కొత్త Honda CB150X అడ్వెంచర్ బైక్ లాంచ్.. ఇది భారత మార్కెట్లో విక్రయించబడుతుందా?

జపనీస్ టూవీలర్ బ్రాండ్ హోండా తమ సరికొత్త హోండా సిబి150ఎక్స్ (Honda CB150X) అడ్వెంచర్ మోటార్‌సైకిల్ ను గ్లోబల్ మార్కెట్లలో విడుదల చేసింది. ఇండోనేషియాలో జరుగుతున్న 2021 గైకిండో ఇండోనేషియా ఇంటర్నేషనల్ మోటార్ షోలో అనేక ఆకర్షణీయమైన ఆధునిక వాహనాలు ప్రదర్శించబడ్డాయి. వాటిలో హోండా సిబి150ఎక్స్ బైక్ కూడా ఉంది. ఇది హోండా యొక్క మొదటి 150 సిసి అడ్వెంచర్ మోటార్‌సైకిల్.

కొత్త Honda CB150X అడ్వెంచర్ బైక్ లాంచ్.. ఇది భారత మార్కెట్లో విక్రయించబడుతుందా?

హోండా సిబిఎక్స్ సిరీస్ లో ఇది ఎంట్రీ లెవల్ అడ్వెంచర్ మోటార్‌సైకిల్. ఈ విభాగంలో తక్కువ ఇంజన్ సామర్థ్యం, తేలిక బరువు మరియు సరసమైన ధరతో కూడిన మోటార్‌సైకిల్ కోసం వెతుకుతున్న కస్టమర్లను లక్ష్యంగా చేసుకొని కంపెనీ ఈ బైక్ ను ప్రవేశపెట్టింది. హోండా ఇటీవల తమ CBX సిరీస్ లో భాగంగా, భారతదేశంలో కొత్త హోండా సిబి200ఎక్స్ (Honda CB200X) అడ్వెంచర్ మోటార్‌సైకిల్ ను విడుదల చేసిన సంగతి తెలిసినదే.

కొత్త Honda CB150X అడ్వెంచర్ బైక్ లాంచ్.. ఇది భారత మార్కెట్లో విక్రయించబడుతుందా?

భారత మార్కెట్లో హోండా సిబి200ఎక్స్ అడ్వెంచర్ మోటార్‌సైకిల్ ధర రూ. 1.44 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ప్రస్తుతం, కంపెనీ నుండి లభిస్తున్న అత్యంత చవకైన అడ్వెంచర్ బైక్ ఇది. కాగా, ఈ కొత్త సిబి150ఎక్స్ అడ్వెంచర్ బైక్ ను కంపెనీ తమ సిబి200ఎక్స్ బైక్ కి దిగువన ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అప్పుడు ఇది సుమారు రూ. 1.20 లక్షల ధరతో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇదే గనుక నిజమైతే, కొత్త సిబి150ఎక్స్ హోండా యొక్క అత్యంత చవకైన అడ్వెంచర్ మోటార్‌సైకిల్ అవుతుంది.

కొత్త Honda CB150X అడ్వెంచర్ బైక్ లాంచ్.. ఇది భారత మార్కెట్లో విక్రయించబడుతుందా?

కొత్త Honda CB200X ను కంపెనీ ఇటు సిటీ ప్రయాణానికి మరియు అటు ఆఫ్-రోడ్ ప్రయాణానికి అనువుగా ఉండేలా డ్యూయెల్ పర్పస్ టైర్లు మరియు పరికరాలతో రూపొందించబడింది. కాగా, ఈ కొత్త Honda CB150X బైక్ కూడా ఇదే స్ట్రాటజీతో తయారుచేయబడింది. ఇవి రెండూ కూడా ప్రత్యేకించి ఆఫ్-రోడ్ ప్రయోజనాల కోసం తయారుచేయబడలేదు. అంతర్జాతీయ మార్కెట్లలో హోండా విక్రయిస్తున్న ఫుల్ ఫెయిర్డ్ మోటార్‌సైకిల్ Honda CB150R ఆధారంగా చేసుకొని ఈ కొత్త CB150X అడ్వెంచర్ బైక్ తయారు చేయబడింది.

కొత్త Honda CB150X అడ్వెంచర్ బైక్ లాంచ్.. ఇది భారత మార్కెట్లో విక్రయించబడుతుందా?

Honda CB150X ముందు భాగంలో తక్కువ ప్యానెల్‌లతో నేక్డ్ స్ట్రీట్ ఫైటర్ బైక్ లా డిజైన్ చేయబిడింది. ఈ బైక్ ఓవరాల్ లుక్ చాలా షార్ప్ గా అనిపిస్తుంది. నిజానికి, ఈ కొత్త మోడల్ హోండా యొక్క అడ్వెంచర్ బైక్‌ల సాధారణ X-లైన్ డిజైన్ లాంగ్వేజ్ ఆధారంగా రూపొందించబడింది. షార్ప్ గా కనిపించే ట్యాంక్ ప్యానెల్స్, ఎత్తులో ఉండే ఫ్రంట్ విండ్‌షీల్డ్, పదునుగా కనిపించే వెనుక డిజైన్, పొట్టి సైలెన్సర్, ఇంజన్ గార్డ్, తక్కువ సీట్ ఎత్తు, పెద్ద ఫ్యూయెల్ ట్యాంక్ వంటి డిజైన్ ఎలిమెంట్స్ తో ఈ బైక్ చాలా అగ్రెసివ్ గా కనిపిస్తుంది.

కొత్త Honda CB150X అడ్వెంచర్ బైక్ లాంచ్.. ఇది భారత మార్కెట్లో విక్రయించబడుతుందా?

ఈ వివరాలు మినహా హోండా ఈ కొత్త CB150X బైక్ కి సంబంధించి మరిన్ని ఇతర వివరాలను వెల్లడించలేదు. అయితే, సమాచారం ప్రకారం, ఈ కొత్త బైక్‌లో కూడా CB150R లో ఉపయోగించిన అదే 149 సిసి లిక్విడ్-కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజన్ ను ఉపయోగించవచ్చని సమాచారం. హోండా CB150R బైక్ లోని ఈ ఇంజన్ 9000 ఆర్‌పిఎమ్ వద్ద 16.5 బిహెచ్‌పి పవర్ ను మరియు 7000 ఆర్‌పిఎమ్ వద్ద 13.8 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

కొత్త Honda CB150X అడ్వెంచర్ బైక్ లాంచ్.. ఇది భారత మార్కెట్లో విక్రయించబడుతుందా?

అయితే, కొత్త హోండా CB150X బైక్ లో మరింత క్విక్ పెర్ఫార్మెన్స్ కోసం ఈ ఇంజన్ ను స్వల్పంగా రీట్యూన్ చేసే అవకాశం ఉంది. తక్కువ ప్యానెల్స్ కారణంగా ఈ బైక్ బరువు కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి, ఇది CB150R ఇంజన్ కన్నా కాస్తంత ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేయవచ్చని అంచనా. కంపెనీ ఈ బైక్ ని కూడా భారతదేశంలో విక్రయించబడుతున్న CB200X బైక్ మాదిరిగానే స్టాండర్డ్ డైమండ్-టైప్ ఫ్రేమ్ ను ఆధారంగా చేసుకొని నిర్మించే అవకాశం ఉంది.

కొత్త Honda CB150X అడ్వెంచర్ బైక్ లాంచ్.. ఇది భారత మార్కెట్లో విక్రయించబడుతుందా?

కొత్త హోండా CB150X బైక్ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ 181 మిమీ, ఇది CB200X కంటే 14 మిమీ పెద్దది. కానీ నేల నుండి డ్రైవర్ సీటు యొక్క ఎత్తు CB150X లో 805 మిమీగా ఉంటే, CB200X లో 817 మిమీగా ఉంటుంది. హోండా CB150R బైక్‌లో ఉపయోదించిన అవే 17 ఇంచ్ మల్టీ-స్పోక్ అల్లాయ్ వీల్స్‌ను ఈ CB150X బైక్‌లో కూడా ఉపయోగించారు.

కొత్త Honda CB150X అడ్వెంచర్ బైక్ లాంచ్.. ఇది భారత మార్కెట్లో విక్రయించబడుతుందా?

ఇక ధర విషయానికి వస్తే, ఇండోనేషియా మార్కెట్లో హోండా CB150X బైక్ ధర 32 మిలియన్ ఆర్‌పి లుగా ఉంది. అంటే, మనదేశ కరెన్సీలో దీని విలువ సుమారు రూ. 1.67 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంటుంది. ఈ ధర వద్ద ఇది భారత మార్కెట్లో విడుదలయ్యే అవకాశం చాలా తక్కువ. ఎందుకంటే, ఇది ప్రస్తుతం హోండా అందిస్తున్న CB200X ధర కంటే సుమారు రూ. 20,000 లకు పైగా అధికంగా ఉంది. ఒకవేళ హోండా ఈ బైక్‌ను ఇక్కడే స్థానికంగా భారతదేశంలో తయారు చేసినట్లయితే, దీని ధర చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది.

Most Read Articles

English summary
Honda cb150x adventure motorcycle launched in global markets will it be launched in india
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X