Just In
- 9 hrs ago
మహీంద్రా కార్స్‌పై అదిరిపోయే ఆఫర్స్ ; ఏ కార్‌పై ఎంతో చూసెయ్యండి
- 19 hrs ago
బిఎండబ్ల్యు ఎమ్340ఐ ఎక్స్‌డ్రైవ్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఫీచర్స్ & పర్ఫామెన్స్
- 22 hrs ago
డ్యుకాటి మోన్స్టర్ ఉత్పత్తి ప్రారంభం; త్వరలో భారత మార్కెట్లో విడుదల!
- 23 hrs ago
భారత్‌లో టి-రోక్ కారుని రీలాంచ్ చేయనున్న ఫోక్స్‌వ్యాగన్; ఈసారి ధర ఎక్కువే..
Don't Miss
- News
మోదీ దుకాణంలో మందులు అగ్గువ -శానిటరీ ప్యాడ్ రూ.2.50కే: ప్రధాని; 7500వ జన ఔషధి కేంద్రం ప్రారంభం
- Movies
రాజీవ్ కనకాల మా నాన్న.. చైల్డ్ ఆర్టిస్ట్ మాటలకు సుమ షాక్
- Sports
ఐపీఎల్ 2021 షెడ్యూల్ వచ్చేసింది.. వేదికల్లో హైదరాబాద్‌కు దక్కని చోటు !
- Finance
ట్విట్టర్ సీఈవో 15 ఏళ్ల క్రితం తొలి ట్వీట్‌కు రూ.కోట్లు
- Lifestyle
ఈ వారం మీ జాతకం ఎలా ఉందో ఇప్పుడే చూసెయ్యండి... మీ లైఫ్ కు సరికొత్త బాటలు వేసుకోండి...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
హోండాకి లక్కీ ఛార్మ్‌గా మారిన షైన్; 125సీసీ సెగ్మెంట్లో బెస్ట్ మోటార్‌సైకిల్
అ్మమకాల పరంగా భారతదేశపు ద్వితీయ అగ్రగామి టూవీలర్ బ్రాండ్ అయిన హోండా మోటార్‌సైకిల్ మరియు స్కూటర్ ఇండియా, గడచిన జనవరి 2021 నెలలో భారత మార్కెట్లో తన మార్కెట్ వాటాను 29 శాతానికి పెంచుకుంది. హోండా నుండి అత్యధికంగా అమ్ముడైన మోటార్‌సైకిల్ జాబితాలో సిబి షైన్ అగ్రస్థానంలో ఉంది.

గత నెలలో హోండా టూవీలర్స్ మొత్తం అమ్మకాలలో 1.16 లక్షల యూనిట్లు కేవలం సిబి షైన్ బ్రాండ్ నుండే వచ్చాయి. జనవరి 2020లో ఈ బ్రాండ్ మోటార్‌సైకిల్ అమ్మకాలు 66,832 యూనిట్లుగా ఉన్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ సమయంలో హోండా సిబి షైన్ 74 శాతం వార్షిక అమ్మకాల వృద్ధిని నమోదు చేసింది.

గడచిన డిసెంబర్ నెలలో హోండా సిబి షైన్ ఓ సరికొత్త అమ్మకాల మైలురాయిని చేరుకుంది. భారత టూవీలర్ మార్కెట్లోని 125సీసీ సెగ్మెంట్లో బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా కొనసాగుతున్న సిబి షైన్‌ను హోండా మార్కెట్లో విడుదల చేసినప్పటి (2006 సంవత్సరం) నుండి డిసెంబర్ 2020 నాటికి 90 లక్షలకు పైగా యూనిట్లను విక్రయించింది.

హోండా షైన్ మోటార్‌సైకిల్ 125సీసీ విభాగంలో కస్టమర్లకు నెంబర్ వన్ ఛాయిస్‌గా ఉంటోంది. ఈ విభాగంలో ఇది అత్యధికంగా 39 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది.

ప్రస్తుతం ఈ మోడల్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఇందులో డ్రమ్ బ్రేక్ వేరియంట్ ధర రూ.70,478 గా ఉంటే డిస్క్ బ్రేక్ వేరియంట్ ధర రూ.75,274 గా ఉంది (రెండు ధరలు, ఎక్స్-షోరూమ్).

హోండా సిబి షైన్ మోటార్‌సైకిల్‌లో 124 సిసి సింగిల్ సిలిండర్ 4-స్ట్రోక్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 10.72 బిహెచ్‌పిల శక్తిని మరియు 11 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

ఈ మోటార్‌సైకిల్‌ను డైమండ్ ఫ్రేమ్‌పై తయారు చేశారు. ఇందులో ముందు వైపు టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్కులు మరియు వెనుక వైపు హైడ్రాలిక్ టైప్ సస్పెన్షన్ సెటప్ ఉంటుంది.

బ్రేకింగ్ విషయానికి వస్తే, డ్రమ్ బ్రేక్ వేరియంట్లో రెండు వైపులా 130 మిమీ డ్రమ్ బ్రేక్స్ ఉంటాయి. డిస్క్ బ్రేక్ వేరియంట్లో ముందు వైపు 240 మిమీ డిస్క్ బ్రేక్ ఉంటుంది మరియు వెనుక వైపు 130 మిమీ డ్రమ్ బ్రేక్ ఉంటుంది.

హోండా సిబి షైన్ బ్లాక్, జెనీ గ్రే మెటాలిక్, అథ్లెటిక్ బ్లూ మెటాలిక్ మరియు రెబెల్ రెడ్ మెటాలిక్ అనే నాలుగు రంగులలో అందుబాటులో ఉంది. టూవీలర్ మార్కెట్లోని 125సిసి విభాగంలో హోండా నుండి అత్యధికంగా అమ్ముడైన మోడళ్లలో సిబి షైన్ నెంబర్ వన్ స్థానంలో ఉంది.

ఇదిలా ఉంటే, హోండా తమ ప్రీమియం డీలర్‌షిప్ కేంద్రాలయిన బిగ్‌వింగ్ ద్వారా విక్రయిస్తున్న సిబి350 మోడల్ ఆధారంగా కంపెనీ ఓ కొత్త రోడ్‌స్టర్ మోడల్‌ను ఇటీవలే మార్కెట్లో ప్రవేశపెట్టింది. మార్కెట్లో ఈ కొత్త హోండా సిబి 350 ఆర్ఎస్ మోడల్ ధర రూ.1.96 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభం అవుతుంది. - ఈ బైక్‌కి సంబంధించిన పూర్తి సమాచారం కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.