బ్లూటూత్ కనెక్టివిటీతో రానున్న కొత్త 2021 Hero Pleasure+ స్కూటర్

భారతదేశపు అగ్రగామి టూవీలర్ తయారీ కంపెనీ హీరో మోటోకార్ప్ (Hero MotoCorp) అందిస్తున్న ఎంట్రీ లెవల్ స్కూటర్ ప్లెజర్ ప్లస్ (Pleasure+) స్కూటర్ లో కంపెనీ ఓ కొత్త అప్‌డేటెడ్ వెర్షన్ ను మార్కెట్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు కంపెనీ తమ సోషల్ మీడియా హ్యాండిల్‌ లో కొత్త ప్లెజర్ స్కూటర్ టీజర్‌ ను కూడా విడుదల చేసింది.

బ్లూటూత్ కనెక్టివిటీతో రానున్న కొత్త 2021 Hero Pleasure+ స్కూటర్

హీరో మోటోకార్ప్ నుండి అత్యధికంగా అమ్ముడవుతున్న స్కూటర్లలో హీరో ప్లెజర్ మొదటి స్థానంలో ఉంటుంది. సరసమైన ధర, తక్కువ బరువు మరియు ఎక్కువ మైలేజ్ వంటి పలు విశిష్ట అంశాల కారణంగా, కస్టమర్లు ఎక్కువగా ఈ మోడల్ ను ఎంచుకుంటున్నారు. పెద్దవారు మరియు మహిళలకు ఇది చాలా ఫేవరేట్ స్కూటర్.

బ్లూటూత్ కనెక్టివిటీతో రానున్న కొత్త 2021 Hero Pleasure+ స్కూటర్

రానున్న పండుగ సీజన్ నేపథ్యంలో, ఈ కొత్త 2021 హీరో ప్లెజర్ ప్లస్ స్కూటర్ (Hero Pleasure+) మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంది. తాజాగా విడుదలైన టీజర్ ప్రకారం, హీరో ప్లెజర్ ప్లస్ పూర్తిగా కొత్త హెడ్‌లైట్ సెటప్ ను కలిగి ఉంటుంది. ఈ కొత్త మోడల్ లో, ప్రస్తుత స్కూటర్ లో కనిపించే ట్రెడిషనల్ హాలోజెన్ హైడ్‌లైట్ యూనిట్ స్థానంలో కొత్త ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లతో కూడిన ఎల్ఈడి హెడ్‌లైట్ యూనిట్ ను ఉపయోగించారు.

బ్లూటూత్ కనెక్టివిటీతో రానున్న కొత్త 2021 Hero Pleasure+ స్కూటర్

ఈ కొత్త 2021 మోడల్ హీరో ప్లెజర్ ప్లస్ స్కూటర్ లో చేసిన మరొక మార్పు విషయానికి వస్తే, ఇందులో కొత్తగా సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ను అందిస్తున్నారు. ఇదివరకు ఈ స్కూటర్ పూర్తిగా అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ తో లభించేది. అంతేకాకుండా, కొత్త ప్లెజర్ స్కూటర్ కి మరింత ప్రీమియం లుక్ ని కల్పించేందుకు హెడ్‌ల్యాంప్ చుట్టూ క్రోమ్ సరౌండింగ్ మరియు సైలెన్సర్ పై క్రోమ్ మఫ్లర్ కవర్ మరియు ఫ్రండ్ అండ్ రియర్ ఫెండర్లపై క్రోమ్ గార్నిష్ వంటి అంశాలు ఉన్నాయి.

బ్లూటూత్ కనెక్టివిటీతో రానున్న కొత్త 2021 Hero Pleasure+ స్కూటర్

ఈ స్కూటర్‌ లో చేయబోయే అతిపెద్ద అప్‌డేట్ ఏంటంటే, కొత్త ప్లెజర్ ప్లస్ స్కూటర్ ఇప్పుడు బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్ తో అందుబాటులోకి రాబోతోంది. ఇందుకోసం డ్యాష్‌బోర్డ్ పై ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ లో ఒక చిన్న డిజిటల్ స్క్రీన్ ఇవ్వబడింది, దీనిలో ఇన్‌కమింగ్ కాల్ అలర్ట్, ఎస్ఎమ్ఎస్ అలర్ట్, మిస్డ్ కాల్ అలర్ట్ మరియు ఫోన్ బ్యాటరీ స్థితి వంటి సమాచారం తెలియజేయబడుతుంది.

బ్లూటూత్ కనెక్టివిటీతో రానున్న కొత్త 2021 Hero Pleasure+ స్కూటర్

ఇంకా ఈ ఎల్‌సిడిపై ఓడోమీటర్ రీడింగ్ మరియు స్కూటర్ లోని ఫ్యూయల్ ట్యాంక్ యొక్క ఇంధన స్థాయిని కూడా చూడొచ్చు. ప్రస్తుత మోడల్‌తో పోలిస్తే, పైన చెప్పుకున్నట్లుగా కొత్త హీరో ప్లెజర్ ప్లస్ ఇతర కాస్మెటిక్ అప్‌డేట్‌ లతో అందుబాటులోకి రానుంది. ఇందులో కొత్తగా జోడించిన ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్స్, ఎల్ఈడి హెడ్‌లైట్స్ మరియు బ్లూటూత్ ఆధారిత ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఫీచర్లు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.

బ్లూటూత్ కనెక్టివిటీతో రానున్న కొత్త 2021 Hero Pleasure+ స్కూటర్

కొత్త 2021 హీరో ప్లెజర్ ప్లస్ స్కూటర్‌ లో ఇంజన్ పరంగా ఎలాంటి మార్పు ఉండబోదని తెలుస్తోంది. కంపెనీ ప్రస్తుత మోడల్ లో ఉపయోగిస్తున్న అదే ఇంజన్‌నే ఈ కొత్త మోడల్ లోనూ కొనసాగించవచ్చని భావిస్తున్నారు. హీరో ప్లెజర్ ప్లస్ యొక్క ప్రస్తుత మోడల్ లో 110 సిసి ఇంజన్‌ ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 8 బిహెచ్‌పి పవర్ ను మరియు 8.7 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ తో జతచేయబడి ఉంటుంది.

బ్లూటూత్ కనెక్టివిటీతో రానున్న కొత్త 2021 Hero Pleasure+ స్కూటర్

ఈ సరికొత్త 2021 హీరో ప్లెజర్ ప్లస్ స్కూటర్ ధర, లభ్యత మరియు బుకింగ్స్ వంటి మరిన్ని వివరాలను హీరో మోటోకార్ప్ త్వరలోనే వెల్లడిస్తుందని భావిస్తున్నారు. ప్రస్తుతం, ఈ బ్రాండ్ నుండి స్కూటర్ లైనప్ లో ప్లెజర్ ప్లస్, మ్యాస్ట్రో ఎడ్జ్ 110, మ్యాస్ట్రో ఎడ్జ్ 125 బిఎస్6, కొత్త మ్యాస్ట్రో ఎడ్జ్ 125 మరియు డెస్టినీ 125 బిఎస్6 మోడళ్లు అందుబాటులో ఉన్నాయి.

హీరో ఎక్స్‌పల్స్ 200 లాంచ్ కోసం సన్నాహాలు

ఇదిలా ఉంటే, హీరో మోటోకార్ప్ తమ కొత్త ఎక్స్‌పల్స్ (XPlus 200) ఆఫ్-రోడ్ అడ్వెంచర్ బైక్ ని భారత మార్కెట్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. కంపెనీ శుక్రవారం (అక్టోబర్ 7వ తేదీ) నాడు తమ కొత్త ఎక్స్‌పల్స్ 200 బైక్ ని విడుదల చేయనుంది. కొత్త అవతార్ మరియు కొత్త ఫీచర్లతో వస్తున్న ఈ బైక్ కస్టమర్లను ఆకర్షించగలదని కంపెనీ ధీమాగా ఉంది.

బ్లూటూత్ కనెక్టివిటీతో రానున్న కొత్త 2021 Hero Pleasure+ స్కూటర్

హీరో మోటోకార్ప్ గడచిన సెప్టెంబర్ 2021 నెల అమ్మకాల గణాంకాలను కూడా విడుదల చేసింది. గత నెలలో కంపెనీ మొత్తం 5,30,000 యూనిట్ల ద్విచక్ర వాహనాలను విక్రయించింది. వీటిలో 5,00,050 యూనిట్లు దేశీయ మార్కెట్‌ లో విక్రయించగా, మిగిలిన 25,000 యూనిట్లు విదేశాలకు ఎగుమతి చేయబడ్డాయి.

బ్లూటూత్ కనెక్టివిటీతో రానున్న కొత్త 2021 Hero Pleasure+ స్కూటర్

సెప్టెంబర్ 2021 లో, కంపెనీ మొత్తం 4,89,417 యూనిట్ల బైక్‌లను విక్రయించగా, స్కూటర్ల అమ్మకాలు 40,929 యూనిట్లుగా ఉన్నాయి. గత సంవత్సరం సెప్టెంబర్ 2020 నెలలో, హీరో మోటోకార్ప్ మొత్తం 7,15,718 యూనిట్ల బైకులు మరియు స్కూటర్లను విక్రయించగా, ఈ సంవత్సరం సెప్టెంబర్ నెలలో 1,85,372 యూనిట్ల తక్కువ అమ్మకాలను నమోదు చేసింది. సెప్టెంబర్ 2020 తో పోలిస్తే గత నెల అమ్మకాలు 25.90 శాతం క్షీణించాయి.

Most Read Articles

English summary
Hero motocorp to launch new pleasure plus scooter with new updates details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X