హోలా మెహికో.. మెక్సికోలో టూవీలర్ వ్యాపారం ప్రారంభించిన హీరో మోటోకార్ప్

భారతదేశపు అగ్రగామి ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ మెక్సికో దేశంలో తమ వాహనాల రిటైల్ అమ్మకాలను ప్రారంభించినట్లు ప్రకటించింది. అక్కడి మార్కెట్లో వివిధ కస్టమర్ విభాగాల అవసరాలకు అనుగుణంగా మోటార్‌సైకిళ్లు మరియు స్కూటర్‌లతో సహా ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియోను మెక్సికోలో ప్రవేశపెట్టినట్లు కంపెనీ శుక్రవారం నాడు ఓ మీడియా ప్రకటనా ద్వారా తెలిపింది.

హోలా మెహికో.. మెక్సికోలో టూవీలర్ వ్యాపారం ప్రారంభించిన హీరో మోటోకార్ప్

మెక్సికో మార్కెట్లో హీరో మోటోకార్ప్ అందించనున్న ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోలో ఎక్స్‌పల్స్ 200, ఎక్స్‌పల్స్ 200టి, హంక్ 190, హంక్ 160ఆర్, హంక్ 150, ఎకో 150 టిఆర్, ఎకో 150 కార్గో వంటి పాపులర్ మోటార్‌సైకిళ్లు మరియు ఇగ్నైటర్ 125, డాష్ 125 వంటి ప్రముఖ స్కూటర్లు ఉన్నాయని కంపెనీ వివరించింది.

హోలా మెహికో.. మెక్సికోలో టూవీలర్ వ్యాపారం ప్రారంభించిన హీరో మోటోకార్ప్

హీరో మోటోకార్ప్ తమ గ్లోబల్ సేల్స్ మార్కెట్‌ను విస్తరించాలనే లక్ష్యంలో భాగంగా, మెక్సికో దేశంలో తన వ్యాపారాన్ని ప్రారంభించింది. అక్కడి మార్కెట్లో అన్ని ద్విచక్ర వాహనాలను తక్కువ ధరలకు విడుదల చేసినట్లు కంపెనీ తెలిపింది. డిస్ట్రిబ్యూటర్లు, ఏజెన్సీలు మరియు విక్రేతల నెట్‌వర్క్ ద్వారా మెక్సికోలో హీరో మోటోకార్ప్ తన విక్రయ వ్యాపారాన్ని ప్రారంభించింది.

హోలా మెహికో.. మెక్సికోలో టూవీలర్ వ్యాపారం ప్రారంభించిన హీరో మోటోకార్ప్

మెక్సికోలో హీరో మోటోకార్ప్‌కు స్వతహాగా ఎలాంటి డీలర్లు లేరు. అయితే, పైన తెలిపిన నెట్‌వర్క్ కారణంగా తక్కువ ఖర్చుతోనే ఆ దేశంలో తమ ద్విచక్ర వాహనాలను ప్రారంభించగలిగామని కంపెనీ తెలిపింది. అంతే కాకుండా, మెక్సికన్లను ఆకర్షించేందుకు ప్రత్యేక రుణ పథకాలను కూడా అందిస్తున్నట్లు కంపెనీ తెలిపింది.

హోలా మెహికో.. మెక్సికోలో టూవీలర్ వ్యాపారం ప్రారంభించిన హీరో మోటోకార్ప్

ఇందులో భాగంగా, మెక్సికోలని పలు ఆర్థిక సంస్థలతో కలిసి హీరో మోటోకార్ప్ వివిధ రకాల ప్రత్యేకమైన ఆఫర్లను ప్రవేశపెట్టింది. మెక్సికోలో హీరో మోటోకార్ప్ వాహనాలను మూడు సంవత్సరాలు లేదా 30 వేల కిలోమీటర్ల వారంటీతో అందించనున్నారు.

హోలా మెహికో.. మెక్సికోలో టూవీలర్ వ్యాపారం ప్రారంభించిన హీరో మోటోకార్ప్

జపనీస్ భాగస్వామి హోండా నుండి విడిపోయిన తర్వాత, హీరో మోటార్‌సైకిళ్లకు ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ లభించింది. రివైలైజ్, రీకాలిబ్రేట్, రివైవ్ మరియు రివల్యూషన్ అనే R4 గ్లోబల్ బిజినెస్ స్ట్రాటజీలో భాగంగా, తమ అంతర్జాతీయ ప్రస్థానాన్ని విస్తరించించుకుంటూ పోతున్నామని కంపెనీ తెలిపింది.

హోలా మెహికో.. మెక్సికోలో టూవీలర్ వ్యాపారం ప్రారంభించిన హీరో మోటోకార్ప్

తమ అంతర్జాతీయ వ్యాపార వృద్ధి కథలో ఇదొక ముఖ్యమైన పరిణామమని, మెక్సికో భవిష్యత్తులో తమకు ఒక కీలకమైన మార్కెట్ అవుతుందని మరియు ఈ దిశలో ఇది తమ మొదటి అడుగు అని హీరో మోటోకార్ప్ గ్లోబల్ బిజినెస్ హెడ్ సంజయ్ భాన్ అన్నారు. మెక్సికోలో తాము ప్రవేశపెట్టిన ఉత్పత్తులు అక్కడి ప్రజలను ఆకట్టుకుంటాయని ఆయన అన్నారు.

హోలా మెహికో.. మెక్సికోలో టూవీలర్ వ్యాపారం ప్రారంభించిన హీరో మోటోకార్ప్

కరోనా మహమ్మారి సమయంలో కూడా కంపెనీ అత్యధిక ఎగుమతులు చేసింది. మార్చి 2021లో కంపెనీ ప్రపంచ మార్కెట్లకు అత్యధిక సంఖ్యలో టూవీలర్లను ఎగుమతి చేసి, నెలవారీ వృద్ధిని నమోదు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఎఫ్‌వై22 లో కూడా కంపెనీ వృద్ధిని సాధించిందని తెలిపింది.

Most Read Articles

English summary
Hero Motocorp Two-wheelers Now Available In Mexico, Details. Read in Telugu.
Story first published: Saturday, July 31, 2021, 14:43 [IST]
--<
-->
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X