ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్

భారతదేశంలోఅతిపెద్ద ద్విచక్ర వాహన తయారీసంస్థ అయిన హీరో మోటోకార్ప్ ఇటీవల 100 మిలియన్ల ఉత్పత్తిని పూర్తి చేసినట్లు అధికారికంగా ప్రకటించింది. సంస్థ తమ 100 మిలియన్ల ద్విచక్ర వాహనమైన ఎక్స్‌ట్రీమ్ 160 ఆర్‌ను ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లోని బ్రాండ్ వద్ద విడుదల చేసింది.

ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్

హీరో మోటోకార్ప్ 1984 వ సంవత్సరంలో మార్కెట్లోకి ప్రవేశించింది. తర్వాత అతి తక్కువ కాలంలోనే హీరో మోటోకార్ప్ కంపెనీ 1985 లో ధారుహెరాలో ప్లాంట్‌ను ప్రారంభించింది. అంతే కాకుండా ఇదే సంవత్సరం కంపెనీ మొదటి మోడల్ ఆయిన సిడి 100 ను తీసుకువచ్చింది.

ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్

హీరో మోటోకార్ప్ కంపెనీ దీని తర్వాత 1987 లో దాదాపు 1 లక్ష యూనిట్లను దాటింది. ఈ సంఖ్య క్రమంగా అభివృద్ధి చెందుతూ తన ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింత పెంచే ప్రయత్నాలు చేసింది. తర్వాత 2004 లో కంపెనీ 10 మిలియన్ల ఉత్పత్తి మార్కును దాటింది.

ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్

హీరో మోటోకార్ప్ 2011 లో తన భాగస్వామి అయిన హోండాతో విడిపోయింది. దీని తరువాత కంపెనీ అనేక కొత్త మోడళ్లను మార్కెట్లోకి తీసుకువచ్చింది. తరువాత 2013 లో 50 మిలియన్ల యూనిట్లను మరియు 2017 లో 75 మిలియన్ల సంఖ్యను దాటింది. ఇప్పుడు ఏకంగా 100 మిలియన్లకు చేరుకుంది.

ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్

ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ద్విచక్ర వాహనాలను విక్రయిస్తుంది మరియు ప్రస్తుతం 40 దేశాలలో తన ఉనికిని కలిగి ఉంది. సంస్థ యొక్క ఉత్పత్తి మరియు ఆర్ అండ్ డి సౌకర్యం భారతదేశంలోని హలోల్, ధారుహేరా, గురుగ్రామ్, హరిద్వార్ వంటి నగరాల్లో లభిస్తుంది. సంస్థ ఒక్క భారతదేశంలో మాత్రమే కాకుండా ఇతరదేశాలలో కూడా తన ఉనికిని చాటుకుంటోంది.

ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్

హీరోమోటోకార్ప్ ప్రస్తుతం కొలంబియా, జర్మనీ, బంగ్లాదేశ్ వంటి దేశాలలో తన ఉనికిని కలిగి ఉంది. ఈ సంస్థ ఇప్పటికీ దేశంలోనే అత్యధికంగా వాహనాలు అమ్ముడవుతున్న సంస్థ మరియు దాని పోర్ట్‌ఫోలియోలో బైక్‌లు, స్కూటర్లను అందిస్తుంది.

ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్

100 మిలియన్ ద్విచక్ర వాహనాల హీరో ఎక్స్‌ట్రీమ్ 160 ఆర్ మోడల్ బైక్‌ను గత ఏడాది జూన్‌లో తీసుకువచ్చారు. దీని ధర రూ. 99,950 (ఎక్స్-షోరూమ్). ఇది రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. దీనితో పాటు, హీరో మాస్ట్రో, డెస్టినీ, ఎక్స్‌ట్రీమ్, స్ప్లెండర్, గ్లామర్ ఫ్యాషన్ ప్రో మోడల్స్ ని విడుదల చేసింది.

ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్

హీరో మోటోకార్ప్‌తో సహా ద్విచక్ర వాహనాల ఉత్పత్తిలో ఒక భారతీయ కంపెనీ ఇంత పెద్ద సంఖ్యలో ఉత్పత్తి చేయడం నిజంగా భారతదేశానికి గర్వకారణం. హీరో మోటోకార్ప్ అమ్మకాలు ఇప్పుడు కూడా మెరుగుపడుతున్నాయి. ఇంకా చాలా కొత్త ఉత్పత్తులు కూడా త్వరలో దేశీయ మార్కెట్లో విడుదలవుతాయి. ఏది ఏమైనా 100 మిలియన్ల యూనిట్లు దాటటం అనేది నిజంగా చాలా గొప్ప విషయం.

More from DriveSpark

Article Published On: Thursday, January 21, 2021, 18:52 [IST]
English summary
Hero MotoCorp Achieves 100 Million Production Milestone. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+