Hero Xtreme 160R స్టీల్త్ ఎడిషన్ టీజర్ లాంచ్; త్వరలోనే విడుదల!

భారతదేశపు అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ (Hero MotoCorp) దేశీయ విపణిలో విక్రయిస్తున్న ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ (Hero Xtreme 160R) లో కంపెనీ ఓ కొత్త స్పెషల్ ఎడిషన్ ను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. స్టీల్త్ ఎడిషన్ (Stealth Edition) పేరుతో కంపెనీ ఈ కొత్త మోడల్ ను పరిచయం చేసే అవకాశం ఉంది.

Hero Xtreme 160R స్టీల్త్ ఎడిషన్ టీజర్ లాంచ్; త్వరలోనే విడుదల!

ఈ మేరకు హీరో మోటోకార్ప్ తమ సోషల్ మీడియా హ్యాండిల్ లో కొత్త హీరో ఎక్‌ట్రీమ్ 160ఆర్ స్టీల్త్ ఎడిషన్ (Hero Xtreme 160R Stealth Edition) యొక్క అఫీషియల్ టీజర్ ను కూడా విడుదల చేసింది. ఈ టీజర్ లో కంపెనీ "స్టీల్త్ మోడ్, త్వరలో వస్తుంది" అని పేర్కొని, "గో బూమ్ ఇన్ స్టీల్త్ మోడ్" అనే హ్యాష్ ట్యాగ్ తో టీజ్ చేసింది.

Hero Xtreme 160R స్టీల్త్ ఎడిషన్ టీజర్ లాంచ్; త్వరలోనే విడుదల!

ఇది బహుశా ఇటీవల ఇంటర్నెట్‌లో లీక్ అయిన కొత్త హీరో ఎక్స్‌ట్రీమ్ 160R స్టీల్త్ ఎడిషన్ కావచ్చని తెలుస్తోంది. ఈ టీజర్ ఫొటోలో ప్రధానంగా బైక్ యొక్క ఫ్రంట్ హెడ్‌లైట్ భాగాన్ని హైలైట్ చేశారు. ఇది చూడటానికి మనిషి ముఖం లేదా పుర్రె మాదిరిగా తెలుస్తుంది. మెయిన్ హెడ్‌ల్యాంప్ కి ఇరువైపులా కళ్ల మాదిరిగా ఉండే రెండు ఎల్ఈడి పైలట్ లైట్లు ఉంటాయి. ఇవి డేటైమ్ రన్నింగ్ లైట్ల మాదిరిగా పనిచేస్తాయి.

Hero Xtreme 160R స్టీల్త్ ఎడిషన్ టీజర్ లాంచ్; త్వరలోనే విడుదల!

ఇందులోని హెడ్‌ల్యాంప్ మరియు ఫ్రంట్ డిజైన్ స్టాండర్డ్ ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ మాదిరిగానే ఉంటుంది. ఇందులోని ఫ్యూయెల్ ట్యాంక్ కవర్స్ ని గమనించినట్లయితే, ఇది డార్క్ మ్యాట్ కలర్ ఆప్షన్‌ తో వస్తుందని తెలుస్తోంది. కొత్త హీరో ఎక్స్‌ట్రీమ్ 160R స్టీల్త్ ఎడిషన్ కొత్త ఫీచర్ అప్‌డేట్‌లతో పాటు అప్‌డేట్ చేయబడిన బ్యాడ్జ్‌లను అందుకుంటుందని సమాచారం.

Hero Xtreme 160R స్టీల్త్ ఎడిషన్ టీజర్ లాంచ్; త్వరలోనే విడుదల!

అంతేకాకుండా, ఈ మోటార్‌సైకిల్ కూడా కంపెనీ యొక్క లేటెస్ట్ బ్లూటూత్ కనెక్టివిటీ టెక్నాలజీని పొందుతుందని భావిస్తున్నారు. ఇది టర్న్-బై-టర్న్ నావిగేషన్‌తో పాటు కాల్ మరియు ఎస్ఎమ్ఎస్ అలెర్ట్ వంటి ఫీచర్‌ లను అందిస్తుంది. కార్లు మరియు ద్విచక్ర వాహనాల ఎక్కువగా అమ్ముడయ్యే ప్రస్తుత పండుగ సీజన్ కంపెనీ ఈ కొత్త హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ స్టీల్త్ ఎడిషన్ ను విడుదల చేసే అవకాశం ఉంది.

Hero Xtreme 160R స్టీల్త్ ఎడిషన్ టీజర్ లాంచ్; త్వరలోనే విడుదల!

కొత్త హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ స్టీల్త్ ఎడిషన్ కేవలం కాస్మెటిక్ మరియు ఫీచర్ అప్‌గ్రేడ్స్ మినహా యాంత్రికంగా ఎలాంటి మార్పులు ఉండబోవని తెలుస్తోంది. ఇందులోని అదే పాత 163 సిసి సింగిల్ సిలిండర్ ట్విన్-వాల్వ్ ఇంజన్ ను ఉపయోగించనున్నారు. ఈ ఇంజన్ 8,500 ఆర్‌పిఎమ్ వద్ద 15 బిహెచ్‌పి శక్తిని మరియు 6,500 ఆర్‌పిఎమ్ వద్ద 14 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.

Hero Xtreme 160R స్టీల్త్ ఎడిషన్ టీజర్ లాంచ్; త్వరలోనే విడుదల!

ఈ మోటార్‌సైకిల్ మొత్తం బరువు 139.5 కిలోలుగా ఉండి, ఇది ఎక్స్‌ట్రీమ్ 160ఆర్‌కు అద్భుతమైన పవర్ టు వెయిట్ రేషియోని అందిస్తుంది. ఈ బైక్ కేవలం 4.7 సెకన్లలో గంటకు 0 నుండి 60 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది. ఈ కొత్త మోటార్‌సైకిల్ ప్రామాణిక స్టార్టర్ మోటార్‌తో పాటు కిక్-స్టార్టర్‌ని కూడా కలిగి ఉండే అవకాశం ఉంది.

Hero Xtreme 160R స్టీల్త్ ఎడిషన్ టీజర్ లాంచ్; త్వరలోనే విడుదల!

కొత్త Hero Xpulse 200 4V విడుదల..

హీరో మోటోకార్ప్ బ్రాండ్ కి సంబంధించిన ఇటీవలి వార్తలను గమనిస్తే, కంపెనీ తాజాగా తమ సరికొత్త హీరో ఎక్స్‌పల్స్ 200 4వి (Hero Xpulse 200 4V) ఆఫ్-రోడ్ అడ్వెంచర్ మోటార్‌సైకిల్ ను మార్కెట్లో విడుదల చేసింది. దేశీయ విపణిలో ఈ కొత్త బైక్ ధర రూ. 1.28 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా నిర్ణయించబడింది. ఈ కొత్త బైక్ దాని మునుపటి తరం మోడళ్ల డిజైన్ మరియు ఫీచర్ల పరంగా చాలా మెరుగ్గా ఉంటుంది.

Hero Xtreme 160R స్టీల్త్ ఎడిషన్ టీజర్ లాంచ్; త్వరలోనే విడుదల!

ఈ కొత్త మోడల్‌ లో కంపెనీ ఇదివరకు అందించిన డ్యూయల్ వాల్వ్ లేఅవుట్‌కు బదులుగా ఫోర్ వాల్వ్ సెటప్‌ను జోడించింది. అదనంగా, ఈ వాహనం బిఎస్6 కంప్లైంట్ 200 సిసి ఫోర్-వాల్వ్ ఆయిల్ కూల్డ్ ఇంజన్‌ తో పనిచేస్తుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 8,500 ఆర్‌పిఎమ్ వద్ద 18.8 బిహెచ్‌పి శక్తిని మరియు 6,500 ఆర్‌పిఎమ్ వద్ద 17.35 ఎన్ఎమ్ టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది.

Hero Xtreme 160R స్టీల్త్ ఎడిషన్ టీజర్ లాంచ్; త్వరలోనే విడుదల!

గతంలో ఆఫర్ చేసిన 2-వాల్వ్ ఇంజన్ సెటప్ విషయానికి వస్తే, ఆ ఇంజన్ 18.1 బిహెచ్‌పి పవర్ ను మరియు 16.45 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ ను ఉత్పత్తి చేసేది. ఫోర్-వాల్వ్ సెటప్ కారణంగా, కొత్త ఇంజన్ మునుపటి కన్నా మెరుగైన పవర్, టార్క్ లను జనరేట్ చేస్తుంది. అంతేకాకుండా, ఈ కొత్త మోడల్ ఇప్పుడు అప్‌డేట్ చేయబడిన స్విచ్ గేర్ ని కూడా కలిగి ఉంటుంది.

Hero Xtreme 160R స్టీల్త్ ఎడిషన్ టీజర్ లాంచ్; త్వరలోనే విడుదల!

అలాగే, ఇందులో Xtreme 160R మోడల్ లో ఆఫర్ చేసినట్లుగా ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ మరియు కిల్ స్విచ్‌ను కూడా పొందుతుంది. ఈ కొత్త బైక్ లో స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ కోసం డిజిటల్ డిస్‌ప్లే యూనిట్ కూడా ఉంటుంది. ఇది టర్న్-బై-టర్న్ నావిగేషన్, గేర్ పొజిషన్ ఇండికేటర్, కాల్ / ఎస్ఎమ్ఎస్ అలెర్ట్ వంటి ఫీచర్లను సపోర్ట్ చేస్తుంది.

Most Read Articles

English summary
Hero motocorp teases xtreme 160r stealth edition launch expected soon details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X