మార్కెట్లో Xtreme 160R Stealth Edition లాంచ్ చేసిన Hero MotoCorp: ధర & వివరాలు

భారతీయ మార్కెట్లో Hero MotoCorp (హీరో మోటోకార్ప్) తన కొత్త Hero Xtreme 160R Stealth Edition (హీరో ఎక్‌ట్రీమ్ 160ఆర్ స్టీల్త్ ఎడిషన్) విడుదల చేసింది. ఈ కొత్త ఎడిషన్ ధర దేశీయ మార్కెట్లో రూ .1.16 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఈ హీరో ఎక్‌ట్రీమ్ 160ఆర్ స్టీల్త్ ఎడిషన్ బైక్ మాట్ బ్లాక్ కలర్‌లో 'స్టీల్త్ ఎడిషన్' బ్యాడ్జ్‌తో చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ బైక్ గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

మార్కెట్లో Xtreme 160R Stealth Edition లాంచ్ చేసిన Hero MotoCorp: ధర & వివరాలు

Hero Xtreme 160R Stealth Edition అధునాతన ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. ఈ బైక్‌లో ఎల్ఈడీ హెడ్‌లైట్, టెయిల్ లైట్ మరియు టర్న్ ఇండికేటర్స్ వంటివి అందుబాటులో ఉన్నాయి. అంతే కాకుండా ఎల్‌ఈడీ డిఆర్‌ఎల్‌లతో కూడిన డ్రాయిడ్ హెడ్‌ల్యాంప్‌లు ఇన్‌స్టాల్ చేయబడ్డాయి, కావున ఇది మంచి దూకుడు రూపాన్ని పొందుతుంది.

మార్కెట్లో Xtreme 160R Stealth Edition లాంచ్ చేసిన Hero MotoCorp: ధర & వివరాలు

బైక్ యొక్క LCD ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌ చాలా ప్రకాశవంతంగా ఉంటుంది. కావున కాంతికి అనుగుణంగా దాని దృశ్యమానతను మార్చడానికి ఉపయోగపడుతుంది. హీరో ఎక్‌ట్రీమ్ 160ఆర్ స్టీల్త్ ఎడిషన్ ఒక దృఢమైన డైమండ్ చాసిస్ మీద నిర్మించబడింది. దీని మొత్తం బరువు 139.5 కిలోలు.

ఈ కొత్త బైక్ యొక్క ఇంజిన్ విషయానికి వస్తే, ఇది దాని స్టాండర్డ్ హీరో ఎక్స్‌ట్రీమ్ 160R ఇంజిన్ ఉపయోగిస్తుంది. ఈ బైక్ 160 cc ఫ్యూయల్ ఇంజెక్ట్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ పొందుతుంది. ఇది 8,500 ఆర్‌పిఎమ్ వద్ద 15.2 బిహెచ్‌పి పవర్ మరియు 6,500 ఆర్‌పిఎమ్ వద్ద 14 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ కేవలం 4.7 సెకన్లలో 0 నుంచి 60 కిమీ/గం నుండి వేగవంతం అవుతుంది. ఇది వాహన వినియోగాదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

మార్కెట్లో Xtreme 160R Stealth Edition లాంచ్ చేసిన Hero MotoCorp: ధర & వివరాలు

Hero MotoCorp ఇటీవల దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన ప్లెజర్ ప్లస్ యొక్క కొత్త వేరియంట్‌ను విడుదల చేసింది. ఈ కొత్త స్కూటర్ ధర రూ. 61,900 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). హీరో ప్లెజర్ ఎక్స్‌టెక్ కొత్త డిజైన్ మరియు రంగులో ప్రవేశపెట్టబడింది. ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

మార్కెట్లో Xtreme 160R Stealth Edition లాంచ్ చేసిన Hero MotoCorp: ధర & వివరాలు

అంతే కాకుండా ఈ మధ్య కాలంలోనే Hero MotoCorp (హీరో మోటోకార్ప్) భారత మార్కెట్లో కొత్త హీరో ఎక్స్ ప్లస్ 200 4వి బైక్ విడుదల చేసింది. దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త హీరో ఎక్స్ ప్లస్ 200 4వి బైక్ ధర రూ. 1.28 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ బైక్ దాని మునుపటి మోడల్స్ కంటే కూడా చాలా వరకు లేటెస్ట్ ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది.

మార్కెట్లో Xtreme 160R Stealth Edition లాంచ్ చేసిన Hero MotoCorp: ధర & వివరాలు

ఈ కొత్త ఇంజిన్లోని 4-వాల్వ్ సెటప్ ఇంజిన్ అధిక RPM ల వద్ద మెరుగైన గాలిని తీసుకోవడానికి సహాయపడుతుంది, తద్వారా బైక్ నుండి మెరుగైన టాప్-ఎండ్ పనితీరును అందిస్తుంది. ఈ ఇంజిన్ ఇప్పుడు 19.1 బిహెచ్‌పి పవర్ మరియు 17.35 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది మంచి పర్ఫామెన్స్ అందిస్తుంది. ఈ కొత్త బైక్ గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

మార్కెట్లో Xtreme 160R Stealth Edition లాంచ్ చేసిన Hero MotoCorp: ధర & వివరాలు

హీరో మోటోకార్ప్ ఈ నెల ప్రారంభంలో సెప్టెంబర్ 2021 అమ్మకాల గణాంకాలను విడుదల చేసింది. సెప్టెంబర్ 2021 లో కంపెనీ మొత్తం 5,30,000 యూనిట్ల ద్విచక్ర వాహనాలను విక్రయించింది. వీటిలో 5,00,050 యూనిట్లు దేశీయ మార్కెట్‌లో విక్రయించగా, 25,000 బైకులు మరియు స్కూటర్లు ఎగుమతి చేయబడ్డాయి. సెప్టెంబర్ 2021 లో, కంపెనీ మొత్తం 4,89,417 యూనిట్ల బైక్‌లను విక్రయించగా, స్కూటర్ల అమ్మకాలు 40,929 యూనిట్లుగా ఉన్నాయి.

మార్కెట్లో Xtreme 160R Stealth Edition లాంచ్ చేసిన Hero MotoCorp: ధర & వివరాలు

గత సంవత్సరం సెప్టెంబర్ నెలలో, కంపెనీ మొత్తం 7,15,718 యూనిట్ల బైకులు మరియు స్కూటర్లను విక్రయించగా, ఈ సంవత్సరం సెప్టెంబర్ నెలలో 1,85,372 యూనిట్ల అమ్మకాలు తగ్గాయి. సెప్టెంబర్ 2020 తో పోలిస్తే అమ్మకాలలో 25.90 శాతం క్షీణత నమోదు చేసింది. అయితే ఈ తగ్గుదలను తగ్గించడానికి మరియు మంచి అమ్మకాలను పొందటానికి కంపెనీ ఇటీవల కొత్త వేరియంట్స్ కూడా విడుదల చేసింది. అంతే కాకుండా ప్రస్తుతం పండుగ సీజన్ కావడం వల్ల కంపెనీ తప్పకుండా మంచి అమ్మకాలను పొందే అవకాశం ఉంటుంది.

Most Read Articles

English summary
Hero xtreme 160r stealth edition launched price features specifications details
Story first published: Friday, October 15, 2021, 13:18 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X