బ్రేకింగ్ న్యూస్.. సెప్టెంబర్ 20 నుంచి రూ. 3,000 పెరగనున్న Hero MotoCorp ధరలు

భారతీయ మార్కెట్లో పేరు మోసిన ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ Hero MotoCorp (హీరో మోటోకార్ప్) ఇప్పుడు మరోసారి తన వాహనాల ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. కంపెనీ నివేదికల ప్రకారం, సెప్టెంబర్ 20 నుండి అన్ని బైక్స్ మరియు స్కూటర్ మోడళ్ల ధరలను పెంచుతున్నట్లు తెలిపింది. దీని గురించి పూర్తి సమాచారం ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

బ్రేకింగ్ న్యూస్.. సెప్టెంబర్ 20 నుంచి రూ. 3,000 పెరగనున్న Hero MotoCorp ధరలు

Hero MotoCorp ఇప్పుడు రూ. 3,000 పెంచనున్నట్లు తెలిపింది. అయితే ఏ మోడల్ పై ఎంత అనేది ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. కంపెనీ దీనికి సంబంధించిన (మోడల్ మరియు వేరియంట్ వారీ ధరలు) సమాచారం త్వరలో వెల్లడిస్తుంది. ప్రస్తుతం ధరల పెరుగుదలకు ప్రధాన కారణం కంపెనీ యొక్క నిర్మాణ వ్యయం పెరగడమే అని కూడా కంపెనీ తెలిపింది.

బ్రేకింగ్ న్యూస్.. సెప్టెంబర్ 20 నుంచి రూ. 3,000 పెరగనున్న Hero MotoCorp ధరలు

Hero MotoCorp కంపెనీ యొక్క గత నెల అమ్మకాలను పరిశీలిస్తే, 2021 ఆగస్టు నెలలో దాదాపు 22 శాతం తగ్గుదలను చేసినట్లు కంపెనీ నివేదికల ద్వారా తెలిసింది. అమ్మకాల తగ్గుదలకు కరోనా మహమ్మారీ ప్రధాన కారణం. కరోనా వల్ల దాదాపు అన్ని కంపెనీలు తగ్గుదలను నమోదు చేశాయి. అయితే Hero MotoCorp అమ్మకాలు రానున్న పండుగ సీజన్ లో మెరుగ్గా ఉండే అవకాశం ఉంటుంది.

బ్రేకింగ్ న్యూస్.. సెప్టెంబర్ 20 నుంచి రూ. 3,000 పెరగనున్న Hero MotoCorp ధరలు

భారతీయ మార్కెట్లో ఇప్పటికే చాలా కంపెనీలు తమ వాహనాల ధరలను పెంచిన విషయం దాదాపు తెలిసిన విషయమే, ఇన్‌పుట్ ధరలలో స్థిరమైన పెరుగుదల వాహన ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని కంపెనీలు తెలిపాయి. ముడి సరుకుల ధరలు అమాంతం పెరగటం వల్ల కంపెనీలు ఈ నిర్ణయాలు తీసుకోవలసి వస్తోంది. ధరల పెరుగుదల ప్రకటించిన కంపెనీలలో ప్యాసింజర్ వెహికల్ తయారీదారులు మరియు టూ వీలర్ తయారీదారులు ఉన్నారు.

బ్రేకింగ్ న్యూస్.. సెప్టెంబర్ 20 నుంచి రూ. 3,000 పెరగనున్న Hero MotoCorp ధరలు

భారతీయ మార్కెట్లో ఆటో పరిశ్రమను కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా ప్రభావితం చేసినప్పటికీ, ఇప్పుడిప్పుడే మెల్ల మెల్లగా కోలుకుంటున్నాయి. అయితే ఇక రానున్న పండుగ సీజన్ ఆటో పరిశ్రమకు చాలా అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నాము.

బ్రేకింగ్ న్యూస్.. సెప్టెంబర్ 20 నుంచి రూ. 3,000 పెరగనున్న Hero MotoCorp ధరలు

ఇదిలా ఉండగా ప్రస్తుతం కంపెనీలు ఎక్కువ సంఖ్యలో వాహనాలను తయారు చేయలేకపోతున్నాయి. దీనికి ప్రధాన కారణం ఆటోమొబైల్ పరిశ్రమలో సెమీకండక్టర్ చిప్స్ కొరత. ఇది నిజంగా కంపెనీలకు చాలా సవాలుగా మారింది. సెమీకండక్టర్ చిప్స్ అవసరమైనన్ని అందుబాటులో లేకపోతే వాహనాల ఉత్పత్తి కూడా బాగా తగ్గుతుంది.

బ్రేకింగ్ న్యూస్.. సెప్టెంబర్ 20 నుంచి రూ. 3,000 పెరగనున్న Hero MotoCorp ధరలు

ప్రస్తుతం దేశీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు మంచి డిమాండ్ ఉంది, ఈ కారణంగానే ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ రోజురోజుకి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో భాగంగానే హీరో మోటోకార్ప్ ఎలక్ట్రిక్ వాహన తయారీకి శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తుంది.

బ్రేకింగ్ న్యూస్.. సెప్టెంబర్ 20 నుంచి రూ. 3,000 పెరగనున్న Hero MotoCorp ధరలు

Hero MotoCorp కంపెనీ ఛైర్మన్ Pawan Munjal (పవన్ ముంజల్) ఇటీవలే కంపెనీ పదవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని తొలి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఆవిష్కరించారు. దీన్ని బట్టి చూస్తే, ఎలక్ట్రిక్ స్కూటర్‌ తయారీపై కంపెనీ పనిచేస్తోందని, కావున ఇది త్వరలో విడుదలయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.

బ్రేకింగ్ న్యూస్.. సెప్టెంబర్ 20 నుంచి రూ. 3,000 పెరగనున్న Hero MotoCorp ధరలు

Hero MotoCorp ఈ సంవత్సరం ఏప్రిల్‌లో, గోగోరోతో బ్యాటరీ మార్పిడి మరియు టెక్నికల్ ఫీచర్స్ కోసం భాగస్వామ్యం కుదుర్చుకుంది. కానీ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం కంపెనీ ఈ భాగస్వామ్యాన్ని చేయలేదు. ఈ స్కూటర్ ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో దేశీయ మార్కెట్లో విడుదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

బ్రేకింగ్ న్యూస్.. సెప్టెంబర్ 20 నుంచి రూ. 3,000 పెరగనున్న Hero MotoCorp ధరలు

Hero MotoCorp యొక్క అమ్మకాలను పరిశీలించినట్లైతే, గత నెలలో కంపెనీ దేశీయ మార్కెట్లో 4,53,879 యూనిట్లను విక్రయించింది, ఇది గత ఏడాది ఆగస్టులో అంటే 2020 ఆగష్టులో విక్రయించిన అమ్మకాల కంటే 22 శాతం తక్కువ. దీన్ని బట్టి చూస్తే కంపెనీ మునుపటికంటే ఆగస్టు 2021 లో 1,30,577 యూనిట్ల తక్కువ వాహనాలను విక్రయించింది.

బ్రేకింగ్ న్యూస్.. సెప్టెంబర్ 20 నుంచి రూ. 3,000 పెరగనున్న Hero MotoCorp ధరలు

Hero MotoCorp తన బాగాస్వామి Honda Motorcycle నుండి విడిపోయిన తర్వాత, ఇప్పుడు 10 వ వార్షికోత్సవాన్ని జరుపుకోనుంది. అంతే కాకుండా త్వరలో రానున్న పండుగ సీజన్ కారణంగా, కంపెనీ ఎక్కువ వాహనాలను విక్రయించే అవకాశం ఉంటుంది. ఇది కంపెనీ యొక్క అమ్మకాలను మళ్ళీ యదా స్థానానికి తీసుకువచ్చే అవకాశం ఉంటుందని భావిస్తున్నాము. కానీ కంపెనీ ఇప్పుడు తమ వాహనాలపై రూ. 3,000 పెంచడం వల్ల అమ్మకాలపై ఎటువంటి ప్రాభవం చూపుతుందో త్వరలో తెలుస్తుంది.

Most Read Articles

English summary
Hero motocorp to hike price upto rs 3000 from next week details
Story first published: Friday, September 17, 2021, 12:27 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X