గ్రేట్ న్యూస్..'గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌' సాధించిన Hero MotoCorp

దేశీయ మార్కెట్లో ప్రముఖ వాహన తయారీ సంస్థగా కీర్తి గడించిన Hero MotoCorp (హీరో మోటోకార్ప్) మార్కెట్లో అద్భుతమైన ఉత్పత్తులను ప్రవేశపెట్టడమే కాకుండా వాహన వినియోగదారుల సౌకర్యార్థం అద్భుతమైన సర్వీస్ కూడా అందిస్తుంది. భారతీయ మార్కెట్లో Hero MotoCorp వినియోగదారుల నమ్మకానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. అంతే కాకుండా కంపెనీ ఇటీవల 'గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌'లో స్థానం సంపాదించుకుంది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

గ్రేట్ న్యూస్.. 'గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌' సాధించిన Hero Motocorp

'గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌'లో స్థానం సంపాదించడం అనేది ఆషా మాషి విషయం కాదని, అందరికి తెలిసిన విషయమే. ఇటీవల కంపెనీ 'అతి పెద్ద ఆన్‌లైన్ ఫోటో ఆల్బమ్ ఆఫ్ పీపుల్ ప్లాంటింగ్ ప్లాంట్స్' ఫోటో ఆల్బమ్ ను రూపొందించింది. 'హీరో గ్రీన్ డ్రైవ్' లో భాగంగా కంపెనీ చేసిన ఈ అతిపెద్ద ఆల్బమ్ కి గాను ఈ అద్భుతమైన రికార్డ్ కైవసం చేసుకుంది.

గ్రేట్ న్యూస్.. 'గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌' సాధించిన Hero Motocorp

కంపెనీ రూపొందించిన ఈ ఆల్బమ్ లో మొక్కలు నాటిన మొత్తం 1,32,775 ఫోటోలను కంపెనీ ఆల్బమ్‌లో చేర్చబడ్డాయి. ఇది నిజంగా చాలా హర్షించదగ్గ విషయం. World Nature Conservation Day సందర్భంగా 2021 సెప్టెంబర్ 21 న ఈ రికార్డ్ సృష్టించింది.

గ్రేట్ న్యూస్.. 'గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌' సాధించిన Hero Motocorp

అంతే కాకుండా కంపెనీ 2021 జనవరి 21 నాటికి కంపెనీ ఉత్పత్తిలో 100 మిలియన్ వాహనాలు చేరడం అనేది మరొక అద్భుతమైన విజయం. కంపెనీ దీని గురించి కూడా ప్రస్తావించింది. దీన్ని బట్టి చూస్తే మార్కెట్లో కంపెనీ యొక్క వాహనాలకు ఏ విధమైన డిమాండ్ ఉందొ అర్థం చేసుకోవచ్చు.

గ్రేట్ న్యూస్.. 'గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌' సాధించిన Hero Motocorp

ఈ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌ కోసం 'అతిపెద్ద ఫోటో ఆల్బమ్ ఆఫ్ ప్లాంటర్స్' ప్రయత్నం కోసం కంపెనీ ప్రకటించింది. దీని కోసం భారతదేశం మరియు కంపెనీ గ్లోబల్ మార్కెట్‌ల నుండి ఉద్యోగులు, వాటాదారులు మరియు ప్రజలతో సహా అనేక మంది పాల్గొని, హీరోగ్రీన్ డ్రైవ్ కింద కంపెనీ ప్లాంట్‌లో మొక్కలు నాటారు, వీటి సంబంధించిన ఫోటోలు అప్‌లోడ్ చేసి ఒక ఆల్బమ్ తయారుచేయబడింది. దీని ద్వారా కంపెనీ ఈ అరుదైన రికార్డ్ కైవసం చేసుకుంది.

గ్రేట్ న్యూస్.. 'గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌' సాధించిన Hero Motocorp

Hero MotoCorp కంపెనీ 2021 ఆగష్టు నెలలో 'అతిపెద్ద మోటార్‌సైకిల్ లోగో' సృష్టించినందుకు కూడా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ద్వారా గుర్తింపు పొందగలిగింది. ఆ తరువాత 'అతిపెద్ద ఆన్‌లైన్ ఫోటో ఆల్బమ్ ఆఫ్ పీపుల్' ద్వారా రెండవ ప్రపంచ రికార్డును సాధించగలిగింది.

గ్రేట్ న్యూస్.. 'గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌' సాధించిన Hero Motocorp

ఇటీవల Hero MotoCorp కంపెనీ ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరులోని కంపెనీ తయారీ యూనిట్‌లో 1,845 యూనిట్ల హీరో స్ప్లెండర్ ప్లస్ బైకులతో హీరో లోగో సృష్టించింది. కంపెనీ సృష్టించిన ఈ ఘనత గురించి హీరో మోటోకార్ప్ గ్లోబల్ ప్రొడక్ట్ ప్లానింగ్ అండ్ స్ట్రాటజీ హెడ్ 'మాలో లే మాసన్' తెలియజేశారు.

గ్రేట్ న్యూస్.. 'గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌' సాధించిన Hero Motocorp

Hero MotoCorp కంపెనీ దేశీయ మార్కెట్లో ఒకప్పటినుంచి కూడా మంచి ప్రజాదరణతో ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగానే 2021 సంవత్సరంలో కూడా చాలా ఉత్సాహంతో ముందుకు సాగింది. కంపెనీ ఇప్పటికే 100 మిలియన్ అమ్మకాలను సాధించగలిగింది. అంతే కాకుండా కంపెనీ కేవలం ఒకే రోజులో లక్ష యూనిట్లను విక్రయించి ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది.

గ్రేట్ న్యూస్.. 'గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌' సాధించిన Hero Motocorp

కంపెనీ కైవసం చేసుకున్న గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌ కి సంబందించిన ఆల్బమ్ లో 1,37,775 మొక్కలు నాటిన చిత్రాలు ఉన్నాయి. అయితే కరోనా అధికంగా ఉన్న ఈ సమయంలో అందరూ కూడా కఠినమైన కోవిడ్ నిబంధనలు పాటించబడినట్లు కూడా తెలిసింది. ఏది ఏమైనా కంపెని ఖాతాలో మరో అరుదైన రికార్డ్ ఇది.

గ్రేట్ న్యూస్.. 'గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌' సాధించిన Hero Motocorp

Hero MotoCorp కంపెనీ ఇటీవల తమ ఉత్పత్తులపైన రూ. 3,000 పెంచనున్నట్లు ప్రకటించింది. ఈ ధరలు సెప్టెంబర్ 20 అమల్లో ఉన్నాయి. ప్రస్తుతం ధరల పెరుగుదలకు ప్రధాన కారణం కంపెనీ యొక్క నిర్మాణ వ్యయం పెరగడమే అని కూడా కంపెనీ తెలిపింది.

గ్రేట్ న్యూస్.. 'గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌' సాధించిన Hero Motocorp

Hero MotoCorp కంపెనీ యొక్క గత నెల అమ్మకాలను పరిశీలిస్తే, 2021 ఆగస్టు నెలలో దాదాపు 22 శాతం తగ్గుదలను చేసినట్లు కంపెనీ నివేదికల ద్వారా తెలిసింది. అమ్మకాల తగ్గుదలకు కరోనా మహమ్మారీ ప్రధాన కారణం. కరోనా వల్ల దాదాపు అన్ని కంపెనీలు తగ్గుదలను నమోదు చేశాయి. అయితే Hero MotoCorp అమ్మకాలు రానున్న పండుగ సీజన్ లో మెరుగ్గా ఉండే అవకాశం ఉంటుంది. అయితే దీనిపైన ఈ ధరల పెరుగుదల ఏమైనా ప్రభావం చూపిస్తుందా అనేది త్వరలో తెలుస్తుంది.

Most Read Articles

English summary
Hero motocorp set new unique guinness world record details
--<
-->
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X