2027 నాటికి పెట్రోల్ టూవీలర్స్ బంద్; త్వరలో కొత్త స్కూటర్ తెస్తాం: Hero

భారతదేశపు అగ్రగామి ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్‌ (Hero MotoCorp) వచ్చే ఏడాది మార్చ్ నెల నాటికి, దేశీయ మార్కెట్లో ఓ సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రస్తుత మార్కెట్ ట్రెండ్ కి అనుగుణంగా సరికొత్త డిజైన్ మరియు లేటెస్ట్ టెక్నాలజీని కలిగి ఉంటుందని కంపెనీ తెలిపింది.

2027 నాటికి పెట్రోల్ టూవీలర్స్ బంద్; త్వరలో కొత్త స్కూటర్ తెస్తాం: Hero

గడచిన ఆగస్ట్ 2021 లో, హీరో మోటోకార్ప్ బ్రాండ్ యొక్క 10 వ వార్షికోత్సవ వేడుక లైవ్ స్ట్రీమ్ లో కంపెనీ తమ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను టీజ్ చేసింది. డ్యూయల్ టోన్ వైట్ మరియు బ్లాక్ షేడ్స్ తో పెయింట్ చేయబడిన ఈ మోడల్ ప్రొడక్షన్‌కు చాలా దగ్గరగా ఉన్నట్లు తెలుస్తోంది. మార్చి 2022 నాటికి దీనిని భారత్ లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు కంపెనీ ధృవీకరించింది.

2027 నాటికి పెట్రోల్ టూవీలర్స్ బంద్; త్వరలో కొత్త స్కూటర్ తెస్తాం: Hero

హీరో ఎలక్ట్రిక్ నుండి రానున్న ఈ అధునాతన ఎలక్ట్రిక్ స్కూటర్, ప్రస్తుతం ఈ విభాగంలో లభిస్తున్న బజాజ్ చేతక్ ఈవీ, టీవీఎస్ ఐక్యూబ్, ఓలా ఎస్ 1 మరియు ఎస్ 1 ప్రో, సింపుల్ వన్ మరియు ఏథర్ 450ఎక్స్ వంటి పలు ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్లతో పోటీ పడనుంది. హీరో మోటోకార్ప్ ఇప్పటికే గోగోరో (Gogoro) ఓ ఒప్పందాన్ని కలిగి ఉంది. ఈ కంపెనీ సహకారంతో హీరో మోటోకార్ప్ షేరింగ్ బ్యాటరీ టెక్నాలజీతో సహా అనేక కొత్త ఉత్పత్తులపై పనిచేస్తున్నట్లు తెలిపింది.

2027 నాటికి పెట్రోల్ టూవీలర్స్ బంద్; త్వరలో కొత్త స్కూటర్ తెస్తాం: Hero

హీరో మోటోకార్ప్ టీజ్ చేసిన చిత్రంలో, కొత్త హీరో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను 12 ఇంచ్ ఫ్రంట్ వీల్ మరియు 10 ఇంచ్ రియర్ వీల్ తో డిజైన్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇది ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ మాదిరిగానే ఒకే-వైపు స్వింగార్మ్‌ ను కలిగి ఉంది. కర్వ్‌డ్ డిజైన్ వైఖరి, ఫ్లైస్క్రీన్ మరియు పొడవైన స్ప్లిట్ సీట్‌తో ఇది చాలా చక్కని డిజైన్‌ను కలిగి ఉంది. ఇది పూర్తిగా స్వదేశీ హీరో ప్రోడక్ట్ అయ్యే అవకాశం ఉంది.

2027 నాటికి పెట్రోల్ టూవీలర్స్ బంద్; త్వరలో కొత్త స్కూటర్ తెస్తాం: Hero

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను అభివృద్ధి చేయడానికి మరియు ఛార్జింగ్ నెట్‌వర్క్ ను విస్తరించడానికి తైవాన్ ఆధారిత గోగోరో సంస్థతో హీరో మోటోకార్ప్ గతంలో ఓ భాగస్వామ్యాన్ని ప్రకటించింది. హీరో మోటోకార్ప్ నుండి రాబోయే ఎలక్ట్రిక్ వాహనాల కోసం గోగోరో బ్యాటరీ మార్పిడి ప్లాట్‌ఫామ్‌ను అందించనుంది.

2027 నాటికి పెట్రోల్ టూవీలర్స్ బంద్; త్వరలో కొత్త స్కూటర్ తెస్తాం: Hero

ప్రస్తుతం, ఈ తైవానీస్ బ్రాండ్ 2,000 బ్యాటరీ మార్పిడి స్టేషన్లను కలిగి ఉంది, ఇప్పటివరకు 174 మిలియన్లకు పైగా బ్యాటరీ మార్పిడులు జరిగాయని కంపెనీ తెలిపింది. ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో తనదైన ముద్రను వేసుకోవడానికి మరియు భారతదేశపు అగ్రగామి సంస్థగా నిలవడానికి హీరో మోటోకార్ప్ పలు ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థలలో పెట్టుబడులు పెడుతోంది. ప్రస్తుతం ఏథర్ ఎనర్జీ సంస్థలోని ప్రధాన పెట్టుబడిదారులలో హీరో మోటోకార్ప్ కూడా ఒకటి.

2027 నాటికి పెట్రోల్ టూవీలర్స్ బంద్; త్వరలో కొత్త స్కూటర్ తెస్తాం: Hero

కాగా, హీరో మోటోకార్ప్ నుండి రాబోయే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కి సంబంధించి ప్రస్తుతానికి ఎలాంటి అధికారిక వివరాలు వెల్లడి కాకపోయినప్పటికీ, ఇది తైవాన్ మార్కెట్లోవిక్రయించే గోగోరో వివా ఎలక్ట్రిక్ స్కూటర్ ఆధారంగా రూపొందించవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. తైవాన్ లో గోగోరో వివా కీల్స్ మరియు బేసిక్ అనే రెండు వేరియంట్‌లలో విక్రయించబడుతోంది.

2027 నాటికి పెట్రోల్ టూవీలర్స్ బంద్; త్వరలో కొత్త స్కూటర్ తెస్తాం: Hero

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో 3 kWh ఎలక్ట్రిక్ మోటార్‌ని ఉపయోంచారు మరియు ఇది పూర్తి ఛార్జ్‌లో 85 కి.మీ రేంజ్ ని ఆఫర్ చేస్తుంది. అయితే, హీరో మోటోకార్ప్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని భారతదేశంలో ఇక్కడి మార్కెట్ అవసరాలకు అనుగుంగా కస్టమైజ్ చేసి, పేరు మార్చి విక్రయించే అవకాశం ఉంది. అంతేకాకుండా, దేశీయ మార్కెట్లో దీని రేంజ్ కూడా పెరిగే అవకాశం ఉంది.

2027 నాటికి పెట్రోల్ టూవీలర్స్ బంద్; త్వరలో కొత్త స్కూటర్ తెస్తాం: Hero

2027 నాటికి పెట్రోల్ టూవీలర్లు కనుమరుగవుతాయ్..

ఇదిలా ఉంటే, భారతదేశంలో పెట్రోల్ ఇంధనంతో నడిచే ద్విచక్ర వాహనాల విక్రయాలను ముగించడానికి హీరో ఎలక్ట్రిక్ ఓ టైమ్‌లైన్‌ను కూడా ప్రతిపాదించింది. దేశంలో 2027 నాటికి పెట్రోల్ టూవీలర్ల శకం ముగిసిపోయి, పూర్తిగా 100 శాతం ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు జరుగుతాయని కంపెనీ అంచనా వేసింది. ఈ మేరకు కంపెనీ తమ భవిష్యత్ ప్రణాళికలను కూడా సిద్ధం చేస్తోంది.

2027 నాటికి పెట్రోల్ టూవీలర్స్ బంద్; త్వరలో కొత్త స్కూటర్ తెస్తాం: Hero

మార్చ్ 2022 నాటికి ఏటా 5 లక్షల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల ఉత్పత్తి..

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్ కి అనుగుణంగా హీరో ఎలక్ట్రిక్ కూడా తమ వాహనాల ఉత్పత్తి సామర్థ్యాన్ని రాకెట్ వేగంతో పెంచేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం, హీరో ఎలక్ట్రిక్ యొక్క లూధియానా ప్లాంట్ లో కొత్తగా ఏర్పాటు చేసిన ఉత్పత్తి సౌకర్యం యొక్క సామర్థ్యాన్ని మరింత విస్తరించనున్నట్లు హీరో ఎలక్ట్రిక్ ప్రకటించింది.

2027 నాటికి పెట్రోల్ టూవీలర్స్ బంద్; త్వరలో కొత్త స్కూటర్ తెస్తాం: Hero

ప్రస్తుతం హీరో ఎలక్ట్రిక్ ఏటా 1 లక్ష వాహనాలను ఉత్పత్తి చేస్తోంది. కాగా, మార్చి 2022 నాటికి కంపెనీ తమ ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి సామర్థ్యాన్ని 5 లక్షల యూనిట్లకు పెంచనున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం, భారత మార్కెట్లో హీరో ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు రూ. 53,600 (సబ్సిడీ తర్వాత) నుండి ప్రారంభం అవుతాయి.

2027 నాటికి పెట్రోల్ టూవీలర్స్ బంద్; త్వరలో కొత్త స్కూటర్ తెస్తాం: Hero

హీరో మోటోకార్ప్ నుండి సరికొత్త ప్రీమియం మోటార్‌సైకిల్..

ఇదిలా ఉంటే, ప్రస్తుతం భారతదేశంలో అమెరికన్ టూవీలర్ బ్రాండ్ హార్లే డేవిడ్సన్ (Harley Davison) యొక్క కార్యకలాపాలు నిర్వహిస్తున్న హీరో మోటోకార్ప్ (Hero MotoCorp), ఈ సంస్థ సహకారంతో త్వరలో భారత్‌లో ఓ ప్రీమియం మోటార్‌సైకిల్‌ను ప్రవేశపెట్టాలని ప్లాన్ చేస్తోంది.

2027 నాటికి పెట్రోల్ టూవీలర్స్ బంద్; త్వరలో కొత్త స్కూటర్ తెస్తాం: Hero

ఈ కొత్త భాగస్వామ్యంలో భాగంగా, హీరో మోటోకార్ప్ మరియు హార్లే-డేవిడ్సన్ సంస్థలు 500 సిసి మరియు అంతకంటే ఎక్కువ ఇంజన్ సామర్థ్యం కలిగిన మిడిల్-వెయిట్ బైక్‌లను అభివృద్ధి చేయనున్నారు. ఈ కొత్త మోటార్‌సైకిళ్లను రెండు బ్రాండ్‌ల ద్వారా కూడా రిటైల్ చేసే అవకాశం ఉంది. రాబోయే ప్రీమియం హీరో మోటార్‌సైకిళ్లు హార్లీ బైక్‌ల కంటే తక్కువ ధరకే లభిస్తాయని భావిస్తున్నారు.

Most Read Articles

English summary
Hero motocorp to launch all new electric scooter in india by march 2022 plans to increase production
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X