సెప్టెంబర్ 2021 సేల్స్ రిపోర్ట్: అమ్మకాల్లో Hero MotoCorp పరిస్థితి ఏంటి

భారతీయ మార్కెట్లో అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ Hero MotoCorp (హీరో మోటోకార్ప్) 2021 సెప్టెంబర్ నెలలో విక్రయించిన వాహనాల జాబితాకు సంబందించిన నివేదికలను విడుదల చేసింది. కంపెనీ నివేదికల ప్రకారం, సెప్టెంబర్ 2021 లో మొత్తం 5,30,346 యూనిట్ల ద్విచక్ర వాహనాలను విక్రయించినట్లు తెలిసింది.

సెప్టెంబర్ 2021 సేల్స్ రిపోర్ట్: అమ్మకాల్లో Hero MotoCorp పరిస్థితి ఏంటి

Hero MotoCorp (హీరో మోటోకార్ప్) యొక్క మొత్తం అమ్మకాలలో 5.05 లక్షలు దేశీయ మార్కెట్‌లో విక్రయించబడ్డాయి. అదే విధంగా కంపెనీ 25,000 యూనిట్ల వాహనాలను భారతదేశం నుంచి ఇతర దేశాలకు ఎగుమతి చేసినట్లు తెలిసింది.

సెప్టెంబర్ 2021 సేల్స్ రిపోర్ట్: అమ్మకాల్లో Hero MotoCorp పరిస్థితి ఏంటి

కంపెనీ యొక్క మొత్తం అమ్మకాలలో 4,89,417 యూనిట్ల మోటార్‌సైకిళ్లను విక్రయించగా, 40,929 యూనిట్ల స్కూటర్లను విక్రయించగలిగింది. ఈ అమ్మకాలు 2020 సెప్టెంబర్ నెలతో పోలిస్తే దాదాపు 25.90 శాతం తగ్గుదలను నమోదు చేసింది. ఈ సంవత్సరం సెప్టెంబర్ నెలలో దాదాపు అన్ని కంపెనీల అమ్మకాలు భారీగా తగ్గాయని నివేదికలు చెబుతున్నాయి.

సెప్టెంబర్ 2021 సేల్స్ రిపోర్ట్: అమ్మకాల్లో Hero MotoCorp పరిస్థితి ఏంటి
Hero MotoCorp

Sep-21 Sep-20 Growth (%)
Motorcycles 4,89,417 6,60,948 -25.95
Scooters 40,929 54,770 -25.27
Domestic 5,05,462 6,97,293 -27.51
Exports 24,884 18,425 35.06
Total 5,30,346 7,15,718 -25.90
Hero MotoCorp YTD FY22 YTD FY21 Growth (%)
Motorcycles 22,93,741 22,07,055 3.93
Scooters 1,69,389 1,70,896 -0.88
Domestic 23,06,514 23,11,254 -0.21
Exports 1,56,616 66,697 134.82
Total 24,63,130 23,77,951 3.58
సెప్టెంబర్ 2021 సేల్స్ రిపోర్ట్: అమ్మకాల్లో Hero MotoCorp పరిస్థితి ఏంటి

Hero MotoCorp (హీరో మోటోకార్ప్) గత సంవత్సరం సెప్టెంబర్‌లో మొత్తం 7,15,718 యూనిట్ల ద్విచక్ర వాహనాలను విక్రయించింది, ఈ సంవత్సరం మునుపటికంటే కూడా 1,85,372 యూనిట్ల తక్కువ వాహనాలను విక్రయించింది. దీన్ని బట్టి చూస్తే, గత ఏడాది సెప్టెంబర్ నెలతో పోలిస్తే, ఈ ఏడాది కంపెనీ దేశీయ అమ్మకాలలో 27.51 శాతం తగ్గుదలను నమోదు చేసింది.

సెప్టెంబర్ 2021 సేల్స్ రిపోర్ట్: అమ్మకాల్లో Hero MotoCorp పరిస్థితి ఏంటి

కంపెనీ యొక్క ఎగుమతుల విషయంలో మాత్రం, గత సంవత్సరం కంటే కూడా ఈ ఏడాది 35.06 శాతం వృద్ధిని నమోదు చేయగలిగింది. గత ఏడాది సెప్టెంబర్‌లో, కంపెనీ దేశీయ మార్కెట్‌లో మొత్తం 6,97,293 యూనిట్ల వాహనాలను విక్రయించగా, సెప్టెంబర్ 2020 లో కంపెనీ 18,425 యూనిట్ల వాహనాలను విదేశాలకు ఎగుమతి చేసింది.

సెప్టెంబర్ 2021 సేల్స్ రిపోర్ట్: అమ్మకాల్లో Hero MotoCorp పరిస్థితి ఏంటి

ఈ సంవత్సరం కంపెనీ మొత్తం 4,89,417 యూనిట్ల మోటార్‌సైకిళ్లను విక్రయించినట్లు నివేదికలు చెబుతున్నాయి. గత సంవత్సరం సెప్టెంబర్ నెలలో, కంపెనీ మొత్తం 6,60,948 యూనిట్ల మోటార్‌సైకిళ్లను విక్రయించింది. కావున మోటార్ సైకిళ్ల అమ్మకాలు ఈ సంవత్సరం 25.95 శాతం క్షీణతను నమోదు చేసింది.

సెప్టెంబర్ 2021 సేల్స్ రిపోర్ట్: అమ్మకాల్లో Hero MotoCorp పరిస్థితి ఏంటి

ఇక కంపెనీ యొక్క స్కూటర్ అమ్మకాలను పరిశీలిస్తే, ఈ సెప్టెంబర్ 2021 లో, కంపెనీ మొత్తం 40,929 స్కూటర్లను విక్రయించగా, గత సంవత్సరం సెప్టెంబర్ నెలలో, కంపెనీ మొత్తం 54,770 యూనిట్ల స్కూటర్లను విక్రయించింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో స్కూటర్ల అమ్మకాల్లో మొత్తం 25.27 శాతం తగ్గాయి.

సెప్టెంబర్ 2021 సేల్స్ రిపోర్ట్: అమ్మకాల్లో Hero MotoCorp పరిస్థితి ఏంటి

Hero MotoCorp (హీరో మోటోకార్ప్) యొక్క నెలవారీ అమ్మకాల విషయానికి వస్తే, 2021 ఆగష్టు నెలతో పోలిస్తే 2021 సెప్టెంబర్ నెలలో కంపెనీ అమ్మకాలు 16.58 శాతం పెరిగాయి. ఆగస్టు 2021 లో కంపెనీ మొత్తం 4,53,879 యూనిట్ల వాహనాలను విక్రయించింది. ఇందులో మోటార్ సైకిళ్లు మరియు స్కూటర్లతో సహా దేశీయ మార్కెట్లో విక్రయించిన వాహనాలు మరియు భారత మార్కెట్ నుంచి విదేశాలకు ఎగుమతి అయిన వాహనాలు ఉన్నాయి.

సెప్టెంబర్ 2021 సేల్స్ రిపోర్ట్: అమ్మకాల్లో Hero MotoCorp పరిస్థితి ఏంటి

భారతీయ మార్కెట్లో వాహన అమ్మకాలు మునుపటికంటే కూడా సెప్టెంబర్ నెలలో చాలా వరకు తగ్గాయి. దీనికి ప్రధాన కారణం కరోనా అధికంగా వ్యాపించడమే. కరోనా మహమ్మారి ఆటో పరిశ్రమలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపింది. ఆ ప్రభావం గత నెల వరకు ఉంది. అయితే ప్రస్తుతం భారత దేశంలో పండుగ సీజన్ ప్రారంభమయ్యింది, కావున వాహనాల అమ్మకాలు క్రమంగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

సెప్టెంబర్ 2021 సేల్స్ రిపోర్ట్: అమ్మకాల్లో Hero MotoCorp పరిస్థితి ఏంటి

ఈ పండుగ సీజన్లో మంచి అమ్మకాలు చేపట్టడానికి కంపెనీలు తగిన ప్రయత్నాలు చేస్తున్నాయి. త్వరలో రానున్న దుర్గాష్టమి (దసరా) మరియు దీపావళి సమయంలో ఎక్కువమంది కొనుగోలుదారులు కొత్త వాహనాలను కొనుగోలు చేయటానికి ఆసక్తి చూపుతారు, కావున వాహన అమ్మకాలు ఖచ్చితంగా పెరుగుతాయని కంపెనీలు భావిస్తున్నాయి.

Most Read Articles

English summary
Hero motocorp sales september 530346 units details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X