర్స్ తో అప్‌గ్రేడ్ అవుతూనే ఉంది. ఈ కారణంగా ఎక్కువ మంది కొనుగోలుదారులను ఆకర్షించడంలో విజయం సాధించింది.

కనెక్టెడ్ ఫీచర్‌తో విడుదలైన సరికొత్త మాస్ట్రో ఎడ్జ్ 125 స్కూటర్‌

హీరో మోటోకార్ప్ యొక్క కొత్త స్కూటర్స్ యొక్క కలర్స్ విషయానికి వస్తే, డిస్క్ వేరియంట్ 6 కలర్స్(కాండీ బ్లేజింగ్ రెడ్, పాంథర్ బ్లాక్, పెర్ల్ సిల్వర్ వైట్, మాట్ టెక్నో బ్లూ, ప్రిస్మాటిక్ ఎల్లో మరియు ప్రిస్మాటిక్ పర్పుల్) లో అందుబాటులో ఉండగా, డ్రమ్ వేరియంట్ 4 కలర్ (కాండీ బ్లేజింగ్ రెడ్, పాంథర్ బ్లాక్, పెర్ల్ సిల్వర్ మరియు వైట్ మాట్ టెక్నో బ్లూ) ఆప్సన్లలో వస్తుంది.

ఇక కనెక్టెడ్ వేరియంట్ కేవలం రెండు కలర్ ఆప్సన్లలో అందుబాటులో ఉంటుంది. అవి ప్రిస్మాటిక్ ఎల్లో మరియు ప్రిస్మాటిక్ పర్పుల్ కలర్స్.

కనెక్టెడ్ ఫీచర్‌తో విడుదలైన సరికొత్త మాస్ట్రో ఎడ్జ్ 125 స్కూటర్‌

ఈ సందర్భంగా హీరో మోటోకార్ప్ స్ట్రాటజీ అండ్ గ్లోబల్ ప్రొడక్ట్ ప్లానింగ్ హెడ్ మాలో లే మైసన్ మాట్లాడుతూ "125 సిసి స్కూటర్ విభాగంలో మాస్ట్రో ఎడ్జ్ 125 ప్రధాన పాత్ర పోషించింది. లేటెస్ట్ అవతార్‌లో మేము దీనిని ఎల్‌ఇడి ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లతో ప్రవేశపెట్టాము. ఇందులో డిజిటల్ స్పీడోమీటర్, టర్న్-బై ఇది ఆన్-టర్న్ నావిగేషన్ మరియు బ్లూటూత్ కనెక్టివిటీ వంటివి వాహనదారునికి చాలా అనుకూలంగా ఉంటాయి అన్నారు.

కనెక్టెడ్ ఫీచర్‌తో విడుదలైన సరికొత్త మాస్ట్రో ఎడ్జ్ 125 స్కూటర్‌

హీరో మోటోకార్ప్ సేల్స్ & ఆఫ్టర్‌సేల్స్ హెడ్ నవీన్ చౌహాన్ మాట్లాడుతూ, ఈ మధ్యకాలంలో మా స్కూటర్లకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని మేము ఈ కొత్త మాస్ట్రో ఎడ్జ్ 125 స్కూటర్ ని లేటెస్ట్ ఫీచర్స్ తో యువకులకు అనుకూలమైనవన్నీ ఇందులో అందించాన్నారు.

కనెక్టెడ్ ఫీచర్‌తో విడుదలైన సరికొత్త మాస్ట్రో ఎడ్జ్ 125 స్కూటర్‌

కొత్త హీరో మాస్ట్రో ఎడ్జ్ 125 స్కూటర్ యొక్క ఇంజిన్ విషయానికి వస్తే,ఇందులో 124.6 సిసి సింగిల్ సిలిండర్ బిఎస్ 6 ఇంజన్ ఉంటుంది. ఇది 7,000 ఆర్‌పిఎమ్ వద్ద 9 బిహెచ్‌పి పవర్ మరియు 5,500 ఆర్‌పిఎమ్ వద్ద 10.4 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది మంచి పనితీరుని కూడా అందిస్తుంది.

Most Read Articles

English summary
New Hero Maestro Edge 125 Launched In India. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X