హీరో మోటోకార్ప్ నుంచి రానున్న మరో కొత్త బైక్ టీజర్ వచ్చేసింది.. చూసారా?

భారతదేశంలో అతిపెద్ద మరియు అత్యంత ప్రసిద్ధి చెందిన ద్విచక్ర వాహన తయారీ సంస్థ 'హీరో మోటోకార్ప్'. ఈ కంపెనీ ఇటీవల తన కొత్త గ్లామర్ ఎక్స్‌టెక్ బైక్‌ను భారతీయ మార్కెట్లో విడుదల చేసింది. అయితే హీరో మోటోకార్ప్ కంపెనీ ఇప్పుడు అప్‌డేట్ చేసిన గ్లామర్ బైక్ యొక్క టీజర్ ఇమేజ్‌ను విడుదల చేసింది.

హీరో మోటోకార్ప్ నుంచి రానున్న మరో కొత్త బైక్ టీజర్ వచ్చేసింది.. చూసారా?

ఇప్పుడు కంపెనీ విడుదల చేసిన ఈ టీజర్ ఇమేజ్ ప్రకారం ఇది అప్డేట్ చేయబడిన దాని స్టాండర్డ్ బైక్ అని తెలుస్తుంది. టీజర్ ఇమేజ్‌లో దూకుడుగా కనిపించే హెచ్‌-షేప్ ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లతో ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌ను చూడవచ్చు. ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్‌లో కంపెనీ పెద్ద మార్పులు చేసినట్లు చూడవచ్చు. హెడ్‌ల్యాంప్ యూనిట్ లోని ఎల్‌ఈడీ మరియు టర్న్ ఇండికేటర్స్ హాలోజన్ యూనిట్లు.

హీరో మోటోకార్ప్ నుంచి రానున్న మరో కొత్త బైక్ టీజర్ వచ్చేసింది.. చూసారా?

కంపెనీ విడుదల చేసిన ఈ ఇమేజ్ లో సిల్హౌట్ కూడా చూడవచ్చు. ట్యాంక్ మరియు సీటు ప్రొఫైల్ కూడా అప్డేట్ చేయబడి ఉంటుంది. అయితే ఈ బైక్ కి సంభందించిన అధికారిక సమాచారం ఇంకా అందుబాటులోకి రాలేదు. కానీ కంపెనీ ఈ కొత్త హీరో గ్లామర్ బైక్ గురించిన మరింత సమాచారం త్వరలో విడుదల చేస్తుంది.

హీరో మోటోకార్ప్ నుంచి రానున్న మరో కొత్త బైక్ టీజర్ వచ్చేసింది.. చూసారా?

ఇటీవల కంపెనీ భారత మార్కెట్లో విడుదల చేసిన కొత్త హీరో గ్లామర్ ఎక్స్‌టెక్‌తో పోలిస్తే సాధారణ గ్లామర్ యొక్క అప్డేటెడ్ సంస్కరణ కొంచెం భిన్నంగా ఉంటుంది. త్వరలో రానున్న ఈ బైక్ యొక్క డిజైన్ లో మార్పు కనిపిస్తుంది. అయితే ఇది చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

హీరో మోటోకార్ప్ నుంచి రానున్న మరో కొత్త బైక్ టీజర్ వచ్చేసింది.. చూసారా?

భారత మార్కెట్లో ప్రస్తుతం ఉన్న హీరో గ్లామర్ బైక్‌ 124 సిసి సింగిల్ సిలిండర్ ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌ కలిగి ఉంటుంది. రానున్న ఈ కొత్త బైక్ లో కూడా కంపెనీ ఇదే ఇంజిన్ అమర్చే అవకాశం ఉంటుంది. కావున ఈ ఇంజన్ 7500 ఆర్‌పిఎమ్ వద్ద 10.7 బిహెచ్‌పి పవర్ మరియు 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 10.6 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడుతుంది.

హీరో మోటోకార్ప్ నుంచి రానున్న మరో కొత్త బైక్ టీజర్ వచ్చేసింది.. చూసారా?

ప్రస్తుతం మార్కెట్లో ఉన్న హీరో గ్లామర్ బైక్‌లో ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్, సెమీ డిజిటల్ ఇన్‌స్టాన్స్ క్లస్టర్ వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. ఈ హీరో గ్లామర్ బ్రాండ్ నుండి వచ్చిన ప్రముఖ ప్రీమియం ప్యాసింజర్ బైకులలో ఒకటి. ఈ బైక్ దేశీయ మార్కెట్లో హోండా షైన్ వంటి వాటికీ ప్రత్యర్థిగా ఉంటుంది.

హీరో మోటోకార్ప్ నుంచి రానున్న మరో కొత్త బైక్ టీజర్ వచ్చేసింది.. చూసారా?

ఇటీవల దేశీయ మార్కెట్లో విడుదలైన హీరో గ్లామర్ ఎక్స్‌టెక్ బైక్‌లో బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్, సైడ్-స్టాండ్ ఇంజన్ కట్-ఆఫ్‌తో ఇంటిగ్రేటెడ్ యుఎస్‌బి ఛార్జర్, బ్యాంక్ యాంగిల్ సెన్సార్ మరియు ఎల్‌ఇడి హెడ్‌ల్యాంప్ వంటి లేటెస్ట్ ఫీచర్స్ ఉన్నాయి. అంతే కాకుండా, ఇందులో కాల్ అలెర్ట్ మరియు ఎస్ఎమ్ఎస్ అలెర్ట్ వంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Saturday, July 24, 2021, 14:30 [IST]
English summary
Updated Glamour Teaser Image Reveled. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+