CB200X డెలివరీలు ప్రారంభించిన Honda Motorcycle; పూర్తి వివరాలు

ప్రముఖ టూ వీలర్ బ్రాండ్ అయిన Honda Motor Cycle India (హోండా మోటార్ సైకిల్ ఇండియా) ఇటీవల భారతీయ మార్కెట్లో కొత్త CB200X బైక్ విడుదల చేసింది. దేశీయ మార్కెట్లో విడుదలై కొత్త Honda CB200X (హోండా సిబి200ఎక్స్) బైక్ ప్రారంభ ధర రూ. 1.44 లక్షలు(ఎక్స్-షోరూమ్, ఇండియా). ఈ కొత్త బైక్ బుకింగ్స్ విడుదల సమయంలోనే ప్రారంభించబడ్డాయి. కావున ఆన్‌లైన్ లేదా అధికారిక డీలర్ షిప్ ద్వారా 2,000 రూపాయల టోకెన్ మొత్తాన్ని చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు కంపెనీ ఈ మోటార్‌సైకిల్ డెలివరీలను భారతదేశం అంతటా ప్రారంభించింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

CB200X డెలివరీలు ప్రారంభించిన Honda Motor Cycle; పూర్తి వివరాలు

దేశీయ మార్కెట్లో విడుదలై కొత్త CB200X (సిబి200ఎక్స్) బైక్ హార్నెట్ 2.0 ఆధారంగా రూపొందించబడింది. ఇది దేశీయ మార్కెట్లో కంపెనీ యొక్క అత్యంత చౌకైన అడ్వెంచర్ బైక్‌గా మారనుంది. ఈ కొత్త బైక్ చాలా స్టైలిష్ లుక్ కలిగి ఉంది అనేక అధునాతన ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. దీనిని రోజువారీ ప్రయాణం మరియు స్వల్ప దూర ప్రయాణాలకు ఉపయోగించవచ్చు.

CB200X డెలివరీలు ప్రారంభించిన Honda Motor Cycle; పూర్తి వివరాలు

కంపెనీ ప్రస్తుతం CB500X బైక్ ని ఇండియన్ మార్కెట్లో అడ్వెంచర్ లైనప్‌లో విక్రయిస్తోంది, కావున కొత్త , ఇప్పుడు CB200X దాని దిగువన ఉంచబడుతుంది. అయితే CB500X బైక్ విక్రయాల మాదిరిగా కాకుండా, కంపెనీ CB200X బైక్‌ను బిగ్‌వింగ్ డీలర్‌షిప్‌కు బదులుగా సాధారణ రెడ్‌వింగ్ డీలర్‌షిప్ నుండి విక్రయించబోతోంది.

CB200X డెలివరీలు ప్రారంభించిన Honda Motor Cycle; పూర్తి వివరాలు

Honda CB200X బైక్ యొక్క డిజైన్ విషయానికి వస్తే, ఈ బైక్ కి ఎల్ఈడీ హెడ్‌లైట్లు మరియు ఇండికేటర్స్ ఉన్నాయి. అయితే ఇందులోని విండ్‌స్క్రీన్ సాధారణంగా అడ్వెంచర్ బైక్‌లలో కనిపించే దానికంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది. కావున ఇది గాలి విస్ఫోటనం నుంచి కాపాడుతుంది.

CB200X డెలివరీలు ప్రారంభించిన Honda Motor Cycle; పూర్తి వివరాలు

ఈ బైక్ లో సీటు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది, కానీ సీటు విడిగా ఉంచబడింది. వెనుక ఉన్నవారికి కూడా తగినంత సౌకర్యాన్ని అందించడానికి ఇందులో గ్రాబ్ రైల్ ఇవ్వబడింది. మొత్తానికి ఈ బైక్ చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.

CB200X డెలివరీలు ప్రారంభించిన Honda Motor Cycle; పూర్తి వివరాలు

కొత్త Honda CB200X బైక్ యొక్క ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో కంపెనీ యొక్క హార్నెట్ 2.0 ఇంజిన్ ఉపయోగించబడింది. ఇందులో ఉన్న 184.4 సిసి సింగిల్ సిలిండర్ ఇంజిన్‌తో 8,500 ఆర్‌పిఎమ్ వద్ద 17 బిహెచ్‌పి పవర్ మరియు 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 16.1 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

CB200X డెలివరీలు ప్రారంభించిన Honda Motor Cycle; పూర్తి వివరాలు

ఈ బైక్ యొక్క మైలేజీని మెరుగుపరచడానికి 8 ఆన్-బోర్డ్ సెన్సార్‌లతో పాటు ఈ బైక్‌లో ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టం కూడా అందుబాటులో ఉంది. ఇది మంచి పర్ఫామెన్స్ అందించడానికి సహాయపడుతుంది. ఈ బైక్ యొక్క సస్పెన్షన్ విషయానికి వస్తే, ముందు భాగంలో అప్సైడ్ డౌన్ పోర్క్ మరియు వెనుక భాగంలో మోనోషాక్ సెటప్ ఉంటుంది.

CB200X డెలివరీలు ప్రారంభించిన Honda Motor Cycle; పూర్తి వివరాలు

ఈ బైక్ లోని బ్రేకింగ్ సిస్టం విషయానికి వస్తే, దీని ముందు భాగంలో 276 మిమీ డిస్క్ బ్రేక్ మరియు వెనుకవైపు 220 మిమీ డిస్క్ బ్రేక్ అమర్చబడి ఉంటుంది. అంతే కాకూండా భద్రతను మరింత మెరుగుపరచడానికి ఇందులో ఎబిఎస్ కూడా అందుబాటులో ఉంటుంది.

CB200X డెలివరీలు ప్రారంభించిన Honda Motor Cycle; పూర్తి వివరాలు

భారతీయ మార్కెట్లో అడుగుపెట్టిన కొత్త Honda CB200X లో బైక్ లో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఇవ్వబడింది. దీని ద్వారా బైక్ కి సంబంధించి చాలా సమాచారాన్ని పొందవచ్చు. ఇది వాహనదారునికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఇందులో ఇంజిన్ స్టాప్ స్విచ్ మరియు హజార్డ్ స్విచ్ వంటి ఫీచర్లు ఇందులో కూడా ఇవ్వబడ్డాయి.

కొత్త Honda CB200X (హోండా సిబి200ఎక్స్) బైక్ అధునాతన ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. అంతే కాకుండా ఇది వాహనవినియోగదారులకు చాలా అనుకూలంగా కూడా ఉంటుంది. ఈ కొత్త బైక్ దేశీయ మార్కెట్లో ఎక్కువ మంది వినియోగదారులను ఆకర్షించే అవకాశం ఉంటుందని భావిస్తున్నాము.

CB200X డెలివరీలు ప్రారంభించిన Honda Motor Cycle; పూర్తి వివరాలు

Honda Motorcycle కంపెనీ తన ఎంట్రీ లెవల్ అడ్వెంచర్-టూరర్, CB200X ని ఎట్టకేలకు ఇండియన్ మార్కెట్లో తీసుకువచ్చింది. ఇది మంచి ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉండటమే కాకుండా తక్కువ ధరకు కూడా లభ్యమవుతోంది. ప్రస్తుతం, భారతదేశంలో CB200X బైక్, హీరో Xpulse 200T కి ప్రత్యర్థిగా ఉండే అవకాశం ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, September 8, 2021, 10:21 [IST]
English summary
Honda cb200x adventure motorcycle delivery starts features price details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+