మార్కెట్లో Honda Activa125 ప్రీమియం ఎడిషన్ లాంచ్.. ధర & ఫీచర్స్

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటార్సైకిల్ (Honda Motorcycle) భారతీయ మార్కెట్లో కొత్త హోండా యాక్టివా 125 ప్రీమియం ఎడిషన్ (Honda Activa125 Premium Edition) స్కూటర్‌ విడుదల చేసింది. దేశీయ మార్కెట్లో అడుగుపెట్టిన ఈ కొత్త ఎడిషన్ ప్రారంభ ధర రూ. 78,725. ఈ కొత్త స్కూటర్ గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

మార్కెట్లో Honda Activa125 ప్రీమియం ఎడిషన్ లాంచ్.. ఇప్పుడు మరిన్ని ఫీచర్స్

హోండా యాక్టివా 125 ప్రీమియం ఎడిషన్ స్కూటర్‌ రెండు డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్‌లలో అందించబడింది. అవి పెర్ల్ అమేజింగ్ వైట్/మ్యాట్ మాగ్నిఫిసెంట్ కాపర్ మెటాలిక్ మరియు మ్యాట్ స్టీల్ బ్లాక్ మెటాలిక్/మ్యాట్ ఎర్ల్ సిల్వర్ మెటాలిక్. ఇది రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. ఇందులో ఒకటి యాక్టివా 125 ప్రీమియం డ్రమ్ అల్లాయ్ వేరియంట్ కాగా, మరొకటి యాక్టివా 125 ప్రీమియం డిస్క్ వేరియంట్. వీటి ధరలు వరుసగా రూ. 78,725 మరియు రూ. 82,280 (ఎక్స్-షోరూమ్).

మార్కెట్లో Honda Activa125 ప్రీమియం ఎడిషన్ లాంచ్.. ఇప్పుడు మరిన్ని ఫీచర్స్

ఈ కొత్త స్కూటర్ లో కొత్త కాస్మెటిక్ అప్‌డేట్‌లు కాకుండా మిగిలినవన్నీ దాని స్టాండర్డ్ యాక్టివా 125 మాదిరిగానే ఉంటుంది. ఇక స్టైలింగ్ అప్డేట్స్ విషయానికి వస్తే, ఇది ఇప్పుడు మునుపటి మాదిరిగా కాకూండా డ్యూయల్-టోన్ బాడీ కలర్‌ పొందుతుంది, ఇది సైడ్ ప్యానెల్‌లతో పాటు ఫ్రంట్ కవర్ వరకు విస్తరించి ఉంటుంది. ఇది కాకుండా, స్కూటర్‌లోని ఇతర ముఖ్యమైన మార్పులు బ్లాక్ ఫ్రంట్ సస్పెన్షన్‌తో బ్లాక్ ఇంజన్‌ని కలిగి ఉన్నాయి.

మార్కెట్లో Honda Activa125 ప్రీమియం ఎడిషన్ లాంచ్.. ఇప్పుడు మరిన్ని ఫీచర్స్

హోండా స్కూటర్ యొక్క LED హెడ్‌ల్యాంప్‌లకు డ్యూయల్ టోన్ ఎఫెక్ట్‌ పొందుతాయి. అంతే కాకుండా బాడీ కలర్ గ్రాబ్ రైల్స్ మరియు ప్రీమియం గ్రాఫిక్స్‌ను కూడా అందించింది. ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ స్కూటర్ యొక్క టెయిల్ ల్యాంప్‌పై యాక్టివా 125 ఎంబాసింగ్ కూడా ఇవ్వబడింది, ఇది దాని వెనుక భాగాన్ని మరింత ఆకర్షణీయంగా చేస్తుంది.

మార్కెట్లో Honda Activa125 ప్రీమియం ఎడిషన్ లాంచ్.. ఇప్పుడు మరిన్ని ఫీచర్స్

కొత్త హోండా యాక్టివా 125 ప్రీమియం ఎడిషన్ స్కూటర్‌లో, కంపెనీ 124 సిసి కెపాసిటీ గల బిఎస్-6 ఇంజన్‌ని ఉపయోగించింది. ఈ ఇంజన్ 6,500 ఆర్‌పిఎమ్ వద్ద 8.1 బిహెచ్‌పి పవర్ మరియు 5,000 ఆర్‌పిఎమ్ వద్ద 10.3 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కంపెనీ ఈ మోడల్‌లో ఫ్యూయల్ ఇంజెక్టెడ్ సిస్టమ్‌ను కూడా ఉపయోగించింది. దీని కారణంగానే ఈ స్కూటర్ మైలేజ్ మరింత మెరుగ్గా ఉంటుంది.

మార్కెట్లో Honda Activa125 ప్రీమియం ఎడిషన్ లాంచ్.. ఇప్పుడు మరిన్ని ఫీచర్స్

ఇక కంపెనీ విడుదల చేసిన ఈ కొత్త హోండా యాక్టవా 125 యొక్క ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో, కంపెనీ మల్టీ-ఫంక్షన్ ఇగ్నిషన్ కీని ఇచ్చింది, తద్వారా మీరు స్కూటర్ యొక్క స్టీరింగ్‌ను కూడా లాక్ చేయవచ్చు, కావున దీని ద్వారా సీటును సులభంగా ఓపెన్ చేయవచ్చు. అంతే కాకూండా ఈ స్మార్ట్ కీ సహాయంతో ఫ్యూయల్ ఫిల్లర్ క్యాప్‌ను కూడా ఓపెన్ చేయవచ్చు, ఇవన్నీ వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

మార్కెట్లో Honda Activa125 ప్రీమియం ఎడిషన్ లాంచ్.. ఇప్పుడు మరిన్ని ఫీచర్స్

కంపెనీ ఇప్పుడు ఈ కొత్త హోండా యాక్టివా 125 స్కూటర్ లో స్పీడోమీటర్‌ వంటి ఆధునిక ఫీచర్స్ కూడా అందిస్తుంది. దీని ద్వారా మైలేజ్, డిస్టెన్స్ ఆంప్ రీడింగ్, సైడ్ స్టాండ్ ఇండికేటర్‌లు వంటి సమాచారాన్ని పొందుతారు. ఇది కాకుండా, ఈ స్కూటర్‌లో కంపెనీ సైలెంట్ స్టార్టర్ సిస్టమ్‌ను కూడా ఇచ్చింది. ఈ ఫీచర్ కారణంగా ఈ స్కూటర్‌ను స్టార్ట్ చేస్తున్నప్పుడు సౌండ్ రాదు.

మార్కెట్లో Honda Activa125 ప్రీమియం ఎడిషన్ లాంచ్.. ఇప్పుడు మరిన్ని ఫీచర్స్

ఇందులో హోండా యొక్క ఐడిల్ స్టాప్ సిస్టమ్ టెక్నాలజీని కూడా ఉపయోగించారు, ఇది హీరో యొక్క ఐ3ఎస్ (ఐడిల్-స్టాప్-స్టార్ట్ సిస్టమ్) మాదిరిగానే ఉంటుంది. ఈ టెక్నాలజీతో స్కూటర్ ఆగినప్పుడు ఆగి, యాక్సిలరేటర్ ఇచ్చిన వెంటనే స్టార్ట్ అవుతుంది. దీనివల్ల ఇంధనం ఆదా అవుతుంది.

మార్కెట్లో Honda Activa125 ప్రీమియం ఎడిషన్ లాంచ్.. ఇప్పుడు మరిన్ని ఫీచర్స్

ఇదిలా ఉండగా కంపెనీ ఇటీవల జరిగిన 2021 ఇండియా బైక్ వీక్‌లో హోండా హైనెస్ CB 350 యొక్క యానివెర్సరీ ఎడిషన్ విడుదల చేసింది. ఈ కొత్త హోండా హైనెస్ CB350 యొక్క యానివెర్సరీ ఎడిషన్ ధర రూ. 2.03 లక్షల (ఎక్స్-షోరూమ్). హోండా హైనెస్ CB350 బైక్ భారతీయ మార్కెట్లో అడుగుపెట్టి ఒక సంవత్సర కాలం పూర్తి చేసుకున్న కారణంగా కంపెనీ ఈ యానివర్సరీ ఎడిషన్ విడుదల చేసింది.

హోండా హైనెస్ CB350 బైక్ భారతీయ మార్కెట్లో విడుదలైనప్పటి నుంచి ఇప్పటికి 35,000 యూనిట్లను విక్రయించింది. అయితే కంపెనీ ఇప్పుడు విడుదల చేసిన ఈ కొత్త యానివర్సరీ ఎడిషన్ బుకింగ్స్ ప్రారంభించింది. కావున కొనుగోలుదారులు ఈ బైక్ కోసం హోండా బిగ్‌వింగ్ డీలర్‌షిప్‌లో బుక్ చేసుకోవచ్చు.

మార్కెట్లో Honda Activa125 ప్రీమియం ఎడిషన్ లాంచ్.. ఇప్పుడు మరిన్ని ఫీచర్స్

సాధారణంగా కంపెనీ యొక్క హోండా హైనెస్ సిబి350 బైక్ రూ. 1,92,411 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ప్రారంభ ధర వద్ద భారతీయ మార్కెట్లో అడుగుపెట్టింది. ఈ బైక్ DLX మరియు DLX ప్రో అనే రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. హోండా హైనెస్ అనేక కొత్త మరియు ఆకర్షణీయమైన లక్షణాలతో కంపెనీ ప్రారంభించింది, దీని కారణంగా ఇది 350 సిసి శ్రేణిలోని ఇతర బైకుల నుండి చాలా భిన్నంగా అప్డేట్ చేయబడింది.

హోండా హైనెస్ సిబి350 బైక్‌లో డ్యూయల్ ఛానల్ ఎబిఎస్‌తో డ్యూయల్ డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి. ఫ్రంట్ వీల్‌లో హబ్‌కు బదులుగా రిమ్‌పై డిస్క్ బ్రేక్ అమర్చబడి ఉంటుంది. హోండా హైనెస్ సిబి 350 లో 348.36 సిసి సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ ఇంజన్ 20.8 బిహెచ్‌పి పవర్ మరియు 30 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. దీనికి 5 స్పీడ్ గేర్‌బాక్స్ అమర్చబడి ఉంటుంది. ఇది మంచి ఇంధన సామర్త్యాన్ని అందిస్తుంది, అంతే కాకుండా సుదూర ప్రాంతాలకు ప్రయాణించడానికి కూడా ఈ బైక్ చాలా అనుకూలంగా ఉంటుంది.

Most Read Articles

English summary
Honda activa 125 premium edition launched price features details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X