అమ్మకాల్లో రికార్డ్ బద్దలుకొట్టిన హీరో మోటోకార్ప్; ఒకేరోజు లక్షకుపైగా..

భారతదేశంలో ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ అత్యంత ప్రజాదరణ పొందిన సంస్థల్లో ఒకటి. హీరో మోటోకార్ప్ కంపెనీ యొక్క స్కూటర్ మరియు మోటార్స్ సైకిల్స్ ఎక్కువ మంది కస్టమర్లు కొనుగోలు చేస్తుంటారు. ఈ కారణంగా హీరో మోటోకార్ప్ కంపెనీ మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది. అయితే కంపెనీ ఇటీవల అందించిన సమాచారం ప్రకారం కేవలం ఒక్క రోజులోనే అత్యధికంగా లక్షకుపైగా మోటార్ సైకిళ్లు మరియు స్కూటర్లను విక్రయించి రికార్డు సృష్టించింది.

అమ్మకాల్లో రికార్డ్ బద్దలుకొట్టిన హీరో మోటోకార్ప్; ఒకేరోజు లక్షకుపైగా..

హీరో మోటోకార్ప్ 2021 ఆగస్టు 9 న విక్రయించిన ద్విచక్ర వాహనాల సమాచారాన్ని అధికారికంగా ప్రకటించే సందర్భంలో ఒకేరోజు లక్షకు పైగా బైకులు మరియు స్కూటర్ల అమ్మకాలు నమోదయ్యాయని తెలిపింది. కంపెనీ ఎంట్రీ, డీలక్స్ మరియు ప్రీమియం టూవీలర్ విభాగాలలో వాహనాలకు డిమాండ్ పెరిగిందని వాహన తయారీదారు చెప్పారు.

అమ్మకాల్లో రికార్డ్ బద్దలుకొట్టిన హీరో మోటోకార్ప్; ఒకేరోజు లక్షకుపైగా..

కంపెనీలో ఇదివరకే అందుబాటులో ఉన్న బైకులకంటే కూడా, ఇటీవల విడుదల చేసిన గ్లామర్ ఎక్స్‌టెక్, స్ప్లెండర్ మ్యాట్ షీల్డ్ గోల్డ్ మరియు ఎక్స్‌ట్రీమ్ 160 ఆర్ వంటివి ఈ అమ్మకాలకు చాలా సహకరించినట్లు తెలిపింది. ఇవి మాత్రమే కాకూండా కంపనీలో ప్రస్తుతం ప్రజాదరణ పొందుతున్న మోడల్స్ అయిన మాస్ట్రో ఎడ్జ్ 125, హీరో డెస్టినీ మరియు ప్లెజర్ 110 కూడా ఎక్కువ విక్రయించబడినట్లు కంపెనీ చెప్పుకొచ్చింది.

అమ్మకాల్లో రికార్డ్ బద్దలుకొట్టిన హీరో మోటోకార్ప్; ఒకేరోజు లక్షకుపైగా..

హీరో మోటోకార్ప్ కంపెనీ తన భాగస్వామి అయిన హోండా మోటార్‌సైకిల్స్ నుండి విడిపోయిన తర్వాత ఈ సంవత్సరం 10 వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. ఇక పండుగల సీజన్ రాబోతోంది. ఈ సమయంలో ఎక్కువమంది ప్రజలు కొత్త వాహనాలను కొనుగోలుచేయడానికి చాలా ఆసక్తి చూపుతారు. ఈ సందర్భంగా కంపెనీ గొప్ప ఆఫర్స్ కూడా అందించే అవకాశం ఉంటుంది.

అమ్మకాల్లో రికార్డ్ బద్దలుకొట్టిన హీరో మోటోకార్ప్; ఒకేరోజు లక్షకుపైగా..

భారతదేశంలో అధికంగా వ్యాపించిన కరోనా సమయంలో కరోనా లాక్ డౌన్ విధించబడింది. ఈ కరోనా మహమ్మారి యొక్క రెండవ వేవ్ కారణంగా భారతదేశంలో వాహన మార్కెట్ వృద్ధి దాదాపు కనిష్ఠానికి చేరుకుంది. ఇది వాహన తయారీదారులకు అమ్మకందారులకు తీవ్ర నష్టాన్ని కలిగించింది. అయితే ఇప్పుడిప్పుడే అమ్మకాలు పెరుగుతున్నాయి మరియు వాహన మార్కెట్ కూడా మళ్ళీ యధా స్థానానికి చేరుకుంటుంది.

అమ్మకాల్లో రికార్డ్ బద్దలుకొట్టిన హీరో మోటోకార్ప్; ఒకేరోజు లక్షకుపైగా..

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ భారీగా పెరుగుతోంది. ఈ క్రమంలో చాలా కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను దేశీయ మార్కెట్లో విడుదల చేస్తున్నారు, మరియు విడుదల చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తున్నారు. ఈ తరుణంలోనే హీరో మోటోకార్ప్ కంపెనీ కూడా త్వరలో తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది.

అమ్మకాల్లో రికార్డ్ బద్దలుకొట్టిన హీరో మోటోకార్ప్; ఒకేరోజు లక్షకుపైగా..

హీరో మోటోకార్ప్ కంపెనీ ఛైర్మన్ పవన్ ముంజల్ గత వారం హీరో మోటోకార్ప్ యొక్క 10 వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఆవిష్కరించారు. పవన్ ముంజల్ స్కూటర్ యొక్క ఫీచర్స్ మరియు పరికరాలను వెల్లడించలేదు, అంతే కాకుండా ధర కూడా ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే త్వరలో స్కూటర్‌ని ప్రారంభిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

అమ్మకాల్లో రికార్డ్ బద్దలుకొట్టిన హీరో మోటోకార్ప్; ఒకేరోజు లక్షకుపైగా..

హీరో మోటోకార్ప్ కంపెనీ ఈ సంవత్సరం ఏప్రిల్‌లో, తైవానీస్ కంపెనీ అయిన గొగోరోతో భాగస్వామ్యం కోసం ఒక ఒప్పందంపై సంతకం చేసిందనే విషయం అందరికి తెలిసిందే. అయితే, ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం కంపెనీ ఈ భాగస్వామ్యాన్ని చేయలేదు. మీడియా నివేదికల ప్రకారం, ఈ స్కూటర్ ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో దేశీయ మార్కెట్లో విడుదల చేసే అవకాశం ఉంటుంది.

అమ్మకాల్లో రికార్డ్ బద్దలుకొట్టిన హీరో మోటోకార్ప్; ఒకేరోజు లక్షకుపైగా..

హీరో మోటోకార్ప్ భారతదేశ ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమలో అధికారికంగా ప్రవేశించనప్పటికీ, హీరో ఎలక్ట్రిక్ భారతదేశంలో ఒక సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకోగలదు. అయితే ఎలక్ట్రిక్ వాహనాల కోసం 'హీరో' బ్రాండ్‌ని ఉపయోగించడం గురించి కంపెనీల మధ్య కొంత వివాదం ఉంది.

అమ్మకాల్లో రికార్డ్ బద్దలుకొట్టిన హీరో మోటోకార్ప్; ఒకేరోజు లక్షకుపైగా..

దేశీయ మార్కెట్లో హీరో మోటోకార్ప్ ఎలక్ట్రిక్ వాహనాలను ఇడుదల చేసినట్లయితే, ఎక్కువమంది కొనుగోలుదారులను ఆకర్శించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కంపెనీ యొక్క నిర్మాణం మరియు నాణ్యతపై కస్టమర్లకు ఎక్కువ నమ్మకం ఉంది.

అమ్మకాల్లో రికార్డ్ బద్దలుకొట్టిన హీరో మోటోకార్ప్; ఒకేరోజు లక్షకుపైగా..

ప్రస్తుతం ప్రపంచహా మార్కెట్లో కూడా ఎక్కువ ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ ఉంది. దీనికి ప్రధాన కారణం అభ్భివృద్ది కావచ్చు. లేకుంటే రోజురోజుకి అధికంగా పెరుగుతున్న ఇంధన ధరలు కూడా కావచ్చు. పెరుగుతున్న ఇంధన ధరలు సామాన్య మానవుడిపై ఎక్కువ భారాన్ని మోపుతున్నాయి. ఈ కారణంగానే ఎక్కువమంది ద్రుష్టి ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలపైకి మళ్లింది. కావున రాబోయే కాలంలో కూడా ఎక్కువ సంఖ్యలో ఎలక్ట్రిక్ వాహనాలు ఉత్పత్తి మరియి విక్రయాలు పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

Most Read Articles

English summary
Hero motocorp sold more than 1 lakh two wheelers in a single day details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X