మిడిల్ వెయిట్ విభాగంలో కొత్త బైక్‌ తీసుకురానున్న హీరో మోటోకార్ప్

భారతదేశపు ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ తన మిడిల్‌వెయిట్ విభాగంలో కొత్త బైక్‌ను విడుదల చేయడానికి సన్నాహాలను సిద్ధం చేస్తోంది. కావున త్వరలో ఈ బైక్‌లు భారతీయ రోడ్లపై కనిపిస్తాయి. హీరో మోటోకార్ప్ యొక్క మిడిల్‌వెయిట్ విభాగంలో రానున్న ఈ కొత్త బైక్ గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

మిడిల్ వెయిట్ విభాగంలో కొత్త బైక్‌ తీసుకురానున్న హీరో మోటోకార్ప్

హీరో మోటోకార్ప్ కంపెనీ మరియు అమెరికాకు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హార్లే డేవిడ్సన్ కొన్ని నెలల క్రితం ఒక భాగస్వామ్యం కుదుర్చుకున్నారు. ఈ సంస్థల భాగస్వామ్యం తరువాత ఈ విభాగంలో కొత్త బైక్ లాంచ్ చేయడం గురించి కొన్ని చర్చలు ప్రారంభమయ్యాయి. కానీ దీనికి సంబధించిన అధికారిక సమాచారం కంపెనీ అందించలేదు.

మిడిల్ వెయిట్ విభాగంలో కొత్త బైక్‌ తీసుకురానున్న హీరో మోటోకార్ప్

నివేదికల ప్రకారం, హీరో మోటోకార్ప్ మిడిల్ వెయిట్ విభాగంలో ట్విన్-టైప్ బైక్‌ను విడుదల చేయడానికి తగిన సమయం కోసం వేచి చూస్తోంది. ప్రస్తుతం హీరో మోటోకార్ప్ మరియు హార్లే డేవిడ్సన్, టీవీఎస్ మరియు బిఎమ్‌డబ్ల్యూ మధ్య భాగస్వామ్యం ఉందని ఆటో మొబైల్ పరిశ్రమ నిపుణులు భావిస్తున్నారు.

MOST READ:ఆ గవర్నమెంట్ హాస్పిటల్ లో ఆక్సిజన్ బస్ సౌకర్యం కూడా.. ఎక్కడంటే?

మిడిల్ వెయిట్ విభాగంలో కొత్త బైక్‌ తీసుకురానున్న హీరో మోటోకార్ప్

టీవీఎస్ కంపెనీ యొక్క అపాచీ ఆర్ఆర్ 310 బైక్ బిఎమ్‌డబ్ల్యూ యొక్క జి 310 ఆర్ బైక్ యొక్క ఇంజన్ టెక్నాలజీని ఉపయోగించి తయారు చేయబడింది. హీరో మోటోకార్ప్‌తో చేసుకున్న ఒప్పంద నిబంధనల ప్రకారం, హీరో మోటోకార్ప్ ప్రస్తుతం హార్లే డేవిడ్సన్ యొక్క బైక్ డెలివరీ మరియి సేల్స్ వంటి వాటిని నిర్వహిస్తోంది.

మిడిల్ వెయిట్ విభాగంలో కొత్త బైక్‌ తీసుకురానున్న హీరో మోటోకార్ప్

అంతే కాకుండా కంపెనీ హార్లే డేవిడ్సన్ బైక్ కోసం మోడరేట్ కెపాసిటీ బైక్‌పై కూడా పనిచేస్తోంది. రీబ్యాడ్జ్ వెర్షన్‌ను హీరో మోటోకార్ప్ బ్రాండ్ కింద కూడా ఉత్పత్తి చేయనున్నట్లు చెబుతున్నారు. ప్రతి బైక్ విభాగం ఇంజిన్ సామర్థ్యంతో మారుతుంది.

MOST READ:మీకు తెలుసా.. భారతదేశంలో అత్యంత ఖరీదైన కాన్వాయ్‌ ఉపయోగిస్తున్న వ్యక్తి ఇతడే..

మిడిల్ వెయిట్ విభాగంలో కొత్త బైక్‌ తీసుకురానున్న హీరో మోటోకార్ప్

కావున గ్లోబల్ మార్కెట్లో, మిడిల్ వెయిట్ విభాగంలో 500 సిసి ఇంజన్ కెపాసిటీ మరియు 900 సిసి సామర్థ్యంతో బైక్‌లు అమ్ముడవుతాయి. భారతీయ వినియోగదారులు 350 సిసి నుండి 400 సిసి బైక్‌లను కొనుగోలుచేయడానికి ఎక్కువగా ఇష్టపడతారు.

మిడిల్ వెయిట్ విభాగంలో కొత్త బైక్‌ తీసుకురానున్న హీరో మోటోకార్ప్

ప్రస్తుతం ఈ విభాగంలో దేశీయ మార్కెట్లో చెన్నైకి చెందిన రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీ ఆధిపత్యం చెలాయించింది. ఈ విభాగంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ దాదాపు 90% వాటా కలిగి ఉంది. హీరో మోటోకార్ప్ ఈ విభాగంలో విడుదల చేయబోయే కొత్త బైక్ రాయల్ ఎన్‌ఫీల్డ్‌తో పోటీ పడనుంది.

MOST READ:మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభించనున్న మారుతి సుజుకి; వివరాలు

మిడిల్ వెయిట్ విభాగంలో కొత్త బైక్‌ తీసుకురానున్న హీరో మోటోకార్ప్

ఇప్పటికే కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, కంపెనీ సిఎఫ్‌ఓ నిరంజన్ గుప్తా మాట్లాడుతూ ఈ విభాగంలో బైక్‌లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. అయితే మార్కెట్లో ఈ బైక్‌లను ఎప్పుడు ప్రవేశపెడతారో అనేదాని గురించి కంపెనీ ఎటువంటి అధికారిక సమాచారం అందివ్వలేదు.

మిడిల్ వెయిట్ విభాగంలో కొత్త బైక్‌ తీసుకురానున్న హీరో మోటోకార్ప్

హార్లే-డేవిడ్సన్ సహాయంతో, మిడిల్ వెయిట్ విభాగంలో హీరో మోటోకార్ప్ కొత్త మరియు ఉత్తమ బైక్‌లను అందించే అవకాశం ఉంది. ఈ బైకులు మార్కెట్లో అడుగుపెట్టిన తర్వాత ప్రత్యర్థులకు మంచి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. అంతే కాకుండా రానున్న ఈ కొత్త బైక్ యొక్క అమ్మకాలు ఏ విధంగా ఉంటాయో కూడా త్వరలో తెలుస్తాయి.

MOST READ:ఒకే వ్యక్తి 20 క్రూయిజర్ బైక్స్ కలిగి ఉన్నాడు, వాటి విలువ అక్షరాలా 3.5 కోట్లు

Most Read Articles

English summary
Hero Motocorp To Launch New Bike In Middle Weight Segment. Read in Telugu.
Story first published: Thursday, May 20, 2021, 13:00 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X